Friday, September 2, 2022

నేటి మంచిమాట. గతం వేరు, వర్తమానం వేరు, భవిష్యత్తు వేరు...

 నేటి మంచిమాట. 

గతం వేరు, వర్తమానం వేరు, భవిష్యత్తు వేరు...
ఉదాహరణకు నేను గత జన్మలో మైసూర్ మహారాజ్ అయితే ప్రస్తుతం మైసూర్ కోట వద్దకు వెళ్లి అదే విషయం చెబితే కోట ముందు ఉన్న భటుడు పిచ్చివానిగా చూస్తాడు... అతి చేస్తే పిచ్చి హాస్పిటల్లో చేరుస్తాడు.
     వర్తమాన శ్వాస లాగానే వర్తమాన ఆలోచనలు పాజిటివ్ గా ఉండి వర్తమానం, భవిష్యత్ అధ్బుతంగా తీర్చి దిద్దుకోవచ్చు    అధ్బుతమైన ఆలోచనలు సరైన సాధన ద్వారా మాత్రమే చేస్తూ.
     చెడు కర్మలు ఎంత బలంగ ఉంటే అంత ఎక్కువ సాధన చేయవలసి ఉంటుంది... కారు చేరుకోవాల్సిన గమ్యాన్ని బట్టే ఇంధనం నింప వలసి వుంటుంది. గురువు సలహాలూ సూచనలూ మాత్రమే ఇస్తాడు గాని నీ వెంట ప్రయాణం చెయ్యడు.
     చెడు కర్మలు ఎక్కువ తక్కువ ఉన్నాయని తెలిసేది అనుభవించే రోగాలు, బాధలు,సమస్యలు, ఇబ్బందుల ద్వారా మాత్రమే అర్ధం అవుతుంది ఎవరికి వారికి.
     అందరి శిష్యులను గురువులుగా మార్చిన ఏకైక గురువు పత్రీజీ గురువు గారికి పాదాభివందనాలు...

No comments:

Post a Comment