Sunday, November 8, 2026

Exclusive Interview with Swami Aatma by Jagadeesh Abbaraju | Swami Aatma | spiritual । R24 Telugu

Exclusive Interview with Swami Aatma by Jagadeesh Abbaraju | Swami Aatma | spiritual । R24 Telugu

Author Name:R24 Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@R24Telugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=YHNREYnDwkU





Title: Exclusive Interview with Swami Aatma by Jagadeesh Abbaraju | Swami Aatma | spiritual । R24 Telugu

Author Name: R24 Telugu

Description: Exclusive Interview with Swami Aatma by Jagadeesh Abbaraju | Swami Aatma | spiritual । R24 Telugu
‪@SwamiAatma‬
#swamiaatma #yoga #spiritual #yogalife #indianculture
facebook :   / swamiaatmaorg  
instagram :   / swamiaatma  
website : https://swamiaatma.de/language/en/swa...

About channel :

Welcome to [ R24 Telugu ] - Your Trusted Source for Telugu News!

Stay informed and engaged with the latest breaking news, in-depth analysis, and exclusive stories from Andhra Pradesh, Telangana, and around the world. Our dedicated team brings you accurate, unbiased reporting on politics, entertainment, sports, technology, health, and more.

Subscribe & Stay Updated: Hit the bell icon to subscribe and receive instant notifications on our latest uploads.

Join us on [ R24 Telugu ] and be part of a vibrant community that values truth, transparency, and timely information. Your news, your voice – stay connected with us!

For Brand Partnerships and Collaborations, reach us at

Facebook: [   / r24teluguofficial   ]
Twitter: [   / r24telugu   ]
Instagram: [   / r24_telugu   ]
For inquiries, please email us at [ @r24telugu@gmail.com ].

#TeluguNews #BreakingNews #LiveUpdates #AndhraPradesh #Telangana #R24Telugu #ApPolitics #PoliticalAnalysis #politicalUpdates

Transcript:
(00:01) [సంగీతం] అందరికీ నమస్కారం నేను మీ జగదీష్ అబ్బరాజు ఈరోజు ఆర్ 24 ఛానల్ ద్వారా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వామి ఆత్మ గారిని పరిచయం చేయటం జరుగుతుంది అందరికీ సుపరిచితమైన మన ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలోనే మన స్వామి ఆత్మ గారు జన్మించడం వారు ఇక్కడి నుంచే అడుగులు వేస్తూ ఆధ్యాత్మికం వైపు నడిచి దేశ విదేశాల్లో తన యొక్క బోధల్ని ఎంతో మందికి విదేశస్తులకి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేసేలా వారి యొక్క మానసిక పరిస్థితుల్ని ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఒత్తిడి మానసిక
(00:46) ఒత్తిడిని నిజంగా ఎలా ఎదుర్కోవాలనేది ఆధ్యాత్మికం ద్వారా తను నేర్పడం వారు నేర్చుకోవడం అలా విస్తరింప చేసేలా మొత్తం దేశ విదేశాల్లో తన యొక్క మార్కుని వేశాడని తెలుస్తోంది [సంగీతం] నమస్కారం స్వామీజీ నమస్కారం నమస్కారం సర్వజన సుఖినో భవంతు చెప్పండి స్వామి నేను ఉదయం నుంచి
(01:32) చూస్తున్నాను చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇది ఒక ఇంగ్లీష్ భాష లాగా అనిపిస్తుంది కానీ సం డిఫరెంట్ గా అనిపించింది ఏంటి స్వామి ఇది ఇది ఏం లేదండి సత్సంగ్స్ అండ్ దర్శన్స్ అని చెప్పేసి నేను అది జర్మన్ భాషలో ఉంది ఓకే జర్మనీ అండి అది అక్కడ జర్మనీలో అన్నమాట అక్కడ నా స్కూల్ ఉందండి అక్కడ యోగా స్కూల్ ఓకే అక్కడ మేము చుట్టూ ఉన్న పల్లెల్లో నెల ఒకసారి వెళ్లి ఒక ఓపెన్ సత్సంగ్స్ అనేది నిర్వహిస్తాం అన్నమాట సత్సంగ్స్ అండ్ దర్శన్స్ ఓకే ఆ ఓపెన్ సత్సంగ్స్ అండ్ దర్శన్స్ నిర్వహించినప్పుడు చాలా వందల మంది అక్కడికి వచ్చి మా ఆధ్యాత్మిక సత్సంగాల్లో
(02:15) పాల్గొని వాళ్లకున్న ప్రశ్నలను అడిగి మేము చెప్పే సమాధానాలతో వాళ్ళు వాటిని నివృత్తి చేసుకుంటారు అన్నమాట ఓకే నేను అక్కడ ధ్యాన పద్ధతులు కొన్ని ఆధ్యాత్మికమైన సూచనలు వారి జీవితాల గురించి చెప్తూ ఉంటాను సో దానికి సంబంధించిన ఒక ఆ ప్రకటనకు ఈ వాడుకున్నారు అంతే ఈ బ్యానర్ ని ఎంతమంది హాజరవుతారు స్వామి అక్కడ వస్తారండి ఒక 500 600 మంది 500 600 ఆ 500 600 మంది వస్తా ఉంటారు విదేశాల్లో జర్మనీలో జర్మనీలో జర్మనీలో అండి అక్కడ చాలా జనాభా తక్కువ అండి ఎందుకంటే ఒక్కొక్క చిన్న పల్లె తీసుకున్నా కూడా ఏ ఒక రెండు
(02:59) మూడు మంది ఉంటారు అంతే ఓకే సో అలా అందుకని చెప్పి వాళ్ళ సౌకర్యార్థంగా మేమే అక్కడికి వెళ్లి ఒక తేదీని వాళ్ళకి చెప్పి మేము ఇలాంటి ఫలానా తేదీలో వస్తాము ఎవరైతే ఆధ్యాత్మిక చింతనతో ఉన్నారో వాళ్ళు వచ్చి కలవచ్చు స్వామి వారిని అని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళు రావడం కొద్దిగా ధ్యానం చేయడం దర్శనం ఉంటది సత్సంగం ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అన్నమాట వారు ఏదైనా సమస్యల్లో ఉన్నటువంటి వారు మీతో చెప్పుకుంటూ ఉంటారా ఆ నేను వాళ్ళకి అవకాశం ఇస్తానండి ఆ వాళ్ళు ముఖాముఖిగా కూడా నాతో కొద్ది సమయం మాట్లాడి వాళ్ళకి ఏదైనా ఉన్నా సమస్యలు ఉన్నా ప్రశ్నలు ఉన్నా
(03:40) వాళ్ళు నన్ను అడిగి నేను వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటాను చాలా మంది కూడా నా సమాధానాల వల్ల వాళ్ళ జీవితాలనే మార్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మీరు చూసారు చాలా మరొక విషయం ఆ జర్మనీయే కాదు స్విట్జర్లాండ్ లో కూడా అవునండి బెల్జియం లో కూడా ఉన్నారని నేను నేను దాదాపు 36 దేశాలు ఇప్పటివరకు తిరిగాను 36 దేశాలు ఆ 36 దేశాలు తిరిగాను 36 దేశాల్లోని ప్రధాన నగరాల్లో కూడా నా సత్సంగ్స్ అండ్ దర్శన్స్ జరిగాయి రియల్లీ గ్రేట్ స్వామి నేను ఎప్పుడూ చాలా వరకు నేను బయటికి చెప్పలేదు కానీ ఆ చాలా మంది విదేశీయులకు స్వామి ఆత్మ అంటే తెలుసు స్వామి ఆత్మ సత్సంగ్స్ అండ్
(04:24) దర్శన్స్ కి కూడా చాలా మంది హాజరవుతూ ఉంటారు నిజంగా గ్రేట్ మీలాంటి వ్యక్తిని డైరెక్ట్ గా కలుసుకోవడం ఆర్ 24 తరపున మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే 36 దేశాలు అంటే ఇది సామాన్యమైన విషయం కాదు అది అందులోనూ ఆధ్యాత్మికంగా నడవటం అంటే బాహ్య ప్రపంచంలో జీవించే వాళ్ళకి ఫలానా చోట బిజినెస్ ల కోసమనో ఇంకో దాని కోసమనో వెళ్ళేది వేరు అక్కడి వారు ఆ ఈ పద్ధతులను పాటించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను మన సనాతన ధర్మం చాలా గొప్పదండి ఉమ్ మన ఆ సనాతన ధర్మానికి ఉన్న విలువ శక్తి అలాంటిది మన సనాతన ధర్మాన్ని మన
(05:09) వైదిక సూత్రాలను విదేశీయులు చాలా గౌరవిస్తారండి అవును వాళ్లకు చెప్పడానికి గురువులు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ వాళ్లకు నేర్పించడానికి చాలా తక్కువ మంది గురువులు ఉన్నారు అలా నేర్పించగలిగితే వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఆసక్తిని కూడా కనపరుస్తారు అవును వాళ్ళు జీవితంలో అన్ని చూసేసారు అక్కడి ప్రజలకి వాళ్లకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి వాళ్ళు అన్ని చూసిన తర్వాతనే ఈ మార్గం నిజమైనది మనకు కావాల్సింది ఏంటి జీవితంలో అని చెప్పి ఆధ్యాత్మికత వైపు వాళ్ళు వస్తారు కాబట్టి గురువులన్నా స్వామీజీలన్న ఇలా సనాతన
(05:55) ధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళన్నా మంచిని జ్ఞానాన్ని బోధించే వాళ్ళన్నా వాళ్ళు చాలా విలువనిస్తారు గౌరవాన్ని ఇస్తారు పూజిస్తారు కూడా అవును అవును స్వామి అందుకనే వాళ్ళు అక్కడ చూపించే విలువల్ని మనకు ఇచ్చే మర్యాదను అన్నిటిని చూసిన తర్వాతే నేను అక్కడ ఉండి అక్కడి వాళ్లకు బోధిస్తూ అక్కడే ఉంటూ ఉన్నాను చాలా గొప్ప విషయం స్వామి నిజంగా మీతో ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి మీతో ప్రయాణం చేయాలనే ఆసక్తి కలుగుతా ఉంది మీ మాటలు వింటుంటే తప్పకుండా నిజంగా ధన్యవాదాలు స్వామి మీరు ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు మీరు కూడా మా సత్సంగాల్లో
(06:44) పాల్గొనవచ్చు మీ మిత్రులు మీ కుటుంబ సభ్యులు ఎవరున్నా సరే మీరు ఎప్పుడూ ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మీకు స్వాగతం ఇక్కడ స్వామి ఆత్మ గారు మీ యొక్క ఆలోచనలో అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి ఆధ్యాత్మికం అంటే చూడండి ఆధ్యాత్మికము అనేది ఏ మతానికి సంబంధించింది కాదు ఇది చాలా వ్యక్తిగతమైనది ఇది ఒక వ్యక్తిగతమైన జీవన విధానం ఆధ్యాత్మికతలో మనసుకు సంబంధించి కానీ ఆత్మకు సంబంధించి కానీ దైవానికి సంబంధించి కానీ ఒక లోత ఎంతైనా అన్వేషణ చేయాలా
(07:33) అనుకున్న ఎవరైనా సరే ఈ ఆధ్యాత్మికంలో జీవిస్తా ఉంటారు ప్రాపంచికమైన విషయాల పట్ల వారి ఆలోచనలు పెట్టకుండా అంతరంగికమైన విషయాల పట్ల ఆత్మ పట్ల నిజమైన సత్యం ఏంటి అనే ఒక సత్యాన్వేషణ శోధకు గా ఉంటారు చూడండి వాళ్ళని నిజమైన ఆధ్యాత్మికమైన వ్యక్తులు అని మనం చెప్పవచ్చు ఈ ఆధ్యాత్మికం కూడా ఏ మతానికి సంబంధించింది కాదు మీరు ఏ మతంలో ఉన్న ఏ ఆచార వ్యవహారాలను మీరు పాటిస్తూ
(08:19) ఉన్నా మీరు ఏలాంటి రూపంలో భగవంతున్ని కొలుస్తూ ఉన్నా కూడా అది కూడా ఆధ్యాత్మిక నిర్మలమైన మనసుతో స్వచ్ఛమైన ప్రేమతో మీరు ధ్యానం చేయగలిగితే లేదా నమాజ్ చేయండి ఏదో చర్చికి వెళ్ళండి గుడికి వెళ్ళండి పూజించండి ఏదైనా సరే మీ మనసును నిర్మలంగా ఉంచుకోగలిగిన ఏ మార్గమైనా ఆధ్యాత్మికమే చాలా గొప్పగా చెప్పారు స్వామి స్వామి అసలు ఈ మార్గం వైపు ఎందుకు వచ్చారు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ నేపథ్యం ఏంటి స్వామి ప్రస్తుత సత్య వ్యవసాయ జిల్లా పుట్టపర్తి అందరికీ సుపరిచితమే నా జననం
(09:08) ఓకే నా విద్యాభ్యాసం నేను ఇక్కడ ఇలాగే ఉంటూ మా తల్లిదండ్రులతోనే ఇక్కడే నా ప్రయాణం మొదలైంది ఓకే ఆధ్యాత్మికత అనే మార్గాన్ని నాకు పరిచయం చేసిన తొలి గురువులు నా తల్లిదండ్రులు ఓకే మా నాన్నగారు ఆధ్యాత్మికతలు చాలా చాలా ఉన్నతంగా ఆయన ఎన్నో అనుభవాలు ఆయనతో పాటు ఆయన మిత్రులు అవ్వనివ్వండి ఆయన శిష్యులు అవ్వనివ్వండి వాళ్ళు ఎల్లప్పుడూ మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు అన్నమాట ఓకే వాళ్ళు చేసుకునే చర్చలు గాని సత్సంగాలు గాని వాటిని అన్నిటిని చూస్తూ నేను పెరిగాను సో దాని ప్రభావం నా పైన ఎక్కువగా
(09:53) ఉండేది నా మార్గానికి అది ఒక తొలి మెట్టు అనుకోండి అసలు మేము విన్నాం మీ గురించి చాలా అతి చిన్న వయసులోనే ఇందాక మీరు చెప్పినట్టుగా అడుగు పెట్టడం గాని విదేశాల్లో కూడా మీ యొక్క భక్తులు మీ యొక్క బోధనలు వింటూ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అని చెప్పి విన్నాం చూసాం కూడా కొన్ని వీడియోస్ లో కూడా చూసాం ఎలా అలా అది ఎలా సాధ్యమైంది మా నాన్నగారు ఆధ్యాత్మికంగా ఒక గురు సమానంగా ఆయన ప్రయాణం మొదలెట్టినప్పటి నుండి 1978 ప్రాంతం చాలామంది విదేశీయులు మా నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు ఓకే
(10:38) ఆధ్యాత్మికంగా ఆయన ఇచ్చే సందేశాలను వినడం కానీ ఆయన దగ్గర కొన్ని ధ్యాన పద్ధతులు నేర్చుకోవడం కానీ ఇలా ఉంటూ వచ్చేది ఆయనకున్న ఆ పరిచయాల వల్ల నాకు యూరోప్ దేశాలకు వెళ్ళడానికి ఒక ఆహ్వానం వచ్చింది ఓకే నాకు 19 ఏళ్ల ప్రాయం ఉన్న అన్నప్పుడు తొలిసారిగా మా నాన్నగారు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు నేను మొట్టమొదటిసారిగా డెన్మార్క్ దేశానికి వెళ్లి అక్కడ నాకు తెలిసిన కొన్ని ధ్యాన సాధనలను వాళ్ళకి నేర్పించడం జరిగింది అలా డెన్మార్క్ లో మీరు వెళ్ళినప్పుడు ఆ 19 సంవత్సరాల వయసులోనే ఆ
(11:25) ఎవరైతే మీ పిరిచువల్ గా మీరు మాట్లాడినప్పుడు వారు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళు ఎలా దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి అక్కడికి వెళ్ళినప్పుడు నేను నేర్పించిన ధ్యాన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ రోజుకి కూడా వాటిని క్రమం తప్పకుండా ఓకే సాధన చేస్తూ ఆ ధ్యాన పద్ధతుల ద్వారా ఎంతో ప్రయోజనాలను పొందుతూ ఇప్పటికీ కూడా చాలా కృతజ్ఞతా భావంతో నాకు ఈమెయిల్స్ రాస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు పొందిన ప్రయోజనం వాళ్ళు చూపే ఆ విలువలు ఎంతో స్ఫూర్తిదాయకం [సంగీతం]
(12:16) స్వామీజీ మన దేశంలో ఉన్న ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉందో దాని నుండి నేను అక్కడికి తీసుకువెళ్ళింది ఒక రవ్వంత మాత్రమే మన ఆధ్యాత్మిక సంపద మన భారతదేశంలో ఉన్నది ఎంతో గొప్పది మనం విలువ కట్టలేనిది కూడా అలాంటి ఆధ్యాత్మికతను నేను చిన్నగా కొద్దిగా మాత్రమే వాళ్లకు పరిచయం చేస్తూ దానినే వాళ్ళు ఏదో మహా ప్రసాదంగా భావించి ఇప్పటికీ కూడా సాధనలు చేసుకుంటూ వారి జీవితాల్ని మార్చుకొని భగవంతుని వైపుగా ఆధ్యాత్మికతను ముందుకు వెళ్తూ ఉన్నారు
(13:02) నిజంగా గొప్ప విషయం స్వామి ఆత్మ గారు ఆ వయసులోనే మీరు చెప్పినటువంటి వినటమే కాకుండా వాళ్ళు ఇప్పటికీ దాన్ని పాటిస్తుండటం నిజంగా ఈ విషయంలో మీరు ఆధ్యాత్మికం వైపు నేర్పటమే కాకుండా మన భారతదేశాన్ని మన భారతీయతను విదేశాల్లో కూడా చాలా చాటి చెప్పేలా మీరు చేస్తున్నందుకు నిజంగా గొప్పగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం మానసికంగా పరిపక్వత చెందిన తర్వాత ఒక గురువు నాకు ఎవరైతే గురువు ఉండాలి అని అనుకున్నప్పుడు మీ మదిలో ఎవరిని గురువుగా అనుకున్నారు గురువు అన్వేషణ జరిగిందా నా బాల్యం నుండే నా తల్లిదండ్రులే ప్రథమ గురువులు అలా నా ఆధ్యాత్మికత మొదలైనప్పటి
(13:44) నుండి నా జీవితంలోకి మా అసలు శిష్యులైన గురువుగారు తన ఆధ్యాత్మిక బోధనలతో నన్ను ఇంతటి వాడిని చేసిన మా గురువుగారు శ్రీ కేదర్నాథ్ బాధురి బాబా పరిపూర్ణ జ్ఞానం అంటే ఏమిటి అది మీరు సాధించారు అనుకుంటున్నారా పరిపూర్ణ జ్ఞానం అనేది ఇది అని చెప్పడానికి లేదండి ఒక వ్యక్తి నేను పరిపూర్ణమైన జ్ఞానవంతుడిని అంటే అంతకు మించిన అజ్ఞానం మరొకటి ఉండదు మీరు నన్ను అడిగితే మీరు పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందారా అంటే లేదు అనే చెప్తాను పరిపూర్ణ జ్ఞానము అనేది అది మాటలకు అతీతమైనది నన్ను మీరు మీరు మనశ్శాంతిగా
(14:31) ఉన్నారా మీరు ఆనందంగా ఉన్నారా అని అడగండి అవునని చెప్తాను పరిపూర్ణమైన జ్ఞానం అనేది ఎవరి వల్ల కాదు అది అసాధ్యం ఎవరైనా ఉంది అన్నారంటే అది అజ్ఞానం మీరు ఎలాంటి బోధనని ప్రాధాన్యత ఇస్తారు ఎలాంటి ప్రక్రియల్ని మీరు బోధిస్తున్నారు సనాతన ధర్మాన్ని ప్రతి వ్యక్తి ఒక యోగి మాదిరిగా జీవించాలని అంటూ ఉంటారు మన సనాతన ధర్మంలో కూడా యోగి ఉన్నతమైన జీవిత ప్రమాణాలతో తన జీవితాన్ని క్రమశిక్షణతో భగవత్ చింతనతో నింపుకొని
