Friday, May 29, 2026

అవతల పారేయండి #Hindudharmakshetram #SantoshGhanapathi

అవతల పారేయండి #Hindudharmakshetram #SantoshGhanapathi

Author Name:Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)

Youtube Channel Url:https://www.youtube.com/@hindudharmakshetram

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QZFY1B1Lh7g



Transcript:
(00:00) ఈ పుస్తకం చూడండి జ్ఞానగంగ అని పేరు ఉన్నటువంటి ఈ పుస్తకం ఉచితంగా తెగపంచుతూ ఉంటారు నాకు కూడా అదే విధంగా ఇది ఉచితంగా వచ్చినటువంటి పుస్తకం ఈ పుస్తకంలో వాళ్ళ గురువుల గురించి వాళ్ళ గొప్పదనం గురించి చెప్పుకునే ఆగిపోతే తప్పు లేదండి దాని గురించి ఎవరు ప్రశ్నించరు కానీ ఎన్ని దారుణాలు ఉన్నాయి అంటే మీకు ఉదాహరణకి ఒకటి చెప్తాను ఇంకా మళ్ళీ చెప్పుకుందాం మనం 101వ పేజీలో జ్ఞానగంగ తెలుగు పుస్తకం 101వ పేజీలో మీరు చూస్తే గనుక త్రేతా యుగంలో లో ప్రకటితమైనటువంటి ఈ యొక్క కబీర్ సాహెబ్ అని చెప్పేసి త్రేతా యుగంలో అట ఈయన ఏం చేశడట రామసేతువు మనందరికీ తెలుసు కదా
(00:38) శ్రీరామచంద్రుడు లంకకు వెళ్ళడానికి సీతాదేవిని రక్షించడానికి రావణ సంహారం కోసం ఏదైతే సేతువు కట్టాడో ఆ సేతువుకి సంబంధించి ఇందులో ఒక దారుణమైనటువంటి కథ ఉంటుందండి ఏమిటి అంటే ఈ యొక్క రామసేతువు అనేది హనుమంతుడు రామ అని వ్రాసి ఆయన రాళ్ళు వేయడం వల్ల కానీ నల నీళ్లులో కట్ట కట్టడం వల్ల కానీ లేకపోతే మరొక శక్తి వల్లో మరొక శక్తి వల్లో రామసేతు కట్టబడలేదు నిర్మించబడలేదు ఆ రాళ్ళు తేలడం అనేది ఎవరి గొప్పదనము కాదు ఎవరు గొప్పదనము అని అంటే ఇక్కడ చెబుతూ ఉంటారు ఎవరో ఒకరు అనేవారు హనుమంతుడు రాళ్లపై రామనామాన్ని రాయడం వల్లనే రాళ్ళు తేలాయి అని ఇంకొకరు అంటారు నల నీలులు
(01:19) వారధిని కట్టారు అని ఇంకెవరో అంటారు శ్రీరాముడు వారధి కట్టారు అని కానీ అవేవి సత్యాలు కావు సత్యాలు ఏమిటి పైన చెప్పబడింది ఏమిటా సత్యము వీళ్ళు చెబుతూ ఉన్నది అనిఅంటే గనుక ఈ యొక్క కబీర్ సాహెబ్ అనేటటువంటి ఒక ఆయనను శ్రీరామచంద్రుడు అంటే త్రేతా యుగంలో కూడా కబీర్ సాహెబ్ అనేటటువంటి ఆయన ఋషివర్ అనే పేరుతో ఉన్నాడట ఆయనను హే ఋషివర్ నాపై చాలా పెద్ద ఆపద వచ్చిపడింది దయ చూపండి ఎలాగైనా ఈ సేన దాటునట్లు చేయండి మీరు మీ సేవకులకి శక్తిని ఇవ్వగలిగినప్పుడు ప్రభువు కొంచెం సహాయం చేయండి అప్పుడు మునీంద్ర సాహెబ్ అంటాడట రామచంద్రుడు తో ఇంతసేపు చెప్పింది
(01:59) రాముడు ఆయనతో అప్పుడు మునీంద్ర సాహెబ్ అంటున్నాడు ఈ ఎదురుగా గల పర్వతం యొక్క నాలుగు వైపులా గీతను గీసి వీటికి మధ్య గల రాళ్లను తెచ్చుకోండి అవి మునగ మీ పని అయపోతుంది అన్నాట ఎంత దారుణమో చూడండి అగస్త్యాది మహర్షులని ఉద్దేశించి కూడా ఈ విధమైనటువంటి కల్పిత కథలు మనవాళ్ళు ఇప్పటిదాకా రాయలేదండి కానీ ఒక సాధారణ వ్యక్తి గురించి ఈ విధంగా రాముణని తక్కువ చేయడం రామాయణాన్ని తక్కువ చేయడం హనుమంతుని తక్కువ చేయడం ఎంత దారుణమో చూడండి ఈ పుస్తకం ఉచితంగా ఇస్తున్నారు కదా అని తీసుకోకండి మీ ఇంట్లో ఉంటే కనుక పూర్తిగా బయట పడవేయండి ఇంకా కూడా ఈ పుస్తకంలో ఉన్న
(02:34) అబద్ధాలు అనేక అబద్ధాలు నేను మీకు తెలియజేస్తాను

No comments:

Post a Comment