Tuesday, November 5, 2024

 శత్రువుకైనా సరే ఎల్లపుడూ మంచి జరగాలనే కోరుకోవాలి.

దీని వలన మనిషిలోని  ఈర్ష్యాఅసూయలు తొలగిపోయి ప్రేమతత్వం అలవడుతుంది.

ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటే కొంచెం ఆలస్యమైనా సరే తప్పక మంచే జరుగుతుంది.

కానీ ఇతరులకు చెడు జరగాలని కోరుకున్నా చెడు జరుగనే జరుగదు. కారణం దేవుడనే వాడు సదా మంచినే చేస్తాడు.

ఒకవేళ ఎవరికైనా చెడు సంభవిస్తే అది వారి కర్మ ఫలం తప్ప మనం చెడు జరగాలని కోరుకోవడం వలన కానేకాదు. ఊరికే పాపము మూట కట్టుకోవడం ఎందుకు ?? ఇతరుల మంచిని కోరుకున్నవాడి బాగోగులు స్వయంగా ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు. 

కనుక మంచినే చేయాలి. మంచినే కోరాలి..``
అలాగే,
సమత్వాన్ని, స్థిరత్వాన్ని స్వప్రయత్నంతో సాధించుకోవాలి. 

జ్ఞానియైనవాడు అవాంతరాలు ఎదురైనపుడు పరిస్థితులకు లొంగిపోడు. తాను అధికుడననే భావం అతనిలో ఉండదు కానీ భగవంతుని ఎడల తనకు గల విశ్వాసపాత్రతను చూపేందుకు స్థిరంగా నిలిచి ఉంటాడు. 

ఇతరులు మనలను ఉద్దేశించి ఒక కఠినమైన పదజాలం ఉపయోగిస్తే మనం దానిని పదే పదే తిరిగి గుర్తు తెచ్చుకుంటూ చివరకు మెదడులో నిక్షిప్తం చేసుకుంటాము. 

కానీ అది సరియైనది కాదు. దానికి పరిష్కారం ఏమిటంటే ఆలోచనకు ప్రతికూల ఆలోచనను తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. దీని ద్వారా ఆ చెడు ఆలోచన బలహీనపడుతుంది. 

చెడుని ఎప్పుడూ మంచి ద్వారా ఎదుర్కోవాలి.    

No comments:

Post a Comment