Tuesday, October 8, 2024

 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
.*..ఇప్పుడు మన యోగ చక్రాల మానసిక పరిణామం:*
1. మూలాధార చక్రము -  అహంకారం

2.స్వాధిష్ఠాన చక్రము - చిత్తం

3.మణిపూరక చక్రము - బుద్ది

4.అనాహత చక్రం - మనస్సు

5.విశుద్ధి చక్రము -   చైతన్యం

6.ఆజ్ఞా చక్రము - పూర్ణ చైతన్యం

7. గుణ చక్రం - పూర్ణ చైతన్యం

8. కర్మచక్రం - పూర్ణ చైతన్యం

9.కాలచక్రం- పూర్ణ చైతన్యం

10. బ్రహ్మ చక్రం- పూర్ణ చైతన్యం

11.సహస్రార చక్రం – శుద్ధ చైతన్యం

12.హృదయ చక్రం- పరిశుద్ధ చైతన్యం

13.బ్రహ్మరంధ్రము- సంపూర్ణ చైతన్యం

...ఇప్పుడు మన యోగ చక్రాల తత్వాలు:

1. మూలాధార చక్రము -   భూమి

2.స్వాధిష్ఠాన చక్రము - జలము

3.మణిపూరక చక్రము - అగ్ని

4.అనాహత చక్రం - వాయువు

5.విశుద్ధి చక్రము - ఆకాశము

6.ఆజ్ఞా చక్రము - పంచభూతాలు

7. గుణ చక్రం -   మనస్సు

8. కర్మచక్రం -  బుద్ది

9.కాలచక్రం- కాలము

10. బ్రహ్మ చక్రం- అహంకారం

11.సహస్రార చక్రం – శబ్ధం

12.హృదయ చక్రం- కాంతి

13.బ్రహ్మరంధ్రము- శూన్యం

...ఇప్పుడు ఈ చక్రాల బీజాక్షరాలు కూడా తెలుసుకోండి.

1. మూలాధార చక్రము - "లం" - 4 దళాలు

2.స్వాధిష్ఠాన చక్రము - "వం" - 6 దళాలు

3.మణిపూరక చక్రము - "రం" - 10 దళాలు

4.అనాహత చక్రం - "యం" - 12 దళాలు

5.విశుద్ధి చక్రము - "హం" - 16 దళాలు

6.ఆజ్ఞా చక్రము - "ఓం" - 2 దళాలు

7. గుణ చక్రం - "మః" -3 దళాలు

8. కర్మచక్రం -  "న" - 3 దళాలు

9.కాలచక్రం-  "శి" -3 దళాలు

10. బ్రహ్మ చక్రం- "వా"- 2 దళాలు

11.సహస్రార చక్రం - "య"- 1000 దళాలు

12.హృదయ చక్రం- "తుం'- 4 దళాలు

13.బ్రహ్మరంధ్రము -  నిశ్శబ్ద నాదం - శూన్యం

...ఇప్పుడు మీరు క్రింద చూపిన దైవాలలో ఎవరో ఒకరిని మనస్ఫూర్తిగా ఎన్నుకొని మార్చకుండా ఒకే రూపంతో ఒకే నామంతో ఆయనను ఆరాధించి వలసి ఉంటుంది. మన యోగ సాధనలో వీరే తారసపడే దైవాలు. కాబట్టి వారిని ముందు నుంచి మచ్చిక చేసుకుంటే మన సాధన పరిసమాప్తి చేయడానికి సహాయ పడతారు. 

వారే
1. మహాగణపతి -మూలాధార చక్ర దైవం

2. లక్ష్మీనారాయణులు- స్వాధిష్టాన చక్రం దైవము

3.మహావిష్ణువు/పాండురంగడు/బాల అమ్మవారు/మీ ఇష్టదైవము- మణిపూరక చక్రం దైవం

4.శివశక్తి (మహాకాలుడు/మహాకాళిక)- అనాహత చక్రం దైవం

5. గాయత్రి/సరస్వతి- విశుద్ధి చక్రము దైవము

6.అర్ధనారీశ్వర తత్వం (శివ కేశవ/శివ పార్వతి) ఆజ్ఞా చక్రం దైవం

7. శ్రీదత్తుడు - గుణ చక్రము దైవము

8. శ్రీరాముడు - కర్మ చక్రం దైవము

9. కాలభైరవుడు - కాలచక్ర దైవము

10. మహా బ్రహ్మ/ఏకపాదుడు-  బ్రహ్మ చక్ర దైవము

11. మహాశివుడు - సహస్రార చక్ర దైవము, హనుమాన్ జీవనాడి మార్గం దైవం

12.ఇష్ట లింగము/అనంతపద్మనాభుడు/ఇష్టకామేశ్వరుడు/ఇష్టకామేశ్వరి-  హృదయ చక్రం దైవం, ఉగ్రనరసింహస్వామి-బ్రహ్మనాడి దైవం

