దుక్ఖ నివారణకు బౌద్ధ ధమ్మమే శరణ్యం.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
భగవాన్ బుద్ధుడు బోధించినది ధమ్మ(ధర్మం).ప్రకృతి నియమాలను గురించి వివరించి చెప్పెను.బుద్ధుడు స్వయం కృషితో ప్రకృతి లోని నియమాలను,సత్యాన్ని కనుగొనెను.బుద్ధునికి ముందు ఎందరో తాను బోధించిన సత్యాన్ని కనుగొని చెప్పారని, భవిష్యత్తులో కూడా ఎంతోమంది ఈ సత్యాన్ని కనుగొని చెబుతారని ప్రకృతి నియమాలు, సత్యం గురించి తనకు ఎలాంటి గుత్తాధిపత్యం లేదన్నారు.భగవాన్ బుద్ధుడు ఎప్పుడూ ఒకే విషయం గురించి మాట్లాడారు.మానవాళి దుక్ఖం గురించి, దుక్ఖానికి గల కారణం గురించి, దుక్ఖ నివారణ ఏమిటి అనే దాన్ని గురించి మాట్లాడారు. భగవానుడు దుక్ఖ విముక్తి గురించి తప్పితే మరే ఇతర విషయాలను గురించి చర్చించలేదు.అసలు ఇతర విషయాలపై ఆయన ఆసక్తి కూడా కనబరచలేదు.
ధర్మం అంటే?
భగవాన్ బుద్ధుడు జ్ఞానోదయుడైన తరువాత 45 సంవత్సరాల పాటు 84 వేల పద్ధతులలో ధర్మం గురించి బోధించారు.మనలోని ప్రతి ఒక్కరూ అనుభూతి పొంది,నిర్ధారించుకోగలిగేది ధర్మం. సత్యం అంటే అదే! అదే ప్రకృతి నియమం.తథాగత బుద్ధుడు ఇలా అనేవారు "బోధకుని వ్యక్తిత్వం కన్నా బోధనలకే ప్రాముఖ్యం ఉంది." ఎంతసేపూ బుద్ధుడు ప్రజలు దుక్ఖం నుండి విముక్తి పొందడానికి గల సాధనను నేర్పించడమే లక్ష్యంగా ఉండేవారు.ఈ మన మానవ శరీరం కృశించి, నశించిపోవుట సహజం.అలాంటి నా శరీరాన్ని శ్రద్ధగా చూడటం వలన ఎలాంటి ఉపయోగం లేదని తనపై మూఢభక్తి పెంచుకొన్న ఒక శిష్యునితో బుద్ధుడు అంటారు. 'ధర్మాన్ని చూసేవాడు నన్ను నిజంగా చూసేవాడు.నన్ను చూసేవాడు ధర్మాన్ని చూస్తాడు.' అని బుద్ధుడు అన్నారు.
చాలామంది వ్యక్తి పూజ అలవాటు చేసుకున్నారు. మనిషికి వ్యక్తి పూజ వలన ఎలాంటి మేలు జరుగదు.బుద్ధుడు చెప్పినట్లుగా తనను పూజించడం, ఆరాధించడం మానుకొని తను చెప్పిన బోధనలను అర్థం చేసుకొని ఆచరించాలి. మనం సత్యాన్ని స్వయంగా అనుభవంలోకి తెచ్చుకోవాలి.బుద్ధుని బోధనలు నేటికీ మనం ఆచరించదగినవి.మనం బుద్ధుని పట్ల చూపే నిజమైన గౌరవం,పూజ ,సన్మానం, సత్కారం,ఆదరం ఏమిటనగా ధర్మ మార్గంలో నిలకడగా నడవాలి.సరైన రీతిలో ధర్మాన్ని పాటించాలి.
ప్రపంచదేశాల మానవులకు జ్ఞానాన్ని, సరైన జీవన విధానాన్ని అందించిన మహోన్నత సిద్ధాంతం బౌద్ధం.బౌద్ధం భారతీయ జీవన విధానం.ఇది మతం కాదు, జీవన విధానం.మనిషికి మనిషికి మధ్య గల ఉండాల్సిన జీవన విధానాన్ని, సంబంధాలను తెలిపేదే బౌద్ధ ధమ్మం.ఈ ప్రపంచంలో ప్రతి మనిషి దుక్ఖంలో ఉన్నారు.ఈ దుక్ఖం మనిషి మరొకరిని సమానతా దృష్టితో చూడకపోవడం వలన ఏర్పడుతుంది.సాటి మనిషిని హింసించడం ధర్మం కాదు. మనిషి సంతోషంగా జీవించాలి అంటే ధార్మికంగా జీవించాలి. ధార్మికంగా జీవించడం అంటే నీ స్వార్థం కోసం జీవించడం కాదు.ఒక మనిషి మరొక మనిషి పట్ల చక్కగా మెలగాలి అని అలా మెలగుతూ ఉండటం వలన సద్ధర్మ రాజ్యం ఏర్పడి ఈ భూమి స్వర్గమౌతుందని గౌతమ బుద్ధుడు చెప్పారు.భారతరత్న డా.బి.ఆర్.అంబేడ్కర్ అందుకే ఈ దేశానికి, ప్రపంచ దేశాలకు బౌద్ధం సరణ్యం అని చెప్పారు. బౌద్ధం మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దుతుంది.ప్రజ్ఞ ,కరుణ, సమతను బౌద్ధం ఇచ్చింది.మనిషి దుక్ఖానికి ఎందుకు లోనవుతారంటే స్వార్ధపరమైన కోరికలు కలిగి ఉండటం వలన ఆ కోరికలు కోసం తాపత్రయం పడటం వలన ,కోరికలు నెరవేరకపోవడం వలన మనిషులు ప్రశాంతతకు దూరం అవుతారు.బుద్ధుడు స్వార్ధ పరమైన కోరికలు, అత్యాశ ,దురాశలను వదులుకుని ప్రశాంతంగా జీవించాలి అని చెప్పారు. వ్యామోహాలకు బానిస అయితే మన జీవితంలో ఆనందం ఉండదు.కాబట్టి వ్యామోహాలకు దూరంగా పూర్తిగా జీవించడమే నిర్వాణం అని బుద్దుడు చెప్పారు.
"బహుజనుల హితం, బహుజనుల సుఖం కోసం, సర్వ మానవాళి శ్రేయస్సు కోరి మీరు నా ధర్మాన్ని ప్రచారం చేయండి. లోకం మీద అనంతమైన కరుణ ప్రసరించండి.నా ధర్మం ఆదిలోనూ, మధ్యలోనూ, అంతంలోనూ మరియు మాటలో, చేతలో శ్రేయస్కరమైనది."
"ప్రజల కళ్ళు దుమ్ముతో కమ్మేసి ఉన్నాయి. వారికి నా యొక్క ధర్మం బోధిస్తే వారి కళ్ళకు ఉన్న దుమ్ము తొలగిపోయి, వారికి దుక్ఖ నివారణ కలుగుతుంది. ప్రజలు నా ధర్మాన్ని అర్థం చేసుకుంటారు. తప్పక నా ధర్మాన్ని స్వీకరిస్తారు.పవిత్ర జీవిత సందేశాన్ని ప్రజలందరికీ అందచేయండి."
"మానవాళిని ఆవరించియున్న దుక్ఖాన్ని గుర్తించడమే ధర్మం యొక్క నిజమైన మౌలిక ఆవశ్యకత. ప్రపంచాన్ని చుట్టుముట్టి ఉన్న దైన్యతను తొలగించడమే మతం యొక్క ప్రధాన ధ్యేయం." అని భగవాన్ బుద్ధుడు ఉపదేశించారు.
బుద్ధుడు మనిషి శ్రేయస్సు కోసం మార్గాన్ని సూచించిన మానవోత్తముడు.నేడు మన జీవితాలు అగమ్యగోచరంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం తప్పకుండా బుద్ధుని ధమ్మాన్ని తెలుసుకోవాలి.బుద్ధుని ధమ్మం మనకు ఒక మంచి దారి చూపుతుంది.బుద్ధుడు మానవ సమాజం కోసం తన బంధాలను త్యాగం చేసిన నిస్వార్థపరుడు.తాను ఏదైతే కనుగొన్నాడో ఆ సత్యాన్ని ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాడు.బుద్ధుని ధమ్మం మనల్ని వెలుగు దారుల వెంట నడిపిస్తుంది.
బౌద్ధం మానవుని స్వభావంలో మార్పు తేగలదు. బౌద్ధం ధమ్మం ఉన్న చోట జాలి, దయ ,కరుణ, దానం, సేవ ,ప్రేమ, స్వచ్ఛమైన జీవనం ఉంటుంది. బుద్ధుడు అందరికీ ఉపయోగపడే ఉపదేశాలు చేశారు. బౌద్ధ సాహిత్యం చాలా విస్తృతంగా ఉంది. ఇది బైబిల్ కంటే కూడా 11 రెట్లు అధికంగా ఉంటుందని బౌద్ధ పండితుల అభిప్రాయం.బాబాసాహెబ్ అంబేడ్కర్ బౌద్ధ మూల గ్రంథాలు అధ్యయనం చేసారు. పాళీ భాషను కూడా నేర్చుకుని "బుద్ధ అండ్ హిజ్ ధమ్మ" అనే గ్రంథాన్ని వెలువరించారు. ఈ గ్రంథం బౌద్ధ ధమ్మంపై స్పష్టతని ఇస్తుంది. ఇతర అన్ని మతాలు దేవుని చుట్టూ తిరిగి మనిషిని మూఢనమ్మకాల వైపు నడిపిస్తే ఒక్క బౌద్ధం మాత్రమే శాస్త్రీయ మైన మార్గం వైపు నడిపిస్తుంది. బౌద్ధం మంచిని పెంచి చెడును పారద్రోలడానికి తోడ్పడే ఒక సాధనం.ఇది మనిషిని దుక్ఖం వైపు వెళ్ళకుండా సరైన జీవనం లోకి వెళ్ళడానికి ఉపయోగపడే గొప్ప ధర్మం. అన్ని మతాలను బౌద్ధం ప్రభావితం చేసింది.
"ఆధునిక ప్రపంచానికి సరిపోయే మతం బౌద్ధమే.ఈ ప్రపంచాన్ని రక్షించగల శక్తి ఒక్క బౌద్ధానికి మాత్రమే ఉంది.దాస్య విమోచన,మానవతా విలువలవైపు నడిపించేది బౌద్ధం మాత్రమే." అని డా.బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు.
మానవులు పురోగతి చెందాలంటే బౌద్ధ ధమ్మం చాలా అవశ్యం.ప్రపంచంలో ఉన్నా మానవులందరూ ముఖ్యంగా పీడనకు గురవుతున్న మానవులకు విపరీతమైన దుక్ఖం ఉంటుంది. పీడితులు దుక్ఖం నుండి విముక్తి పొందేందుకం ధమ్మం అత్యంత అవసరం. ప్రపంచంలో పీడితులు ఆర్థికంగఆ బలపడాలి అందుకు గానూ వ్యవస్థలో పరివర్తన రావాలి. వ్యవస్థలో పరివర్తన రావాలంటే ముందు వ్యవస్థలోని పీడితులందరిలోనూ మానసిక పరివర్తన జరగాలి. దోపిడీ పాలకులను, దోపిడీ రాజ్యాన్ని కూల్చేందుకు జ్ఞానం, పోరాట పటిమను అలవరుచుకోవాలి. హింసలేని రిపబ్లిక్ సమాజాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలి.