(15:18) జీవిస్తాడు నేటి కాలంలో కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలి అనుకునే వాళ్ళకు భగవత్ చింతన యోగి లాగా క్రమశిక్షణ ఈ రెండిటిని కలిపి జీవించడం ఎంతో ముఖ్యమని అలా జీవించడం వల్ల వారి జీవితాల్లో ఎంతో మంచి జరుగుతుందని నా వద్దకు వచ్చిన వాళ్ళకి నేను బోధిస్తూ ఉంటాను బోధనల విషయానికి వస్తే ప్రతి గురువు వారికి తెలిసింది వారికి నచ్చిన విధానంలో బోధనలు చేస్తా ఉంటారు నా వరకు వస్తే నేను భగవంతుని
(16:02) మీద భక్తి కలిగి ఉండమని అందరికీ బోధిస్తూ ఉంటాను మరియు అలాగే సేవా దృక్పదాన్ని పెంచుకోమని బోధిస్తూ ఉంటాను ఆధ్యాత్మికమైన సాధనలు ఎంతో నేటి యువతకు అవసరం మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండాలి వీటన్నిటిని సమ్మిళితం చేసి నా సత్సంగాల్లో యువతకు కానీ ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకునే వాళ్ళకు కానీ నా జ్ఞానాన్ని పంచుతూ వాళ్ళని సన్మార్గంలో ముందుకు తీసుకుపోవడానికి నేను బోధిస్తా ఉంటాను మీ సందేశాలు కావచ్చు మీ ప్రక్రియలు కావచ్చు ఇప్పుడు ఎవరైతే మీ దగ్గర నుంచి మీ
(16:52) ఫాలోవర్స్ గా కానీ లేకపోతే మీ శిష్య బృందం గాని వారు ఎలా దీన్ని స్వీకరిస్తున్నారు వారు ఎలా పాటిస్తున్నారు ఇటువంటి ఆధ్యాత్మికమైన బోధనల వల్ల అక్కడి ప్రజలకు ఎవరైతే ఈ ఆధ్యాత్మికమైన సాధనలు చేస్తున్నారో వారి రోజు వారి జీవితాల్లో ఎంతో ఒత్తిడి నుంచి విడుదలైనట్టుగా వాళ్ళు నాకు చెప్తా ఉంటారు ప్రత్యేకించి వాళ్లకున్న దురలవాట్లకు దూరం అవ్వడం కానీ వాళ్ళల్లోని ఏకాగ్రత పెంపొందించడం కానీ ఓకే వాళ్ళలో ఉన్న ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించడం కానీ ఈ
(17:38) ఆధ్యాత్మిక బోధనల వల్ల సాధ్యమవుతుంది ఒక చిన్న ఉదాహరణగా చెప్తాను నేను ఒక ఐదు సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి తను ఎంతో జీవితంలో దురలవాట్లకు బానిస అయి మొత్తం కోల్పోయి చాలా ఒక దీనమైన స్థితిలో నా వద్దకు వచ్చాడు వచ్చి అడిగాడు స్వామి నా నాకు బ్రతకాలని లేదు చనిపోవాలని ఉంది నేను మొత్తం కోల్పోయాను అని జీవితం పైన ఆశని వదిలేసుకున్నాడు అటువంటి వ్యక్తి ఇవాళ ఈ బోధనల వల్ల ఈ యోగి జీవితాన్ని ప్రారంభించి ఇవాళ మళ్ళీ తను పుంజుకొని పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఒక చక్కటి
(18:22) జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు నేను పేరు చెప్పను గాని ఆ వ్యక్తిని మీరు కూడా కలిసారు ఆ సో అలాగా ఈ ఆధ్యాత్మికమైన సాధనలు క్రమశిక్షణతో సాధన చేయగలిగితే జీవితాన్ని మనకు కావాల్సినట్టుగా మనం మలుచుకోవచ్చు మార్చుకోవచ్చు కూడా రైట్ సో ఇటువంటి బోధనలు మంచికి వారి జీవితాల్లో సుఖశాంతులను తీసుకో రావడానికి నేను సత్సంగుల ద్వారా సత్సంగ ప్రసంగాలు ఇస్తూ వాళ్ళని ఉత్తేజపరుస్తూ భగవంతుని వైపు ఈ ధ్యాన మార్గంలో ముందుకు తీసుకుపోతూ ఉంటాను గ్రేట్ స్వామి స్వామీజీ
