Hidden Secrets of Cosmic Energy | ధ్యానంలో వచ్చే ప్రాణశక్తిని ఎలా హ్యాండిల్ చేయాలి?
Author Name:naveen kalyan spiritual life
Youtube Channel Url:https://www.youtube.com/@naveenkalyanspirituallife5599
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_S4nt3AeBmk
Transcript:
(00:00) మిత్రులారా మనం ధ్యానంలో ఉన్నప్పుడు మన యొక్క మెదడు తరంగాలు అనేవి ఆల్ఫా లేక θీట స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో మనం విశ్వం నుండి అనంతమైన ప్రాణశక్తిని మన యొక్క బ్రహ్మరంద్రం నుండి మన యొక్క శరీరంలోనికి గ్రహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాణశక్తి అనేది మనం ఫోన్ కి ఏ విధంగా అయితే ఛార్జింగ్ పెడుతున్నామో అదేవిధంగా మన శరీరంలో ఉండే ప్రతి కణానికి కూడా ఈ ప్రాణశక్తి అనేది చేరుకొని ఒక ఛార్జింగ్ లా మన శరీరంలో ఉండే ప్రతి కణానికి శక్తిని అందిస్తూ మనల్ని ఆరోగ్యవంతంగా ఉత్తేజపరచడం జరుగుతుంది.
(00:38) అయితే మనం ఈ విధంగా ధ్యానం ద్వారా అనంతమైన ప్రాణశక్తిని ప్రతిరోజు గ్రహించడం వల్ల మనం అనేక రకాల ప్రయోజనాలను పొందడం జరుగుతుంది. అందులో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలు చాలా తొందరగా తగ్గిపోవడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ధ్యానం ద్వారా గ్రహిస్తున్న ప్రాణశక్తి అనేది మన యొక్క శరీరంలో చేరుకుంటుందో అది మన శరీరంలో ఎక్కడైతే అనారోగ్య సమస్య ఉందో ఆ ప్రదేశం వద్దకు చేరుకొని అక్కడుండే కణాలకు శక్తిని అందిస్తూ వాటిల్ని రీరిపేర్ చేయడం జరుగుతుంది.
(01:16) తద్వారా అక్కడున్న అనారోగ్య సమస్య అనేది పూర్తిగా శ్రమిసిపోయి మనం ఆరోగ్యవంతంగా మారడం జరుగుతుంది. అదే కాకుండా మనం విపరీతమైన తెలివితాటల్ని పొందడం జరుగుతుంది. మనకు అధికంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని సక్రమంగా చేస్తున్నామా తప్పుగా చేస్తున్నామా అనే ఒక ఎరుక మనకు అనుభవంలోకి రావడం జరుగుతుంది.
(01:42) మన జీవితంలో ఎదురయ్యే కొన్ని కొన్ని విషయాలు మనం ముందుగానే తెలుసుకుంటాం అంటే మన యొక్క భవిష్యత్తు మనం ఇప్పుడు తీసుకుంటున్న ప్రతి ఆలోచన ద్వారా ప్రతి నిర్ణయం ద్వారా ఎలా ఉండబోతుందని మనం ముందుగానే అంచన చేయగలిగే శక్తి సామర్థ్యాలు మనలో ఉండడం జరుగుతుంది. అలాగే మనం ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో సరిగ్గా క్రమంగా చేయగలిగే శక్తిని మనం పొందగలుగుతాం.
(02:06) మన జీవితంలో ఏదైనా సాధించగలిగే ఆత్మ ధైర్యాన్ని నమ్మకం మనలో సంపూర్ణంగా ఉంటూ ప్రతి పనిలో కూడా మనం రాణించడం జరుగుతుంది. అలాగే ఈ విశ్వకశక్తి మన చుట్టూ ఒక ఆరాలా ఏర్పడుతుంది. తద్వారా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం మనపై పడకుండా మనం చాలా పాజిటివ్ గా ఉండడం జరుగుతుంది. అలాగే మన దగ్గరికి ఎవరైనా స్నేహితులు గాని తెలిసినవాళ్ళు గాని ఎవరైనా వచ్చినట్లయితే మనతో మాట్లాడుతున్నప్పుడు వారికి చాలా ప్రశాంతంగా ఉంటుంది.
(02:37) ఆహ్లాదవంతమైన భావన వారిలో కలుగుతుంది. దానికి గల మూల కారణం మనం ఏదైతే ధ్యానం ద్వారా గ్రహిస్తున్న ప్రాణశక్తి ఉందో దాని యొక్క ప్రభావమే. కాబట్టి సాధుకులారా మనం ధ్యానం చేయడం ద్వారా ఈ యొక్క ప్రాణశక్తిని అధికంగా గ్రహించాలి. తద్వారా మన జీవితంలో మనం అనుకునే ప్రతిది కూడా మనం సాధించగలం. అయితే ఈ యొక్క ప్రాణశక్తి యొక్క ప్రవాహం మన శరీరంలో అధికంగా ఉన్నట్లయితే మనం కొన్ని కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోక తప్పదు.
(03:08) అందులో మొదటి ఇబ్బంది ఏంటంటే మన శరీరంలో అధికంగా వేడి అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ వేడి ప్రతిక్షణం కూడా మనల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలాగే మనకు ఆజ్ఞా చక్రం వద్ద తలలో ఏదో లాగుతున్నట్లుగా గుచ్చుతున్నట్లుగా మన ఇటువంటి అనుభవం రావడం జరుగుతుంది. అలాగే శరీరం కొంచెం బొరువుగా ఉన్న భావన కూడా కలుగుతుంది. ఈ యొక్క ప్రాణశక్తి అనేది అధికంగా ఉండడం వల్ల రాత్రివేళ మనకు సరిగ్గా నిద్ర అనేది రాకపోవచ్చు.
(03:39) అలా రకరకాల ఇబ్బందుల్ని మనకు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రాణశక్తి మనలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచుకోవాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే మనం కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి. అయితే మన యొక్క శరీరంలోకి వచ్చే ఎక్స్టర్నల్ ఎనర్జీని ఎలా తగ్గించుకోవాలి దాని నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
(04:06) మొదటిగా మనం గ్రౌండింగ్ సాధన చేయడం ద్వారా ఈ యొక్క అధికంగా వస్తున్న ప్రాణశక్తిలో చాలా వరకు మనల్ని ఇబ్బంది పడుతున్న ప్రాణశక్తిని మనం పంపించవచ్చు. మీరు మీ ఇంటి దగ్గర గాని ఎక్కడైనా బయటన చెప్పులు తీసివేసి గడ్డి ప్రదేశాల్లో అలాగే మెట్టి నేనేలో మీరు నడిచినట్లయితే మీ యొక్క బాడీలో ఉండే ఈ యొక్క అధిక ప్రాణశక్తి అనేది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది.
(04:33) తద్వారా ఆ ప్రాణశక్తి వల్ల వచ్చే ఇబ్బంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అలాగే మీరు చల్లటి నీటితో స్నానం చేయడం గానీ ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల మీ యొక్క బాడీలో అధికంగా ఉండే వేడి పూర్తిగా తగ్గి ప్రశాంతవంతంగా మాడడం జరుగుతుంది. అలాగే మీరు ధ్యానం పూర్తి చేసిన తర్వాత కొన్ని కొన్ని ఆసనాలు గాని శారీరక శ్రమ గాని ఎక్సైజెస్ గాని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ యొక్క ప్రాణశక్తి అనేది మీ శరీరంలో ఉండే అన్ని భాగాలకు సతుల్యంగా చేరుకొని మిమ్మల్ని ఇబ్బంది పట్టకుండా ఆ యొక్క ఎనర్జీ మీరు మీ జీవితంలో చేస్తున్న ప్రతి పనికి కూడా కరెక్ట్ గా ఉపయోగకరంగా మారడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు కొన్ని
(05:19) కొన్ని ప్రక్రియలు చేయడం ద్వారా ఈ యొక్క ప్రాణశక్తి మీకు ఉపయోగపడుతుంది. అలాగే అధికంగా ప్రాణశక్తి ఉన్నవారు మీరు ఎవరి మీదైనా కోప్పడం గానీ కసరకోవడం కాానీ ఎవరికైనా చెడు జరగాలని మీరు అస్సలు భావన చేయొద్దు ఎందుకంటే మీరు అలా భావన చేయడం ద్వారా మీలోకి వస్తున్న ఈ యొక్క ప్రాణశక్తి అనేది మీరు ఏదైతే సంకల్పం చేశారో ఆ సంకల్పానికి అది జోడించబడి ఎవరికైతే చెడు జరగాలని మీరు కోరుకుంటారో వారికి అనుకోకుండా చెడు జరిగేందుకు అవకాశం ఉంటుంది.
(05:50) తద్వారా వారు ఇబ్బంది పెడతారు. ఆ ఇబ్బంది వల్ల మరలా మీరు కర్మని మూటకట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి తస్మస్ జాగ్రత్త ప్రాణశక్తి మీలో అధికంగా ఉన్నప్పుడు మీరు చాలా వరకు కాముగా ఉండాలి. చాలా తక్కువ మాట్లాడేందుకు మాత్రమే ప్రయత్నం చేయండి. అవసరమైన విషయాల్లో మాత్రమే మీ యొక్క నోటి నుండి మాట రావాలి అలా కాకుండా మీరు మాట్లాడినట్లయితే కచ్చితంగా మీకు మీ చుట్టూ ఉండే ప్రతి ఒక్కరికి కూడా మీరు ఆహాని చేయడం జరుగుతుంది.
(06:22) అలాగే మీరు ఏవైనా నెగిటివ్ థాట్స్ ని మీ యొక్క మైండ్ లో క్రియేట్ చేసినట్లయితే అంటే నేను అనుకున్నది ఏది కూడా సరిగ్గా జరగట్లేదు. నాకు రావలసిన డబ్బులు సరిగ్గా రావట్లేదు. నన్ను చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు నా జీవితం ఇంతేనా అన్నట్లుగా మీరు నెగిటివ్ ఆలోచన చేసినట్లయితే అంతే మీ యొక్క ప్రాణశక్తి ద్వారానే మిమ్మల్ని మీరు ఆన్ చేసుకున్న వాళ్ళు అవుతారు అంటే మీ యొక్క చేతిని మీ యొక్క నోటితో మీరే తడుచుకున్నమాట ఆ విధంగా మిమ్మల్ని మీరే ఇబ్బంది పెట్టుకుంటారు కాబట్టి మీలో అధికంగా ప్రాణశక్తి ఉన్నప్పుడు ఎటువంటి నెగిటివ్ థాట్స్ ని మీరు క్రియేట్ చేయవద్దు మీ గురించే గానీ మీ కుటుంబం
(07:02) గురించి గానీ బయట వాళ్ళ గురించి గానీ ఎటువంటి ఆలోచనలు క్రియేట్ చేయకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. మీరు ఎవరి వద్దయతే సాధన తీసుకున్నారో ఆ గురువు గారితో ఒకసారి మాట్లాడండి చర్చించండి తద్వారా మీకు ఉండే రకరకాల డౌట్స్ అనేవి బయటికి పోయేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీకు మీరు గాని ధ్యానం చేసి ఈ యొక్క ఎనర్జీని గ్రహించినట్లయితే మీకు ఇటువంటి ఇబ్బంది ఉన్నట్లయితే నా యొక్క నెంబర్ కి ఫోన్ చేయండి తద్వారా మీరు ఆ యొక్క సమస్య నుండి ఎలా బయటపడాలో అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను.
(07:33) అలాగే నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్ ద్వారా మీరు ఈ యొక్క ప్రాణశక్తిని మీకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలి మీరు ఆరోగ్యవంతంగా ఎలా మారాలి మీ యొక్క సంకల్పాలని మీరు ఎలా నెరవేర్చుకోవాలి ఇలా రకరకాల విషయాలని బోధిస్తూ మీ జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు.
(07:58) మీలో కూడా ఈ యొక్క ప్రాణశక్తి యొక్క ప్రభావం అధికంగా ఉన్నట్లయితే కిందన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే కూడా మీరు కామెంట్ చేయవచ్చు. అలాగే ఈ వీడియో నచ్చినట్లైతే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment