Tuesday, November 5, 2024

 *గుడికి ఎందుకు వెళ్ళాలి?*
                 

*ఆలయంకు ఎందుకు వెళ్ళాలి ?ఆలయంలో నిజంగా అద్భుతాలు ఉంటాయా ?*
 
*హిందువులుగా ఉన్న వారిలో చాలా మందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. దానిని మనకు మన పెద్దలు నేర్పితే, మనం మన పిల్లలకు నేర్పుతాం. ఇందులోని మర్మమేటో తెలియకుండా మనం పెద్దలు చెప్పిన ప్రకారం గుడికి వెళ్ళి పూజలు చేస్తుంటాం.*

*పెద్దలు ఎంతో అనుభవంతో మనకు నేర్పిన సలక్షణం గుడికి వెళ్ళడం! అయితే అందులో మర్మమేమిటో తెలుసుకుంటే మరింత బాగుంటుంది.*

*గుడికి వెళ్ళితే నిజంగా మనకు అంతటి ప్రేరణ ప్రశాంతత వస్తుందా ? ఒక్కసారి చూద్దాం…*

*గుడిని దర్శించుకోవడం వెనుక ప్రయోజనాలే ఉన్నాయని చెబుతారు. నేటి సైన్సు, నాటి వేదాలు రెండూ చెప్పే మాటే. అయితే ఈ అంశం కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో నిర్మించిన ఆలయాలకు ఎక్కువగా వర్తిస్తుంది. ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలాగే భూమిలో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తూ ఉంటుంది. అది కూడా భూమి స్వభావం.*

*ఆ ప్రాంతంలో ఉండే ఖనిజాలు, లోహాలను అనుసరించి ఉంటుంది. అందుకే ఆలయం నిర్మించడానికి అప్పట్లో కొన్ని ప్రత్యేక ప్రదేశాలను మాత్రమే ఎన్నుకుంటారు.*
*ఆ గుళ్లలోకి వెళ్లగానే శరీరం ఒక్కసారిగా చల్లబడుతుంది, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇది కావాలంటే పరిశీలించి చూడడండి.*

*ఎంపికైన ప్రదేశంలో దేవాలయం, ఆకర్షణ శక్తి అధికంగా ఉన్న కేంద్రంలో మూలవిరాట్టును ప్రతిష్టింప చేస్తారు. వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు)ను విగ్రహం కింద నిక్షిప్తం చేసి ఉంచుతారు.*
*రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.*

*అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూలవిరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి.*
*ప్రతి రోజు గుడికి వెళ్ళేవారిలో దివ్యశక్తి చేరడాన్ని మనం గమనించవచ్చు. గుడికి వెళ్ళి వచ్చేవారు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది.*

*అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే. ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు మరింత శక్తిని సమకూరుస్తాయి.*

No comments:

Post a Comment