Saturday, September 12, 2026

‼️Ekadantaya అని గణపతిని ఎందుకు పిలుస్తారు?‼️| Telugu Puranas | Madan Gupta

‼️Ekadantaya అని గణపతిని ఎందుకు పిలుస్తారు?‼️| Telugu Puranas | Madan Gupta

Author Name:Madan Gupta

Youtube Channel Url:https://www.youtube.com/@themadangupta

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ucDsmtCrws8





Title: ‼️Ekadantaya అని గణపతిని ఎందుకు పిలుస్తారు?‼️| Telugu Puranas | Madan Gupta

Author Name: Madan Gupta

Description: SUPPORT US ;
India Overseas Bank
Chikkadapalli
Account No. 262701000002888
IFSC: IOBA0000678
UPI ID: 9491027104@ybl

Order My Book From
https://www.hindueshop.com/product/ap...

Transcript:
(00:00) నమస్తే సదా వత్సలే మాతృభూమే నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్త గణేశుడు శుభానికి ప్రతీక విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు ఆయన అంతేకాదు జీవితాన్ని చక్కగా నిర్వహించుకోవడం ఎలాగో నేర్పించే గొప్ప మార్గదర్శి ఆయనే గణనాయకుడు గణపతి ప్రపంచంలో అత్యంత విస్తృతంగా పూజింపబడే దేవతల్లో గణేశుడు ఒకడు ఆయన అన్ని శాస్త్రాలను తెలిసినవాడు జ్ఞానానికి ప్రతీక మొదటి లిపికారుడు అంటే లిపిని తయారు చేసినటువంటి మొదటి లిపికారుడుగా గణేశుని ఆరాధిస్తారు.
(00:42) ప్రకృతిని ప్రేమించేవాడు పచ్చని దూర్వాగడ్డిని ఎంతో ఇష్టపడేవాడు అందుకే కాబలు ఆయన చుట్టూ మనకు ఎలుక, పాము, నెమలి వంటి జీవులు ఎక్కువగా కనిపిస్తాయి. గణేశుడి రూపాన్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే అది కేవలం ఒక దేవుడి రూపంలో కనిపించదు ప్రకృతి మనిషి జ్ఞానం జీవితం ఈ నాలుగింటి మధ్య ఉన్న ఒక గొప్ప సంబంధంగా గణేశుడి మూర్తి కనిపిస్తుంది.
(01:13) మనిషి జీవితంఅంతా శుభం అశుభం మధ్య ఒక జారుడు బండ మీద నడుస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఎటు జారిపోతాడో తెలీదు అలాంటి జీవితంలో సమతుల్యతను కాపాడుకుంటూ ముందుకు సాగడం చాలా ముఖ్యం ఆ సమతుల్యతే గణేశుడు శివుడు పార్వతీదేవి కుమారుడైనటువంటి గణేశుడు ప్రకృతిలోని అనేక శక్తులకు ఒక గొప్ప ప్రతీక ఆయన రూపంలో కనిపించే ప్రతి అంశం వెనుక ఏదో ఒక అర్థం దాగి ఉంది చూడడానికి కొన్ని విషయాలు విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఆ రూపం వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటే ప్రకృతి మనిషి మధ్య ఉండాల్సినటువంటి
(01:58) సామరస్యం మనకు కనిపిస్తుంది. అదే గణేషుడి యొక్క గొప్పతనం అదే ఆయన చెప్పే జీవన నిర్వహణ సూత్రం పెళ్లి కాని గణేషుడు వైరాగ్యానికి ప్రతీక వివాహమైన గణేషుడు గృహస్థ జీవితానికి ప్రతీక దక్షిణ భారతదేశంలో ఆయన్నను బ్రహ్మచారిగా భావిస్తారు. ఉత్తర భారతదేశంలో మాత్రం వివాహమైన దేవుడుగా భావిస్తారు. విద్యార్థి నుంచి వృద్ధుడి వరకు మనిషి జీవితంలోని ప్రతి దశలోనూ అవసరమైన వాటికి గణేశుడు దేవత మరొక విశేషం ఏమిటంటే జ్ఞానానికి అధిదేవత అయినటువంటి సరస్వతీ దేవికి, ఐశ్వర్యానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవికి, ఇద్దరికీ అతి దగ్గరగా ఉండేటటువంటి దేవుడు గణేశుడు. ఇక గణేశుడి రూపాన్ని
(02:44) గమనించండి ఏనుగు తల చిన్న కళ్ళు పెద్ద చెవులు కదులుతూ ఉండే తొండం పెద్ద పొట్ట నాలుగు చేతులు చేతుల్లో ఆయుధాలు కింద చిన్న కాళ్ళు వాహనంగా ఒక చిన్న ఎలుక ఇవన్నీ ఎందుకు ఇవన్నీ కలిపి చూస్తే గణేశుడి రూపం మనకు ఒక గొప్ప జీవన పాఠాన్ని నేర్పుతుంది. గణేశుడి ఏనుగు తలలో కూడా ఒక గొప్ప సందేశం ఉంది. ఏనుగు తన జ్ఞాపక శక్తికి ప్రసిద్ధి అందుకే గణేశుడు బుద్ధికి జ్ఞాపక శక్తికి ప్రతీక ఆయన పెద్ద తల మన ఆలోచనలు కూడా విశాలంగా ఉండాలి అని చెబుతుంది.
(03:26) చిన్న కళ్ళు ఆలోచనాత్మకంగా గంభీరంగా ఉండాలని చెబుతాయి. పెద్ద చెవులు ప్రతి ఒక్కరి మాట వినాలి అని చెబుతాయి కానీ విన్న ప్రతిదాన్ని వెంటనే నమ్మకూడదు అని కూడా చెబుతాయి. మన బుద్ధితో మన వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇదే గణేశుడి పెద్ద చెవులు మనకు చెప్పే గొప్ప పాఠం చాట లాంటి గణేష్ చెవులు మరో విషయాన్ని కూడా మనకు చెబుతున్నాయి చాట మన ఇంట్లో చూస్తూ ఉంటాం చాట మంచి ధాన్యాన్ని ఉంచి చెత్తను వేరు చేస్తుంది అలాగే మన చెవులకు కూడా మంచి మాటలు వచ్చినప్పుడు వాటిని స్వీకరించాలి చెడు మాటలు వచ్చినప్పుడు వాటిని అక్కడే వదిలేయాలి గణే తొండం ఎప్పుడు కదులుతూనే ఉంటుంది అది మనకు
(04:11) ఏం చెబుతుంది జీవితంలో ఎప్పుడూ చురుకుగా ఉండాలి సుమా అని చెబుతుంది. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి ఎప్పుడు ముందుకు సాగుతూనే ఉండాలి గణేశుడి పెద్ద పొట్ట మనకు మరో గొప్ప పాఠం చెబుతుంది. ఆహారాన్ని మాత్రమే కాదు మాటలను కూడా జీర్ణించుకోవడం మనం నేర్చుకోవాలి. ప్రతి మాటకు వెంటనే స్పందించకూడదు ప్రతి విమర్శకు మనం వెంటనే కోపం తెచ్చుకోకూడదు విన్నదాన్ని ఆలోచించాలి అర్థం చేసుకోవాలి అవసరమైనప్పుడు మాత్రమే స్వీకరించాలి ఇదే పెద్ద పొట్ట వెనుక ఉన్నటువంటి గొప్ప జీవన సందేశం ఇక గణేశుడి జన్మకు సంబంధించినటువంటి ఎన్నో కథలు ఉన్నాయి. సరే
(04:56) మనకు ప్రచురితమైనటువంటి ఒక కథ చూద్దాం పార్వతీదేవి తన శరీరానికి రాసుకున్నటువంటి పసుపు నూనెతో చేసినటువంటి నలుగుతో ఒక చిన్న ఆకృతిని తయారు చేసింది. ఆ ఆకృతికి ప్రాణం పోసి తన కుమారుడిగా స్వీకరించింది. అందుకే ఆయనను వినాయకుడు అని పిలిచారు అంటే ఎవరిపైనా ఆధారపడకుండా స్వయంగా ఉద్భవించినవాడు వినా వినా నాయకుడు అంటే నాయకుడు అంటే తండ్రి లేకుండా జన్మించినటువంటి వాడు అనే భావం వస్తుంది.
(05:30) ఆ తర్వాత ఆ ఆకృతిని గంగాజలంలో స్నానం చేయించగా గంగ స్పర్శలతో ఆయనలో జీవం వచ్చిందని ఆ ఆకృతి పెద్దగా మారిందని కథ. అందుకే ఆయనకు గాంగేయుడు అనే పేరు కూడా వచ్చింది. ఓరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి వెళుతూ తన కుమారుడైనటువంటి గణేశుని గుమ్మం దగ్గర కాపలాగా కూర్చోబెట్టింది. ఎవరిని లోపలికి రా నీకు నాన్న అని చెప్పింది.
(05:58) అంతలో పరమశివుడు అక్కడికి వచ్చాడు. శివుడు తన తండ్రి అని గణేషుడికి తెలియదు. అందుకే ఆయనను కూడా లోపలికి వెళ్ళనీయలేదు. మరి తన ఇంట్లోకి తనను రానివ్వకపోతే ఎవరికైనా కోపం వస్తుంది కదా శివుడికి కూడా కోపం వచ్చింది. త్రిశూలంతో గణేశుడి తలను నరికాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి తీవ్రంగా బాధపడింది. ఆమెను సంతోష పెట్టడానికి శివుడు ఒక ఏనుగు పిల్ల తలను గణేశుడి శరీరానికి అమర్చి మళ్ళీ ప్రాణం పోశడు.
(06:31) అప్పటి నుంచి గణేశుడు గజాననుడు అయ్యాడు. ఏనుగుతల కలిగినటువంటి దేవుడుగా ప్రపంచానికి పరిచయంఅయ్యాడు. ఆ తర్వాత దేవతలందరూ గణేశుడికి అనేక వరాలు ఇచ్చారు. ఇంద్రుడు అంకుశాన్ని ఇచ్చాడు వరుణుడు పాశాన్ని ఇచ్చాడు బ్రహ్మ అమరత్వాన్ని ప్రసాదించాడు లక్ష్మీదేవి బుద్ధి సిద్ధులను ఇచ్చింది సరస్వతీ దేవి సమస్త విద్యలను ఆయనకు ప్రసాదించింది అలా గణేశుడు దేవతలందరిలో ప్రథమ పూజ్యుడుఅయ్యాడు గణేశుడి చేతులను మరోసారి గమనించండి నాలుగు చేతులు ఒక చేతిలో శంఖం మరో చేతిలో కమలం మరో చేతిలో వీణ ఇంకో చేతిలో పరసువు శంఖం నీటికి ప్రతీక కమలం అందానికి ప్రతీక వీణ సంగీతానికి ప్రతీక అలాగే విద్యకు కూడా
(07:19) పరశువు శక్తికి ప్రతీక అంటే ప్రకృతి అందం కళ శక్తి ఇవన్నీ గణేశుడి రూపంలో కలిసి ఉన్నాయి అని మనకు గణేశుడి రూపం తెలియజేస్తుంది. ప్రకృతిలో ఎక్కడ చూసినా కనిపించే పచ్చనిది గడ్డి దాన్ని దూర్వ అంటారు అంటే గరిక అని కూడా మనం చెప్పుకోవచ్చు. గణేశుడికి ఎంతో ప్రియమైనది ఇది కూడా ఒక గొప్ప సందేశమే ప్రకృతిని ప్రేమించండి ప్రకృతిని గౌరవించండి ప్రకృతితో కలిసి జీవించండి అని గణేశ ఆరాధన మనకు చెబుతుంది మట్టితో గణేశుడికి ఉన్న అనుబంధం కూడా చాలా గొప్పది ఏమీ లేకపోయినా మట్టితో గణేశుడి రూపాన్ని
(08:04) తయారు చేసి పూజించుకోవచ్చు ఆవు పేడతో తయారు చేసిన గణేశ విగ్రహాలు కూడా మన సాంప్రదాయంలో మనకు కనిపిస్తాయి గోమయే వసతే లక్ష్మి అని అంటారు. అంటే గోమయంతో తయారు చేసినటువంటి ఆవు పేడతో తయారు చేసినటువంటి గణేశుని ఆరాధిస్తే అటు లక్ష్మీదేవిని ఆరాధించినటువంటి ఫలితం ఇటు గణేశుని ఆరాధించిన ఫలితం రెండు మనకు లభిస్తాయి. గణేశుని పూజించడం అంటే కేవలం ఒక విగ్రహాన్ని పూజించడం కాదు ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిని గౌరవించడం నీటిని గౌరవించడం గాలిని గౌరవించడం అడవులను ప్రకృతిని పర్వతాలను అన్నింటిని గౌరవించడం ప్రకృతిని గౌరవించడమే గణేశుడిని గౌరవించడం అంటే
(08:49) ప్రకృతిని కాపాడమని గణేషుడు మనకు చెబుతున్నాడు. కానీ ఈరోజు మనం ప్రకృతిని మర్చిపోయాం. ప్రకృతితో మనకున్న బంధాన్ని మర్చిపోయాం. దాని ఫలితం ఏమిటి? ఈరోజు ప్రకృతి తన ఉనికికే అతి పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కుంటుంది. ఇంకా బాధాకరణమైన విషయం ఏమిటంటే ఆ ప్రమాదంలో మనం ప్రకృతికి తోడుగా నిలబడాల్సింది పోయి ప్రకృతికి వ్యతిరేకంగా నిలబడుతూ ఉన్నాం అందుకే గణేశుని అర్థం చేసుకోవాలి అంటే వేలాది దేవాలయాలు కట్టడం మాత్రమే సరిపోదు వేలాది విగ్రహాలు ప్రతిష్టించడం మాత్రమే సరిపోదు మంత్రాలు భజనలు కీర్తనలు ఇవన్నీ చేస్తున్న ప్రకృతిని నాశనం చేస్తే గణేషుడు త్వాన్ని
(09:38) మనం అర్థం చేసుకున్నట్టే కాదు ఎందుకంటే గణేషుడు బయట ఎక్కడో లేడు గణేశుడు మనలోనే ఉన్నాడు మన ఆలోచనల్లో ఉన్నాడు మన మంచితనంలో ఉన్నాడు ప్రకృతిని ప్రేమించే మన హృదయంలో ఉన్నాడు. ప్రకృతిని కాపాడినప్పుడే మనలోని గణేశుడు మేల్కుంటాడు. గణేశుడికి మోదకం అంటే ఎంతో ఇష్టం గణేశుడి పొట్ట పెద్దది అని ముందే చెప్పుకున్నాం. ఆయన లడ్డూలు తింటాడు అయితే ఆయనకు పెట్టే నైవేద్యంలో కూడా మన పూర్వీకులు ఒక ఆలోచనను ఉంచారు గజాననం భూతగణాది సేవితం కపిత్త జంబూపల చారు భక్షణం అంటే వెలగపండు నేరేడు పండ్లు కూడా గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలుగా పెడతారు ఆయుర్వేదంలో కూడా
(10:21) వీటికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అంటే గణేశుడి రూపంలో నిర్వహణ ఉన్నది రచన నైపుణ్యం ఉంది ప్రకృతితో అనుబంధం ఉంది జీవితానికి సంబంధించిన ఎన్నో సూత్రాలు ఉన్నాయి బహుశా ఇదే కారణంగా గణేశుడు ప్రజల జీవితాల్లో ఇంతగా కలిసిపోయాడు. గణేశ చతుర్థి కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి పండుగ కాదు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ పండుగ జరుపుకుంటారు అంతేకాదు జపాన్ చైనా కంబోడియా ఇండోనేషియా థాయిలాండ్ మలయా జావా టిబెట్ ఇంకా దూరంగా మెక్సికో వరకు గణేషుడి రూపాలు మనకు కనిపిస్తాయి. ఇది గణేషుని పూజకు
(11:06) ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపును మనకు తెలియజేస్తుంది. భారత స్వాతంత్ర ఉద్యమంలో కూడా గణేశుడికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. బాలగంగాధర్ తిలక్ గారు ప్రజల్లో గణేశుడికి ఉన్న ఆదరణను గుర్తించారు. గణేశోత్సవానికి ఒక సామాజిక ఉద్యమంగా దాన్ని మలిచారు పూజా మండపాలు ప్రజలు కలుసుకునే వేదికలుగా మారాయి. ప్రజల్లో చైతన్యం పెరిగింది.
(11:32) సామాజిక పునరుజ్జీవనం ప్రారంభమయింది. అలా గణేశ ఉత్సవం స్వాతంత్ర ఉద్యమానికి ఒక గుర్తింపుగా మారింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా భార్య గణేశ విగ్రహాలు ప్రతిష్టించే సాంప్రదాయం మరింత విస్తరించింది. గణేశ చతుర్థి నుంచి అనంత చతుర్దశి వరకు జరిగే ఈ ఉత్సవం మతపరమైనదే కాదు సామాజిక పరమైనది కూడా భారతీయ కళలు సంస్కృతి సృజనాత్మకత ఇవన్నీ ఒకే వేదికపై కనిపించేటటువంటి గొప్ప పండుగగా మారింది గణేశ చతుర్థి మన వేదాల్లో కూడా గణేశుడి ప్రస్తావన ఉంది.
(12:12) నమో గణేభ్యో గణపతిభ్యస్చవో నమో నమః మనకు రుద్రంలో వినిపిస్తుంది అంటే గణాలకు గణాల అధిపతి అయిన గణేశుడికి నమస్కారం మన ధర్మ గ్రంథాల్లో గణేశుడు గురించి ఎన్నో కథలు ఉన్నాయి కానీ అన్నింటిలోనూ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. గణేశుడు విఘ్నాలను తొలగించేవాడు అందుకే మనం ప్రార్థిస్తాం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా అంటే వంకరగా ఉన్న తొండం కలవాడా విశాలమైన శరీరం కలవాడా కోటి సూర్యులంతటి ప్రకాశం కలవాడా ఓ గణేశుడా నా పనులన్నింటిలో
(12:58) ఎప్పుడూ ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని చెప్పి ఆయన్ని ప్రార్థించడం ఒకసారి గణేశుడికి పరశురాముడితో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పరశురాముడు తన గొడ్డలతో గణేశుడి ఒక దంతాన్ని విరిచాడు అప్పటి నుంచి గణేశుడు ఏకదంతుడు అయ్యాడు అనేది ఒక కథనం. కానీ గణేశుడు తనలో ఏర్పడిన ఆ లోపాన్ని ఆయన బలహీనతగా భావించలేదు. అదే తన ప్రత్యేకతగా మార్చుకున్నాడు.
(13:27) విరిగిన ఆ దంతాన్నే కలంగా మార్చుకొని మహాభారతాన్ని రాశాడు అని మనకు పురాణ కథలు చెప్తాయి. ఇదే మనకు ఒక గొప్ప సందేశం మనలో ఉన్న లోపాన్ని చూసి నిరాశ చెందకూడదు దాన్నే మనం బలంగా మార్చుకోవాలి అనేది ఇక గణేశుడి జీవితంలోని మరో అద్భుతమైన కథ శివుడు పార్వతీదేవి తమ ఇద్దరు కుమారులైనటువంటి కార్తికేయుడు గణేశుడికి ఒక పరీక్ష పెట్టారు.
(13:55) ఎవరైతే ప్రపంచం చుట్టూ మూడు సార్లు తిరిగి ముందుగా వస్తారో వారికే అత్యంత రుచికరమైన పండు అని చెప్పారు. కార్తికేయుడు వెంటనే తన నెమలి పైకి బయలుదేరాడు. నెమలి బాగా బేగం కలిగినటువంటి పక్షి ఇక కార్తికేయుడు యువకుడు శక్తివంతుడు కానీ గణేశుడు భార్య శరీరం ఎలుక వాహనం ఎలా వెళ్ళగలడు ఎలా ఈ ముల్లోకాలని చుట్టి రాగలడు ఆయన తన తల్లిదండ్రుల చుట్టూ తిరగడం ప్రారంభించాడు.
(14:31) అందరూ ఆశ్చర్యపోయారు నువ్వు ప్రపంచం చుట్టూ ఎందుకు తిరగలేదు అని అడిగారు అప్పుడు గణేశుడు చెప్పిన సమాధానం ఎంత గొప్పది అంటే నా తల్లిదండ్రులే నా ప్రపంచం వారి చుట్టూ తిరిగితే సమస్త ప్రపంచం చుట్టూ తిరిగినట్టే ఇది గణేశుడి ప్రదీక్షణ అదే తల్లిదండ్రుల పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవం ప్రతి వారు తమ తల్లిదండ్రులని గౌరవంగా చూడాలి వాళ్ళని ఆదరించాలి వాళ్ళ వాళ్ళ కనుసన్నల్లో నడవాలి వాళ్ళని ముందు పెట్టుకొని మనం జీవనాన్ని కొనసాగించాలి అని గణేశుడు మనక ఇచ్చినటువంటి గొప్ప సందేశం కార్తికేయుడు యోధుడు గణేశుడు పండితుడు కార్తికేయుడు దేవతల సేనాధిపతి గణేశుడు ఋషులకు
(15:17) లిపికారుడు కార్తికేయుడికి ఆయుధాలు సైన్యం ఇవి ప్రియమైనవి గణేశుడికి జ్ఞానం సంపద ప్రియమైనవి ఇద్దరి రూపాలు వేరు ఇద్దరి మార్గాలు వేరు కానీ శివుడు శక్తి యొక్క ఇద్దరి కుమారులు దైవత్వం మానవత్వంతో అనుసంధానమైనటువంటి రూపాలు ఒకటి విద్య రెండు శక్తి ఇక మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని చెబుతూ ఉంటే గణేశుడు దాన్ని రాశాడని మన సాంప్రదాయం చెబుతుంది.
(15:53) అందుకోసం ఇద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది. వ్యాసుడు ఆపకుండా చెబుతాడు గణేషుడు ఆపకుండా రాస్తాడు ఇది కేవలం ఒక కథ కాదు వినడం అర్థం చేసుకోవడం వేగంగా ఆలోచించడం ఏకాగ్రతతో పని చేయడం ఇవన్నీ కలిసినప్పుడే ఎంత గొప్ప కార్యాన్నైనా సాధ్యము సాధ్యం చేయవచ్చు అని చెప్పే ఒక సందేశం ఈ కథలో మనకు ఇమిడి ఉంది. గణేశుని గురించిన ఎన్నో కథలు ఉన్నాయి ఎన్నో పురాణాలు ఉన్నాయి ఎన్నో నమ్మకాలు ఉన్నాయి శృతి స్మృతి ధర్మసూత్రాలు మీమాంస పురాణాలు మహాపురాణాలు ఎక్కడ చూసినా గణేశుడి ప్రస్తావన మనకు కనిపిస్తుంది.
(16:34) ఎత్ర ఎత్ర సర్వత్ర ఎక్కడ చూసినా గణేశుడే కానీ వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది గణేశుడు మనిషి జీవితానికి కేంద్రం మన ఆలోచన లోతుల్లో ఉన్నటువంటి శక్తి మనలోని జ్ఞానం మనలోని వివేకం మనలోని సమతుల్యత మనలోని ప్రకృతి ప్రేమ ఇవన్నీ కలిపిన రూపమే గణేశుడు గణేశుడు శాశ్వతుడు గణేశుడు సనాతనుడు మన విశ్వాసాల్లో ఉన్న ఓంకారంలో గణేశుడు ఉన్నాడు మన భయాల్లో మన ఆశల్లో మన సంకల్పాల్లో మన విజయాల కోసం చేసే ప్రార్థనల్లో గణేశుడు ఉన్నాడు.
(17:13) కాబట్టి గణేశుని కోసం బయట వెతకడం కంటే మనలోని గణేశుని మనం మేలుకొలుపుదాం. మన ఆలోచనలను విశాలం చేసుకుందాం. మన చెవులను మంచి మాటల కోసం తెరిచి ఉంచుదాం. చెడు మాటలను చాటలాగా వడగట్టుదాం. మన కోపాన్ని అదుపు చేసుకుందాం. ప్రకృతిని ప్రేమిద్దాం ప్రతి జీవిని గౌరవిద్దాం మన జీవితాన్ని సమతుల్యతతో నడిపిద్దాం అప్పుడు మనలోని గణేశుడు మేలుకుంటాడు.
(17:43) మన జీవితం మంగళమయం అవుతుంది మన ప్రయాణం విఘ్నరహితం అవుతుంది. అందుకే మన జీవితంలోని ప్రతి కొత్త సంకల్పానికి శ్రీకారం చుట్టుదాం. చివరిగా గణేశుని పూజించే ఏకవింశతి పత్రి అంటే 21 ఆకులను గురించి తెలుసుకుని ఈ విషయాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం శివుని బిల్వదళాలతో లక్ష్మీదేవిని కమలాలతో విష్ణువును తులసితో హనుమను తమలపాకులతో పూజించడం ప్రశస్తం అని చెబుతారు ఏదైనా పత్రం పుష్పం అన్నట్లుగా దేవతలను పూజించే సాంప్రదాయం మనకు ఉంది వినాయకుడిని మాత్రం 21 రకాల పత్రిలతో అంటే పత్రి అంటే ఆకులు తో పూజించడం ప్రత్యేకం ఐదు కర్మేంద్రియాలు ఐదు గ్రాణేంద్రియాలు ఐదు పంచభూతాలు పంచ
(18:31) ప్రాణాలు మరియు ప్రాణం మొత్తం కలిపి 21 ఎలాంటి మసాలాలు లేని నైవేద్యాలు కుడుములు గుండ్రాళ్లుు ఇవి గణేశుడి పూజకు నైవేద్యానికి నానా కార్యమిదం దివ్యం తృష్యర్థంతే నివేదితం మయాభక్త్యా శివ పుత్ర గృహాణ గణనాయక ఏకవింశతి సంఖ్యాకాన్ మోదకాన్ గృతపాచికాన్ నైవేద్యం సఫలం తదధ్యాం నమస్తే విఘ్ఞనాశినే అని మనం వినాయక వ్రతంలో స్మరించుకుంటాం.
(19:04) ఈ 21 పత్రాలు ప్రకృతి సిద్ధమైన ఔషధ గుణాలు కలిగినయి. వీటన్నిటికీ ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత ఉంది. వీటిని సేకరించేటప్పుడు మన పిల్లల్ని మనతోటి తీసుకొని వెళితే ప్రకృతి తత్వం ఆయుర్వేద విశిష్టత వాళ్ళు తెలుసుకుంటారు. పర్యావరణ విజ్ఞానం వాళ్ళకు కలిగించిన వాళ్ళం అవుతాం. నేను నా పిల్లలను చిన్నప్పుడు ఇలానే తీసుకొని వెళ్ళేవాడిని సరే ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు మేము తీసుకెళ్ళేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఆ 21 పత్రాలు ఏమిటి వాటి విశిష్టత ఏమిటి అనేది మనం తెలుసుకుందాం.
(19:42) గరగరా గన్నేరు మారేడు దేవకాంచనరేగు దేవదారు ఇలా మనం ఆ పూజ చేసేటప్పుడు ఈ 21 పత్రాల పేర్లు కూడా చెప్పుకుంటాం. వీటిలో మొట్టమొదటిది గరిక దీన్ని దూర్వాయుమం అంటారు. ఇది చాలా చోట్ల లభిస్తుంది. పశువులు బాగా మేస్తాయి కూడా అవి అంత బలవర్ధకంగా ఉండడానికి కారణం ఈ గరికే దీన్ని వినాయక పూజలో ప్రశస్తంగా వాడుతారు. గరికకు అతి నీలిలోహిత కిరణాలను నిరోధించేటటువంటి శక్తి ఉంది.
(20:16) అందుకే గ్రహణ సమయంలో ఇంట్లో ఉన్న అన్ని పదార్థాలలో ఈ గరికను వేస్తారు. సంక్రాంతి నాడు సూర్యుడి గతి మారుతుంది. అప్పుడు ప్రసారమయ్యే కిరణాల నుండి రక్షణకు గొబ్బెమ్మల్లో గరికను ఉంచి వాకిటిలో ఉంచుతారు. మూత్ర సంబంధ వ్యాధులను దూరం చేసుకోవడానికి గరికతో పచ్చడి చేసుకొని తింటారు. బృహతి పత్రం దీన్ని వాకుడాకు అని మన తెలుగులో పిలుస్తారు.
(20:42) కొందరు నేల మునగా అని కూడా పిలుస్తారు. ముళ్ళతో ఉన్న ఈ మొక్క హృద్రోగాలను తగ్గించి వీర్య వృద్ధిని కలిగిస్తుంది. వాకుడు ఆకులను నీటితో కలిపి నూరుకొని సేవిస్తే మూలశంక దగ్గు మలబద్దకం తగ్గిస్తుంది. మాచిపత్రం సాధారణంగా దీన్ని మాచిపత్రి అంటారు. దద్దుర్లు వ్రణాలు తగ్గించడానికి ఇది తోడ్పడుతుంది. ఆకును తడిపి కళ్ళ మీద ఉంచుకుంటే నేత్ర వ్యాధులు తగ్గుతాయి.
(21:08) పసుపు నూనెతో కలిపి ఒంటికి పూసుకుంటే చర్మ వ్యాధులు తగ్గుతాయి. బిల్లు పత్రం త్రిదళం త్రిగుణాకారం అని మనం మన స్తోత్రం కూడా చేస్తాం శివుని పూజించే ప్రశస్తమైనటువంటి పత్రం ఇది బంక విరేచనాలకు బిల్వాన్ని వాడతారు చక్కెర వ్యాధి తగ్గడం కోసం రోజు రెండు మూడు ఆకులు నమిలి రసాన్ని మింగాలి. అంతేకాకుండా రేడియేషన్ అడ్డుకునే శక్తి మారేడుకు ఉంది.
(21:37) మీరు నార్త్ కు వెళ్తే మారేడు కాయల రసాన్ని మనకు జ్యూస్ గా ఇస్తారు. ఇక ఐదవది దత్తూరు పత్రం ఉమ్మెత్త అని పిలుస్తారు. దీని ఆకులను కాపడం చేసి వాపులపై పెడితే వాపు తగ్గుతుంది. లైంగిక వ్యాధులు వ్రణాలు గడ్డల నివారణకు ఇది బాగా పనిచేస్తుంది. మానసిక రోగులకు ఈ ఆకుల రసం అద్భుతంగా పనిచేస్తుంది. ఆరు తులసి పత్రం ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రతి ఇంట్లో తులసిని తులసి మాత అని మనం పూజిస్తూ ఉంటాం.
(22:13) కఫ నివారణకు అజీర్ణ వ్యాధుల నివారణకు చర్మ రోగాల నివారణకు తులసి అమృతంలా పనిచేస్తుంది. రోగ నిరయోధక శక్తిని పెంచుతుంది. కాబట్టే మనవాళ్ళు తీర్థంలో వేసి రోజు తులసిని స్వీకరిస్తారు. దీని ఆకులు ఫ్లోరోసిస్ ను తగ్గిస్తాయని ఇటీవల శాస్త్రవేత్తలు కూడా కనుగొన్నారు. ఐదారు ఆకులను ఐదారు మిరియాలు ఐదారు ధనియాలు కలిపి నూరుకొని తింటే దగ్గు తగ్గుతుంది. కడుపులోని నురుపులు పోతాయి.
