🍁ముక్కు మొఖం తెలియని వారి గురించి అపార్థం చేసుకోవడం లో ఒక అర్థం ఉంది. మీకు పోటీ అయినవారిని అనుమానించుట లో అర్దం ఉంది..
కానీ కలకాలం కలసి మెలసి జీవిస్తున్న ఇంట్లో వారిని కూడా అపార్థం చేసుకునుట లో అర్థం ఉంటుందా!!
ఒకవేళ ఇంట్లో వారి ప్రవర్తన సరిగ్గా ఉండ కపోవచ్చు.. అంత మాత్రాన వారి గురించి ఇతరులకి ప్రచారం చేస్తూ వారి పరువు తియ్యటం ఏమైనా శిబిస్తుందా!
మీరు మీ ఇంట్లో వారి గురించి ఇతరులకి చెప్పి మీ వాళ్ళ పరువు తీశారు..
తరువాత రోజు, ఆ ఇతరులు మీ ఇంట్లో వారి గురించి, చెప్పిన మీ గురించి అందరికీ చెప్తూ మీ పరువు ను, మీ ఇంటి పరువును మొత్తం తీసేస్తారు..
పరిష్కారాలు లేని కొన్ని సమస్యలను ప్రచారం చేసి పెద్దది చేసుకోవడం కన్నా పరమేశ్వరుని మీద భారం వేయడంలోనే కళ్యాణం ఉంటుంది..🍁
మీ
మురళీ మోహన్
No comments:
Post a Comment