భగవాన్ బుద్ధుడు మనిషి శ్రేయస్సు కోసం మార్గాన్ని సూచించిన మానవోత్తముడు.నేడు మన జీవితాలు అగమ్యగోచరంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం తప్పకుండా బుద్ధుని ధమ్మాన్ని తెలుసుకోవాలి.బుద్ధుని ధమ్మం మనకు ఒక మంచి దారి చూపుతుంది.బుద్ధుడు మానవ సమాజం కోసం తన బంధాలను త్యాగం చేసిన నిస్వార్థపరుడు.తాను ఏదైతే కనుగొన్నాడో ఆ సత్యాన్ని ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాడు.బుద్ధుని ధమ్మం మనల్ని వెలుగు దారుల వెంట నడిపిస్తుంది.
బౌద్ధం మానవుని స్వభావం లో మార్పు తేగలదు. బౌద్ధం ధమ్మం ఉన్న చోట జాలి, దయ ,కరుణ, దానం, సేవ ,ప్రేమ, స్వచ్ఛమైన జీవనం ఉంటుంది. బుద్ధుడు అందరికీ ఉపయోగపడే ఉపదేశాలు చేశారు. బౌద్ధ సాహిత్యం చాలా విస్తృతంగా ఉంది. ఇది బైబిల్ కంటే కూడా 11 రెట్లు అధికంగా ఉంటుందని బౌద్ధ పండితుల అభిప్రాయం.బాబాసాహెబ్ అంబేడ్కర్ బౌద్ధ మూల గ్రంథాలు అధ్యయనం చేసారు. పాళీ భాషను కూడా నేర్చుకుని "బుద్ధ అండ్ హిజ్ ధమ్మ" అనే గ్రంథాన్ని వెలువరించారు. ఈ గ్రంథం బౌద్ధ ధమ్మం పై స్పష్టతని ఇస్తుంది. ఇతర అన్ని మతాలు దేవుని చుట్టూ తిరిగి మనిషిని మూఢనమ్మకాల వైపు నడిపిస్తే ఒక్క బౌద్ధం మాత్రమే శాస్త్రీయ మైన మార్గం వైపు నడిపిస్తుంది. బౌద్ధం మంచిని పెంచి చెడును పారద్రోలడానికి తోడ్పడే ఒక సాధనం.ఇది మనిషిని దుక్ఖం వైపు వెళ్ళకుండా సరైన జీవనం లోకి వెళ్ళడానికి ఉపయోగపడే గొప్ప ధర్మం. అన్ని మతాలను బౌద్ధం ప్రభావితం చేసింది. "ఆధునిక ప్రపంచానికి సరిపోయే మతం బౌద్ధమే.ఈ ప్రపంచాన్ని రక్షించగల శక్తి ఒక్క బౌద్ధానికి మాత్రమే ఉంది.దాస్య విమోచన,మానవతా విలువలవైపు నడిపించేది బౌద్ధం మాత్రమే." డా. బి. ఆర్. అంబేడ్కర్ అన్నారు.
మానవులు పురోగతి చెందాలంటే బౌద్ధ ధమ్మం చాలా అవశ్యం.ప్రపంచంలో ఉన్నా మానవులందరూ ముఖ్యంగా పీడనకు గురవుతున్న మానవులకు విపరీతమైన దుక్ఖం ఉంటుంది. పీడితులు దుక్ఖం నుండి విముక్తి పొందేందుకం ధమ్మం అత్యంత అవసరం. ప్రపంచంలో పీడితులు ఆర్థికంగఆ బలపడాలి అందుకు గానూ వ్యవస్థలో పరివర్తన రావాలి. వ్యవస్థలో పరివర్తన రావాలంటే ముందు వ్యవస్థలోని పీడితులందరిలోనూ మానసిక పరివర్తన జరగాలి. దోపిడీ పాలకులను, దోపిడీ రాజ్యాన్ని కూల్చేందుకు జ్ఞానం, పోరాట పటిమను అలవరుచుకోవాలి. హింసలేని రిపబ్లిక్ సమాజాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలి.
