*_పుట్టినామా... ఆనందించినామా... తిన్నామా... పడుకున్నామా... తెల్లారిందా... రోగం వచ్చినదా... సచ్చినామా... అంతేనా జీవితం అంటే.?_*
*_మనిషిగా నీవు పుట్టినందుకు సమాజానికి ఏదో ఒకటి ఇచ్చే వెళ్లాలి. రావడం... పోవడంలో జీవన మాధుర్యం ఏముంటుంది.?_*
*_అలా అనుకుంటే పశుపక్షాదులు, క్షుద్ర చీమలు, కీటకాలు... జన్మిస్తున్నాయి, మరణిస్తున్నాయి. మనకు పశుపక్షాదులకు గల తేడా ఏంటి.?_*
*_ధనమును సంపాదించండి తప్పులేదు. ఒకరిని ముంచి సంపాదించాలనుకోకండి. పదవులు, కీర్తిని సంపాదించండి. కానీ, ఒకడిని తొక్కి పై స్థాయికి రావాలనుకోకండి..._*
*_డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు. అది ఎలా సంపాదించావు అనేది ముఖ్యం._*
*_వంద కోట్లు ఉన్నా వందేళ్లు బ్రతకలేము. పది యిళ్లు ఉన్నా ఉండేది ఒక ఇంట్లోనే... ఉన్న ఒక్క జన్మకి వందేళ్లు గుర్తుండేలా బ్రతకాలి. పది మందికి సహాయం చేసేలా ఉండాలి._*
*_మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే, మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం గొప్పది._*
*_ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళకింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించింది ఏదీ మనది కాదు, శాశ్వతంగా నిలిచి ఉండేది... మంచితనం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప మరేమి లేదు._*
*_నీ పుట్టుక ఒక సాధారణం కావచ్చు. కానీ, నీ జీవితం మరో చరిత్ర కావాలి. అలా బ్రతకాలి, అలా ఉండాలి జీవితమంటే...☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹 🪷🙇🪷 🌹🌹🌹
No comments:
Post a Comment