గోవర్ధన పూజ అనేది దీపావళి ఐదు రోజుల పండగ పూజలలో ఒక భాగంగా ఉంది. మరియు ఇంద్రుడి పై శ్రీ కృష్ణభగవానుని విజయం గౌరవార్థం ప్రశంసించబడుతుంది.గోవర్ధన పూజ దీపావళి తర్వాత రోజు శ్రీకృష్ణుడు ఇంద్రున్ని జయించిన రోజుగా పండుగ జరుపుకుంటారు.
శ్రీ కృష్ణుడు యాదవులను, గోవులను ప్రళయం నుండి కాపాడటం కోసం గోవర్ధన గిరి అనే పర్వతాన్ని తన చిటికెన వ్రేలితో ఎత్తి వారిని రక్షిస్తాడు.
భాగవతం లో ప్రస్థావించబడిన ఒక పర్వతం పేరు గోవర్ధనం. దీనిని హిందువులు పవిత్రంగా భావిస్తారు. ఇది ప్రస్తుతం బృందావనం పట్టణానికి సమీపంలో ఉన్నది.గోవర్ధనం అనగా గోవుల్ని వర్ధనం అనగా వృద్ధి చేయడం అని అర్ధం.పూర్వం బృందావనంలో వర్షాలు బాగా పడేందుకు , సశ్యశామలంగా ఉండేందుకు ఇంద్రభగవానుడికి , వర్షదేవుడికి పూజలు చేసే వారు.కానీ పక్కన ఉన్న గోవర్ధన గిరి బృందావనంను ఉద్ధరిస్తుంది , గోవులను పాలిస్తుంధి. అలంటి గోవర్ధగిరిని పూజించకుండా ఇంద్రుడిని పూజించడం ఏంటని నిలదీస్తూ , గోవర్ధన కొండను ప్రార్థించమని శ్రీకృష్ణుడు అభయమిచ్చాడు.ఇది చూసిన ఇంద్రుడు దిగ్ర్భాంతి కి లోనయి , కోపంతో ఆ ఊరిని తీవ్ర వర్షంతో ముంచేయమని వరుణ దేవుడికి ఆజ్ఞాపిస్తాడు.జంలప్రళయం వచ్చి బృందావన ప్రజలను ముంచి వేసి అనేక జీవనాధారాలను ముంచివేసింది.అయినప్పటికీ , కృష్ణభగవానుడు వెనక్కి తగ్గలేదు. తన చిటికెన వేలితో గోవర్ధన్ గిరిని ఎత్తి వేసి నివాసులను , గోవులను కాపాడాడు.ఇది ఏడు రోజులు , ఏడు రాత్రులు వరకు కొనసాగింది. చివరకు ఇంద్రుడు తన అపరాధాన్ని అర్థం చేసుకుని కృష్ణుడికి నమస్కరించాడు.అటువంటి సంఘటన తరువాత భక్తులు , శ్రీకృష్ణభగవానుని కి సంబంధించిన ఒక లక్షణం గా , పూజ సమయంలో ధాన్యపు భారాన్ని సమర్పిస్తారు ఇది గోవర్ధన కొండకు ప్రాతినిధ్యం వహిస్తుంది..
అరుణాచలం వంటి క్షేత్రాలలో కొండ మొత్తానికి ప్రదక్షిణం చేస్తారు.దానిని గిరి ప్రదక్షిణం అంటారు. శ్రీకృష్ణుడే ఇంద్ర యాగం మానిపించి గోవర్ధన పర్వతానికి ప్స్,ప్రదక్షిణ చేయమని చెప్పి అందరితో చేయించాడు దానివల్ల ఎంతటి సత్ఫలితం వచ్చిందో తెలిసిందే కదా!
No comments:
Post a Comment