గెలుపు కోసం 🌱
🌱🌱ఒక చిన్న కథ .... అన్వేషణ 🌱🌱
🌱సమీపంలో ఏదో భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి ...
నేను ప్రతిరోజూ సాయంత్రం వాకింగ్ చేస్తూ అక్కడ కాసేపు కూర్చుంటాను.🌱
🌱చాలామంది పేద కార్మికులు అక్కడ తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని నివసిస్తూ పనిచేస్తుంటారు. వారి పిల్లలు ఒకరి చొక్కా మరొకరు పట్టుకొని "రైలు బండి రైలు" అనే ఆట ఆడుతుంటారు.🌱
🌱ఎవరైనా ఒకరు ఇంజిన్ అవుతారు మిగిలినవారు బోగీలు అవుతారు ..🌱
🌱ప్రతిరోజూ ఈ పిల్లలు మలుపులు తిరుగుతూ కేరింతలు కొడుతూ ఆడుతూవుండే ఈ ఆటను చూడడం నాకు ఇష్టమైన దినచర్యగా మారిపోయింది ...🌱
🌱చాలా రోజులుగా వాళ్ళ ఆటను గమనిస్తున్నాను.ఇంజన్ గా ఉన్న పిల్లవాడు మరోరోజు బోగీగా.. బోగీగా ఉన్న పిల్లలు ఇంజన్ గా ఇలా మారుతూనే ఉన్నారు.🌱
🌱కానీ, ఒక చిన్న బాలుడు,సగం నిక్కరు మాత్రమే ధరించి తన చేతిలో ఒక చిన్న ఆకుపచ్చ వస్త్రాన్ని పట్టుకుని రోజువారీ గార్డుగానే ఉంటున్నాడు ...🌱
🌱🌱ఒకసారి నేను వెళ్ళి అడిగాను ...🌱🌱
🌱"బాబూ ! నువ్వు కూడా ఒక ఇంజిన్ లేదా బోగీగా మారి అడుకోవచ్చు కదా! ఎప్పుడూ గార్డ్ గానే ఎందుకుంటున్నావు ? ...🌱
🌱అతను మృదువుగా ప్రత్యుత్తరం ఇచ్చాడు ...🌱
🌱🌱"సర్, నాకు ధరించడానికి ఒక చొక్కా లేదు, కాబట్టి ఇతర పిల్లలు నన్ను పట్టుకుని రైలును ఎలా తయారుచేస్తారు?🌱🌱
🌱ఆ మాటలు చెబుతున్నప్పుడు
నేను అతని కళ్ళలో కొంచెం తేమ గమనించాను..🌱
🌱🌱నేను అతనితో మరి కాసేపు మాట్లాడిన తర్వాత జీవితానికి సంబంధించిన ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాను....!🌱🌱
🌱అతను చొక్కా కోసం ఇంట్లో అడిగాడు,అరిచాడు,అలిగాడు, ఎంతగా ప్రయత్నించాలో అంతగా ప్రయత్నించాడు.కానీ, ఇంట్లో ఆరోగ్య పరమైన మరో అత్యవసర ఖర్చులుండడం వల్ల అతని తల్లిదండ్రులు అతనికి చొక్కాని కొనుగోలు చేయలేకపోయారు...🌱
🌱🌱కానీ,ఆ పిల్లవాడు తన ప్రయత్నం విఫలమైనందుకు నిరాశ చెందలేదు. బదులుగా అతను తనను తాను ఆస్వాదించడానికి ఆనందంగా ఉండడానికి మరొక మార్గం ఎంచుకున్నాడు...!🌱🌱
🌱🌱జీవితంలో మనం కోరుకున్న అన్ని విషయాలను పొందలేము...🌱🌱
🌱🌱నాకు బైక్ లేదు, నాకు కారు లేదు, నాకు ఇల్లు లేదు..ఇలా రకరకాలుగా అసంతృప్తిని అనుభవిస్తుంటాము...లేనిదాని గురించి ఆలోచిస్తూ ఆస్వాదించడాన్నీ - ఆనందంగా ఉండడాన్ని మరిచిపోతుంటాము.🌱🌱
🌱🌱జీవితంలో జీవం లేకుండా బ్రతుకుతుంటాము ....!🌱
🌱🌱ఆ పిల్లవాడితో సంభాషించిన తర్వాత నేను నేర్చుకున్న పాఠం ఇది.🌱🌱
🌱మన కోరికలు నెరవేరడం కోసం పూర్తి ప్రయత్నం చెయ్యాలి. మన కోరికలు నెరవేరవచ్చు! నెరవేరకపోవచ్చు! కానీ అంత వరకు ఉన్నవాటితోనే జీవితాన్ని
ఆస్వాదించే మార్గాలను అన్వేషించాలి.🌱
🌱🌱మన లక్ష్యం ఆస్వాదించడం - ఆనందంగా ఉండడమే. అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ ఉన్న అసలు లక్ష్యాన్ని కోల్పోకూడదు.....🌱🌱
🌱సదా అందరి మంచి కోరే మీ🌱
🌱స్కై ఫౌండేషన్ 🌱
🌱 9493613555 🌱
No comments:
Post a Comment