*తిరుమల క్షేత్రచరిత్ర*
*శాసనముల ద్వారా తిరుమల తిరుపతి దేవాలయాల చరిత్ర*
శ్రీవేంకటాచల దివ్యక్షేత్రము పూర్వము అనేకరాజుల పరిపాలనలో నుండెనని శ్రీవేంకటాచల క్షేత్రమాహాత్మ్య పురాణము ద్వారా తెలియుచున్నది. రాజులకు శ్రీవేంకటాచల క్షేత్రముతో గల సంబంధమును నిరూపింపగల శాసనాధారములు తిరుమల ప్రాచీన చరిత్రను సజీవముగా నిలుపుతున్నవి. ఈ శాసనములను అప్పటి మద్రాస్ ప్రభుత్వము 1922 నుండి 1927 వరకు 5 సంవత్సరములు అవిశ్రాంతముగా సాధు సుబ్రహ్మణ్యశాస్త్రిగారిచేత నిశితముగా పరిశీలించి, వాటిలో సుమారు 1252 పైగా సేకరించి, చారిత్రక విషయాలను భద్రపరిచింది. ఈ శాసనాలు కీ.శ 800 మొదలు క్రీ.శ 1909 వరకు గల కాలానికి సంబంధించినవి. పల్లవ, చోళ, పాండ్య, విజయనగర రాజవంశీయులకు సంబంధించిన తిరుమల క్షేత్ర యాత్ర, దాన వివరములను యీ శాసనాలు తెలియజేస్తున్నాయి.
తిరుమలచరిత్రకు సంబంధించి మనకు లభించిన అత్యంత ప్రాచీనమైన శాసనం క్రీ.శ 800వ నాటిది. ఇది తమిళములో వ్రాయబడినది. ఈ తమిళ శాసనములో శ్రీవేంకటేశ్వర ఉత్సవమూర్తి దగ్గర దీపం పెట్టడానికి మూలధనముగా పల్లవరాజైన కోవిజయదంతి విక్రముని కాలములో ఉళగప్పెరుమనారు అనే భక్తుడు తిరుమలలో చేసిన దీపదానాన్ని వివరిస్తున్నది. అత్యంత ఆధునికమైన 1908 నాటి శాసనం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ విమానం పై గల కలశస్థాపనను గురించి తెలియ జేస్తుంది.
ఈ దానశాసనాలలో 70 మాత్రమే తెలుగు లిపిలో వున్నాయి. 1150 శాసనాలు తమిళ గ్రస్థలిపిలో వున్నాయి. మిగిలినవి సంస్కృతములోను, కన్నడములోను ఉన్నాయి. వీటిలో సాళువ నరసింహరాయలు కాలానికి సంబంధించిన శాసనాలు 169, కృష్ణదేవరాయలు కాలానికి సంబంధించినవి229,అచ్యుతరాయకాలానికి సంబంధించినవి 251, సదాశివరాయల కాలానికి సంబంధించినవి 147, ఆరవీడు వంశరాజుల కాలంనాటివి 135 వున్నాయి. ఈ శాసనాలను రాజులు లేక వారి అనుచరులైన అధికారులు, సామంత రాజులు, సంపన్నులు, మొదలైన వారెందరో తిరుమల దేవునికీ వారు సమర్పించిన కానుకల్ని శిలాక్షరాలద్వారా నిరూపించారు. ఈ శాసనాల ద్వారా కృష్ణదేవరాయలు ఏడుపర్యాయములు తిరుమల క్షేత్రాన్ని సందర్శించినట్లు తెలియుచున్నది.
16వ శతాబ్దంలో వ్యాసరాయ మత స్థాపకులైన వ్యాసతీర్థులు తిరుపతి క్షేత్రాన్ని దర్శించినట్లు శాసనాలవల్ల మనకు తెలియుచున్నది. ఇంతే కాకుండా రాజాస్థానాలలోగల ప్రముఖోద్యోగులు, వైదిక బ్రాహ్మణులు మొదలైనవారు వేయించిన శిలాసనాలు శతాధికసంఖ్యలో పున్నాయి. వీటిలో అధిక సంఖ్యకు చెందిన శాసనాలలో దేవుని దీపారాధనకు కావలసిన నేతిని సమకూర్చే నిమిత్తము ఎందరో దాతలు గోవులను దేవునికి సమర్పణ చేశారని, నిత్యనైవేద్యము కోసం అగ్రహారాలను శ్రీనివాసునికి అంకితం చేసిన వదాన్యులను గురించీ, అటువంటి అగ్రహారాలలో సస్యవృద్ధికి అనువైన జలాశయాలను నిర్మింపజేసిన మహానుభావులను గురించీ, దేవపూజకోసం పూలతోటలను వేయించిన భక్తవరేణ్యులను గురించీ, మూలవిరాట్టుకు, ఉత్సవ విగ్రహాలకు సమర్పితమైన, నవరత్నఖచిత సువర్ణాభరణాల గురించి మనకు తెలియజేస్తాయి. వేదపారాయణకు, పురాణపఠనానికి, బహ్మోత్సవం, వసంతోత్సవం వంటి ఉత్సవాలకు సంబంధించిన శాసనాలు అధిక సంఖ్యాకంగా వున్నాయి.
ఈ శిలాఫలకాలతోపాటు 16వ శతాబ్దంనాటి తాళ్లపాక చినతిరుమలాచార్యులవారు, సంస్కృత ప్రాకృత, శూరసేన, మాగధి, పైశాచి, అవంతి భాషలతో కలిపి అష్టభాషాదండకం వాసిన తామ్రఫలకాలు లభ్యమవుతున్నాయి.తిరుమల కొండకు వెళ్లే మార్గం ప్రారంభమైన అడిపడి (అలిపిరి) దగ్గర
లక్ష్మీనారాయణ దేవాలయం గోడలమీద శక సంవత్సరం 1550
(క్రీ.శ.1628) నాటి నలభై ఒక్క చరణాలుగల సీసమాలిక తెలుగులిపిలోను,
గ్రస్థలిపిలోను, దర్శనమిస్తుంది. ఇది మట్ల కుమార అనంతరాజు అలిపిరి
నుండి గాలిగోపురం వరకు వున్న సోపానమార్గమును, కొత్తగోపురాన్ని,
గాలి గోపురాన్ని నిర్మించాడని తెలియచేస్తుంది. ఈ సోపాన పంక్తి ఏర్పడక
ముందు కపిలతీర్థము నుంచి గాలిగోపురం వరకు వేరొక మార్గం వుండేదని,
ఇది గాక మోకాళ్లపర్వతం నుంచి చివరి వరకు మరొక మార్గం ఉన్నదని
శక సంవత్సరం 1887లో వెలసిన శాసనంవల్ల (T.T. 53 ) మనకు తెలుస్తున్నది.
చోళరాజుల తిరుమల సేవ నిరుపమానమైన మహానగరాలను
దేవాలయాలను నిర్మించడంలో చోళ చక్రవర్తులది అందె వేసిన చేయి.
చోళులకాలంలోగల తిరుమల శాసనాలను పరిశీలించినట్లయితే సప్తగిరివాసునకు వారు సమర్పించిన కానుకలతో పాటు ఆకాలపు పరిపాలన
విధానం కూడా యథాతథంగా మనకు వ్యక్తమౌ తుంది. మదిరై కొండకోపర
కేసరి వర్మన్ లేక పరాంతక1 అనే చోళ చక్రవర్తి శాసనం జి.టి.232, 234 తిరుచానూర్ లో వుంది. మొదటి పరాంతకుడు కీ. శ॥ 905నుంచి 956 వరకు పరిపాలించాడని, ఈయన వేంకటేశ్వర స్వామికి రెండుసార్లు దీపస్తంభాలను కానుకగా సమర్పించాడని శాసనాలు
చెబుతున్నాయి. మొదటి రాజరాజచోళుని తండ్రి రెండవ పరాంతక సుందర చోళుడు సతీమణి దేవిఅమ్మనార్ స్వామికి రత్నసంఘటిత హేమపతకాన్ని సమర్పించారని T.T.17వ నంబరు శాసనంలో వుంది. క్రీ.శ 935వ సంవత్సరములో మలైనాడుకు చెందిన కొడుంగోలూరన్ అను భక్తుడు స్వామి
దీపారాధనకోసం 40 బంగారు నాణేలను దేవస్థానమునకు ఇచ్చినట్లుగా
G.T.215 నంబరుగల శాసనంలో వుంది. T.T. నంబరు 20 శాసనంవల్ల40
మొదటిరాజ చోళుడు తిరుమలలో 24 దీపాలను వెలిగించడానికి ఘృతాన్ని ఏర్పాటు చేశాడని తెలుస్తున్నది. G.T.126 నంబరు గల శాసనం మూడవ రాజ రాజు పరిపాలనకు వచ్చిన 19వ సంవత్సరంలో లిఖితమైనది. ఈ శాసనములో తిరుమంగై ఆళ్వార్ విగ్రహాన్ని శ్రీగోవిందరాజస్వామి ఆలయప్రాకారంలో ప్రతిష్ఠించారని కుడవూర్ గ్రామంలో కొంతభూమిని ఇచ్చి దానిమీద వచ్చే గ్రాసంతో యీ దేవునకు నిత్య భోగాదులు జరిపించాలని వుంది.
చోళరాజైన కొప్పాత్ర పార్థివేంద్రవర్మ 14వ పరిపాలనా సంవత్సరములో పల్లవరాణి శక్తి విటంకన్ భార్య సామవై పెరుందేవి తిరుమలయాత్ర చేసి శ్రీవేంకటేశ్వరస్వామికి ఉత్సవవిగ్రహంగా భోగశ్రీనివాసమూర్తి (మనవాళప్పెరుమాళ్) అని పిలిచే వెండి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయంలో తిరువిలనాన్ కోయిల్ లో 8-6-966 తేదీన ప్రతిష్ఠించింది. సామవై పెరుందేవి ఈఉత్సవవిగ్రహానికి అనేక సువర్ణాభరణాలను సమర్పించింది. పెరటాసి, మార్గళి (ముక్కోటి ఏకాదశి) నెలల్లో బ్రహ్మోత్సవాలు ఏర్పాటుచేసింది. వీటి నిర్వహణకై 4177 కుళీల భూమిని దానం చేసింది.
No comments:
Post a Comment