. *కాగితం - కలం*
***************
కాగితం, కలం వలననే
ఏ విషయమైనా
అక్షరాలలో నిక్షిప్తం.
పది కాలాల పాటు పదిలం.
కాగితం లేనపుడు
కలం ఉన్నా లేనట్లే.
కలం లేనపుడు
కాగితమున్నా లేనట్లే.
పనికొచ్చే మన
ఆలోచనలను
భద్రపరచాలని
అనుకున్నపుడు
కలంతో మరియు
కాగితంతో పని
చదువచ్చిన వారికే
ఇవి అవసరాలు.
మన ఆలోచనలన్నీ
కలం సహాయంతో
కాగితంలోనే పదిలం.
ఎప్పుడు కావాలనుకుంటే
అప్పుడు కాగితం చూచి
చదివి తెలుసుకోవచ్చు.
మనసులోకి చేరనిచ్చి
ఉంచవచ్చు పదిలంగా.
ఇటువంటి కాగితాలన్నీ
కలిస్తే పుస్తకమౌతుంది.
అందుకే పుస్తకం
జ్ఞాన సమన్వితం.
కలం వలననే
కాగితానికి విలువ.
కాగితమున్నపుడే
కలంతో పని.
కాగితంపై కలం కదిలితే
జ్ఞానమునకు సాకారం.
అక్షరాల రూపములో
జ్ఞానమెపుడు పదిలం.
పుస్తకం తెరచి చదివితే
జ్ఞానం మనకు స్వంతం.
అర్థవంతమైన అక్షరాలే
జ్ఞానానికి ప్రతీకలు.
కాగితం, కలం ఇవి రెండూ
జ్ఞానాన్ని పదిలపరచే ఆయుధాలు.
అక్షర సాకారానికి
కలం కాగితం రెండు అవసరాలే.
సనాతన కాలమున
తాటి ఆకులే కాగితాలు.
మొనదేలిన ఘంటమే కలం.
ప్రత్యేకించి గురువులకు
లేఖకులకు రచయితలకు
ఇవి ముఖ్య సాధనములు.
చదువచ్చిన వారికే
కలం కాగితం అవసరం.
చదువు రాని వారికేం తెలుసు
కలం కాగితాల అవసరాలు ?!
ఎలా ఏర్పడినవొ
సనాతన కాలమున
ఈ కలం కాగితాలు ?!
తద్వారా రామాయణ
భారతాది గ్రంథాలు
జ్ఞానానికి మూల ప్రతీకలు.
కాగితంలో కలం వలననే
ఏ విషయమైనా అక్షరాలలో
కలకాలం సుస్థిరం ! పదిలం !
ముందు ముందు విషయావగాహనకు.
ఏదైనా ఉత్తరం
వ్రాయాలనుకున్నపుడో
కవితలు మొదలైనవి
వ్రాయాలనుకున్నపుడో
కలంతో కాగితంతో పని
చదువ గలిగిన వారికి
చదివి అర్థం చేసుకునే పని
తద్వారా ఎనలేని ఉపయోగం.
****************
రచన :-----రుద్ర మాణిక్యం ( కవి రత్న )
రిటైర్డ్ టీచర్. జగిత్యాల (జిల్లా)
**********************************
No comments:
Post a Comment