Wednesday, September 9, 2026

₹47 కోట్ల వ్యాపారం అమ్మేసి సన్యాసం! ఈ థాయ్ బిజినెస్‌మెన్ కథేంటి? #SiripongAkkarasriyuk #BuddhismMonk

₹47 కోట్ల వ్యాపారం అమ్మేసి సన్యాసం! ఈ థాయ్ బిజినెస్‌మెన్ కథేంటి? #SiripongAkkarasriyuk #BuddhismMonk

Author Name:Bala Latha Madam

Youtube Channel Url:https://www.youtube.com/@balalathamadam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=cYmwW7MVqbI



Transcript:
(00:00) యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపిఎస్ కోసం ఈ సెప్టెంబర్ 20వ తారీకు సండే నుంచి సిఎస్బిఐఎస్ అకాడమీ హైదరాబాద్ లో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ ఆన్లైన్ ఆఫ్లైన్ లో యాక్సెస్ చేయొచ్చు. థాయిలాండ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సిరిపాంగ్ అకార శ్రీయుక్ బౌద్ధ సన్యాసిగా అంటే ఒక బుద్ధిస్ట్ మాంక్ గా మార్నున్నారంట.
(00:20) అంతేకాదు ఆధ్యాత్మిక సాధనతో తన మొత్తం జీవితాన్ని ఇంకా ఆయన అంకితం చేయాలనుకుంటున్నారంట. అయితే తను చాలా సంవత్సరాల నుంచి ఒక వ్యాపారం చేస్తున్నారు. 1999 లో ఈ సిరిపాంగ్ అకార శ్రీయుక్ హావెల్స్ ఐస్ క్రీమ్ కంపెనీ స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు సక్సెస్ఫుల్ కంపెనీ అన్నమాట. ఇప్పుడు ఆ కంపెనీని 47 కోట్ల రూపాయలకి అమ్మకానికి పెట్టారు. ఎవరైతే కొనుగోలు దారిని అంటే ఎవరైతే బయర్ ని తీసుకొస్తారో వాళ్ళకి కమిషన్ కూడా ఇస్తానని ప్రకటించారన్నమాట.
(00:46) ఆ తర్వాత వచ్చే రెండు సంవత్సరాల్లో ఒక ఆశ్రమాన్ని స్థాపించి ధ్యానం ద్వారా జ్ఞానోదయం పొందాలని చెప్పి ఆయన కోరిక అంట. మనం చూస్తే కొంతమంది వ్యక్తులు మెటీరియలిజం వైపు నుంచి స్పిరిచులిజం వైపు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ గౌతమ బుద్ధుడి యొక్క జీవన ప్రస్థానం చూస్తే ఆయన కూడా 29 సంవత్సరాల వయసులో తన రాజ్యాన్ని తన ప్రజల్ని తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క సర్వ సౌఖ్యాన్ని వదిలేసి ఒక మాంక్ లాగా బయటికి వెళ్ళిపోయారు.
(01:12) మనం చరిత్రలో మరో గొప్ప వ్యక్తిని చూస్తే అదే చంద్రగుప్త మౌర్య ఆయన కూడా తన యొక్క 40స్ లో అన్ని త్యజించి శ్రావణ బలగాన వెళ్ళిపోయి సల్లేఖన్వర్త కూర్చున్నారు. ఇలా చాలా మంది వ్యక్తులు జీవిత సారాంశం ఏంటి జీవితానికి అర్థం ఏంటి అని ఆలోచిస్తా ఉంటారు అన్నమాట మనకు తెలుసు జీవితం అనేది చాలా తాత్కాలికం కన్ను తెరిస్తే జరనం కన్ను మూస్తే మరణం రెప్పపాటు ఈ జీవితం అంటాం.
(01:34) కానీ చాలా మంది జీవితంలో ఉన్న మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే ఈ సౌఖ్యాలకి ప్లెజర్స్ కి అతుక్కుపోయి నిజమైన సారాంశం గ్రహించలేకపోతారు. కానీ అతి కొద్దిమంది మాత్రం ఒక స్థాయికి రాంగానే ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీని ఒక పాత్ గా తీసుకుంటారన్నమాట. ఈ మధ్యకాలంలో మనం చూస్తే భారతదేశంలో కూడా చాలా మంది ఒక వయసు వచ్చిన తర్వాత అన్ని వదిలేసి స్పిరిచువల్ పాత్ వైపు నడుస్తున్నారు.
(01:54) ఇక్కడ మనం చూస్తే 2021వ సంవత్సరంలో ప్రకాష్ షా గారు అని చెప్పి రిలయన్స్ లో టాప్ ఎగ్జిక్యూటివ్ అన్నమాట వైస్ ప్రెసిడెంట్ గా చేసేవాళ్ళు. అప్పట్లో ఆయన జీతం సంవత్సరానికి 75 కోట్లు ఆయన ఆయన భార్య అన్ని వదిలేసి జైన మతంలో మాంక్స్ గా మారిపోయారు. అదేవిధంగా ఢిల్లీకి చెందిన ఒక పెద్ద బిజినెస్ మన్ ఒక వ్యాపారవేత్త బన్వర్లాల్ దోషి 2015 లో ఆయనకున్న 600 క్రోర్స్ బిజినెస్ ఎంపైర్ ని పక్కన పెట్టేసి ఒక మాంక్ గా మారిపోయారు.
(02:21) మన లేటెస్ట్ గా ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే 2024 లో యూపిఎస్సి చైర్ పర్సన్ మనోజ్ సోని గారు యూపిఎస్సి చైర్ పర్సన్ పోస్ట్ కి తనకున్న టెన్యూర్ కన్నా ముందుగానే రిజైన్ చేస్తూ స్పిరిచువల్ కాలింగ్ వల్ల తాను రిజైన్ చేస్తున్నానని తన జీవితం మొత్తం ఆధ్యాత్మికతకు అంకితం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ అంశం మొత్తాన్ని కంక్లూడ్ చేయాలంటే ఒక వ్యక్తి అన్ని భోగాలు అనుభవించి సన్యాసిగా ఎందుకు మారుతున్నారు.
(02:46) చాలా మందికి లైఫ్ అంటే ఒక పర్స్పెక్టివ్ ఉంటది. జీవితం చివరి నిమిషం వరకు కూడా అన్ని సంపాదించాలి పేరు ఆస్తులు అని చెప్పి మరి కొంతమందికి అసలు ఎందుకు ఈ జీవితం దీని యొక్క పర్పస్ ఏంటో ఆలోచన వస్తుందన్నమాట మనం ఈ జీవితాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత మనం ఏ పదవిలో ఉన్నామో ఎవరు గుర్తుపెట్టుకుంటారు మనక ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో మనకెంత నెట్ వర్త్ ఉందో లేదా మనకెంత నెట్వర్క్ ఉందో ఎవరు గమనిస్తారు ఇవన్నీ ఎవరు గుర్తు పెట్టుకుంటారు మనకు కావాల్సింది ఏంటి ఆధ్యాత్మిక చింతనే కదా మనం ఏంటో మనం తెలుసుకోవడమే కదా ఇది చాలామంది ఈ మధ్య అనుసరిస్తున్న బాట అన్నమాట

No comments:

Post a Comment