Sunday, September 18, 2022

ఆధ్యాత్మికత అంటే..! ఋణాను బంధం - అందరినీ ప్రేమించటం.

 *ఆధ్యాత్మికత అంటే..!* 
🍁🥀🥀🥀🥀🍁🌹🍁🥀🥀🥀🥀🍁

*ఋణాను బంధం - అందరినీ ప్రేమించటం.*

💐 ఆధ్యాత్మికత ఆంటే మనం నిత్యంచేసే పనుల్ని వదిలిపెట్టకుండా ఇంకా నైపుణ్యంతో చేయాలి అని అర్ధం.

💐 నీలోని నీశక్తి గ్రహించి, నువ్వంటే ఎవరివో తెలుసుకుని జ్ఞానాన్ని జీవితంలో ఆచరించడమే  ఆధ్యాత్మికత.

💐 ఈ ఆధ్యాత్మికత మనల్ని ఇంకా శక్తిమంతుడిని, జ్ఞానిని, ప్రతిభావంతుడిని చేస్తుంది.

💫 అందుకే  *"నహి జ్ఞానేన సదృశం"* అన్నది *భగవద్గీత.* 

💐 మనలో జ్ఞానం, ఆధ్యాత్మికత ఎంత ఉన్నాయో కనీసం వారానికి. ఒక్కరోజు అయినా పరిశీలించుకోవడం మంచింది. కాలం,  కర్పూరం కొద్దిగా కూడా ఉపయోగించకపోయినా కరిగిపోతాయి.

💫 గతంలో మనం చేసుకున్న సత్కర్మల వలన లభించే గొప్ప అవకాశాలు మన నిర్లక్ష్యం, బద్ధకం, అజాగ్రత్త వలన చేజారి పోతాయి.

💫 ఆధ్యాత్మిక ప్రస్థానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు క్షణకాలమైనా దానిపైనుండి దృష్టి మరల్చని స్థితియే ఏకాగ్రత. ఏ ఆకర్షణలూ లౌకికమైన ఇంద్రియ సుఖాలూ, ఆఖరికి జీవితంలోని మమతా మొహాలు కూడా నీ దృష్టిని మరల్చకూడదు.
      
💫 నీవు నీఆధ్యాత్మిక ప్రస్థానంతో తాదాత్మ్యం కావాలి. ఇదే సమయంలో మనం మన స్వధర్మాలను ఎంత మాత్రం మరచి పోకూడదు. నిత్య జీవితంలోని మనం నెరవేర్చవలసిన ప్రతి పనిని మరింత నైపుణ్యంతో శ్రద్ధగా చేయాలి. లక్ష్యం స్థిరంగా ఉండాలి.

🌈 ఆధ్యాత్మికత పేరుతో దీనికి లోపం కలిగిస్తే ఏ వ్యక్తితో మనకి ఉన్న ఈ జన్మలో తీర్చ వలసిన కర్మ ఋణాన్ని తీర్చక పోతే, అది రాబోయే జన్మ జన్మలకి వాయిదాపడే ప్రమాదముంది. ఇది కుటుంబంలోని వ్యక్తులకీ వర్తిస్తుంది, అనుబంధాలకీ, శత్రుత్వాలకీ కూడా వర్తిస్తుంది.

🌈 ఈ కారణంగానే మనం కోరుకున్న వారితో కంటే, మనం కోరుకోని  వారితోనే వేదనా భరితంగాఎక్కువ  జీవితం గడపవలసి వస్తుంది. అనివార్యమైన బంధాలు బంధనాల్లా, వేదనకు గురి చేసినా సహనంతో భరించక తప్పదు.
 
🌈 మీకు ఓ సందేహం రావచ్చు. వేధిస్తూ మనతోటే అనివార్యంగా జీవించే వారిని ఎదిరించి దూరంగా వెళ్ళి పోకూడదా అని..?

🌈 అన్ని బంధాలను వదిలించుకోవడం సాధ్యం కాదు. *'ఋణానుబంధ రూపేణా పశుపత్నీ సుతాదాయా'* అన్నారు.

*జీవులని ఋణాలు కలుపుతాయి. ప్రేమలూ కలుపుతాయి.*

*రుణం తీరి పోతుంది. ప్రేమతో ఏర్పడ్డ బంధం పెరుగుతుంది.* 

*రుణం తీరిపోయిన వాళ్ళు ఒక్క క్షణం కూడా మనతో ఉండరు.*

🌈 *ప్రేమ బంధం కలిగిన వారు ఎప్పటికి వెంటే ఉంటారు. అందరినీ ప్రేమిద్దాం. అందరితో ఋణానుబంధం కాక ప్రేమానుబంధం పొందుదాం. ఏకాగ్రత సాధిద్దాం !*


*సేకరణ:*  
🍁🥀🥀🥀🥀🌹🍁🌹🥀🥀🥀🥀🍁

No comments:

Post a Comment