*ఒక చిట్టికధ మీఅందరితో పంచుకుంటా ఈరోజు..చిన్నపిల్లల కధలా ఉంది అనుకోకండేం...!*
*ఒకసారి రెండుకాకులు ఎవరు ఎక్కువ ఎత్తుకి ఎగరగలవో చూద్దాము అని పోటీ పెట్టుకున్నాయి..*
*ఆ పోటీలో ప్రత్యేకత ఏమిటంటే...రెండు కాకులు ఒకే పరిమాణం అంటే ఒకే సైజు ఉన్న సంచీలో ఏదో ఒకటి నిండుగా నింపుకుని ఆ బరువున్న సంచీని ముక్కుకి కరుచుకుని పైకి ఎగరాలి...అలా బరువు మోస్తూ ఎవరు ఎక్కువ ఎత్తుకి ఎగరగలిగితే వారిదే గెలుపు..!*
*మొదటికాకి సంచి నిండా దూది నింపుకుంది..రెండోకాకి సంచి నిండా ఉప్పు నింపుకుంది...మొదటికాకి అది చూసి రెండోకాకి వైపు చూస్తూ హేళనగా నవ్వింది ఇక గెలుపు నాదేలే అనుకుంటూ...!*
*రెండు కాకులు సుమారుగా చాలా ఎత్తువరకు వెళ్ళాయి ఉన్నట్టుండి మబ్బులుకమ్మి వాన పడి ఆగింది ఉప్పు సంచీ లో ఉప్పు వాననీళ్ళకు కరిగిపోయింది దూది సంచీలోని దూది వాననీళ్ళు పీల్చుకుని బరువెక్కుతోంది ఇక అక్కడ మొదలయ్యాయి మొదటికాకికి తిప్పలు తేలికగా దూదిని మొయ్యచ్చు అనుకుంది కానీ అదే దూది నీరు పీల్చుకుని బరువయ్యింది దానివల్ల మొదటికాకికి ఊహించని కష్టం ఎదురయ్యింది రెండో కాకి ఉప్పు నింపుకునేటప్పుడే బరువు మొయ్యటానికి సిద్ధపడింది.ఇప్పుడు ఉప్పు కరిగిపోయి సంచీ తేలిక అయ్యి అనుకోని అదృష్టం కలిసొచ్చింది..ఇక మొదటికాకి తడిసిన దూది బరువు మొయ్యలేక ఎత్తు ఎగరటం సంగతి తర్వాత ముందు కిందకి అయినా సరిగ్గా దిగగలనా లేదా అని తెలిసి రెండో కాకి ముందు తన ఓటమి ఒప్పుకుని దూదిసంచీని వదిలేసి క్షేమంగా కిందకు తిగింది...గెలుపు ఓటమిల కంటే ముఖ్యం సురక్షితంగా ఉండటం...!*
*అంతే జీవితం .... ఉన్నట్టుండి కధ అడ్డం తిరుగుతుంది..ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతుంటాయి...ఊహించని కోణంలో రెండోకాకి గెలిచింది..ప్రతీసారీ విధి కష్టమే ఇవ్వదు, ఒక్కోసారి అద్భుతాలు, కలిసొచ్చే అద్రృష్టాలు కూడా ఇచ్చి ఆనందం పంచగలదు...*
No comments:
Post a Comment