Thursday, September 8, 2022

ఆంతర్యం లోని అందాలే బాహ్యంలో ఆరబోసుకోవటం జరుగుతుంది.

 ఓం నమో భగవతే వాసుదేవాయ 🌺🙏🌺

      మనిషి ఎప్పుడూ నవ్వలేడు. కాని, నవ్వగలిగే శక్తిని ఎప్పుడూ కలిగి యున్నాడు. మౌనంగా ఉన్నంత మాత్రాన మాటలు రావని కాదు. మన నుండి కదిలే ఆలోచనల వెనుక, మననుండి సాగే మాటల నడుమ, మనకు తెలిసే విషయాల మధ్య మౌనంగా, మర్మంగా ఉన్నదెవరో తెలిస్తే,ఆ తరువాత ఒక అందమైన అలౌకిక వాతావరణాన్ని ఆంతర్యంలో అవలోకించటం జరుగుతుంది. ఆంతర్యం లోని అందాలే బాహ్యంలో ఆరబోసుకోవటం జరుగుతుంది. బాహ్యాభ్యంతరాలలో ఒకే అందం,.ఒకే సౌందర్యం, ఒకే ఆనందం,ఒకే వీక్షణం దోబూచులాడుతుంది. అదొక దివ్యానుభూతి. దివ్యమైన అద్వైతానుభూతి.

                    ----- స్వామి సుందరచైతన్యానంద.

No comments:

Post a Comment