13. ఆది పరాశక్తి/దీప దుర్గ,దీప కాళిక,దీప చంఢి - బ్రహ్మ రంధ్రం దైవము
బ్రహ్మ విష్ణువు శివుడు - త్రిగ్రంధుల దైవాలు
ఈ పైన చెప్పిన 13 దైవాలు మనకున్న 13 యోగ చక్రాలు దేవతలు కాబట్టి వీరిలో ఒకరిని మనస్ఫూర్తిగా బాగా ఆసక్తి, అనురక్తి, మధుర భక్తితో మనల్ని కదిల్చే వారిని మీ ఇష్టదైవంగా ఎంచుకొని  సాధన కొనసాగించండి.

ఇక  ఈ యోగ చక్రాలలో వచ్చే యోగ మాయలను కూడా ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడండి.

1. మూలాధార చక్రము - కామ మాయ

2.స్వాధిష్ఠాన చక్రము - ధన మాయ

3.మణిపూరక చక్రము - ఇష్ట దేవత మాయ

4.అనాహత చక్రం - చావు/మరణ భయం మాయ

5.విశుద్ధి చక్రము - జ్ఞాన మాయ

6.ఆజ్ఞా చక్రము - జీవమాయ, అహంకారము

7. గుణ చక్రం - త్రిగుణాల మాయ

8. కర్మచక్రం - కర్మ మాయ

9.కాలచక్రం- అకాల మృత్యు భయం మాయ

10. బ్రహ్మ చక్రం-  బ్రహ్మ జ్ఞాన అహంకారం మాయ

11.సహస్రార చక్రం - సర్వ సిద్ధుల మాయ

12.హృదయ చక్రం- ఇష్ట కోరిక మాయా,స్పందన మాయ

13.బ్రహ్మరంధ్రము - మహా మృత్యువు భయము మాయ, సహన శక్తి మాయ

త్రి గ్రంధులు -త్రిమూర్తి మాయలు

హృదయ గ్రంధి - బాలా త్రిపుర సుందరి మాయలు

ఈ విధంగా మనకుండే యోగ చక్రాలలో మరియు ఈ పైన చెప్పిన యోగ మాయాలు ఉంటాయి.
ఈ 13 యోగ చక్రాలలో ఉండే యోగ శక్తులు ముందుగానే తెలుసుకుంటే వాటిని దాట గలిగే స్థాయికి మన మనోస్థాయి మీ సాధన స్థాయి ఉంటుంది. 

