*మోక్షం ఎలా -పొందాలి?*
భగవంతుడు ప్రతి మనిషికి.... ఈ శరీరం నీదికాదు. ఇది నీ అద్దె ఇల్లు అని మూడు అవకాశాలు ఇస్తాడు.
ఒకటి కళ్ళకి చత్వారం,
రెండు పళ్ళు ఊడగొడతాడు,
మూడు జుట్టు నెరిసిపోతుంది...```
*1. మొదటిది వచ్చినప్పుడు అర్థం చేసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లి కళ్ళజోడు తగిలిస్తాం. తెలుసుకోము ఎందుకు జరిగిందని.*
*2. రెండోది వచ్చినప్పుడు పళ్ళకి టింకరింగ్ వేయిస్తారు, రకరకాల పేస్ట్స్ వాడి ఉన్నవి కూడా ఊడగొట్టుకొని పళ్ళు కట్టించుకుంటారు, అయినా అర్థం కాదు.*
*3. మూడు తలమెరుపు.. జుట్టంతా తెల్లబడి మూడో వార్నింగ్ వచ్చినా సరే.. ఊహు ఈ ఇల్లు నాది. అని రంగులు వేస్తారు. అప్పటికి అర్థంకాదు.*
*4. నాలుగు చివరిది…
యముడు దిగుతాడు రంగంలోకి.. మెడకి తాడు వేసి లాక్కొని వెళుతూ...
”ఒరేయ్ ఈ శరీరం నీదికాదు అని ఎన్ని నోటీసులు పంపినా వినకుండా ‘నాది నాది’ అంటే దాని ఓనర్ ఊరుకుంటాడా! ఇంటికి అద్దె కట్టే యజమాని అంటే భయం ఉంది గాని ఈ శరీరం అద్దెకిచ్చిన యజమాని అంటే భయం లేదు.
తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయకుండా నాది నాది అన్నావ్. ఏది ఇప్పుడు చూపించు నీది అనేది ఏది ఉందో!” అని నరకంలో పడేసి నానాయాతనలు పెట్టి.. “ఒరేయ్ ఈసారైనా తెలుసుకొని మలుచుకో”మని పంపుతాడు…```
సద్గ్రంధాలు చదివి, సద్గురువులని ఆశ్రయించి, సత్సంగాలు చేస్తూ ఆత్మజ్ఞానం పెంచుకొని సాధనలు చేసి ‘జన్మరహిత్యాన్ని’ అంటే ‘మోక్షం’ పొందాలి..!*.
No comments:
Post a Comment