What will it be like after attaining self-realization?_Ramana Maharshi
Author Name:Spiritual Books Club
Youtube Channel Url:https://www.youtube.com/@SpiritualBooksClub
Youtube Video URL:https://www.youtube.com/watch?v=JhmhPRartyY
Transcript:
(00:02) ఓం నమో భగవతే శ్రీ రమణాయ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అంటే అతను మేలుకొని ఉన్నప్పుడైనా నిద్రపోయేటప్పుడైనా సుషుప్తిలో ఉన్న ఈ మూడు అవస్థ స్థలో కూడా అసలు అతనికి ఉండవు ఒకే విధంగా ఉంటాడు. నిజమేనా అని ఒక భక్తుడు ప్రశ్నించాడు దానికి భగవాన్ రమణ మహర్షి గారి సమాధానం మెలకువ స్వప్నం సుషుప్తి
(00:48) ఈ మూడు అవస్థలు ఉండవని ఎట్లా అంటున్నావు ఇక్కడ భగవాన్ బ్రహ్మార్షి గారు చెప్తున్నారు నేను కలకన్నాను నేను గాఢ నిద్రపోయాను నేను మేల్కొని ఉన్నాను అని నువ్వు అన్నప్పుడే ఆ మూడు స్థితులలోనూ నువ్వు ఉన్నట్టేనని ఒప్పుకోవాలి. అంటే ఎల్లప్పుడూ నువ్వు ఉన్నావనే స్పష్టమవుతుంది. ఇప్పుడు ఉన్నట్లుంటే నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నట్టు స్వప్నావస్థలో ఇది మరుగున పడుతుంది.
(01:21) అట్లాగే సుషుప్తిలో స్వప్నావస్థ మాయమవుతుంది. నువ్వు అప్పుడు ఉన్నావు ఇప్పుడు ఉన్నావు ఎప్పుడూ ఉంటావు ఆ మూడు అవస్థలు కూడా వస్తుంటాయి పోతుంటాయి. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ ఇక్కడ ఉంటావు. ఇదొక సినిమా వంటిది ఇప్పుడు చూడండి తెర ఎప్పుడూ అక్కడ ఉంటూనే ఉంది. కానీ దాని మీద ఎన్నో రకాల బొమ్మలు వస్తుంటాయి పోతుంటాయి. తెర మీద ఏది అంటుకోదు.
(01:53) తెర తెరగానే ఉంటుంది అట్లాగే ఆ మూడు స్థితులల్లోనూ నువ్వు ఆత్మగానే ఉంటావు. ఈ విషయం తెలిస్తే ఈ మూడు అవస్థలు నిన్నేమి ఇబ్బంది పెట్టవు. ఎలాగైతే తెరకి చిత్రాలు అంటుకోనట్టు తెర మీద ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కెరటాలతో మహాసముద్రం కనబడుతుంది. అది పోతుంది. ఇంకోసారి చుట్టూ రేయిపోతున్న మంట కనబడుతుంది. అది పోతుంది. రెండు సార్లు కూడా తెర అలాగే ఉంది అక్కడే ఉంది.
(02:27) నీటి వల్ల తెర ఏమైనా తడిసిపోయిందా మంట వల్ల తెర కాలిపోయిందా తెరని ఏది ఏం చేయలేదు అట్లాగే మెలుకువగా ఉన్నప్పుడు గాని స్వప్నంలో ఉన్నప్పుడు గాని సుషుప్తిలో ఉన్నప్పుడు గాని జరిగే వాటికి వేటికి నీ మీద ప్రభావం ఉండదు. నువ్వు నీ ఆత్మగానే ఉంటావు. అంటే మరి ఆ మూడు అవస్థలు ఉన్నా మనుషులపై వాటి ప్రభావం ఉండదా అని మరో భక్తుడు ప్రశ్నించాడు.
(03:04) భగవాన్ రమణమా సమాధానం అవును ఈ అవస్థలన్నీ వస్తుంటాయి పోతుంటాయి. ఇవేవి ఆత్మకి పట్టవు దానికి ఒకే ఒక అవస్థ ఉంటుంది. అంటే అటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఉన్నా ఒక సాక్షిగా మాత్రమే ఉంటాడనా దాని అర్థం మరో భక్తుడు ప్రశ్నించాడు. దానికి భగవాన్ సమాధానం అవును దీనికి పంచదశిలో విద్య అరణ్యులు ఒక ఉపమానం పెట్టారు. నాటకశాలలో రంగస్థలం మీద పెట్టిన దీపాన్ని నాటకం జరుగుతున్నంత సేపు ఆ దీపం ఏ విచక్షణ లేకుండా అన్ని పాత్రదారులని కనపడేటట్లు చేస్తుంది. వాళ్ళు రాజులైనా
(03:50) సేవకులైనా నర్తకులైనా ప్రేక్షకులైనా సరే ఆ దీపం నాటక ప్రదర్శనకి ముందు ఉంటుంది. ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఉంటుంది నాటకం ముగిసిన తర్వాత కూడా ఉంటుంది. ఆ విధంగానే లోపలి కాంతి అంటే ఆత్మ అహానికి బుద్ధికి స్మృతికి మనసుకి వెలుగునిస్తుంది. దానికి మాత్రం పెరుగుదల క్షీణించడం అంటూ ఏమీ లేదు. గాఢ నిద్రలో ఇతర అవస్థలలో అహం ఉన్నట్టు అనిపించకపోయినా ఆత్మ మాత్రం ఏ గుణము లేకుండా ప్రకాశిస్తూనే ఉంటుంది ఎల్లప్పుడూ అసలు ఆత్మ సాక్షి అనే భావం మనసులో ఉన్నదే
(04:37) అది ఆత్మ గురించిన కేవల సత్యం కాదు సాక్షిభూతం అవ్వడానికి పదార్థాలతో సంబంధం ఉంటుంది. ఆ సాక్షి పదార్థము మనసుచే కల్పింపబడినది. అప్పుడు మరొక భక్తుడి ప్రశ్న చైతన్యానికి గల ఆ మూడు స్థితులు తురియ అవస్థకు ఏ విధంగా తక్కువ ఇంతకుముందు చెప్పిన మూడు అవస్థలు ఇంకో నాలుగవ దానికి అంటే నాలుగవ తురియా అవస్థ దానికి దీనికి సంబంధం ఏమిటి అని అడుగుతున్నాడు.
(05:13) దానికి భగవాన్ సమాధానం ఉన్నదల్లా ఒకే ఒక అవస్థ అది చైతన్య స్థితి దానినే ఎరుక అనొచ్చు లేక ఉనికి అనొచ్చు. ఆ మూడు అవస్థలు మెలుకువ స్వప్నం సుషుప్తి సత్యం కానే కావు. సత్యం ఎప్పుడూ ఉంటుంది. అన్ని అవస్థలలోనూ ఉండే ఆ నేను ఆ ఉనికే సత్యం అసలు మిగిలిన మూడు వాస్తవాలు కావు. అందువల్ల వాటికి ఎంత సత్యం ఉందో చెప్పడం కష్టం స్థూలంగా ఇట్లా చెప్పవచ్చు.
(05:47) ఉనికి లేక చైతన్యం ఒక్కటే సత్యం. చైతన్యానికి మెలుకువని జోడించిన స్థితిని జాగ్రతవస్థ అంటాం. అట్లాగే చైతన్యానికి నిద్రను జోడించిన స్థితిని సుషుక్తి అంటాం. చైతన్యానికి కలను జోడించిన స్థితిని స్వప్నావస్థ అంటాం. అన్ని చిత్రాలు వస్తూపోతూ ఉండే తెర ఇక్కడ చైతన్యం ఆ తెర సత్యం చిత్రాలు దానిపై కదలాడే నీడలు ఎంతో కాలంగా అలవాటయపోయిన కారణంగా ఈ అవస్థలన్నీ నిజమని భావించి ఎరుకని లేదా చైతన్య స్థితిని నాలుగో అవస్థ అంటాం.
(06:32) నాలుగో అవస్థ అంటూ ఏమీ లేదు అసలు అక్కడ ఉన్నదల్లా ఒకే ఒక అవస్థ నిజానికి స్వప్నావస్థకి జాగ్రతవస్థకి తేడా ఏం లేదు. ఎర్చి స్వప్నావస్థ తక్కువది జాగ్రతవస్థ పెద్దది రెండు మనసుకు ఫలితాలే జాగ్రతవస్థ ఎక్కువ జీవితకాలం ఉంటుంది కాబట్టి అదే మన నిజస్థితి అని ఊహించుకుంటాం. అసలు మన నిజస్థితి తురియావస్థ నాలుగోది అది ఎప్పుడు ఉంటుంది దానికి మిగిలిన మూడు అవస్థల గురించి తెలియదు.
(07:06) ఆ మూడింటిని అవస్థలు అంటుంటాం కాబట్టి నాలుగో దానిని కూడా తుర్యావస్థ అంటాం. అది ఒక అవస్థ కానే కాదు అది ఆత్మ యొక్క నిజ స్థితి సహజ స్థితి ఇది గ్రహిస్తే తురియ నాలుగవ స్థితి కాదని తెలుస్తుంది. దానిని మిగిలిన మూడింటికి జోడిస్తే నాలుగవది అవుతుంది. అది తుర్యా అతీత స్థితి. మరి ఈ మూడు అవస్థలు ఆత్మని అసలైన తరం మీదకి ఎందుకు వస్తూ పోతుంటాయి అని మరొక భక్తుడు ప్రశ్నించాడు.
(07:38) దానికి సమాధానం భగవాన్ ఇచ్చిన సమాధానం ఈ ప్రశ్నని వేసేది ఎవరు ఈ అవస్థలు వస్తూ పోతూ ఉంటాయని ఆత్మ అంటుందా ఇవి వస్తూపో వస్తూ పోతూ ఉన్నాయి అనేది ద్రష్టే ద్రష్ట దృశ్యము కలిస్తే మనసు అవుతుంది. మనసంటూ ఏదైనా ఉన్నదేమో గమనించు మనసు ఆత్మలో లీనమైనప్పుడు ద్రష్ట లేదు దృశ్యము లేదు. కాబట్టి నీ ప్రశ్నకు సరైన సమాధానం ఇది.
(08:08) అవి రాను రావు పోను పోవు ఎల్లప్పుడూ ఉండేదల్లా ఆత్మ ఒక్కటే ఆ మూడు అవస్థలు చింతన లేకపోవడం వల్ల ఏర్పడేవే చింతన వాటిని అంతముండిస్తుంది. ఎంత విడమర్చి చెప్పినా ఆత్మ సాక్షాత్కారం అయ్యే వరకు సత్యం తేటతెల్లం కాదు. అది జరిగిన తర్వాత అంతకాలము స్పష్టంగా ఎల్లవెలలా ఉండే దానిని ఎట్లా చూడలేకపోయానా అని ఆశ్చర్యం కలుగుతుంది. నెక్స్ట్ మరో దాంట్లో మరో క్లాస్ లో కలుచుకుందాం అంతవరకు థాంక్యూ.
No comments:
Post a Comment