(22:39) ఇక ఏడవది బదిరి పత్రం దీన్ని రేగు పత్రం అంటారు రేగు చెట్టు జీర్ణకోశంలో వచ్చే వ్యాధులను నివారించి రక్త దోషాలను తగ్గించే ఫలం ఈ రేగుపళ్ళం శ్లేష్మం అంటే కఫాన్ని ఎక్కువ చేస్తుంది బాల వ్యాధులను నివారిస్తుంది అందుకే పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు భోగి పండ్లలో ప్రధానమైనవి రేగు పళ్లే అపామార్గ పత్రం దీన్ని ఉత్తరేణి అంటారు ఉత్తరేణి వేరుతో పళ్ళు తోముకుంటే పంటి రోగాలు దగ్గరకు కూడా రావని మనకు ఆయుర్వేదం చెబుతుంది.
(23:13) చూతపత్రం చూతపత్రం అంటే మామిడాకులు బ్యాక్టీరియా దోమలు మొదలైన క్రిమి కీటకాలు ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా ఇంటికి అలంకరణ కూడా మామిడి చిగురుతో ఉప్పు కలిపి వేడి చేసి కాలి పగుళ్లకు పూస్తే కాలి పగుళ్లు తగ్గుతాయి. కరవీర పత్రం దీన్నే గన్నేరు అంటారు. వ్రణాలకు మందుగా దీన్ని వాడతారు. జ్వరం తగ్గడానికి గన్నేరు ఆకులు గల కొమ్మను పాలు లేకుండా ఒక తడి గుడ్డతో శరీరానికి కట్టుకుంటే జ్వరం తగ్గుతుంది.
(23:46) విష్ణుక్రాంత పత్రం దీన్ని అవిశ అంటారు. చిన్న ముక్కగా ఉంటుంది రుమ్ము వ్యాధులు ఉబ్బసం తగ్గించే స్వభావం దీనికి ఉంది. తామర రక్తదోషాలు ఇది నివారిస్తుంది. దీని ఆకుల్ని నిమ్మరసంలో నూరి తామరకు రాస్తే తామర తగ్గుతుంది. దాడిమీ పత్రం దీన్ని దానిమ్మ అని పిలుస్తారు. నోటి పూతకు ఏలిక పాములు నులిపురుగుల నివారణకు దీన్ని ఉపయోగిస్తారు.
(24:12) దగ్గు ఉబ్బసం ఈ ఆకుల రసం సేవిస్తే తగ్గుతాయి. వాపులు ఉన్నచోట దీని ఆకులను నూనె వ్రాసి కడితే వాపులు తగ్గుతాయి. దేవదారు పత్రం ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి వృక్షం దీని పువ్వులను ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. మాన నుండి తయారు చేసిన నూనె వేడి నీళ్లలో వేసుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు ఉపశమిస్తాయి. శ్వాసకోస వ్యాధులను కూడా ఇది దూరం చేస్తుంది.
(24:38) మరువక పత్రం దీన్ని మరువం అంటాం పూలతో పాటుగా ఆకులను కట్టుకొని స్త్రీలు తలలో పెట్టుకుంటారు. మంచి సువాసన ఇచ్చేటటువంటి పత్రాలు ఇవి జాయింట్ పెయిన్స్ చర్మ వ్యాధులు హృదయ సంబంధ రోగాలకు ఇది ఉపయోగపడుతుంది. ఇక 15వది సింధువార పత్రం దీన్ని మన తెలుగునాట వావిలాకు అంటారు. ఇది వాత సంబంధమైనటువంటి సమస్యలకు బాగా పనిచేస్తుంది. కీళ్ల జబ్బులు విషాన్ని హరించే గుణం ఈ ఆకులకు ఉంది.
(25:08) ఇక జాజీ పత్రం జాజికాయను బాల వైద్యానికి వాడతారు. పైత్య రోగాలకు ఇది మంచి ఔషధం నోటి దుర్వాసన పోవడానికి దీని ఆకులను వెన్నలో నూరి పండ్లు తోముకుంటే దండ సమస్యలు సమస్య పోతాయి. దండకీ పత్రం దీన్నే దేవకాంచన అని కూడా అంటారు. హృదయ సంబంధ సమస్యలకు పైల్స్ చర్మ వ్యాధులకు ఈ పత్రాలను వాడతారు 18 షమీ పత్రం జమ్మి ఆకులు వీటిని కుష్టుకు వాడతారు.
(25:37) శరీరంలో ఎక్కడైనా అవాంచిత ప్రదేశాల్లో వెంట్రుకలు మొలిస్తే ఈ ఆకుల పసరను ఆ శరీర భాగాల్లో పూస్తే ఆ వెంట్రుకల సమస్య తగ్గుతుంది. అశ్వద్ధ పత్రం దీన్ని రావి చెట్టు అంటారు. దీన్ని దేవతా వృక్షంగా పూజిస్తాం. ఈ చెట్టు ఆక్సిజన్ ను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఎండిన రావి కర్రలను నేటితో కాల్చి ఆ భస్మాన్ని రోజు తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే శ్వాసకోస వ్యాధులు దూరమవుతాయి.
(26:05) ఎక్కువ రక్తస్రావం అయ్యే చోట ఈ ఆకులను నలిపి కడితే రక్తస్రావం తగ్గుతుంది. అర్జున పత్రం దీన్ని మద్ది చెట్టు అంటారు నల్లమద్దిని ద్వారాలు ఇతర ఇంటి సామాన్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. దీన్ని ఎనమద్ది అని కూడా పిలుస్తారు అంటే ఇనుము అంత దృఢంగా ఉంటుందని వాతాన్ని హరిస్తుంది ఇవి మూడు రకాలుగా మనకు లభిస్తాయి తెల్ల మద్ది నల్లమద్ది ఎర్రమద్ది ఏదైనా సరే పుండ్లు ఉన్నచోట ఈ ఆకులను కడితే కుండ్లు తగ్గుతాయి చివరిగా అర్కపత్రం దీన్నే జిల్లేడు అంటాం.
(26:37) దీనిలో రెండు రకాలు ఉన్నాయి మామూలు జిల్లేడు తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడు వేరుతో గణపతిని చేసి పూజించే సాంప్రదాయం ఉంది మనకి తంత్రశాస్త్రంలో ప్రయోగాల్లో దీన్ని ఉపయోగిస్తారు ఇది చాలా జాగ్రత్తగా వాడాల్సిన ఔషధం కుష్టు ఇతర చర్మ వ్యాధులకు దీన్ని వాడతారు. ఆయుర్వేదంలో 64 రకాల ఉపయోగాలు చెప్పబడ్డాయి ఈ జిల్లేడుపు సూర్యుడికి చాలా ఇష్టమైనటువంటి చెట్టు ఇది అందుకే దీన్ని అర్క అని పిలుస్తారు ఈ 21 ఆకులతో గణపతిని పూజిస్తాం ఈ ఆకులని గురించి మనం తెలుసుకుంటాం.
(27:14) మన నిత్య జీవితంలో వచ్చే సమస్యలను వీటితో నివారించుకోవచ్చు. దీని ద్వారా ఔషధ విజ్ఞానం మనకు తెలుస్తుంది. పూజ అయిన తర్వాత వీటిల్ని చెరువుల్లో కుంటల్లో లేదా బావుల్లో కలుపుతారు. ఇవి నీటిలో కుళ్లి వాటి ఔషధ తత్వాలు క్రింద ఉన్నటువంటి మట్టికి చేరుతాయి. చెరువులు పూడికి తీసేటప్పుడు ఆ మట్టిని మన పొలాల్లో వేసుకుంటాం. సారవంతమైన పంటలు పండుతాయి.
(27:37) ఇక చివరిగా వినాయక నిమర్జనం గురించి కొద్దిగా తెలుసుకొని విషయాన్ని ముగిద్దాం. ఎంతో శ్రమించి విగ్రహం చేయడం ఎందుకు దాన్ని నీళ్లల్లో కలపడం ఎందుకు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. మట్టి నిరాకార రూపం దాని నుండి సాకార రూపమైన గణపతిని తయారు చేస్తారు. ఆ విగ్రహాన్ని తొమ్మిది రోజులు పూజిస్తారు ఉపచారాలు చేస్తారు తర్వాత దాన్ని నీటిలో కలుపుతారు.
(28:02) మట్టితో ఆకారాన్ని పొందిన ఆ విగ్రహం మరలా మట్టిలో కలిసిపోతుంది. మానవ జీవితం కూడా ఇంతే ఏమీ లేని తనం నుండి అండంగా పిండంగా శిశువుగా ఈ లోకంలోకి వచ్చినటువంటి మానవుడు రకరకాల ప్రాపంచిక భోగాలను అనుభవిస్తాడు తర్వాత మరలా ఈ మట్టిలోనే కలిసిపోతాడు బ్రతికి ఉన్నప్పుడు ఆశాపాశాలు ఆరాటాలు పోరాటాలు స్వార్థం జీవుడు దాటి వెళితే కట్టి మిగులుతుంది.
(28:29) దాన్ని తగలేయడమో లేదా పూర్చి పెట్టడమో చేస్తారు. మట్టిలో మట్టిగా లేదా బూడిదగా మారుతుంది. ఇది మూడు నాళ్ళ ముచ్చట అనేది మనకు ఈ వినాయక నిమజ్జనం గుర్తు చేస్తుంది. ఇది మిత్రులారా ఈనాటి మన వినాయకుడి ప్రాసస్యం మరలా మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా సెలవ మరి మిత్రులారా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం.
(29:03) చాలామంది పెద్ద మనసుతో వారికి తోచిన సహాయాన్ని అందిస్తున్నారు మీ సహాయాన్ని కొనసాగించండి మాకు కొంతలో కొంత ఈ కార్యక్రమానికి అది సహాయపడుతుంది. 70% మంది మన వీడియోలని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు వారందరికీ మరొక్కసారి మనవి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి, షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మీ మిత్రులకు కూడా మన ది మదన్ గుప్త ఛానల్ ను పరిచయం చేయండి.
(29:31) మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవా మరి జై హింద్ జై మా భారతి

No comments:

Post a Comment