అది
1. మూలాధార చక్రము - భూచర సిద్ధి

2.స్వాధిష్ఠాన చక్రము - అనుర్మిమ తత్వం సిద్ధి

3.మణిపూరక చక్రము - దూరశ్రవణం సిద్ధి

4.అనాహత చక్రం - దూరదృష్టి సిద్ధి

5.విశుద్ధి చక్రము - మనో జపంసిద్ధి

6.ఆజ్ఞా చక్రము - దివ్య దృష్టి సిద్ధి

7. గుణ చక్రం - కామరూప సిద్ధి

8. కర్మచక్రం -  అపరాజయం సిద్ధి

9.కాలచక్రం-  సహక్రుత్ సిద్ధి

10. బ్రహ్మ చక్రం- అద్వంద్వం సిద్ధి

11.సహస్రార చక్రం - అష్టసిద్ధులు సిద్ధి

12.హృదయ చక్రం- యధా సంకల్ప సిద్ధి

13.బ్రహ్మరంధ్రము -  స్వచ్ఛంద మరణ సిద్ధి

... రుద్రగ్రంధి - పంచభూతాలు అదుపులో ఉండటం సిద్ధి,

... విష్ణు గ్రంధి -ప్రాకామ్యశ్చ సిద్ధి,

... బ్రహ్మ గ్రంధి-  పర చిత్తాది అభిజ్ఞత సిద్ధి,

... హృదయ గ్రంధి- ఆజ్ఞా ప్రతిహత గతి సిద్ధి

ఈ విధంగా మీరు 13  యోగ చక్రాల జాగృతి , శుద్ధి,ఆధీనం,విభేదనం స్థితిలు గురించి అలాగే ఈ చక్రాల దేవతల గురించి ఈ చక్రాల యోగమాయలు గూర్చి ఈ చక్రాల యోగ శక్తుల గురించి తెలుసుకున్నారు కదా ! అలాగే ఈ 13 యోగ చక్రాల లోని దైవ అనుగ్రహం పొందుటకు అలాగే వాటి యోగ మాయాలను దాటించుటకు పఠించవల్సిన స్తోత్రాలు తెలుసుకోండి. కానీ సిద్ధ మార్గంలో ప్రయాణించే వారికి వీటి అవసరం ఉండదు. కానీ మిగిలిన యోగ మార్గాలు ప్రయాణించే వారికి వీటి అవసరం పడే అవకాశాలున్నాయి. అనగా కర్మ, భక్తి,,జ్ఞాన, ధ్యాన  ఇలా ఈ మున్నగు మార్గాలలో ప్రయాణించే వారికి ఈ స్తోత్ర పఠనము యోగ మాయాలను దాటిస్తాయని వివిధ యోగులు అనుభవాల ద్వారా తెలుసుకొని వాటిని సేకరించి ఒక వరుస క్రమంలో చేర్చడం జరిగింది. అవి
ఇప్పుడు మన యోగ చక్రాల కోసం పఠించవలసిన స్తోత్రాలు:

1. మూలాధార చక్రము - మహాగణపతి స్తోత్రాలు

2.స్వాధిష్ఠాన చక్రము - లక్ష్మీనారాయణుల స్తోత్రాలు

3.మణిపూరక చక్రము - మహావిష్ణువు స్తోత్రాలు/పాండురంగడు స్తోత్రాలు

4.అనాహత చక్రం - శివశక్తి స్తోత్రాలు,శివ స్తోత్రాలు పార్వతి స్తోత్రాలు

5.విశుద్ధి చక్రము - గాయత్రి/సరస్వతి స్తోత్రాలు

6.ఆజ్ఞా చక్రము - గురు స్తోత్రాలు,షిరిడి సాయి బాబా, దత్త స్వామి, గురు రాఘవేంద్ర స్తోత్రాలు

7. గుణ చక్రం - శ్రీదత్తుడు స్తోత్రాలు

8. కర్మచక్రం -  సీతారామ స్తోత్రాలు

9.కాలచక్రం-  కాలభైరవుడు/కాలభైరవి స్తోత్రాలు

10. బ్రహ్మ చక్రం- గాయత్రి/సరస్వతి/సావిత్రి స్తోత్రాలు

11.సహస్రార చక్రం - మహాశివుడు/శ్రీకృష్ణ/ మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు

12.హృదయ చక్రం- ఇష్ట లింగము/అనంతపద్మనాభుడు/ఇష్టకామేశ్వరుడు/ఇష్టకామేశ్వరి/హనుమ స్తోత్రాలు,అర్గళా స్తోత్రం

13.బ్రహ్మరంధ్రము -  ఆది పరాశక్తి కవచ స్తోత్రం - దీప దుర్గా కవచ స్తోత్రం - దీప కాళికా కవచ స్తోత్రం - దీప ఛంఢి కవచ స్తోత్రం
త్రి గ్రంధులు -బాలా త్రిపుర సుందరి స్తోత్రాలు
మనము ఏఏ చక్రాల్లో ఉన్నామో ఆయా చక్రాలు కొన్ని సూచనలు ఇస్తాయి. తద్వారా ఆ చక్రాలు జాగృతి అయినట్లు భావించుకోవాలి.

 అవేమిటంటే:
1. మూలాధార చక్రము - మన దగ్గర లేని పదార్థాల వాసనలు రావడం, రతిక్రీడ దృశ్యాలు

2.స్వాధిష్ఠాన చక్రము – ఇష్టపదార్ధాల రుచులు గుర్తుకి రావడం, గుప్తనిధుల దృశ్యాలు

3.మణిపూరక చక్రము - అన్ని రకాల ప్రమాదాలు కనిపించటం

4.అనాహత చక్రం -   ప్రమాదాలు జరిగే ప్రాంతాలు తరచుగా కనిపించడం

5.విశుద్ధి చక్రము -  వివిధ రకాల శబ్దాలు వినబడటం

6.ఆజ్ఞా చక్రము -  ఓంకార నాదం వినబడటం

7. గుణ చక్రం -  త్రిగుణాలు హెచ్చుతగ్గులు రావడం

8. కర్మచక్రం -  వివిధ రకాల ఆయుధాలు కనబడటం.  త్రిశూలం, ఖడ్గం ,రామ బాణం, చక్రం ,బ్రహ్మదండం సందర్శనం

