Sunday, December 6, 2020

మంచి మాటలు

శుక్రవారం --: 23-10-2020 :-- ఈరోజు AVB మంచి మాటలు ..

దేవి శరన్నవరాత్రులు లో భాగంగా ఈరోజు ఏడవ రోజు సందర్భంగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు యావత్ మంది భక్తులు మహాలక్ష్మి మాత దర్శనం చేసుకొని మహాలక్ష్మి స్తోత్రాన్ని పఠిస్తూ అష్ట ఐశ్వర్యాలు పొందాలని మనసారా కోరుతూ సర్వలోకానాం సుఖినోభవంతు అష్ట ఐశ్వర్య ప్రాప్తిరస్తు

ఉదయం మీ అందమైన చిరుళవ్వుతో ప్రారంభం కావాలనీ మీరు మీ కుటుంబసభ్యులు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .

ఒక మంచి వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి విలువ తెలియకపోవచ్చు కానీ ! విడిపోయాక మాత్రం కచ్చితంగా తెలుస్తుంది . మన జీవితంలో ఏం పోగొట్టుకున్నామో .

అందరితో కలిసి ఉండు అందరిలా నవ్వుతూ ఉండు అంతే గాని అందరినీ అయినా వాళ్లు అనుకోకు ! అంతా నా వాళ్ళు అని మురిసిపోకు , నటనతో కూడిన మనిషి విషం కన్నా చాలా ప్రమాదం . తెలుసుకుని నడుచుకో నేస్తమా ! .

మనషి చచ్చాక శవంగా మారే మనవ శరీరం , ఎవరికీ కనపడని ఆత్మ మట్టిలో కలసే మాసం ముద్ద కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకోని భంధాలు , దీనికోసం మోసాలు , అబద్దాలు , నితీ నియమాలు వదిలేయడం , పగలు ప్రతీకారాలు , సాటివారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందటం ఇదీ నేటి కలియుగ మానవ జీవనం .

మనలో ఉన్న బాధను నలుగురితో పంచుకుంటే తగ్గుతుంది అంటారు . కానీ ! నేటి సమాజంలో ఆ నలుగురు మరో నలుగురికి చెప్పి ఆ బాధను రెట్టింపు చేస్తారు . జాగ్రత్త నేస్తమా .

ఆత్మీయ బంధుమిత్రులైన మీకు శుభోదయ శుభాకాంక్షలు ,మీకు మీ కుటుంబసభ్యులకు లక్ష్మి పద్మావతి సమేత ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వరాలయాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ

సేకరణ ✒️ మీ ... AVB సుబ్బారావు 💐🤝🌹🌷

Source - Whatsapp Message

No comments:

Post a Comment