*పెద్ద వారి చేయి ఎల్లప్పుడూ*
*పైనే ఉండే విధంగా చూసుకోండి*
(నేటి శనివారం స్పెషల్ స్టోరీ)
*"మొన్నామధ్య మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మా ఫ్రెండ్ దంపతులు చాలా హడావుడిగా వున్నారు."*
*"ఏంటి ఏదో పండుగ వాతావరణం కనిపిస్తోంది...ఏంటి విశేషం" అడిగాను.*
*"మా అమ్మాయి సుధ తెల్సుగా! సుధకు దానికి మంచి ఉద్యోగం వచ్చింది. ఇవాళ అది మొదటి నెల జీతం అందుకునే రోజు. అందుకని...దిష్టి తీయడం.. స్వీట్ తినిపించడం.” అంటూ చాలా ఉద్వేగంగా, ఉత్సాహంగా చెప్తుండగానే సుధ వచ్చింది. వరండాలో చీకట్లో వున్న మేము సుధ కి కనిపించము, లోపలికి వెళ్ళిపోయింది.*
*సుధ లోపలికి వెళ్ళగానే నా స్నేహితుడి ముఖంలోకి చూశాను...వెలిగి పోతోంది.*
*క్షణం తర్వాత లోపలి నుంచి మాటలు వినబడుతున్నాయి…"తొలి జీతం కదా నాన్న గారికి ఇవ్వమ్మా!"*
*"ఇవ్వను" తెగేసి చెప్పినట్టు సుధ గొంతు వినబడింది.*
*అప్రయత్నంగా మా ఫ్రెండ్ ముఖం వంక చూశాను. ఫ్యూజ్ పోయిన బల్బ్ లా మాడిపోయి వుంది. నేను అక్కడ వుండడం సబబు కాదనిపించి లేవబోయాను.*
*నా చెయ్యి పట్టుకుని కూర్చోమన్నట్టు లాగాడు. వాడి చెయ్యి సన్నగా వణుకుతోంది.*
*"తప్పే..! అలా అనకూడదు.. నీ సంతోషం చూడాలని నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నారు నాన్నగారు. వెళ్ళు.....వెళ్ళి జీతం ఇచ్చిరా పో....!"*
*"ఏంటమ్మా..ఒకసారి చెప్తే అర్ధం కాదా.. నేను ఇవ్వను.... ఆ టేబుల్ మీద పెడతా....వచ్చి తీసుకోమను......."*
*ఈ సంభాషణ వింటున్న మా వాడు తలొంచుకుని కూర్చున్నాడు. కళ్ళల్లో నీళ్ళు నిలిచాయేమో చీకట్లో నాకు కనబడలేదు.*
*లోపలినుంచి చెంప చెళ్ళుమన్న శబ్దం.*
*"అమ్మా"*
*"ఛీ.....ప్రేమ లేదు కనీసం విశ్వాసం కూడా లేదే నీకు" ఏడుపు దాచుకోలేకపోతోంది తల్లి.*
*"అమ్మా...ఎంతసేపూ...నీ వైపునుండి ఆలోచించడమేనా.....నేనెందుకు ఇవ్వనంటున్నానో అడగవా…..."*
*"చెప్పేడు...."*
*"అమ్మా....చిన్నప్పట్నించీ నాన్న నన్ను ఎంతో గారాబంగా పెంచాడు.. చిన్నప్పటి ఐస్ క్రీమ్ దగ్గర్నించి ఇవాళ పొద్దున్న ఆఫీస్ కి వెళ్ళడానికి ఆటో ఖర్చుల దాకా అన్నీ నాన్నే ఇచ్చేవాడు.*
*అలా ఇచ్చిన ప్రతిసారీ నాన్న చేయి పైన నా చేయి కిందా వుండేది. అలాంటిది ఇప్పుడు తగుదునమ్మా అని జీతం నాన్నకిస్తే నాన్న చేయి కిందా నా చేయి పైనా వుంటుందమ్మా..!*
*అది నాకిష్టం లేదు. నాన్న చేయి ఎప్పుడూ పైనే వుండాలమ్మా. అందుకే ఇవ్వనంటున్నానమ్మా" అంటూ భోరుమని ఏడ్చింది సుధ.*
*అది విన్న మా ఫ్రెండ్ భావోద్వేగంతో "అమ్మా సుధా.....నా తల్లీ" అని పెద్దగా ఏడుస్తూ లోపలికి పరిగెత్తాడు..*
*’వస్తారా!’ అని చెప్పి మనోడి వంక చూశాను.*
*కళ్ళనిండా నీళ్ళు తుడుచుకోవడంతో కూడా మరిచి పోయి చూస్తున్నాడు.*
*"దీని వల్ల నీకేం అర్ధం అయింది. మన కన్నా వయసులో పెద్ద వారికి మన చేయి పైన వుండేలా ఇవ్వకూడదు. దోసిలిలో పట్టుకుని వారిని తీసుకోమనాలి. అంతే కాదు ఆ సర్వలోకాల సృష్టికర్త అయిన భగవంతుని పేరుతో నీవు ఎవరికి ఏమి ఇవ్వాలనుకున్నా మొత్తం నీ శరీరాన్ని, తలను వంచి భగవంతునికి కృతజ్ఞతా పూర్వకంగా ఇవ్వడం నేర్చుకో...*.
No comments:
Post a Comment