9.కాలచక్రం-  ప్రేత ఆత్మ దర్శనాలు, త్రికాల జ్ఞానం

10. బ్రహ్మ చక్రం-దశ మహా విద్య దేవతల దర్శనం

11.సహస్రార చక్రం -  కర్పూరం సుగంధ పరిమళాలు వాసనలు రావటం

12.హృదయ చక్రం-  హనుమాన్/అనంత పద్మనాభుని దర్శనాలు, ఇష్టలింగం రావటం

13.బ్రహ్మరంధ్రము - కపాలం దర్శనాలు
త్రి గ్రంధులు -త్రిమూర్తులు దర్శనాలు
అలాగే మనము ఏఏ చక్రాల శుద్ధిలో ఉన్నామో తెలియాలంటే ఈ రకమైన అనుభవాలు కలుగుతాయి.

1. మూలాధార చక్రము -  మనకు సంబంధం లేకుండా కామ విషయాలలో ఇరుక్కోవటం, శరీరం తేలికగా  గాలిలో ఎగరడం,శవ ఆసనాలు
2.స్వాధిష్ఠాన చక్రము -వాంతులవడం, ధన సంబంధ విషయాల్లో ఇరుక్కోవటం, నీళ్ల విరోచనాలు అవ్వడం
3.మణిపూరక చక్రము -  విపరీతమైన వేడి బొడ్డు ప్రాంతంలో నొప్పి, అన్ని రకాల ప్రమాదాలు కనిపించటం
4.అనాహత చక్రం - విపరీతమైన ధ్యానం చేయడం, జపాలు పూజలు చేయాలని అనిపించటం
5.విశుద్ధి చక్రము -  చెవిలో సముద్ర హోరు,గాలి హోరు, నీటి సవ్వడి, నీటి అలల శబ్దాలు వినిపించడం, ఏదో చేయాలని తీవ్రమైన జ్ఞాన సంబంధ వాంఛలు కలగడం
6.ఆజ్ఞా చక్రము - కనుబొమ్మల మధ్య కోడిగుడ్డు ఆకారంలో శ్వేత జ్యోతి దర్శనం
7. గుణ చక్రం -   ఇదః శరీరం పరోపకారార్ధం ఇతరుల కోసం దీనుల కోసం ఏదైనా చేయాలని బలంగా అనిపించడం
8. కర్మచక్రం -  ధర్మం పాటించాలి అని అనిపించటం, సత్ప్రవర్తన కలిగి ఉండటం
9.కాలచక్రం-   చావు మరణ, మృత్యు భయాలు భయపడటం, ప్రేతఆత్మ దర్శనాలు పొందుట
10. బ్రహ్మ చక్రం- వివిధ రకాల తత్వం, ఆత్మ, బ్రహ్మ జ్ఞానం కోసం పరితపించడం భూమండలం వివిధ లోకాల దర్శనం
11.సహస్రార చక్రం - మలము నుండి కర్పూర వాసన, శరీరం నుండి సుగంధ పరిమళం వాసన
12.హృదయ చక్రం-   ఏకైక ఇష్ట కోరిక ఏమిటో తెలియటం, ఏకైక కోరిక జిజ్ఞాస
13.బ్రహ్మరంధ్రము - మహా మృత్యు దర్శన జిజ్ఞాసలు కలగడం
త్రి గ్రంధులు - ఆయా లోకాలు దర్శనం అనగా శివ విష్ణు బ్రహ్మ లోకాల దర్శనం
అలాగే మనము ఏఏ చక్రాల ఆధీనంలో ఉన్నామో తెలియాలంటే ఈ రకమైన స్థితులు కలుగుతాయి.
1. మూలాధార చక్రము -  గాలిలో ఒక అడుగు ఎత్తులో ఎగరటం

2.స్వాధిష్ఠాన చక్రము - నీటిమీద తేలియాడటం

3.మణిపూరక చక్రము - అగ్ని ప్రమాదాలు జరిగిన ఏమీ కాకపోవడం

4.అనాహత చక్రం - వాయు ప్రమాదాలు జరగకపోవడము

5.విశుద్ధి చక్రము -  ఆకాశంలో ఎగరటం.           *(మరికొంత జ్ఞానాన్ని రేపటి సంచికలో సముపార్జించుకుందాం)*. 

No comments:

Post a Comment