Saturday, October 19, 2024

 🙏🏻 *రమణోదయం* 🙏🏻

*మెలకువని ఎఱుక అనుకోవటం ఆత్మని మరచిన అవిద్య వల్లనే. ఈ జాగ్రదవస్థ శ్రేష్టమైన ప్రజ్ఞాదశయనే భ్రమ తొలగితే అప్పుడు నిద్ర కేవలం అద్వైత స్థితిగా తోస్తుంది. (అంతవరకు శాస్త్రాలు నిద్రని ఒక కోశంగా అంటే ఆనందమయి కోశమంటాయి).*

వివరణ : *కలలోను, మెలకువలోను శరీరాహంకారాన్ని తన నిజమైన ఉనికి అని భావించడం వలన  అహమణగిన నిద్రావస్థను ఉనికి లేని స్థితిగా ఎంచుచున్నాము. అయితే విచారణ ద్వారా తన నిజస్వరూపాన్ని ఉనికిగా తెలుసుకొంటే జాగ్రత్ స్వప్నాలలో గల అహంభావాన్ని భ్రమ అని తెలిసి నిద్ర నిజ ప్రజ్ఞయేయన్న భావం ఉదయిస్తుంది. నిద్రలో పూర్ణజ్ఞానముంది. మెలకువలో పూర్ణ అజ్ఞానముందని భగవాన్ వాక్కు.*

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.457)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🪷🪷
*స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*||
                  
🪷🙏🏻🪷🙏🏻🪷

నీవు అరుణాచలంలో ఉండటం కాదు.
నీవే అరుణాచలంలా ఉండు..
తనువును, మనసును కదలనీకు...
ఇదే గొప్ప సాధన!

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏🏻

జ్ఞానదృష్టి అలవరచుకొన్నప్పుడే ప్రపంచం
బ్రహ్మమయంగా కనిపిస్తుంది..బ్రహ్మమెవరో
తెలియకుండా ఈశ్వరుని సర్వమయత్వం
ఏవిధంగా తెలుసుకోగలుగుతావు..??

🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ🙏🏻

No comments:

Post a Comment