🙏 *రమణోదయం* 🙏
*యుగాన్ని ఒక్క క్షణంగాను, క్షణాన్ని ఒక యుగంగానూ తోచేట్లు చేసి కల్లోలపరచడమే మనస్సు యొక్క మాయాజాలం.*
వివరణ: *మనోమాయ చేత దేశకాల భేద కల్పితాలు జరుగుతున్నాయని భావం.*
తనకు తాను ఉంటాడు..ఇతరులకూ తానుంటాడు
ఇది జీవితం🌹
ఇతరులకు తాను ఉండడు..తనకు తాను ఉంటాడు
ఇది మరణం🌹
ఇతరులకు తాను ఉంటాడు..తనకు తాను ఉండడు
అయినా "తాను ఉంటాడు"..ఇది మోక్షం!🙏
నేను పుట్టక మునుపు,
నేను మరణించాక ఉన్న
"నేను" యొక్క అడ్రస్ ఎవ్వరికీ తెలియదు.
అనగా జనన - మరణ రహస్యం
ఎప్పటికీ రహస్యమే!🙏
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.561)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*||
🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🌹🙏
No comments:
Post a Comment