Monday, January 23, 2023

ఉన్నత దృష్టిని అలవరచుకుంటూ శాశ్వతమైన దానితో సంబంధాన్ని కలిగి ఉండటమే శ్రేయస్కరం.

 210123a1733.    220123-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀746.
నేటి...
  
              *ఆచార్య సద్బోధన:*
                  ➖➖➖✍️

*ఉన్నత దృష్టిని అలవరచుకుంటూ శాశ్వతమైన దానితో సంబంధాన్ని కలిగి ఉండటమే శ్రేయస్కరం.*

*మనం బలహీనంగా ఉంటే, బలవంతులమయ్యేందుకు ప్రయత్నించాలి.*

*నిరాశా నిస్పృహలతో, క్రుంగుబాటుతో ఉంటే ఆనందాన్ని తెచ్చుకొనేందుకు ప్రయత్నించాలి.*

*మన మనస్సు వ్యాకులత అనే చీకటితో కప్పబడి పోయి ఉంటే వెలుతురుకై ఎదురుచూడాలి.*

*శారీరక రుగ్మతలు కలిగి ఉంటే ఆరోగ్యంగా, పవిత్రంగా అయ్యేందుకు కృషి చేయాలి.*

*అధైర్యంతో ఉంటే ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నించాలి. లౌకికత్వం నుండి పారమార్థికత వైపుకి పయనించాలి.*

*ఈ విధంగా నిమ్నస్థాయి వాటి నుండి బయటపడి ఉన్నత స్థాయి వాటిని చేరుకునే ప్రయత్నం జీవితంలో నిరంతరం సాగుతూ ఉండాలి.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment