Saturday, November 2, 2024

****దానవుడు..* *మానవుడు* *దేవుడు*

 *దానవుడు..*
             *మానవుడు*
                          *దేవుడు*
                   

**మానవునకు రోగం కలిగించేది పాపం*.

*పాపం చెయ్యకూడదు అని తెలిసినా చేస్తాడు మనిషి పాపం.*

**మానవునకు భోగం కలిగించేది పుణ్యం*.

*పుణ్యం చేస్తే మంచిది అని తెలిసినా, పుణ్యం చెయ్యడానికి యిచ్చగించదు మనసు.*

**మానవుని భవిష్యత్తు నిర్ణయించేది *కర్మ*.

*నీ స్వకీయ కర్మను అంకిత భావంతో చేసుకో మంటాడు పరమాత్మ. అలా చేసుకుంటే - నీకు మోక్షం కూడా యిస్తానన్నాడు భగవద్గీత 18-46 శ్లోకం లో.* 
*అయినా మనసు యిచ్చ గించదు.*

**మానవునకు లాభం కలిగించేది సేవ*.

*సర్వ ప్రాణులకు చేసిన సేవ మాధవ సేవే ఔతుంది -అని, పదే పదే చెప్పాడు పరమాత్మ కానీ, అంతా నాకే కావాలంటాడు మనిషి.*

**మానవునకు సంపాదన నిలిపేది పొదుపు*.

*బిందువు + బిందువు కలిస్తేనే సింధువు అయ్యింది అని తెలుసు మనిషికి! కానీ కొంచెం +కొంచెం కూడ బెడితే కొండంత అవుతుంది అని తెలిసినా - ఒకేసారి కొండంత అయిపోవాలంటాడు మనిషి.*
*ఇటుక +ఇటుక పేరిస్తేనే ఇల్లు ఔతుంది. ఓకే రోజు ఇల్లు పూర్తైపోవాలంటాడు మనిషి.*
*విత్తనం పెట్టి, నీరు + ఎరువు వేసి కొన్ని సంవత్సరాలు పెంచితే, చెట్టు ను జాగ్రత్తగా కాపాడితే - బ్రతికి నన్నాళ్ళు ఫలాలు యిస్తుందని తెలిసినా, ఓర్పు వుండదు మనిషికి.*

**మానవుని విలువ పెంచేది దానం*.

*మనకున్న దాంట్లో, మనకన్నా లేని వాళ్లకు దానం చెయ్యాలి. నీవుఒక చేత్తో దానం చేస్తే - నీకు పది చేతుల్తో సహాయం చేస్తాడు దేవుడు.*

*దానం చెయ్యాలి!          మానాన్న నాచేతికిచ్చి, నాచేత్తో దానం చేయించేవాడు.*
*అంటే, నాకు దానగుణం నేర్పాడన్న మాట.*

*దయగల హృదయమే భగవన్నిలయము*

**మానవునకు నష్టం కలిగించేది హింస*.

*’అహింసా పరమోధర్మహః’- అని శాస్త్రం చెప్పినా, మనిషి హింస మానడు. [బోయవాడు కొల్లేరు (నీటి సరస్సు)లో పట్టిన పక్షుల్ని మావూర్లో అమ్మడానికి వచ్చే వాడట. మొత్తం పక్షుల గుట్టను క్రిందికి దింపించి - కట్లు (హరిః ఓమ్, హరిః ఓమ్.) విప్పించే వాడట మాతాత. బేరమాడి, కాళ్ళు + రెక్కలు బాగా వున్న పక్షుల్ని మొత్తంగా కొని పక్షుల్ని వదిలేసే వాడట మాతాత. అది అహింస కు పరాకాష్ట*].  

*తన తొడ నుండి మాంసం కోసి బోయ వాడికి (తాను పట్టుకున్న పావురాయి కి బదులు) యిచ్చిన శిబి చక్రవర్తి ఈ దేశంలో పుట్టిన వాడే గదా! మాతాతకు శిబిచక్రవర్తి ఆదర్శం.*

**మానవునకు అశాంతి కలిగించేది ఆశ*.

*ఉన్నదానితో సంతృప్తి పడటం నేర్చుకోవాలి. ఆశకు మితం ఏముంది?*

**మానవునకు శాంతి కలిగించేది తృప్తి*.

*తినుటకు జీవించువాడు బద్ధుడు, జీవించుటకు తినువాడు ముక్తుడు. _Eat to live, do not live to eat_*

**మానవునకు దుఃఖం కలిగించేది కామం*.

*_Desire is the root cause of all evils. It is an insatiable demand._ కోర్కెలు తీరేవి కావు. కోర్కెల్ని తీర్చలేము.*

**మానవుని పతనం చేసేది అహంకారం*.

*’అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహా’ లను వదిలేస్తే మోక్షం యిస్తానన్నాడు పరమాత్మ  భగవద్గీత లో.*

**మానవునకు అందరిని దగ్గర చేసేది *ప్రేమ*.

_*Serve, Love, Give, Purify, Meditate, Realise._*

**మానవునకు అందరినీ దూరం చేసేది అసూయ*.

*కేవలం అసూయతో దుర్యోధనుడు వంశవినాశనానికి కారకు డౌతాడు.*

**మానవుని స్థితిని సూచించేది గుణం*.

*అన్నింటికీ మూలకారణం గుణమే. మంచి గుణం తయారు చేసుకోవాలి. చెడుగుణాల్ని వదిలి మంచి గుణాల్ని పోగు జేసుకోవాలి. అప్పుడు మనలో దైవత్వం చేరుతుంది.*

**మానవుని దైవంగా మార్చేది "దయ!"*

**మానవుని ఆత్మస్థితి తెలిపేది *వాక్కు*.

*తియ్యగా మాట్లాడటం నేర్చుకోవాలి. ‘అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్’ - అని భగవద్గీత చెప్పింది.* 

*మాగురువు గారి భార్య మాటలలో…  "ప్రభావతి మాట వందనంగా ఉంటుంది అనేది" ( 'ప్రభావతి' -నాభార్య పేరు). అందుకే, నాభార్య గృహిణి గా వుంటూనే : ‘యోగిని, బ్రహ్మజ్ఞాని’ కూడా అయ్యింది.*

**మానవునకు విజయం చేకూర్చేది "ధర్మం"*.

**మానవుని గొప్పవాడిగా చేసేది "తత్వజ్ఞానం"*.


**మానవునకు ముక్తి నిఇచ్చేది "సత్యం"*. 


**మానవుని అన్ని రకాలుగా సంస్కరించేది *"ధ్యానం"*. 
హరిః ఓమ్. హరిః ఓమ్. హరిః ఓమ్.

No comments:

Post a Comment