ముందు ముందు జీవితాలు ఇంకా దారుణంగా ఉంటాయి!#kaliyugam@Govindaseva
Author Name:Govinda seva
Youtube Channel Url:https://www.youtube.com/@Govindaseva
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FL-HYIX_ZZY
Transcript:
(00:01) గోవిందాయ నమః ఈ రోజుల్లో ఎవరికీ మనశశాంతి లేదు సమాజంలో ఎవరికీ శాంతి లేదు. ఇంట్లో కుటుంబంలో శాంతి లేదు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత సామరస్యం లేదు దంపతుల మధ్య కూడా సఖ్యత లేదు. సోషల్ మీడియా చూద్దాంని ఓపెన్ చేస్తే దానిలో కూడా రోజు తగువులు గొడవలు ఇట్లా ఉంది పరిస్థితి చూస్తూ ఉంటే కళ్ళ ముందే కలియుగం కొట్టవచ్చినట్టు కనపడుతుంది ఉంటుందన్నమాట కలియుగంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎలాంటి దుర్వ్యవస్థ తయారవుతుంది సమాజంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఇంట్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి వీటి గురించి స్పష్టంగా విష్ణు పురాణాలుగా వివరించబడి ఉంది. దాని గురించి నేను కొంచెం చదివి
(00:44) వినిపించే ప్రయత్నం చేస్తాను అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను వీటిలో ఎన్ని లక్షణాలు మీరు గమనించారు ఎన్ని లక్షణాలు రాబోతున్నాయి సూచనగా ఇప్పుడే కనబడుతున్నాయి వీటికి సంబంధించి మీ అభిప్రాయం ఏమిటి అనేది ఈ వీడియో విన్న తర్వాత కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎందుకంటే వీడియో ఓపెన్ చేసిన వాళ్ళు కామెంట్స్ కూడా చూస్తారు.
(01:04) మీ కామెంట్ కూడా చూడటం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మీ అనుభవాలు కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు. నేనైతే విష్ణు పురాణ అంతర్గతంగా ఉన్న కలియుగ లక్షణాల గురించి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను చంద్రవంశ సూర్యవంశ రాజులు ఏలి ఆ రాజ్యాలు అంతమైపోయిన తర్వాత వచ్చే పాలకులు ఎలా ఉంటారో అక్కడి నుంచి ఆరంభం అవుతుంది. భవిష్యత్తు రోజులలో రాజ్యపాలన చేయు రాజులు ఆదిలో ఉన్నట్లే రాజుల వలె ధర్మవర్తనులు కారు.
(01:34) సూర్య చంద్రవంశ రాజులు లాగా తర్వాత వచ్చే ఈ పరిపాలకులు ధర్మవర్తనలు కారట అవినీతిని అన్యాయమును స్వార్ధ గుణములను ఆశ్రయించుకొని పరిపాలింతురు ప్రజారంజకంగా పరిపాలించుటకు బదులు అధికార దుర్వినియోగము చేయుదురు బలహీనులను దోచుకొని తమ స్వసు సుఖములను పొందెదరు ప్రసన్న గుణము క్షమా గుణము ఉండక తమ శక్తికి మించిన కోపావేశాలు అధికార దర్పము ఎక్కువ కలిగి ఉంటాయి ారు నిజమే కదా వీరికి దురాశ ఎక్కువై వారి పతనమును వారే కొని తెచ్చుకుందురు.
(02:10) యజ్ఞ యాగముల సంగతి ఎట్లున్నను కనీసం దైవనామ స్మరణము గాని పాపభీతి గాని లేక ఉవ్వెత్తున లేచిన కిరటము వెంటనే జతికలబడినట్లు ఇట్లే ఉన్నతి కనిపించి అట్లే పతనమగుదురు ఐదేళ్ళు ఉంటారు పదవిలో ఆ తర్వాత జనాలే వీళ్ళని దించేస్తారు ఆ తర్వాత ఇంకెవరో వస్తారు వాళ్ళు అంతే అలా ఇంతకుముందు సూర్య చంద్రవంశపు రాజులు వంశ పారంపర్యంగా పరిపాలనలు చేస్తే ఇప్పుడు ఐదేళ్ళు చేయడం కష్టం అయిపోతుంది అన్నమాట అన్నమాట అది విషయం సరే యధారాజ [గురకలు] తదా ప్రజ అన్నట్లు పాలకులను చూసి పాలితులు అంటే ప్రజలు కూడా కుత్సితములను నేర్చుకొందురు. జనపదారలోని ప్రజలు ప్రభువు
(02:54) అనుగ్రహము కోసము అధికారుల కరుణ కోసము విపరీతంగా తాపత్రయపడుతురు. కొంచెం అధికారము గాని లాభము గాని లభించినచో దానిని పూర్తిగా పొందుటకై యత్నించి రాజును అధికారిని క్రిందకు దించి అధికారమును కైవసము చేసుకొందురు. సమాజమున దైవభక్తి ధర్మనిష్ట క్రమశిక్షణ ఆదర భావము సోదర భావము వాత్సల్యము స్నేహ భావము లోపించును బంధుత్వములు చుట్టరికములు అన్నియును అర్ధ సంబంధమైనవిగా అంటే ధన సంబంధమైనవిగా ఉండును మన దగ్గర డబ్బు ఉంటే అందరూ వచ్చేస్తారు మనల్ని పొగుడుతారు మన దగ్గర డబ్బులు లేక ఆస్తులు అమ్ముకొని అప్పులు పాలు అయ్యామ అనుకోండి ఫోన్ చేస్తే కూడా ఎత్తరు రావడం
(03:39) మొహం చూపించడం అలా ఉంచండి ఫోన్ చేసినా తీరు ఆ పరిస్థితులు మనం ఇప్పుడే చూస్తున్నాము ఇంకా రాను రాను ఘోర కరిలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించవచ్చు ఇట్లు అధర్మము వ్యాప్తి చెందినప్పుడు ధర్మమునకు కాక అర్థమునకు అంటే డబ్బుకు విశేషమైన ఖ్యాతి బలము సంభవించును ధర్మము అనేది మచ్చకైనా కానరాదు డబ్బు మీదే అంతా కూడా ఆధారపడి ఉంటుంది పైసామే పరమాత్మహే అనే సామెత విన్నారు కదా అలా అన్నమాట ధనవంతుడే ఉత్తమ కులీనుడిగా ప్రసిద్ధి పొందును డబ్బు ఉంటే చాలు వాడు చాలా ఉత్తమ వంశంలో పుట్టిన వాడిగా సదాచార సంపన్నుడిగా పరిగటిస్తారు.
(04:15) ధనమే సమస్త కార్యములకు మూలహేతువగును కామలోలత్వమే దాంపత్య బంధమునకు కారణం అనుకుందు అంత నీచమైన పరిస్థితి వస్తుంది. పవిత్రమైన దాంపత్య బంధానికి కూడా మూలము కామమే కామ కోరికలు తీర్చుకోవాలంటే పెళ్లి చేసేసుకుంటే ఒక లైసెన్స్ లాగా వచ్చేస్తుంది. పెళ్లి చేసుకోకపోతే అక్రమం అనుకుంటారు పెళ్లి చేసుకుంటే లైసెన్స్ వచ్చేస్తుంది ఇది మాత్రమే దాంపత్యానికి పెళ్లికి కారణం అనుకుంటారట సృష్టి ధర్మము గృహస్థ ధర్మము అందులో తరించే విధానము గృహస్థ ధర్మం ద్వారా మోక్షాన్ని పొందే విధానము అవన్నీ పోతాయి గాలికి దాంపత్యము వివాహం ఎందుకంటే కామానికి లైసెన్స్ పెళ్లి చేసుకుంటే ఎవరు
(04:56) అడగరు మన ఇష్టం అనే ఒక స్థితి వచ్చేస్తుంది ఆల్రెడీ వచ్చేసింది ఆ విధంగానే భావించి బ్రమ పడుతున్నారు. ప్రజలు అర్థమును అంటే ధనమును సంపాదించుటకై అనేక చేయరాని పనులను ధర్మ విరుద్ధమైన అన్యాయమైన పనులను చేయదురు చేస్తున్నారు ఆల్రెడీ కాల [గురకలు] పరిస్థితులు తారుమారు అగుట వలన జంద్యము ధరించుటచే విప్రణకు చిహ్నముగా మారును జంద్యం వేసుకుంటే చాలు అరు సద్బ్రాహ్మణుడు గొప్పవాడు అని పరిగణించడమే తప్ప సదాచార సంపన్నులా కాదా ఇవఎవ్వరికీ అక్కర్లేదు అంతే తప్ప బ్రాహ్మణత్వం నిజముగా అనుసరింపరు బ్రాహ్మణత్వం అనేది ఎవరిలో మచ్చు కూడా తానరాదు బయటకి మాత్రము మేము చాలా గొప్ప
(05:35) వాళ్ళము గొప్ప అనుష్టానవంతులమ అని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా ఈ రోజుల్లో చూస్తున్నాము. ఇక భవిష్యత్తులో ఎలా ఉంటుందో తమకు విహితమైన కులధర్మములను పాటించరు స్వర్ణము అంటే బంగారము రత్నములు, సంపద ఉన్నవాడినే గొప్పవాడని స్లాగింతురు. అంతే తప్ప అట్టి వాడి గుణములను ఎవ్వరు లెక్కింపరు.
(05:57) ఎన్ని అవగుణాలు ఉన్నా ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నా ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ఎన్నిసార్లు విడాకులు ఇచ్చినా బయట పాపులారిటీ ఉంటే చాలు వాళ్ళఏదో సినిమా వాళ్ళ ఏదో ఒకటి అయి ఉంటే చాలు డబ్బు ఉంటే చాలు గ్లామర్ ఉంటే చాలు ముఖ్యమంత్రులనే ప్రధానమంత్రులని చేసేస్తారు జనాలు వాళ్ళకు కూడా ధర్మంతో పనిలేదు ఒక సత్శీలము నీతి న్యాయంతో పనిలేదు అట్లా ఉన్నాయి ఇప్పుడే పరిస్థితులు [గురకలు] అలాగే జీవనము సాగించుటకు అన్యాయమైన మార్గములను సునాయాసముగా కష్టపడకుండా సంపద పొందు త్రోవలను అన్వేషింతురు తేలిగ్గా డబ్బు సంపాదించడం ఎలా YouTube తంబ్నైల్స్ కూడా కనపడుతున్నాయి మీరు తేలిగ్గా
(06:38) కోటేశ్వరులు అవ్వడం ఎలా జనాలని సోమరపోతుల్ని బద్ధకస్తులని చేసే వీడియోస్ అవన్నీ నిర్బలులపై నిస్సహాయులపై దౌర్జన్యము చేయుటయే వీరత్వము అగును వీరత్వము అంటే బలహీనులను కాపాడటం దుర్మార్గులు అది వీరత్వం కానీ కలియుగంలో వీరత్వం ఏంటంటే దుర్బలులు బలహీనులు వాడి మీద దాడి చేస్తే వీడు వీరుడు అవుతాడుఅన్నమాట తమ వద్ద జ్ఞానము లేకున్నను మిడిమిడి జ్ఞానం వచ్చే బల్ల గుద్ది చెప్పువారే పండితులుగా విజ్ఞానవంతులుగా పేరుొందదురు.
(07:09) ఇప్పుడు చాలామంది పండితులు అని చెప్పేవాళ్ళు ప్రవచనకారులు అని చెప్పేవాళ్ళు కూడా అలాగే ఉంటారు ఏది ట్రెండింగ్ లో ఉంటే అది గొప్పగా చెప్పాలి పారితోషకాలు సంపాదించుకోవాలి. వాళ్లే పండితులు వాళ్లే జ్ఞానులు అన్నట్లుగా ఈ సోషల్ మీడియా వచ్చాక పరిస్థితి అలాగే ఉంది. దూర క్షేత్రములలోని ఏదో ఒక ఉదకమే తీర్థమని భ్రమించెదరు.
(07:30) గంగా యమునా సరస్వతి కావేరి కృష్ణ గోదావరి తీర్థాలు పోతాయి. వీటి మీద మనసు ఉండదు. ఎక్కడో ఒక చోట కొత్త గుడి కట్టించి అడఒక చిన్న కోనేరులాగా దొవ్వించి దాంట్లో నాలుగు ఆ తామర గింజలు వేసేసి పువ్వులు మొలిపించి ఇదఒక తీర్థం అని చెప్తే జనాలు ఆ నీళ్ళు తల మీద చల్లుకొని తాగి డబ్బాలకు పట్టుకొని డబ్బులు ఇచ్చి మరి వెళ్తారుఅన్నమాట అసలైన తీర్థాలు పవిత్రమైన తీర్థాలు పవిత్రమైన జలాశయాలు వాటికి పేరు ఉండదు కొత్తగా ఈ పెట్టుడు ఏవైతే ఉంటాయో వాటికి పేరు వస్తది.
(08:01) అలాగే స్నానము చేయుటే శుద్ధి చెందినట్లుగా భావించెదురు శుద్ధి అంటే సబాహ్యభ్యంతర సుచిహి బయటికి సుచిగా ఉండాలి మానసికంగాను సుచిగా ఉండాలి ఆత్మపరంగాను సుచిగా ఉండాలి అవన్నీ మానేసి స్నానం చేసాం శుద్ధయ్యం అంతే అలాగే గర్విష్టి మాటలు అహంభావపు ఊరికే బుకాయింపులు తమ ప్రవర్తనలో గొప్పతనం అని అనుకొందురు గర్వంగా తలపొగరుగా మాట్లాడటము చేసి కూడా చేయనట్లు బుకాయించడము పెద్ద పెద్ద తప్పులు నేరాలు ఘోరాలు చేసి సమర్ధించుకోవడము ఇవన్నీ చూసి ఆహా వీళ్ళది ఎంత గొప్ప ప్రవర్తన అనుకుంటారట ప్రజలు ఆ పరిస్థితికి వచ్చేస్తారు.
(08:40) బలము ఉన్నవాడు సంపదలు ఉన్నవాడు దౌర్జన్యము చేయువాడు మూర్ఖుడు అబద్ధములు చెప్పువాడు కొండెములు పెట్టువాడు అంటే గొడవలు పెట్టేవాడు బ్రతుకనేర్చి లాభపడును వాడే అధికారం పొందును వాడే రాజకును ఎక్కడెక్కడ రౌడీ షీటర్లు మర్డర్లు చేసిన వాళ్ళు జైలుకు పోయిచ్చిన వాళ్ళు అక్రమంగా భూకబ్జాలు చేసిన వాళ్ళు మహిళలను నివేదించిన వాళ్ళు వీళ్ళందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అవుతున్నారు.
(09:03) ఈ కలికాలంలో అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపుగా అదే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇట్లు పరిస్థితులు మారి సర్వము దోషపూరితముగా ఉన్నప్పుడు ఇంకను సత్యము ధర్మము అచట అచట మిగిలి ఉండుటచే ప్రజలు బడాయి ప్రభువులను రాజులను భరించలేక కొండలు గుట్టలు లోయలు పట్టిపోయెదరు కళ్ళు ఆకుకూరలు ఆకులు పువ్వులు కందమూలములనే ఆహారముగా స్వీకరింతురు. చెట్టపట్ట చెట్ల పట్టాలు ఆకులు కట్టుకొందురు సంతానమును అమితముగా కనెదరు ప్రకృతిలోని అనేక మార్పులకు తట్టుకొని బ్రతుకుదురు కలియుగము చివరకు పోవు కొద్దీ ఆయుర్ధాయము తరిగిపోవును ఇట్లు ఈ జనము కలియుగాంతమున అందరూ నసిందురు కలియుగమున ధర్మము పక్క మార్గము పట్టి
(09:46) క్షీణించిపోగా సకల చరాచర సృష్టికర్త ఆది మధ్యాంతర రహితుడు సృష్టిస్తులయకారుడు పరబ్రహ్మ స్వరూపుడైన వాసుదేవుని అంశము శంబనుగ్రహమునందు అవిర్భవించి కలికావతారము దాల్చి ధర్మ సంస్థాపన చేయడానికి స్వామి విద్యుక్తుడు అవ్వాడు. పన్నులు పెరిగిపోయి కరెంట్ బిల్లులు పెరిగిపోయి నెల మొత్తం సంపాదించినా కూడా ఇంటి అద్దలకి చాలక తిండికి చాలక పిల్లలు ఫీజులకు చాలక భార్య భర్త ఇద్దరూ పరిశ్రమ చేసే ఉద్యోగాలు చేసి అవి కూడా సరిపోక నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ఇవన్నీ ప్రజలు భరించలేక దుర్మార్గమైన పాలకులని భరించలేక సమాజంలో బ్రతకలేక పొరుగు వారితో సఖ్యం లేక ఇంట్లో
(10:27) వారితో సఖ్యము లేక ఎవరి మధ్య సఖ్యము ఆనందం అనేది కొరవై మనము ఉంటున్నాము ఆ మిషన్లు ఉంటున్నాయి అనే పరిస్థితి వచ్చి అంటే మనుషులు మరయంత్రాలలాగా తయారయి ఇక జీవించలేక ఈ సమాజంలో అడవులు బట్టి కొండలు బట్టి వెళ్లి ఆదివ మానవులు బ్రతికారు ఆకులు కట్టుకొని ఆ బ్రతుకు బ్రతికి శాంతిస్తారట అలాంటి దారుణమైన పరిస్థితులకు వచ్చేసరికి అప్పుడు ఇహ ధర్మాన్ని చక్కపరచాల్సిన ఆవశ్యకత ఉంది అని భావించిన పురుషోత్తముడైన పరమాత్మ శంబలా అనేకమలు కలిగి అవతారం దాల్చి మరల వ్యవస్థను చక్కపరుస్తారు అక్కడి నుంచి మరల సత్య సత్యుగం లేదా కృతయుగ ధర్మాలు స్టార్ట్
(11:04) అవుతాయి. కలియుగ లక్షణాలు గురించి కొంతే విష్ణు పురాణంలో ఉంటుంది. శ్రీమద్ భాగవతంలో ఇంకా గొప్పగా ఉంటుంది అది ఎప్పుడైనా చెప్పుకుందాము. ఇప్పుడు నేను చదివి వినిపించిన విష్ణు పురాణాంతర్గతంగా ఉన్న కలియుగ లక్షణాలను ఎన్నో మనము కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ఇంకొన్ని పరిస్థితుల్లో భవిష్యత్తు తరాలు చవిచూస్తారు.
(11:22) కానీ సదాచారవంతులు నిర్మలమైన హృదయం ఉన్నవాళ్ళు ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల నుండి విడిచిపెట్టరు. ధర్మం అనేది మనిషిని కాపు కాస్తుంది పరమాత్మై మన ధర్మమే మనల్ని రక్షిస్తుంది కాబట్టే పెద్దలు చెప్తారు ధర్మో రక్షత రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణ
No comments:
Post a Comment