Monday, January 23, 2023

సానుకూల ధృక్పధం…* *చిత్రకారుడి వివేకం

 HF5.2212. 1-8.  230123-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*సానుకూల ధృక్పధం…*

               *చిత్రకారుడి వివేకం*
                    ➖➖➖✍️

*ఒకానొకప్పుడు ఒక రాజు ఉండేవాడు, అతనికి ఒక కన్ను, ఒక కాలు మాత్రమే ఉండేవి.  ఈ బలహీనతలు ఉన్నప్పటికీ, అతను సమర్థవంతమైన, దయగల, తెలివైన పాలకుడు.  అతని పాలనలో  ప్రజలు చాలా సంతోషకరమైన జీవితాన్ని గడిపేవారు.*

*ఒకరోజు రాజు తన రాజభవనం గుండా నడుస్తున్నాడు.  అకస్మాత్తుగా, భవనం వసారా  గోడలపై వేలాడుతున్న చిత్రాలపై అతని చూపు పడింది. అవి అతని పూర్వీకుల చిత్రాలు.  భవిష్యత్తులో తన వారసులు రాజభవనంలోని ఆ భవనవసారా గుండా వెళుతున్నప్పుడు, ఆ చిత్రాల ద్వారా తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటారని రాజు తనలో తాను అనుకున్నాడు.*

*అయితే, ఆ గోడపై రాజుగారి చిత్రపటం ఇంకా పెట్టలేదు. శారీరక వైకల్యాలతో ఉన్న అతని చిత్రం ఎలా ఉంటుందో అని అనుకున్నాడు.  కానీ ఆ రోజు తన చిత్రాన్ని కూడా ఆ గోడపై పెట్టాలని నిర్ణయించుకున్నాడు.*

*మరుసటి రోజు అతను దేశంలోని ఉత్తమ చిత్రకారులను దర్బారుకు ఆహ్వానించాడు.  భవన వసారా  గోడపై తన అందమైన చిత్రాన్ని పెట్టాలనుకుంటున్నట్లు ప్రకటించాడు.  అతడి అందమైన చిత్రాన్ని చిత్రించగలవారెవరైనా ముందుకు రావాలని కోరాడు.  చిత్రం ఎలా ఉంటుందో దాని ఆధారంగా చిత్రకారుడికి బహుమతి ఇవ్వబడుతుందని ప్రకటించాడు.*

 *దర్బారులో ఉన్న చిత్రకారులందరూ తమ కళలో నైపుణ్యం కలిగినవారే, కానీ రాజు ప్రకటన వినగానే, ఆయనికి ఒక కాలు, ఒక కన్ను మాత్రమే ఉందికదా,  చిత్రపటాన్ని అందంగా ఎలా చిత్రించగలం? అని వారు ఆలోచించడం ప్రారంభించారు.  ఒకవేళ, చిత్రం అందంగా కనిపించకపోతే, రాజు కోపం తెచ్చుకుని వారిని శిక్షించవచ్చు.*

*ఈ ఆలోచనతో ఎవ్వరూ ముందుకు రావడానికి ధైర్యాన్ని చూపలేదు. ఒక్కొక్కరు  ఒక్కో సాకుతో మర్యాదగా  అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక యువ చిత్రకారుడు మాత్రం అక్కడ నిలబడి ఉన్నాడు.*

*రాజు అతనిని , "నీవు నా చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధంగా ఉన్నావా?"అని అడిగాడు.* 

*దానికి యువ చిత్రకారుడు అంగీకరించాడు.  మరుసటి రోజు నుండి చిత్రకారుడు రాజు యొక్క చిత్రపటాన్ని తయారు చేయడం ప్రారంభించాడు.*

*కొన్ని రోజుల తర్వాత, చిత్రం సిద్ధమైంది. చిత్రావిష్కరణ రోజు వచ్చేసరికి సభికులతోపాటు చిత్రలేఖనానికి నిరాకరించిన ఇతర చిత్రకారులు కూడా దర్బారుకు హాజరయ్యారు. చిత్రం ఆవిష్కరణ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.*

*చిత్రాన్ని ఆవిష్కరించినప్పుడు, రాజుతో సహా ప్రతి ఒక్కరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.*

*చిత్రపటం చాలా అందంగా చిత్రీకరించబడింది.*
*చిత్రంలో, రాజు గుర్రంపై రెండు వైపులా కాళ్లు పెట్టుకొని కూర్చున్నట్లుగా చూపించారు, కానీ చిత్రంలో ఒక వైపు మాత్రమే రాజుగారి ఒక కాలు  కనిపిస్తున్నది.*
*రాజు ఒక కన్ను మూసుకుని విల్లును గురిపెట్టినట్లు చూపబడింది, దానివలన రాజుగారి రెండవ కన్ను యొక్క బలహీనత కూడా కప్పివేయబడింది.*

*ఈ చిత్రాన్ని చూసి రాజు చాలా సంతోషించాడు.  చిత్రకారుడు తన వైకల్యాలను తెలివిగా దాచిపెట్టి అద్భుతమైన చిత్రాన్ని రూపొందించాడు.  రాజు అతనికి బహుమతితో పాటు,  తన ఆస్థాన ప్రధాన చిత్రకారుడిగా నియమించాడు.*

**ప్రతీ మానవుడు సామర్ధ్యాల భాండాగారమే, అయితే ఆ సంభావ్యతను గుర్తించడానికి సానుకూల వైఖరి, ప్రేమపూర్వక దృక్పథాన్ని కలిగి ఉండటం అవసరం.  క్లిష్ట పరిస్థితులలో కూడా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించడంలో సహాయపడుతుంది.*               
    
                     
*మనం ఏపని చేసినా, మన హృదయంలోని  ప్రేమనంతా ఆ పని పై  కురిపించాలి.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment