భగవన్నామస్మరణం.....
భగవన్నామం సోకితే సంసారమనే చీకటి వెంటనే తొలగుతుంది
భగవన్నామ శ్రవణం భగవంతుణ్ణి ద్వేశించేవారికే ఎంతో క్షేమమంటే ఇక భగవంతుణ్ణి ప్రేమించేవారికి చెప్పన్నకర లేదు, కనుక మాకు భగవంతుని చేష్టితములను వివరించమని సూతుణ్ణి ఋషిగణం అంతా అడిగారు.
ఆపన్నః సంసృతిమ్ ఘోరాం యన్నామ వివసో గృనన్ |
తతసత్యో విముచ్యేత యద్భిబేతిస్వయంభవః ||
భగవంతుని నామం ఎంత గొప్పదంటే "యన్నామ వివసో గృనన్", తెలిసినా తెలియకనున్నా ఒక సారి నోరార కీర్థిస్తే చాలు. ఎక్కడ ? పరమపదంలో కాదు ఇతరత్ర లోకాల్లో కాదు. "ఆపన్నః సంసృతిమ్ ఘోరాం" సంసృతిమ్ అంటే పుట్టుట గిట్టుట ఇది ఒక పెద్ద చక్రం. ప్రతి వస్తువు ఒక రూపాన్ని సంతరించుకుంటుంది, పెరుగుతుంది, క్షీణిస్తుంది, ఇలా నశించి రూపం మారిపోతూ ఉంటుంది. వస్తువులన్నీ కనిపించని దష నుంది కనిపించే దషవరకు వచ్చి రకరకాల మార్పులు చెందుతూ కనిపించని దషలోకే చేరిపోతూ ఉంటాయి. ఇది ఒక చక్రం. ఈ నాడు ఒక చెట్టును చూస్తున్నాం అంటే అది మొదట గింజ, ఏయే వస్తువులనైతే తనలో చేర్చుకొని ఇంత పెద్ద వృక్షంలా మారిందో తిరిగి అన్నింటిని వాటిల్లో చేర్చి మరో రూపం తీసుకుంటుంది. ఇది ప్రతి వస్తువులో సతతం సాగుతూనే ఉంటుంది. దీనికి సంసృతి చక్రం అని పేరు. ఇందులో పడి తిరుగుతున్న వాళ్ళం మనం. ఇది మొదటి జన్మ కాదు, ఇది వరకు ఎన్ని జన్మలో తెలియదు, కొన్ని కోట్ల యుగాలుగా సాగుతూనే ఉంది.
ఎంతకాలం తిరుగుతున్నామో కానీ ఈ నాడు అది గుర్తించే మానవ జన్మలోకి వచ్చాం. తెలుసుకుంటే మళ్ళీ ఈ చక్రంలో పడాల్సిన అవసరం లేదు. ఇంతవరకు ఎట్లా వచ్చామో మన చేతుల్లో లేదు కానీ ఇకనుండి ఎట్లా ఉండాలో అది మన చేతుల్లో ఉంది. ఇదీ రహస్యం. మరి జరగాల్సింది కూడా నిర్ణయించబడి ఉంటుంది అంటారు, ఇక మనం చేసేదేముంటుంది అంటుంటారు. జరగాల్సిందేదో నిర్ణయించబడే ఉన్నా దాన్ని నీవు మార్చుకోవచ్చు. నది ప్రవాహం ప్రారంభించి ఎక్కడ చేరుతుంది ?
"నదీనామ్ సాగరో గతిః" సముద్రాన్ని చేరుతుంది. అయితే మధ్యలో ఉన్న గతిని మనం అనుకూల పరచుకోవడం లేదా. మధ్యలో మనం ఆనకట్ట కట్టి వ్యర్థంగా పోయే నీటి గతిని మార్చి వాడుకుంటుంన్నాం. తిరిగి ఆ నీరు ఎలాగో ఒకలా తిరిగి సముద్రంలోనే చేరుతుంది. మధ్యలో ఎంత లాభం జరుగుతుంది. ఇది నీ చేతుల్లో పనే. అట్లానే మనిషి జీవనం ఎక్కడికి చేరాలో అది తప్పదు, కానీ ఆ చేరే మధ్యలో మనం మార్చుకోవచ్చు. పరమాత్మ దివ్య సన్నిధికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ సంసృతి చక్రం నుండి బయట పడేసే శక్తి భగవంతుని నామానికి ఉంది.
ఎట్లా ? భగవంతుని నామం వల్ల "తతసత్యో విముచ్యేత" గతంలో చేసుకున్న పాపాల గుట్టలైతే ఏవి ఉన్నాయో "విముచ్యేత" వదిలేస్తాయి. భగవంతుని నామ స్మరణ అనేది చీకటి గదిలో దీపం పెట్టడం లాంటిది. చీకటి ఎలాగైతే తొలగిపోతుందో, భగవన్నామ స్మరణ అనేది ఎలాంటి కర్మ వాసనలైనా తుడుచుకొని పోతాయి. స్వామి 9వ అధ్యాయంలో చెప్పినట్లుగా "అపిచేత సుదురాచార భజతేవా అనన్యబాత్ సాదురేవ" వాడు చేయకూడనివి ఎన్ని చేసినా ఇక నుండి నన్ను తలిస్తే వాడిని సాదువు అనేట్టు నేను చేసుకుంటా, లోకం వాణ్ణి ఆదరించేట్టు చేస్తా అని స్వామి చేసిన వాగ్దానం. ఎంత సమయం పడుతుంది ? "తతసత్యో విముచ్యేత" వెంటనే పాపాలనుండి విడువ బడుతారు. అది ఎట్లా సాధ్యం ? "యద్భిబేతిస్వయంభవః" భవః అంటే సంసారం. "యత్-భిబేతి" శిక్షింపబడేవాడు కొరడాను చూసి భయపడి పనిచేస్తున్నట్లే, పరమాత్మ సంకల్ప మాత్రం చేత ఈ లోకంలో ప్రతి వస్తువూ పనిచేస్తుంది. అట్లా ఈ సంసారానికి పరమాత్మంటే భయం. అలాంటి పరమాత్మ గురించి వినాలని వచ్చాం అని ఋషులంతా సూతుణ్ణి ప్రార్థించారు.
No comments:
Post a Comment