Thursday, January 30, 2025

 నిత్యం అవకాశం కొరకు ఆరాటం"

నిజానికి ఈ భూమి మీద ఉన్న 
ప్రతి ఒక్కరూ.. ఏదో ఆశతో 
అవకాశం కొరకు
ఎదురు చూస్తూనే ఉన్నారు!...
తమలో పుట్టిన ఆశయం 
నిలబెట్టుకోవడానికి 
తిప్పలు పడుతూనే  ఉన్నారు!...

శ్రమలేకుండా లక్ష్యం నెరవేరదు!...
అందమైన ఊహలవెనుక ఎన్ని ఆలోచనలో!...
విశ్వాసంతో అవకాశం అందుకోవడానికి
నిత్యం ప్రయాస పడుతున్నారు!!...

నిత్యం ఏదో అన్వేషణ!...
అనునిత్యం ఏదో ఆలోచన!...
జీవితాంతం రోజులను..దినాలను నెట్టేసుకుంటూ..
తనమీద తాను గట్టిగా ఒట్టేసుకుంటారు!...

నమ్ముకున్నకాలం వెనుక అడుగులువేస్తూ...
ప్రతిరోజూ తనకు తాను వికసిస్తూ...
ఆశయం కొరకు అర్రులు చాస్తూ...
పరుగెత్తుకొచ్చే అవకాశం కొరకు 
ఒక సజీవ జీవనదిలా ప్రవహిస్తూఉంటారు!...

సహనం..సాహసం 
చైతన్య దీప్తిలా వెలుగుతూ...
ఉదయానికి హృదయం పరిచి...
ఆశయం అంది పుచ్చుకోవాలని...
ఓ భక్తునిలా తనశక్తిని ఉపయోగిస్తారు!

ఆలోచనలోని అంతర్గత భావమే
ముందుకు నడిపిస్తోంది!...
అంచెలంచెలుగా అనుకున్నది సాధించాలనే తపన... 
ఓపక్క లోకం...మరోపక్క తాపం...
మరోపక్క అనుకున్న ఆశయం...
కళ్ళముందు కాలం కనుమరుగైంది!!
అందుకోలేని అవకాశం ఎదురైంది!...

ప్రతిక్షణం మనుసు పదేపదేకోరుతోంది..
ఇప్పుడు ఆచూపులేదు ఆ ఊపూలేదు..
బతుకులో అంతా వెలితి!...
అడ్డదారిలో అడుగులు వేసేవారికి
ఇది ఇష్టంగా ఉంటుంది!...
 
కొందరు నిజాయతీగా... 
కష్టమైనా...ఇష్టంగా అందుకోగలరు!..
సాధించడానికి ప్రయత్నంచేస్తారు!...
అవకాశం కోసం ఆకాశంవైపు చూస్తే
చుక్కలే కనబడతాయి!... 
కానీ ఆశయం నెరవేరదు!...

వెతుకుతున్నది పాతరోజులు కాదు...
ఓ విచిత్రమైన కొత్తరోజులు!...
తరం మారింది ఓ కొత్త తరం వచ్చింది...  
ఎక్కడచూసినా.. పైశాచిక ప్రవృత్తి!...
ఇది అవకాశాలులేని ఆరాటమే...
ఆశయం కొరకు పోరాటమే!...

అందుకే పటిష్టమైన పట్టుదల నిండైన విశ్వాసం...
దృఢమైన మానసిక సంకల్ప బలం ఉంటే... 
ఎంత కష్టమైన అవకాశం అందుకోగలరు!...

అంబటి నారాయణ
నిర్మల్
9849326801

No comments:

Post a Comment