🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*సద్వినియోగం!*
➖➖➖✍️
```
ఒకరోజు బుద్దుడికి ఒక దుప్పటి కనుగోలు చేస్తున్న ఒక యువకుడు కనిపించాడు.
“ఈ దుప్పటి కొన్నాళ్ళకు చినిగిపోతుంది కదా!అప్పుడు దాన్నేం చేస్తా”వన్నాడు బుద్దుడు.
“దీన్ని రెండు ముక్కలుగా చింపి అంగవస్త్రంగా వాడుకుంటాను” అన్నాడు ఆ యువకుడు.
“మరి అవి కూడా చినిగిపోతే?” అన్నాడు బుద్దుడు.
“ముక్కలుగా చేసి ఇల్లు తుడవడానికి వాడుకుంటాను” అన్నాడు.
“అది కూడా ముక్కలైపోతే?” అన్నాడు బుద్దుడు.
“ఆ ముక్కలన్నింటిని మట్టితో పిసికి బొమ్మలు చేస్తాను. ఆ బొమ్మలు అమ్మగా వచ్చిన డబ్బుతో మరో కొత్త దుప్పటి కొనుక్కుంటాను" అన్నాడు నవ్వుతూ ఆ యువకుడు.
ఈ మాటలకు బుద్దుడు “సద్వినియోగం చేసుకోవడం అంటే ఇదేమరి!” అని తన శిష్యులకు చెప్పాడు.
మహాత్మాగాంధీ కూడా సద్వినియోగం చేసుకోవడం సబర్మతి ఆశ్రమంలో వుండే తన సహచరులకు ఎప్పుడూ చెపుతుండేవారట.
ఒకనాడు చిటికెన వేలంత పెన్సిల్ కనపడలేదు. పుస్తకాలకింద అలసిపోయేదాక వెదుకుతూ వున్నారంట.
అప్పుడు ఒక శిష్యురాలు వచ్చి “బాపూ ఇదిగో కొత్త పెన్సిల్ తీసుకోండి.” అంది.
“నేను కొత్త పెన్సిల్ కావాలని అడగలేదే?! నా పెన్సిల్ కోసం వెదుకుతున్నాను” అన్నారట మహాత్ముడు.
బాపు చిన్న కాగితం కూడా వ్యర్దం చేసే వారు కాదట. తనకు వచ్చిన ఉత్తరాల వెనకాల వున్న ఖాళీ ప్రదేశంలో ఏదో ఒకటి రాసే వారట.
“బాపూ కాగితాలు చాలా వున్నాయి వాడుకోండి!” అంటే,
“వద్దు..పేపర్ కోసం వాడే వెదురు చెట్లు భవిషత్ తరాలకు అయిపోవచ్చు. అందుకని కాగితాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి.
అనవసరమనిపిస్తే ఉప్పు కూడా ఎక్కువగా వడ్డించుకోవద్దు!” అని ఆశ్రమం గోడ మీద రాసి వుంచే వారంట.
వస్తువుల్ని సద్వినియోగం చేయడం చాలా మంచి అలవాటు! ఎందుకంటే భవిషత్ తరాలకు అన్నీ అందక పోవచ్చు తరిగిపోవచ్చు! ఆ లక్ష్యం మనసులో వుంటే ఆహారం, నీరు వ్యర్థం చేయము.
ప్రతి వస్తువు అయిపోయాక ఏదో ఒక పనికి ఉపయోగపడుతుంది.
కొనడం మాసిపోయిందనీ పాత ది అయిందనీ పారేయడం వలన వాతావరణం ప్రకృతి కాలుష్యం అవుతుంది!
బుద్దుడి కధ లో లాగా అది చివరికి మట్టిలో కలిసే వరకు ఉపయోగించడం వలన ఎంతో ఉపయోగముంటుంది.
మహాదేవుడు శివుడు కూడా ఒక సందర్భంలో అడవుల్ని కొట్టి వేసి జంతువుల్ని చంపివేసేవారికి తాను కఠిన శిక్ష వేస్తాననీ చెప్పారు. ఈ జగత్తును పాలించే శివుడు కూడా జనులకు ఐశ్వర్యము ప్రసాదించే వారైనప్పటికి…, పట్టుపీతాంబరాలు ధరించక…,
పులి లేదా ఏనుగు మరణించిన తరువాత లభించే వాటి చర్మం ధరిస్తాననీ చెప్పారు… బ్రతికిన దాన్ని చంపి దాని చర్మం నేను ధరించను…అని వారే స్వయంగా ఋషులకు జ్ఞాన సత్సంగంలో చెప్పేవారు.
విచ్చలవిడిగా వస్తువుల్ని,నీటిని, ఆహారాన్ని ప్రకృతిని వ్యర్ధం చేయడం తనకు ఆగ్రహం తెప్పిస్తుందనీ చెప్పేవారు.
మన వంతు బాధ్యత గా ప్రకృతి ని కాపాడుకోవాలి… మితంగా జీవిస్తూ పరిమితంగా వస్తువుల్ని వినియెగించుకోవాలి.
ఎందుకంటే… రాబోయే తరాల కోసం…!
అలాగే కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి! కాలాన్ని సద్వినియోగం చేయకుండా సోమరితనం, నిద్ర తో, వ్యర్దపు మాటలతో కాలాన్ని దుర్వినియోగం చేసేవారికి కాలసర్పదోషం తగులుతుందనీ జ్యోతిషులు అంటారు.
అదే కాలసర్ప దోషమంటే…!
కాలసర్ప దోషానికి పరిహారం కేవలం కాలాన్ని దుర్వినియోగం చేయకుండా మంచి పనులు,మంచి మాటలు, వారి వారి బాధ్యతల్ని ధర్మంగా నిర్వహించడమే!
భగవంతుని ధ్యానం, జపం పూజ యోగ సాధన, ఆధ్యాత్మిక సాధన చేయడం, పరోపకారం పరమ ధర్మంగా భావించడమే- కాలాన్ని సద్వినియోగం చేయడం…!✍️```
-------- సేకరణ.
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment