పరకాయ ప్రవేశ విద్య రహస్యం 🔥 Parakaya Pravesha Vidya Explained | Hindu Scriptures Telugu #telugu
Author Name:Vedamrutam
Youtube Channel Url:https://www.youtube.com/@vedamrutamtelugu1
Youtube Video URL:https://www.youtube.com/watch?v=YEJ5YSk6WbA
Transcript:
(00:00) ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ భయంకరమైన అత్యంత ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని ఊహించుకోండి. మీరు మీ ఇంట్లో మీ మంచం మీద మీకు ఇష్టమైన దుప్పటి కప్పుకొని చాలా ప్రశాంతంగా గాఢ నిద్రలో ఉన్నారు. సడన్ గా మీకు మెలుక వచ్చింది. గాలి పీల్చుకుంటూ కళ్ళు తెరిచి చూశారు కానీ మీరు కళ్ళు తెరిచింది మీ గదిలో కాదు ఆ వాతావరణం అంతా కొత్తగా ఉంది.
(00:29) ఆ గదిలో ఏదో తెలియని సుగంధ ద్రవ్యాల వాసన వస్తుంది. ఆ గోడలు కొత్తగా ఉన్నాయి. మీరు పడుకున్న మంచం కూడా మీది కాదు పక్కన ఎవరో ముఖం తెలియని మనుషులు గుమ్మిగూడి పెద్ద పెద్దగా ఏడుస్తున్నారు. మీకు ఏమీ అర్థం కావడం లేదు. భయంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. నెమ్మదిగా వనుకుతున్న కాళ్ళతో మంచం మీద నుండి కిందకు దిగారు. పక్కనే ఉన్న ఒక పెద్ద అద్దం దగ్గరికి వెళ్ళారు. అద్దంలో చూసుకున్నారు.
(00:55) ఆ క్షణం మీకు గుండె ఆగిపోయినంత పనైంది. అద్దంలో కనిపిస్తున్న ముఖం మీది కాదు ఆ కళ్ళు మీవి కావు ఆ చేతులు మీవి కావు అసలు ఆ దేహమే మీది కాదు. అది ఎవరో ముఖం తెలియని ఒక కొత్త వ్యక్తి శరీరం కానీ మీ జ్ఞాపకాలు మీ ఆలోచనలు మీ చిన్ననాటి స్నేహితులు మీ తల్లిదండ్రులు మీ పేరు అన్నీ మీకు స్పష్టంగా గుర్తున్నాయి. మీరెవరో మీకు తెలుసు కానీ మీరు బందీ అయిపోయింది మాత్రం వేరొకరి దేహంలో ఒక్కసారి గట్టిగా నేను ఇక్కడ ఉన్నాను నన్ను కాపాడండి అని అరవాలని ప్రయత్నించారు.
(01:34) కానీ బయటికి వస్తున్న గొంతు మీది కాదు ఎవరో పరాయివాడి గొంతు మీ నోట్లో నుంచి వస్తుంది. ఆ క్షణంలో మీకు కలిగే ఆ భయం ఆ ఒంటరితనం ఆ నరకం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వినడానికే ఒల్లు జలదరిస్తుంది కదా ఇది ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలోని సీన్ లాగా లేదా గొప్ప గ్రాఫిక్స్ ఉన్న వీడియో గేమ్ లాగా అనిపిస్తుంది కదా అవతార్ లాంటి సినిమాలో కోట్లు ఖర్చు పెట్టి టెక్నాలజీ ద్వారా ప్రాణం ఇంకో శరీరంలోకి పంపించడం మనం చూశం.
(02:02) ఇదంతా కేవలం గ్రాఫిక్స్ దర్శకుడి ఊహ మాత్రమే అని మనం అనుకుంటాం. కానీ అసలు నిజం ఇంకా షాకింగ్ గా ఉంటుంది. ఈ అద్భుతాన్ని ఎలాంటి మెషిన్లు కేబుల్స్ సైన్స్ ల్యాబ్లు టెక్నాలజీ లేని వేల సంవత్సరాల క్రితమే మన భారతదేశంలోని యోగులు సిద్ధులు ఈ అద్భుతాన్ని చాలా సునాయాసంగా కేవలం తమ కనుబొమ్మల కదలికతో చేసేవారు. ఒక శరీరాన్ని ఒక పాత చొక్కాలాగా విప్పేసి ప్రాణం లేని మరొక శరీరంలో దూరి అచ్చం వాళ్ళలాగే జీవించేవారు.
(02:37) ఈరోజు మనం మన తెలుగు సాహిత్య యోగ మరియు తాంత్రిక చరిత్ర పూటల్లో దాగి ఉన్న ఒక మహా అద్భుతమైన విస్మయకరమైన విద్య గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే పరకాయ ప్రవేశ విద్య. ఈ వీడియో మిమ్మల్ని మనుషుల ఊహ కందని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా వినండి.
(03:03) అసలు ఈ పరకాయ ప్రవేశ విద్య అంటే ఏంటి? ఈ పదాన్ని మనం చాలా సింపుల్ గా విడదీసి చూద్దాం. పర అంటే ఇతరుల కాయ అంటే శరీరం ప్రవేశం అంటే అడుగు పెట్టడం అంటే మన ప్రాణాన్ని మనలో ఉన్న ఆ అసలైన శక్తిని మన దేహం నుండి బయటకు తీసి వేరొక శరీరంలోకి పంపడం అన్నమాట. ఇది వినగానే ఏదో చేతబడి లాగానో బ్లాక్ మ్యాజిక్ లాగానో అనిపించవచ్చు. కానీ మన భారతీయ యోగశాస్త్రం ప్రకారం ఇది ఎలాంటి మాయాజాలం కాదు మనసును కంట్రోల్ చేసే ఒక అత్యున్నతమైన ప్రాచీన సైన్స్ తమ మనస్సును ప్రాణాన్ని పూర్తిగా తమ గుప్పట్లోకి తెచ్చుకున్న గొప్ప గొప్ప అఘోరాలు మహాయోగులు మాత్రమే ఈ విద్యను సాధించేవారు. వాళ్ళు దీన్ని ఏదో మ్యాజిక్
(03:47) షో లాగా ఊరికే అందరికీ ప్రదర్శించి డబ్బులు సంపాదించుకోవడానికి వాడలేదు. సమాజం బాగుపడడం కోసం ప్రాణాపాయంలో ఉన్న వారిని రక్షించడం కోసం లేదా ఎవరికీ తెలియని రహస్య జ్ఞానాన్ని సంపాదించడం కోసం మాత్రమే మన వాళ్ళు దీన్ని వాడేవారు. దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న ఉదాహరణను చూద్దాం. మన చేతిలో ఉన్న లాప్టాప్ లేదా మొబైల్ ఫోన్ పాడైపోయింది అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం అందులో ఉన్న డేటా మొత్తాన్ని ఒక పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసి ఒక కొత్త లాప్టాప్ లోకి ఎక్కిస్తాం.
(04:20) ఆ లాప్టాప్ కలర్ మారొచ్చు బ్రాండ్ మారొచ్చు స్క్రీన్ సైజ్ మారొచ్చు కానీ అందులో ఉన్న మీ ఫోటోలు మీ ఫైల్స్ అన్నీ పాతవే ఉంటాయి కదా ఇక్కడ మన శరీరం కూడా ఒక లాప్టాప్ లాంటిది మన ప్రాణం లేదా మనసు ఆ పెన్ డ్రైవ్ లాంటిది ఒక్కసారి ఊహించండి మీ ప్రాణాన్ని ఒక అదృశ్యమైన పెన్ డ్రైవ్ లాగా తీసి వేరొకరి శరీరంలో పెడితే ఎలా ఉంటుందో ఆ దేహం ఆ ముఖం వాళ్ళదే కావచ్చు కానీ ఆలోచనలు జ్ఞానం లోపల ఉన్న మీరు అంతా మీరే అవుతారు కదా అలాగే ఆ యోగి యొక్క మూల చైతన్యం మాత్రం తన సొంత దేహంతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉంటుంది.
(05:02) పరకాయ ప్రవేశ విద్య అంటే అక్షరాల ఇదే ఇది వినగానే మీకు ఖచ్చితంగా ఒక పెద్ద డౌట్ వస్తుంది. అసలు మన శరీరంలో నుంచి మన ప్రాణం ఎలా బయటకు వస్తుంది? అది ఏమైనా గాలిబుడగా బయటకు రావడానికి అని. ఇది తెలుసుకోవాలంటే మనం ముందు మన దేహం గురించి చాలా డీప్ గా తెలుసుకోవాలి. మనకి కంటికి కనిపించేది అద్దంలో చూసుకునే ఈ ఒక్క దేహమే అని మనం అనుకుంటాం.
(05:27) కానీ యోగశాస్త్రం ప్రకారం మనకు ఒకేసారి మూడు రకాల శరీరాలు ఉంటాయి. మొదటిది స్థూల శరీరం. అంటే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న ఈ భౌతిక దేహం. ఇది భూమి, నీరు నిప్పు గాలి ఆకాశం అనే పంచభూతాలతో తయారైన ఒక మాంసపు ముద్ద. ఇది కేవలం ఒక కారు లాంటి వాహనం మాత్రమే. రెండవది సూక్ష్మ శరీరం. రోడ్డు మీద కారు ఉంటే సరిపోదు కదా దాన్ని నడపడానికి ఒక డ్రైవర్ కావాలి.
(05:56) ఆ డ్రైవరే ఈ సూక్ష్మ శరీరం. ఇందులో మన మనసు, బుద్ధి, మన ఎమోషన్స్, అహంకారం, ప్రాణశక్తి ఉంటాయి. యోగి వేరే శరీరంలోకి వెళ్లేది ఈ సూక్ష్మ శరీరంతోనే దీనికి భౌతిక హద్దులు ఉండవు. ఇక మూడవది కారణ శరీరం ఇది మన కర్మలన్నిటిని వాసనలను దాచుకునే ఒక సీక్రెట్ మెమొరీ కార్డు లాంటిది. ఒక కారు డ్రైవర్ తన పాత కారును గ్యారేజ్ లో పెట్టి ఇంకొక కొత్త కారును తీసుకొని వెళ్ళినంత ఈజీగా యోగులు ఈ పని చేసేవారు.
(06:29) యోగి ఈ పరకాయ ప్రవేశం చేసినప్పుడు తన కారు లాంటి ఈ భౌతిక దేహాన్ని తాత్కాలికంగా ఒక చోట వదిలేసి డ్రైవర్ లాంటి ఆ సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చి వేరొక దేహంలోకి వెళ్తాడు. అప్పుడు ఆ యోగి ఎక్కడున్నాడు? ఎప్పుడు తిరిగి రావాలి అనేది ఆ కారణ శరీరం డిసైడ్ చేస్తుంది. ఒక్కసారి ఊహించండి మీరు ఇష్టంగా వేసుకున్న డ్రెస్ ని సాయంత్రం ఇంటికి రాగానే ఎంత ఈజీగా విప్పేస్తారో అలా ఈ మాంసపు దేహాన్ని విప్పేసి ఒక అద్భుతమైన కాంతి లాగా మీరు గాలిలో తేలుతూ బయటకు వస్తే ఏ గోడలు మిమ్మల్ని ఆపలేవు.
(07:05) ఏ తలుపులు మిమ్మల్ని బంధించలేవు. అది ఎంత స్వేచ్ఛగా అద్భుతంగా ఉంటుందో కదా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ విద్య గురించి ఏవో పాతకాలం నాటి పల్లెటూరి జానపద కథల్లో మాత్రమే రాసలేదు. మన యోగశాస్త్ర పితామహుడు సాక్షాత్తు దైవ స్వరూపుడైన పతాంజలి మహర్షి తను రాసిన యోగ సూత్రాలు అనే మహా గ్రంథంలో విభూతి పాదం అనే విభాగంలో దీన్ని ఎంతో సైంటిఫిక్ గా లాజిక్ గా వివరించారు.
(07:34) పతాంజలి మహర్షి చెప్పిన సూత్రం ప్రకారం దీనిని ఎవరైనా సాధించవచ్చు. ఆ సూత్రం ఏంటంటే బంధకారణ శైతిల్యాత్ ప్రచార సంవేదనాచ చిత్తస్య పరశరీరావేషః ఈ కష్టమైన సంస్కృత పదాన్ని మీకు చాలా సింపుల్ గా అరటిపండు వలిచినట్లు చెప్తాను వినండి. సాధారణంగా మనుష్యులమైన మనకు మన దేహం మీద విపరీతమైన ప్రేమ పిచ్చి అటాచ్మెంట్ ఉంటాయి. నేను అంటే ఈ శరీరమే ఈ అందమే ఈ కండరాళ్లే అనే ఒక అహంకారం మనకు ఉంటుంది.
(08:10) దీనివల్ల మన ప్రాణం మన దేహాన్ని ఒక సూపర్ గ్లూ లాగా చాలా గట్టిగా పట్టుకొని ఉంటుంది. పతాంజలి మహర్షి ఏం చెప్పారంటే ఈ బంధాన్ని యోగ సాధన ద్వారా లోతైన ధ్యానం మరియు సమాధి ద్వారా వదులు చేయాలి. దీన్నే బంధకారణ శైతిల్యం అంటారు. ఆ తర్వాత మన శరీరంలో నాడుల ద్వారా ప్రాణం ఎలా ప్రవహిస్తుందో ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఆ సీక్రెట్ రూట్స్ అన్ని తెలుసుకోవాలి.
(08:37) దీన్నే ప్రచార సంవేదనం అంటారు. దీనిని ఒక చిన్న ఉదాహరణతో తెలుసుకుందాం. ఒక అందమైన పక్షిని ఒక ఇనుప బోనులో పెట్టి ఆ బోనుకి గట్టిగా తాళం వేశారనుకోండి ఆ పక్షి రెక్కలు ఎంత బలంగా ఉన్నా అది బయటకు రాలేదు కదా. ఇక్కడ మన ప్రాణమే ఆ పక్షి ఈ దేహం అనే బోనులో ఆ పక్షి చిక్కుకుపోయింది. ఆ బోను తాళం తీయడమే యోగ సాధన. ముఖ్యంగా మన గొంతు దగ్గర ఉదాన వాయువు అనే ఒక ప్రాణశక్తి ఉంటుంది.
(09:05) దాని మీద పూర్తి కంట్రోల్ సాధించిన యోగి తన శరీరాన్ని దూదిపింజలాగా తేలికగా మార్చుకోగలడు. అంతేకాదు ఏకంగా మృత్యువుని కూడా జయించగలడు. ధారణ ధ్యానం సమాధి అనే మూడింటిని పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయడాన్ని సంయమం అంటారు. ఈ సంయమం ద్వారా యోగి దేహ పరిమాణాన్ని మార్చే అనిమా మహిమ లాంటి శక్తులు పొందుతాడు. అలాగే ఆకాశంలో పక్షి లాగా ఎగిరే కేచర విద్య కూడా వస్తుందట.
(09:38) అప్పుడు తన చైతన్యాన్ని ఆకాశం ద్వారా ఒక వైర్లెస్ సిగ్నల్ లాగా వేరొక శరీరంలోకి సునాయాసంగా పంపగలడు. కానీ అసలు నిజం వింటే మీరు సీట్లోనుంచి ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే ఇదంతా ఎవరో చెప్పిన థియరీ కాదు లేదా క్లాస్ రూమ్ లో చదివే సైన్స్ పాఠం కాదు. మన కళ్ళ ముందు మన చరిత్రలో జరిగిన ఒక మహా అద్భుతం ఉంది. అదే మన తెలుగు ఆధ్యాత్మిక సాహిత్యంలో బంగారు అక్షరాలతో రాసి ఉన్న ఆదిశంకరాచార్యుల వారి జీవితంలో జరిగిన రోమాలు నిక్కబుడుచుకునే సంఘటన.
(10:09) శంకరాచార్యుల వారు చిన్న వయస్సులోనే సన్యాసం తీసుకుని భారతదేశంంతా కాలినడకన తిరుగుతూ ఎంతోమంది హేమహేమీయులైన పండితులతో వాదించి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపిస్తూ వస్తున్నారు. అలా ఒకసారి మండన మిశ్రుడు అనే గొప్ప పండితుడితో వాదించి అతన్ని ఓడిస్తారు. అప్పుడు మండన మిశ్రుడి భార్య ఉభయభారతి రంగంలోకి దిగుతుంది. ఆమె సామాన్యురాలు కాదు ఎంతో తెలివిగలది.
(10:35) శంకరులను ఎలాగైనా ఓడించాలని ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. శంకరులు సన్యాసి కాబట్టి ఆయనకు గృహస్థాశ్రమం మీద భార్యా భర్తల దాంపత్య జీవితం మీద ముఖ్యంగా కామశాస్త్రం మీద ఎలాంటి ప్రాక్టికల్ అనుభవం ఉండదని ఆమెకు తెలుసు. అందుకే కావాలనే ఆ అంశంపై ఎన్నో కష్టమైన ప్రశ్నలు వేసింది ఉభయభారతి. సన్యాసి అయిన శంకరులు వాటికి సమాధానం చెబితే ఆయన సన్యాస ధర్మానికి విరుద్ధం చెప్పలేకపోతే ఆయన ఓడినట్లు లెక్క ఇదొక భయంకరమైన ధర్మ సంకటం ఇక్కడే శంకరులు ఒక అద్భుతమైన ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకుంటారు.
(11:16) ఈ ప్రశ్నలకు అనుభవపూర్వకంగా సమాధానం తెలుసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి అని ఆమెను గడువు అడుగుతారు. ఇక ఇక్కడి నుంచి జరిగే స్టోరీ ఒక హాలీవుడ్ త్రిల్లర్ మూవీని మించిపోతుంది. శంకరులు తన శిష్యులతో కలిసి ఒక దట్టమైన అడవిలో నడుస్తూ వెళ్తుంటారు. ఆ అడవిలో చీకటిగా నిశశబ్దంగా ఉంది. గాలికి ఎండిన ఆకులు రాలుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది. అలా వెళ్తున్న వారికి ఒక పెద్ద చెట్టు కింద ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది.
(11:44) ఆ రాజ్యాన్ని పాలించే అమరుక అనే ఒక బలమైన రాజు వేటకు వచ్చి అనుకోకుండా పాముకాటుకు గురై చనిపోయి పడి ఉంటాడు. అతని దేహం అప్పటికే చల్లబడిపోయింది. ఆ రాజు శరీరాన్ని చూడగానే శంకరుల మదిలో ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది. తాను నేర్చుకోవాల్సిన కామశాస్త్ర రహస్యాలు నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఇంతకంటే సరైన అవకాశం బ్రహ్మదేవుడు కూడా ఇవ్వలేడు అని ఆయన నిర్ణయించుకుంటారు.
(12:12) వెంటనే తన శిష్యులను పిలిచి ఆ అడవిలో ఎవ్వరికీ కనిపించని ఒక గుప్తమైన రహస్య గుహలోకి వాళ్ళంతా వెళ్తారు. శంకరాచార్యుల వారు శిష్యులతో ఎంతో సీరియస్ గా ఇలా చెప్తారు. నేను నా ప్రాణాన్ని వదిలి ఆ మరణించిన రాజు శరీరంలోకి వెళ్తున్నాను. నా ఈ శరీరాన్ని కుల్లిపోకుండా క్రూర జంతువులు తినేయకుండా మీ కంటికి రెప్పలా కాపలా కాయాలి అని ఆజ్ఞాపించి ఆ చీకటి గుహలో పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతారు.
(12:45) ఒక్కసారి ఆ సీన్ ని ఒక సినిమా లాగా ఊహించుకోండి. ఆ చీకటి గుహలో నిశశబ్ద వాతావరణంలో శంకరుల భౌతిక శరీరం శ్వాస ఆపేసింది. ఆయన శరీరం నుంచి ఒక అద్భుతమైన కాంతి లాంటి సూక్ష్మ శరీరం బయటకు వచ్చింది. ఆ కాంతిరేఖ అదృశ్య రూపంలో గాలిలో తేలుతూ వెళ్లి అక్కడ చెట్టు కింద చలనం లేకుండా పడి ఉన్న ఆ రాజు శరీరంలోకి సూటిగా ప్రవేశించింది.
(13:11) అంతే చనిపోయాడు ఇక లేవడు అనుకున్న ఆ రాజు ఒక్కసారిగా గట్టిగా గాలి పీల్చుకుంటూ ఉలిక్కి పడి కళ్ళు తెరుస్తాడు. చనిపోయిన రాజు బ్రతికి లేచేసరికి సైనికులు మరియు రాజ్యమంతా ఎంతో సంతోషంగా అంగరంగ వైభవంగా పండగ చేసుకున్నారు. ఆ రాజు శరీరంలో ఉన్నది సాక్షాత్తు జగద్గురువు ఆదిశంకరాచార్యులే అన్న విషయం ఆ రాజ్యంలో ఎవ్వరికీ తెలియదు. రాజువేషంలో ఉన్న శంకరులు నేరుగా రాజ్యానికి వెళ్తారు.
(13:40) అంతఃపురంలో రాజు దేహంతో ఉంటూనే ఒక సాక్షిలాగా నీటిమీద తామరాకులా ఉంటూ ఆ కామశాస్త్ర రహస్యాలఅన్నింటిని స్వయంగా తెలుసుకుంటారు. ఇది వింటే మీకు నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. శంకరులు రాజు శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఆ రాజు పాలన పూర్తిగా మారిపోయింది. మునుపటి కంటే వంద రెట్లు తెలివి ఎంతో అద్భుతంగా ధర్మబద్ధంగా పరిపాలిస్తుంటాడు.ఒ ఒక సాధారణ రాజుకి అది కూడా విలాసాల్లో తేలిపోయే మనిషికి సడన్ గా ఇంత గొప్ప బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుంది ఇది గమనించిన ఆ రాజ్యపు మంత్రులకు ఒక పెద్ద అనుమానం వస్తుంది.
(14:17) మన రాజుకి ఇంత జ్ఞానం లేదు ఇతను మన రాజు ఖచ్చితంగా కాదు చనిపోయిన మన రాజు శరీరంలోకి ఏదో ఒక గొప్ప యోగి ఆత్మ ప్రవేశించి ఉంటుంది అని వాళ్ళు పసిగడతారు. వాళ్ళ స్వార్థం ఎలా ఉంటుందంటే ఈ అద్భుతమైన యోగి ఎప్పటికీ మన రాజు శరీరంలోనే ఉండిపోవాలి. అప్పుడే మన రాజ్యం బాగుంటుంది. ఆయన తిరిగి వెళ్ళిపోతే మన రాజు మళ్ళీ పడిపోయి చనిపోతాడు అని మంత్రులు భయపడతారు.
(14:45) ఆ యోగి తిరిగి వెళ్ళాలంటే ఆయన ఎక్కడో వదిలేసి వచ్చిన సొంత శరీరం భద్రంగా ఉండాలి కదా కాబట్టి ఆ దేహం దొరక్కుండా చేయాలి అని కుట్రపన్నుతారు. ఆ రాజ్యంలో ఎక్కడ అనాధ శవాలు కనిపించినా వెంటనే అగ్నిలో దహనం చేసేయాలి అని ఒక కఠినమైన ఆర్డర్ పాస్ చేశారు మంత్రులు. వాళ్ళు వెతుక్కుంటూ వెళ్లి శంకరుల శిష్యులు కాపలా ఉన్న ఆ అడవిలోని గుహను కూడా కనుక్కుంటారు.
(15:09) శిష్యులను బలవంతంగా పక్కకు నెట్టేసి ఆ గుహలో ధ్యాన ముద్రలో ఉన్న శంకరుల అసలు శరీరానికి నిప్పు పెడతారు. మంటలు భయంకరంగా అంటుకుంటాయి. శరీరం కాలిపోవడం మొదలవుతుంది. శిష్యులకు ఏం చేయాలో పాలుపోదు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ రాజు దగ్గరకు వస్తారు. కానీ రాజసభలో రాజుకు నేరుగా గురువుగారు మీ శరీరం కాలిపోతుంది అని విషయం చెప్పలేరు కదా అందుకే అత్యంత తెలివిగా పాటల రూపంలో వేదాంతపరమైన శ్లోకాలతో ఆయనకు అసలు విషయాన్ని గుర్తు చేశారు.
(15:45) ఆ శ్లోకాలు వినగానే అంతఃపురపు మాయలో ఉన్న శంకరులు ఒక్కసారిగా ఉలిక్కి పడి అలర్ట్ అవుతారు. ఆ క్షణంలో ఏమాత్రం ఆలోచించకుండా ఆ రాజు శరీరాన్ని వదిలేస్తారు. రాజు కిందకు పడిపోయి మళ్ళీ నిర్జీవంగా చనిపోతాడు. ఇక శంకరుల ప్రాణం సెకనులో లక్షవ వంతు వేగంతో ఆకాశ మార్గంలో ప్రయాణించి గుహలో మంటల్లో కాలిపోతున్న తన సొంత శరీరంలోకి చివరి నిమిషంలో ఎంటర్ అవుతుంది.
(16:13) కళ్ళు తెరిచి చూసేసరికి అగ్ని జ్వాలలు తన దేహాన్ని దహిస్తున్నాయి. భరించలేని మంట ప్రాణాలు పోయేంత నొప్పి వెంటనే ఆయన తనను ఈ అగ్ని నుండి రక్షించమని నరసింహ స్వామిని ఆక్రోశంగా వేడుకుంటూ ప్రసిద్ధమైన లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పటిస్తారు. ఆ అద్భుతమైన భక్తి శక్తితో మంటలు చల్లారి ఆయన ప్రాణాలతో బయట పడతారు. వింటుంటేనే ఒక విజువల్ వండర్ లాగా ఉత్కంఠభరితమైన సినిమా క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది కదా కానీ ఒక్క నిమిషం ఆలోచించండి.
(16:46) ఈ విద్య కేవలం శంకరాచార్యుల వారు మాత్రమే చేశారా? కాదు మన తెలుగులో ఎంతో పాపులర్ అయిన విక్రమార్క బేతాల కథలు మరియు సింహాసన ద్వాత్రింషిక అనే అద్భుతమైన జానపద గ్రంథాలలో ఈ విద్య గురించి ఎంతో విపులంగా వర్ణించారు. మన విక్రమాదిత్య మహారాజు ఆ అద్భుతమైన విద్యను ఒక గొప్ప యోగి దగ్గర ఎంతో కష్టపడి నేర్చుకుంటారు. శత్రువుల గుట్టు వారి కుట్రాల రహస్యాలు తెలుసుకోవడానికి విక్రమార్కుడు ఏకంగా తన దేహాన్ని వదిలి ఒక చిన్న రామ చిలుక శరీరంలోకి దూరేవాడట అచ్చం సినిమాలో అండర్ కవర్ స్పై లాగా ఆ పక్షి రూపంలో శత్రువుల రాజ్యానికి ఎగిరి వెళ్లి వాళ్ళు మాట్లాడుకునేదంతా రహస్యంగా
(17:27) వినేవాడట అవసరమైతే ప్రాణాపాయంలో ఉన్న ఎవరినైనా కాపాడడానికి తన ప్రాణాలనే పనంగా పెట్టి ఒక మృతదేహంలోనికి తన చిత్తాన్ని బదిలీ చేసేవాడట ఒక్కసారి మీ ఊహకు పదును పెట్టండి. మీరు సరదాగా ఒక పక్షి శరీరంలోకి వెళ్లి ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతూ మీకు కావలసిన వారి ఇంటికి వెళ్లి మీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో రహస్యంగా వినగలిగితే ఎలా ఉంటుంది? ఆ ఊహే అద్భుతంగా ఉంది కదా ఈ కథలన్నీ చూస్తుంటే ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు.
(18:00) ఆ రోజుల్లో ధర్మాన్ని రక్షించడానికి సమాజాన్ని కాపాడడానికి మన వాళ్ళు వాడిన ఒక గొప్ప ప్రాణాధారమైన ఆయుధం అని అర్థంవుతుంది. ఇక మన తెలుగునాట గొప్ప సిద్ధుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న బౌద్ధ సన్యాసి సిద్ధ నాగార్జునుడు రాసిన కక్షపుటము అనే తాంత్రిక గ్రంథంలో ఈ విద్యని పరకాయాంతర ప్రవేశం అని చాలా క్లియర్ గా రాశారు. అందులో అజపాన మహామంత్రం గురించి రాశారు.
(18:29) ఆ మంత్రాన్ని ఏకాగ్రతతో చదవడం ద్వారా కేవలం ఒక చిన్న సంకల్పం తోటే వేరొక శరీరంలోకి సునాయాసంగా వెళ్లొచ్చని చెప్పారు. అంతేకాకుండా ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి అనే ఈ పంచభూతాలను కంట్రోల్ చేయడం ద్వారా ఈ విద్య మన సొంతం అవుతుందట. ఉదాహరణకు మనం వీడియో గేమ్స్ ఆడేటప్పుడు జాయిస్టిక్ తో కార్లను మనుషుల్ని ఎలా కంట్రోల్ చేస్తామో ఈ పంచభూతాలు కూడా ఆ యోగి చేతిలో అలా కంట్రోల్ అవుతాయి.
(19:01) అలాగే మేదవరపు సంపత్ కుమార్ గారు తెలుగులోకి ఎంతో శ్రమించి అనువదించిన 64 తాంత్రిక గ్రంథాలలో ఆకాశ భైరవ తంత్రం భూత డామర తంత్రం మహామాయా తంత్రం లాంటి పుస్తకాల్లో దీని గురించి ఒక పెద్ద సైన్స్ దాగి ఉంది. తన సొంత శరీరాన్ని వదిలి వెళ్లే ముందు ఆ దేహాన్ని పాడైపోకుండా కుళ్లిపోకుండా ఉండడానికి వాడే ఎవ్వరికీ తెలియని ప్రత్యేక తైలాలు మూలిక ఔషధాల గురించి కూడా ఈ పుస్తకాలలో చాలా క్లియర్ గా రాసి ఉంది.
(19:32) ఇదంతా చూస్తుంటే మన ప్రాచీన విజ్ఞానం ఎంత అడ్వాన్స్ గా ఉందో అర్థమవుతుంది. కానీ అసలు ప్రమాదం ఇప్పుడే మొదలవుతుంది. ఈ విద్య గురించి వినగానే చాలా మందికి ఒక క్రేజీ ఆలోచన వస్తుంది. అబ్బా భలే ఉందే ఎప్పుడు పడితే అప్పుడు నాకు నచ్చిన వాళ్ళ శరీరంలోకి ఏ అంబానీ లాంటి కోటీశ్వరుడి శరీరంలోకో వెళ్ళిపోవచ్చా అని దానికి ఆన్సర్ ఖచ్చితంగా నో దీనికి ఎవ్వరు బ్రేక్ చేయలేని కొన్ని కఠినమైన రూల్స్ ఫిజిక్స్ కి సంబంధించిన టైం లిమిట్స్ ఉంటాయి.
(20:04) ఒక వ్యక్తి సాధారణంగా అనారోగ్యంతోనో లేదా వయసైపోయి మరణిస్తే ఆ శరీరంలోకి వెళ్ళడానికి కేవలం మొదటి 90 నిమిషాలు అంటే గంటన్నర మాత్రమే టైం ఉంటుంది. ఎందుకంటే ప్రాణం పోయిన వెంటనే ఆ శరీరంలో ఒక శూన్యం ఏర్పడుతుంది కాబట్టి ప్రవేశం సులభం అవుతుంది. అదే మన ఆదిశంకరాచార్యుల కథలో లాగా పాముకాటు వల్ల చావు వస్తే ఆ విషం వల్ల ప్రాణశక్తి చాలా నెమ్మదిగా శరీరాన్ని వదులుతుంది.
(20:34) కా కాబట్టి ఆ కేసులో దాదాపు నాలుగున్నర గంటల సమయం యోగికి దొరుకుతుందట. యోగశాస్త్రం ప్రకారం మనిషి చనిపోగానే ప్రాణం మొత్తం ఒకేసారి గాలిలో కలిసిపోదు. మన శరీరంలో ధనంజయ వాయువు అని ఒకటి ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ దేహం పూర్తిగా కుల్లిపోయేంతవరకు ఆ ప్రాణవాయువు అక్కడే అలా ఉండిపోతుంది. ఈ మధ్య గ్యాప్ లోనే ఆఖరి సెకండ్ లో యోగులు ఆ దేహంలోనికి ఎంటర్ అవుతారు.
(21:01) ఉదాహరణకు మీరు మెట్రో రైల్ ఎక్కాలి. ఆ డోర్స్ మూసుకుపోతున్నాయి. ఆ రెండు డోర్స్ మధ్య ఉన్న గ్యాప్ లో మీరు స్లిప్ అయి లోపలికి వెళ్ళినట్లు అన్నమాట. ఒక్క సెకండ్ లేట్ అయినా ఆ డోర్స్ మీకు తగిలి మీరు కింద పడిపోతారు. మరి బ్రతికి ఉన్న వాళ్ళ శరీరంలోకి వాళ్ళకి తెలియకుండా వెళ్లొచ్చా ఇది అత్యంత కష్టం. ఎదుటి వ్యక్తి చాలా గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేదా వాళ్ళ విల్ పవర్ బాగా వీక్ గా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందట.
(21:32) ఒక్కసారి ఊహించండి ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే అతని బాడీలో ఒక ఖాళీ ఏర్పడుతుంది. అక్కడ ఒక ఇన్విజిబుల్ టైమర్ ఆన్ అవుతుంది. ఆ సమయం ముగిసిపోయే లోపే యోగి తన ప్రాణాన్ని ఒక కాంతి లాగా అందులోకి పంపించాలి. ఎంతటి పర్ఫెక్ట్ టైమింగ్ తో టెన్షన్ తో జరగాలో కదా ఇదంతా వింటుంటే అద్భుతంగా ఏదో మ్యాజిక్ లాగా ఉంది కదా కానీ ఇక్కడే అసలు భయంకరమైన ట్విస్ట్ ఉంది.
(21:59) ఈ విద్య ప్రాణాలతో చెలగాటం లాంటిది. సింపుల్ గా చెప్పాలంటే ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఇందులో ఉన్న ప్రమాదాలు తెలిస్తే మీరు కలలో కూడా దీన్ని ఊహించడానికి భయపడతారు. ఒక యోగి తన అసలు శరీరాన్ని ఎక్కడో అడవిలో వదిలి వెళ్ళినప్పుడు దానికి ఎలాంటి సెక్యూరిటీ గార్డ్స్ ఉండరు. ఆ టైంలో ఏ క్రూర జంతువైనా ఒక పులో సింహమో వచ్చి ఆ దేహాన్ని పీక్కు తిన్నా లేదా శంకరాచార్యుల కథలో లాగా ఎవరైనా తెలియక ఆ శరీరాన్ని అగ్నిలో కాల్చేసినా ఆ యోగి పరిస్థితి ఏంటి? ఆయన ఇంక తిరిగి వచ్చే దారే ఉండదు.
(22:35) ఒకవేళ అలా జరిగితే ఆ యోగి ఎప్పటికీ ఆ రెండవ శరీరంలోనే ఆ పరాయివాడిగానే బ్రతకాలి లేదా ఆ క్షణమే తను ప్రాణాలు వదలాలి. ఇది ఎంత భయంకరమైన సైకలాజికల్ ట్రాపో ఎంత ఎమోషనల్ నరకమో ఒకసారి మీరే ఊహించండి. మీరు ఇంకొకరి దేహంలో ఇరుక్కుపోయారు. ఇక్కడ మీ అసలు శరీరాన్ని ఎవరో తగలుబెట్టేశారు. ఇంక మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి ఎప్పటికీ వెళ్ళలేరు.
(23:03) ఒకవేళ మీరు వెళ్లి అమ్మ నేనే నీ కొడుకుని అని చెప్పినా మీ పరాయి ముఖం చూసి మీ తల్లే మిమ్మల్ని తరిమి వేస్తుంది. అద్దంలో చూసుకుంటే మీ సొంత ముఖం మీకు జీవితాంతం కనిపించదు. మీరు మీరే కాదనే భావన మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేస్తుంది. ఇలా జరిగితే ఈ నిజం మీ మనసును పిండేస్తుంది కదూ ఇది మాత్రమే కాదు ఇంకొక అతి పెద్ద సైలెంట్ కిల్లర్ రిస్క్ ఏంటంటే మానసిక ఐడెంటిఫికేషన్ మరియు కర్మబంధం అవతలి వాళ్ళ బాడీలోకి వెళ్ళినప్పుడు ఆ కొత్త శరీరానికి అప్పటికే కొన్ని కఠినమైన అలవాట్లు పిచ్చి కోరికలు వాసనలు ఉంటాయి కదా ఒకవేళ ఆ శరీరం ఒక తాగుబోతుదో లేదా విపరీతమైన కోపం ఉన్నవాడిదో అయితే యోగి తన
(23:45) సంకల్పాన్ని స్ట్రాంగ్ గా ఉంచుకోకపోతే ఆ కొత్త దేహం యొక్క ఆ చెడు అలవాట్లు ఫీలింగ్స్ యోగి మనసును మాగ్నెట్ లాగా లాగేస్తాయి. వాళ్ళ పాప పుణ్యాల కర్మలన్నీ వాళ్ళు చేసిన తప్పులన్నీ ఏ సంబంధం లేని ఈ యోగి మెడకు ఉరితాడులా చుట్టుకుంటాయి. అందుకే ఆ దేహంలో ఉన్నా కూడా ఎప్పుడూ ఒక సాక్షి లాగా డిటాచ్డ్ గా ఉండడం అత్యంత అవసరం.
(24:11) ఏమాత్రం ఎమోషన్స్ కి కనెక్ట్ అయి బ్యాలెన్స్ తప్పినా ప్రాణాలు కోల్పోవాల్సిందే లేదా కర్మ చక్రంలో బలైపోవాల్సిందే మరి ఇప్పుడు ఈ మోడరన్ ప్రపంచంలో ప్రతిదానికి ప్రూఫ్ అడిగే ఈ సైన్స్ యుగంలో ఈ విద్యని ఎవరైనా నమ్ముతారా నేటి సైన్స్ ఇదంతా అసాధ్యం జస్ట్ పిట్ట కథలు అని కొట్టి పారేయొచ్చు కానీ ఆధునిక ఆధ్యాత్మిక రంగంలో నేటికీ దీనిపై లోతైన పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి.
(24:37) సద్గురు జగ్గి వాసుదేవ్ లాంటి పాపులర్ గురువులు దీన్ని చాలా క్లియర్ గా ప్రాణిక్ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే ఒక దేహంలోని ప్రాణశక్తిని ఒక ప్యూర్ ఎనర్జీని ఇంకో దేహంలోకి వైర్లెస్ గా బదిలీ చేయటం అన్నమాట. అలాగే డిజిటల్ మాధ్యమాల్లో మన తెలుగులో బ్రహ్మర్షి గరికపాటి నరసింహారావు గారి లాంటి ఎంతోమంది అనుభవజ్ఞులైన పండితులు ఇవి మన ప్రాచీన శాస్త్రాల్లో నిక్షిప్తమైన పచ్చి నిజాలు అని వీటిని మనం కేవలం మాయగా హేలనగా చూడకూడదు అని చాలా గట్టిగా చెబుతున్నారు.
(25:12) ఇదండీ ఒక మనిషి తన దేహాన్ని విప్పేసి మరొక మనిషి శరీరంలోకి దర్జాగా వెళ్లే పరకాయ ప్రవేశ విద్య వెనుక ఉన్న భయంకరమైన అత్యంత ఆసక్తికరమైన రహస్యం మరి ఇప్పుడు మీరే చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు మనుషుల్లో దాగి ఉన్న ఈ అద్భుతమైన శక్తుల గురించి పతంజలి మహర్షి రాసిన ఈ సైన్స్ గురించి విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఇదంతా నిజమే అని మీ మనసుకి అనిపిస్తుందా? అసలు ఇలాంటి శక్తులు మనుషులు సాధించగలరా ఒకవేళ మీకు దేవుడు ప్రత్యక్షమై 24 గంటల కోసం ఈ పరకాయ ప్రవేశ విద్య చేసే శక్తి ఇస్తే మీరు ఎవరి శరీరంలోకి వెళ్లాలనుకుంటున్నారు ఎవరి సీక్రెట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు
(25:55) ఒక్కసారి ఆలోచించండి. మీ అద్భుతమైన క్రేజీ ఆలోచన కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
No comments:
Post a Comment