Monday, January 23, 2023

::: ఆలోచనలతో ఎలా వుండాలి:::

 *::: ఆలోచనలతో ఎలా వుండాలి:::::::*
1) *పుట్టుక* ఆలోచనల పుట్టుకను పరిశీలించాలి. మనస్సు కుశలమైతే కుశలమైన ఆలోచనలే వస్తాయి. కనుక చెడు ఆలోచనలను తృంచడం మీద దృష్టి పెట్టడం కన్నా అకుశల మనస్సుని శుద్ధి చేయడం మీద దృష్టి పెట్టాలి.
2) *నిరాకరణ* చెడ్డ ఆలోచనలు వస్తే వాటికి సహకరించక నిరాకరించాలి.
3) *ఆమోదించక పోవడం* నిరుపయోగంగా ఉన్నవి, తిరగ పెట్టేవి, ఆవేశాలకు లోను చేసేవాటిని ఆమోదించిక పోతే అవి కనుమరుగు అవుతాయి 
4) *నిలబడటం* కొన్ని ఆలోచనలు మనం తెలియక ఇస్తున్న ప్రాధాన్యత బట్టి నలబడతాయి. ప్రాధాన్యత ఇవ్వకండి.
5) *వ్రేలాడటం* మనస్సు పట్టు కొని వ్రేలాడే విషయాలలో ఆలోచనలు ఒకటి.ఈ వ్రేలాడే అలవాటు కు దూరం అవ్వొచ్చు.
6) *జతచేయడం* కొన్ని ఆలోచనలు ఉద్వేగాలతో జత చేయబడి వుంటాయి. విడదీసి రిలాక్స్ అవ్వాలి.
 *పై విషయాలకు ధ్యానం సహాయం పడుతుంది*
*షణ్ముఖానంద 9866699774*

No comments:

Post a Comment