🙏🏻 *రమణోదయం* 🙏🏻
*"ఉన్నాను" అనే సహజ రూపమాత్రంగా తోచు జ్ఞానమే హృదయం. ఇతరములను తెలుసుకొనే వృత్తులు లేని ఈ హృదయానికే సత్యం తనంతట గోచరిస్తుంది. కనుక ఆ హృదయాన్ని (అంటే తనను) ఆశ్రయించియుండు ఆత్మనిష్ఠయే స్వయం ప్రకాశకమయిన ఆత్మజ్ఞానము.*
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.435)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*||
🪷🙏🏻🪷🙏🏻🪷
పువ్వులో మకరందం ఉంటే
భ్రమరం దానికదే వచ్చి ఆస్వాదిస్తుంది.
మనలో ఆర్తి ఉంటే
ఆత్మ దానికదే వచ్చి ఆవహిస్తుంది!
🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻
No comments:
Post a Comment