🎻🌹🙏 నాటకమింతా నవ్వులకే |
పూటకు బూటకు బొల్లైపోవు
* కోటి విద్యలును గూటి కొరకే పో |
చాటున మెలగేటి శరీరికి |
తేటల నాకలి తీరిన పిమ్మట |
పాటుకు బాటే బయలై పోవు
* మెరసేటి దెల్లా మెలుతల కొరకే |
చెరల దేహముల జీవునికి |
అరమరపుల సుఖమందిన పిమ్మట|
మెరుగుకు మెరుగే మొయిలై పోవు
* అన్ని చదువులును ఆతని కొరకే |
సన్నెరిగిన సుజ్ఞానికిని |
యిన్నిట శ్రీ వేంకటేశు దాసునికి |
వెన్నెల మాయలు విడివడి పోవు
🌸🌿🌸🌿🌸.
No comments:
Post a Comment