"ఈనాడు బౌద్ధాన్ని అస్పృశ్యుల మతమని కొంతమంది అవహేళన గావించవచ్చు కానీ, భావితరాల వారు బౌద్ధాన్ని తప్పకుండా స్వీకరించే రోజు తప్పక వస్తుంది." అని డా.బి.ఆర్.అంబేడ్కర్ మహారాష్ట్ర లోని నాగపూర్ లో 1956 వ సంవత్సరం అక్టోబరు 15 వ తేదీన లక్షలాది మందితో బౌద్ధ ధమ్మ దీక్ష స్వీకరించిన తరువాత విలేఖరుల సమావేశంలో పై విధంగా జోస్యం చెప్పారు. అంబేడ్కర్ చెప్పినట్లు బౌద్ధం అందరిదీ..బౌద్ధానికి లేదు కులం,ప్రాతం,మతం.నేడు కులం,ప్రాంతం ,మతంతో సంబంధం లేకుండా బౌద్ధాన్ని అందరూ వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్నారు. అయితే చిత్తశుద్ధితో, నిజాయితీగా, నిబద్ధతతో ఈ కృషి జరగాలి.
బౌద్ధ మతం మనిషిలో కపటత్వాన్ని వదులుకుని జీవిత సత్యాలను అంగీకరించాలని ప్రోత్సహిస్తుంది. ఈ ప్రపంచంలో దోపిడీ చేసే వర్గాలు ఉన్నంత వరకూ మనుషులు దుక్ఖంలో ఉంటారు.మనుషులు కేవలం దోపిడీ వర్గాల వలనే కాదు అవిద్య ,మోహం వలలో పడి కూడా దుక్ఖానికి లోనవుతారు. ఇలాంటి దుక్ఖితులు అయిన మనుషులను ఉద్ధరించడం కోసం బౌద్ధం ఆవిర్భవించింది. దుక్ఖం లో ఉన్న మానవులకు సేవ చేయడానికి స్వచ్ఛందంగా తమ స్వంత అవసరాలను, అనుకూలతలను వదులుకుని దుక్ఖితులకు సేవలు చేయాలని బౌద్ధం బోధిస్తుంది.
బౌద్ధ ధమ్మం ప్రకారం ఈ లోకంలో మనం చేసే మంచి పనులను అనుసరించి మనకు మంచి ఫలితాలు ,మనం చేసే చెడు పనులను అనుసరించి మనకు చెడు ఫలితాలు ఎదురవుతాయని బౌద్ధం చెబుతుంది. ఇతర మతాలన్నీ మనిషి మరణాంతరం మనం చేసిన పనులను బట్టి స్వర్గం, నరకాలకు వెళతారని చెబుతుంటే బౌద్ధం ఒక్కటే ఈ లోకంలోనే మనం చేసే పనులను బట్టి ఫలితాలు ఉంటాయి అని స్వర్గం, నరకాలు అనేవి లేవని చెప్పింది.బౌద్ధులు స్వయం పరిశీలన ఆధారంగా జీవించాలి. దేనినీ గుడ్డిగా నమ్మరాదు.దేనిని అయినా క్షుణ్ణంగా అంటే లోతుగా బాగుగా తెలుసుకున్న తరువాతనే స్వీకరించాలి.ఎవరైతే ప్రకృతి నియమాలను అనుసరించి నడుచుకోకుండా జీవిస్తూ ప్రకృతికి విఘాతం కలిగిస్తారో ,ఎవరైతే నీతిమాలిన చెడు పనులు చేస్తూ ఉంటారో అలాంటి వారికి పతనం తప్పకుండా ఉంటుంది. దాని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని బుద్ధుడు చెప్పారు.చేయాల్సిన తప్పుడు పనులు చేసి దేవుణ్ణి ప్రార్థించడం వలన ఎలాంటి మేలు జరుగదు.మనిషి మనస్సును పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని బుద్ధుడు చెప్పారు.
✍🏽అరియ నాగసేన బోధి
M.A.,M.Phil.,TPT.,LL.B
ధమ్మ ప్రచారకులు & న్యాయవాది
సద్ధమ్మం చిరకాలం వర్థిల్లు గాక !
సర్వజన హితాయ-సర్వజన సుఖాయ.
భవతు సబ్బ మంగలమ్
No comments:
Post a Comment