(19:09) ఫర్ మీ ఇస్ ఆన్ యాంకర్ ఇన్ మై లైఫ్ స్వామీజీ ఫర్ మీ ఇస్ గ్రేట్ హైప్ మాస్టర్ హి ఇస్ మై ఎవ్రీథింగ్ హి ఇస్ మై ఆల్ స్వామి భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ఉందా మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి ప్రణాళిక అంటే ఇప్పుడు నేను ఏదైతే చేస్తూ ఉన్నానో ఇలాగే ఇంకా చాలా మందికి ఈ సనాతన ధార్మిక యోగ పద్ధతులు అందరికీ అందుబాటులోకి రావాలి అలా వస్తూ ప్రతి మనిషి ఈ యోగి తత్వాన్ని అలవర్చుకొని సరైన సాధనలు చేసుకుంటూ జీవితాన్ని సుఖమయంగా ఆనందమయంగా
(20:00) గడుపుతూ ఉంటే అది చూడాలి చాలా మందిని వేల మందిని లక్ష మందిని ఆనందంగా ఆరోగ్యంగా చూడాలి అన్నదే నా జీవితాశయం దాని కోసం ఈ దేహంలో ప్రాణం ఉన్నంత కాలం నలుగురికి మంచిని బోధిస్తూ నలుగురికి మంచిని చెబుతూ నలుగురికి సహాయపడుతూ నవ్వుతూ నవ్విస్తూ అలా గడిచిపోవాలి అన్నది నా జీవిత లక్ష్యం ఆల్ ది బెస్ట్ స్వామి మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవ్వాలని కోరుకుంటున్నాను నాకు ఎన్నో సందేహాలు ఉన్నాయి నేను అడగదలుచుకున్న ఒక సందేహాన్ని ఒక ప్రశ్న ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను
(20:45) ఏమిటంటే చాలా మంది ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవాళ్ళు ఆ శక్తి గురించి మాట్లాడుతుంటారు తనలో తాను శక్తిని ఎలా తెలుసుకోవాలి ఆ శక్తిని ఎలా ఆధ్యాత్మికం వైపు నడిపించాలి అంటే మీరు దాని యొక్క సమాధానం తనలో ఉన్న శక్తిని తాను తెలుసుకోవడం సారీ ఎలా ఎలా క్రమశిక్షణతో కూడిన జీవితంలో యోగి కొన్ని ధ్యాన పద్ధతుల ద్వారా తనలో ఉన్న చక్రాలను మేల్కొలుపుతాడు యోగి తనలో ఉన్న శక్తిని తాను అనుభూతి
(21:33) పొందుతాడు ఆ అనుభూతి మాటలకు అందరి అటువంటి శక్తిని మనం అనుభవించినప్పుడు అది ఎంతో హాయిగా మన మనసుకు ఎంతో ప్రశాంతతను కలుగజేస్తుంది అటువంటి ప్రశాంతతను మనలో అనుభవించినప్పుడు మనకు మాటల్లో చెప్పలేనంత హాయి అది దైవానుగ్రహం ఉంటేనే అది సాధ్యం దీనికి చాలా మీరు చెప్పిన విధంగా చాలా నిబద్ధత అవసరం పట్టుదల క్రమశిక్షణ కలిగి మన జీవితంలో మనము సాధన చేయగలిగితే ఇటువంటి అనుభూతులన్నీ మనకు కలుగుతాయి కలుగుతాయి ఆ
(22:20) యోగి తన జీవితంలో తాను తప్పకుండా ఏది మరిచినా తన యోగి సాధనలు మాత్రం మర్చిపోతుంది మా ఆర్ 24 ఛానల్ ద్వారా ఒక రాపిడ్ ఫైర్ రౌండ్ ఒక ప్రశ్న ఒక సమాధానం అంటే సూటిగా ఒక్క మాటలో ఓకే అలా ప్రశ్నలు ఉంటాయి మొదటి మొదటిది ఆ మీరు స్వామి ఎందుకు అవ్వాలనుకున్నారు డబ్బు కోసమా పేరు కోసమా అదేం లేదండి నా సత్యాన్వేషణ నా ఆనందం కోసం సేవ పేరుతో ఎంతో మంది దొంగ స్వామీజీలు పుట్టుకొని వస్తున్నారు వాటి మీద మీ అభిప్రాయం ఎవడి కర్మ వాడిదండి అంతే అంటారా ఎందుకు విదేశాల్లో
(23:07) ఉన్నారు ఇక్కడ మీకు జరగదా జరుగుతది అక్కడ అలా కుదిరింది అంతే ఆ అక్కడే ఉండాలని ఏం లేదు వస్తూ పోతూ ఉంటాను కదా స్వామీజీలు బాబాలు వీళ్ళంతా చాలా మంది ఈ వెంట్రుకలు జులపాలు వేసుకొని వేషధారణ డిఫరెంట్ గా ఉంటుంది మీరు అలా లేకపోవడానికి గల కారణం దానికి దీనికి సంబంధం లేదండి అవి ఏవి లేకోకుండా ఉండే స్వామీజీల్ని గురువుల్ని సన్యాసుల్ని కూడా నేను చూశాను ఓకే సో కాబట్టి ఆధ్యాత్మికతకు గడ్డాలు జులపాలు పెంచుకోవడానికి అసలు సంబంధం లేదు భారతదేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో మీ యొక్క భక్తులు ఆ డివోటీస్ ఫాలోవర్స్ ఉన్నారని ఉన్నారు ఉన్నారు ఉన్నారు ఆ ఇక్కడ
(23:52) కూడా విస్తరింప చేయడానికి ఏమైనా సిద్ధపడుతున్నారా చూద్దాం అవకాశం వస్తే అన్ని చోట్ల ఉండడానికి నేనేం భగవంతుడిని కాదు కదా అసలు మీ దృష్టిలో మతం అంటే ఏంటి ఒక విశ్వాసం ప్రజలు జీవించడానికి ఒక యాంకర్ కావాలి ఒక విశ్వాసం కావాలి ఆ విశ్వాసాన్ని మతం మనకు ప్రసాదిస్తా ఉంది సో కాబట్టి ఆ మతాన్ని విశ్వసించిన వారు ఎవరైనా సరే ఓకే మనం ఈ పద్ధతిని ఈ ఆచార వ్యవహారాల్ని ఇలా ఏదైతే ఈ మతం మనకి ఇస్తుందో ఆ జీవన ప్రమాణాల్ని అన్నిటిని తీసుకొని వాళ్ళు జీవిస్తా ఉన్నారు ప్రతి మంత్రం మంచినే కదండీ బోధిస్తుంది అంటే స్వామి ఆత్మ ఆ ప్రతి మతాన్ని గౌరవిస్తాను
(24:37) గౌరవిస్తాను ప్రతి మతము ఉన్నతమైంది నేను ఏ మతానికి వ్యతిరేకిని కాను సర్వ మతాలు మంచినే బోధిస్తాయి ప్రేమ అనే పంచమని చెబుతా ఉన్నాం మానవత్వాన్ని చాటుతా ఉన్నాం మరి అటువంటప్పుడు మనం ఎలా మతాన్ని మనం వ్యతిరేకించగలం ఇది గొప్ప అది గొప్ప అని ఏనాడు మనం బేరీజు వేసుకోక మత ప్రచారాలు తీవ్రంగా జరుగుతున్న ఈ పరిణామాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో మూర్ఖత్వం అండి అది మూర్ఖత్వం ప్రచారం మూర్ఖత్వం అంటారా తప్పకుండా ఒక నా మతమే గొప్ప అని ప్రచారం చేయడం మూర్ఖత్వం నీ మతం చిన్న అది ఎలా ఉంటది అంటే ఆ మా అమ్మే గొప్ప మీ అమ్మ గొప్ప కాదు అన్నట్టుగా ఉంటది మీ అమ్మ మీకు గొప్ప మా అమ్మ నాకు
(25:24) గొప్ప అంతే కదండీ అంతే అంతే అమ్మ ఎవరికైనా అలాంటప్పుడు అమ్మకి ఆ అమ్మకి ఇవ్వాలి నేను మీ అమ్మకు గౌరవాన్ని ఇస్తే మీరు మా అమ్మకు గౌరవాన్ని ఇస్తారు కదా అంతే సో అలాగా నా మతమే గొప్ప అని ప్రచారం చేసుకోవడం మూర్ఖత్వానికి సూచిక అని నేను అంటాను స్వామి ఆ చాలా ధన్యవాదాలు మీరు మాకు ఈ అవకాశం ఇచ్చి మాకు ఈ సమయం కేటాయించి ఆ ఈ మంచి విషయాల్ని మాకు మా ప్రేక్షకులకు తెలియజేసే విధంగా ఈ ఆధ్యాత్మికం గురించి తెలుసుకున్నందుకు ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది మరొకసారి ధన్యవాదాలు మీకు మీ ఆర్ 24 యాజమాన్యానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు
(26:13) మరియు ధన్యవాదాలు మీకు విజయం చేకూరాలని మీరు ఎంతో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు ఇది మనం ఈరోజు తెలుసుకున్న ఆధ్యాత్మిక విషయాలు స్వామి ఆత్మ గారి గురించి గురించి వారి విషయాలు వారి ఆ బోధనలు మరియు ఆధ్యాత్మికం గురించి ఆయన ఆ విషయాలను ఎంతో బోధిస్తున్న విషయాలని మనం ఈరోజు తెలుసుకున్నాం ధన్యవాదాలు ధన్యవాదా ధన్యవాదా ధన్యవా ధన్యవాదా ఓం
(26:58) నమో ஓம் நமோ టుగెదర్ వి ఆర్ పవర్ఫుల్

No comments:

Post a Comment