Saturday, November 2, 2024

*****మనం భౌతికత్వంలో కూరుకుపోయి ఉన్నప్పుడు ఆధ్యాత్మికత వంటబట్టదు.*

 *మనం భౌతికత్వంలో కూరుకుపోయి ఉన్నప్పుడు ఆధ్యాత్మికత వంటబట్టదు.*

ఏ మానవుడికైతే ఇంద్రియాలు బాహ్యంగా వర్తిస్తూ ఉంటాయో, అతడు బద్దుడై నిలుస్తాడు. 

బాహ్య విషయాల వైపుకి పరుగులు పెట్టడం అంటే ఎండమావుల వెనుకబడటం వంటిదే. అంతకు మించిన దారిద్య్రం మరొకటి ఉండబోదు.

అందుకే తెలివైనవారు బాహ్య పరిస్థితుల్లో ప్రతికూలతలు ఏర్పడినప్పుడు అంతర్ముఖులై ఉండే ప్రయత్నాన్ని చేస్తారు. ఎటువంటి ప్రతికూలతలు ఎదురైనా చలించక దృఢంగా నిలుస్తారు. 

అదే సామాన్య వ్యక్తి అయితే బాహ్య విషయాలలో తగుల్కొని ఉన్నప్పుడు ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటే, వాటిని ప్రతిఘటించైనా సరే అందులోనే ఉండాలనే సంకల్పంతో ఉంటాడు. వాటిలో సుఖం లేదనే జ్ఞానం అతనికి కలుగదు.
అలాగే,
 *భగవంతుని సృష్టిలో ప్రతి మనిషి లోకసేవకుడే.    ప్రతివాడు దైవముచే ఎన్నుకోబడినవాడే!    కానీ మనమే ప్రాపంచిక విషయాల పట్ల ఆకర్షితులమై భగవంతుడు మనకు అప్పగించిన పనిని మరచిపోతున్నాము.*

*భగవంతుడు మనకు అప్పగించిన కర్తవ్యం పట్ల మనం చాలా శ్రద్ధగా ఉంటూ మన కర్తవ్య కర్మలను ఏమాత్రం అశ్రద్ధ లేకుండా నిర్వర్తించాలి. లోకమును సేవిస్తూ లోకేశ్వరుని సేవిస్తుండాలి.   మనం భగవంతుని ఆశీస్సులను పొందదలచినపుడు ఆయన సూచించిన ప్రతి చిన్నమాట మన హృదయంలో హత్తుకుపోవాలి. దానికి అనుగుణంగా మనం వర్తించాలి. ఆయన సంకల్పం పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండాలి.   మన సమస్యల గురించి మనకంటే ఆ భగవంతునికే ఎక్కువగా తెలుసు కాబట్టి, మళ్ళీ మళ్ళీ ఆయనకు చెప్పుకోనక్కరలేదు.   వాటి గురించి దిగులు పడనక్కరలేదు. ఆయనపై భారం వేసి, ప్రార్థిస్తూ మన కర్తవ్య కర్మలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు మన యోగక్షేమాలను తానే చూసుకుంటాడు.*         

No comments:

Post a Comment