*:::::::లోపలి మాటలు ::::::*
మన మనస్సు లో నుండి మనకు రెండు రకాల మాటలు విని పడతాయి.
*1) ఏవేవో ఆలోచనలు...*
ఇవి మనతో మనం మాట్లాడుకునే మాటలు.
వీటికి విలువ లేదు. పైగా వీటినుండి బయట పడదాము అనుకుంటాం. లోపలి ఈ మాటలు ఆగి నిశబ్దం వుంటే బాగుండు అనుకుంటాం.
*2) పరిష్కారం..*.
మనం ఒక సమస్య లో వున్నపుడు, ఎటూ తేల్చుకోలేక పోతున్నప్పుడు , నిర్ణయం చేయలేక సందిగ్ధత వున్నప్పుడు, శూన్యత ఏర్పడి, అకస్మాత్తుగా లోపలినుండి మొరుపు లాగా ఒక పరిష్కారం,ఒక నిర్ణయం,ఒక జవాబు,ఒక క్లారిటీ, వస్తుంది.
దీనికి ఏదేదో పేరు పెడతారు. గురువు మెసేజ్ అంటారు, విశ్వం ఇచ్చిన జవాబు అంటారు.
*నేనైతే దీనిని ప్రజ్ఞ అంటాను. సరైన ధ్యానికి త్వరగా ప్రజ్ఞ మేల్కొని వుంటుంది*
*షణ్ముఖానంద. 9866699774*
No comments:
Post a Comment