Wednesday, October 2, 2024

 💥💥🔥🔥#లాల్_బహదూర్_శాస్త్రి...💐

మనలో  చాలామందికి తెలియని పేరు,  నక్కల్లాంటి, మేకవన్నెపులుల్లాంటి  కొందరు నాయకులు చేసుకునే  ప్రచారాలను మాత్రమే నిజమనీ,  అదే చరిత్ర అని నమ్మే గొర్రెల్లాంటి ప్రజలు మరచిపోయిన పేరు, చరిత్రకారులు సైతం నిర్లక్ష్యం చేసిన పేరు,  తన జీవితాన్ని దేశం కోసం అర్పించిన ఒక  నిజమైన దేశభక్తుడి పేరు,  ప్రధానిగా పని చేసి కూడా కనీసం స్వంత ఇల్లు కూడా ఏర్పరుచుకోలేని నిజాయితీపరుడి పేరు,  నిస్వార్ధ ప్రజా నాయకుడి పేరు, పాకిస్తాన్ ను గడగడలాడించి వెన్నులోంచి వణుకు పుట్టించిన పేరు, యుద్దరంగంలో  పాకిస్తాన్ కు చెమటలు పట్టించి ప్రాణభయంతో పరుగులు పెట్టించి భారతదేశపు సత్తా చాటిన భారత ప్రధాని పేరు, తన తెగువతో ధైర్యంతో  పాకిస్తాన్ ను  పాదాక్రాంతం చేసుకుని తన ధీరత్వాన్నీ వీరత్వాన్నీ చాటిన  భారతనాయకుడి పేరు. పబ్లిసిటీ లేని నాయకుడు కాబట్టి  మనమంతా మరచిపోయిన పేరు.  
సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ ప్రధానీ, దేశం గర్వించదగ్గ నాయకుడు, జై జవాన్ జై కిసాన్ అంటూ నిస్వార్ధంగా నిరాడంబరంగా ప్రజాసేవలో తరించిన ఆదర్శప్రాయుడు, ప్రపంచదేశాల ముందు  దేశగౌరవాన్ని నిలిపి,  దేశం జీవించి దేశం  కోసమే మరణించిన  భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి  జయంతి నేడు (2/10/1904)
అసలు లాల్ బహదూర్ శాస్త్రి చరిత్ర ఎంతమందికి తెలుసు ? ఆయనది  సహజ మరణం కాదనీ ఆయన  పొరుగు దేశానికి వెళ్ళి అక్కడ  విషప్రయోగానికి గురై చనిపోయాడని ఎంతమందికి తెలుసు ?  తమ ఉనికిని కోల్పోతామనే భయంతో  పాకిస్తాన్, సోవియట్ యూనియన్ లు చేసిన కుట్రకు బలైపోయాడని ఎంతమందికి తెలుసు?  శక్తివంతమైన నేతగా ఎదుగుతున్న లాల్ బహదూర్ శాస్త్రిని  స్వంత పార్టీ  (కాంగ్రేస్)  నాయకులే అడ్డుతొలగించుకోవాలని చూసారనీ,  ఆయన మరణానికి సంతోషించి ఇతర దేశాలతో కుమ్మక్కై ఆయన మరణ రహస్యాన్ని బయటకు పొక్కకుండా కాపు కాసారని ఎంతమందికి తెలుసు ? ఆయన శవానికి కనీసం పోస్ట్ మార్టం కూడా జరగలేదని మీకు తెలుసా? ఆరోజు  ఆయనతో ఉన్న వారంతా తరువాత  హత్య చేయబడ్డారని, హత్యా ప్రయత్నాలకు గురయ్యారని  మీకు తెలుసా ? అప్పటి మన ప్రభుత్వం లాల్  బహదూర్ శాస్త్రి  మరణానికి ఏమాత్రం  స్పందించలేదనీ,  ఆయన హత్య చేయబడ్డారన్న ఆరోపణలను కొట్టి పారేసాయనీ, ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బ తింటాయనీ, కొందరి కుట్రలు బయటికొస్తాయనే  కారణంతో మన ప్రభుత్వం  కనీస విచారణ కూడా చేయలేదనీ మీకు తెలుసా ? దటీజ్ ఇండియన్ గవర్నమెంట్, దటీజ్ కాంగ్రేస్  గవర్నమెంట్.  
లాల్ బహదూర్ శాస్త్రి దరిద్రం  ఏంటంటే....
" మహాత్ముడిలా' నటిస్తూ  కోట్ల రూపాయుల బంగారాన్ని డబ్బునీ ప్రజల నుంచి విరాళాలు గా తీసుకుని రహస్యంగా  దాచుకోకపోవడం, పైకి శాంతి వచనాలు భోదిస్తూ  విదేశాలతో రహస్య ఒప్పందాలు చేసుకోకపోవడం , కొందరు నాయకులకు విధేయుడిగా ఉండకపోవడం, తన కోసం తన ప్రచారం కోసం  ఎటువంటి వ్యక్తులను, సంస్ధలనూ ఆశ్రయించకపోవడం, చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దొమ్మరి గుడెసెలు  అన్నట్టు నటించిన కొందరు పెద్దమనుష్యుల్లాగా  ప్రజల ముందు బిల్డప్ లు ఇస్తూ నటించలేకపోవడం, ప్రజలకు తెలియని చీకటి జీవితాలు గడుపుతూ గుడిసేటి పనులు చేసి ఎంజాయ్ చేయడం,  కొంతమంది నాయకుల్లాగా గొప్పగా  ప్రచారం చేసుకోకపోవడం, గ్రూపులు మెయింటైన్ చేయకపోవడం, నిస్వార్ధంగా నిజాయితీగా  ఉండడం , అన్నిటికీమించి అక్టోబర్ 2 న పుట్టడం."
 ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను.  జైహింద్..

No comments:

Post a Comment