Friday, January 31, 2025

 ప్ర: *మన ఇళ్లల్లో ఉన్న దేవతల క్యాలెండర్లు, చిత్ర పటాలు జీర్ణించినప్పుడు లేదా ఉపయోగించనప్పుడు వాటిని ఎలా విసర్జించాలి?*

జ: మనం ఉపయోగించనప్పుడు ఉపయోగించే వారికి ఇవ్వచ్చు. జీర్ణించినప్పుడు వాటిని నదులలోగానీ, సముద్రాలలోగానీ వదిలేయాలి. అవి ఆ జలాల లోపాలకి వెళ్లిపోయేలా చూసుకుని కదలాలి. మళ్ళీ వడ్డుకి వచ్చి చెత్తలో కలవకుండా జాగ్రత్తపడాలి.

ప్ర: *శివునకు భక్ష్యం, భోజ్యం, పులిహోరా, పొంగలి, గుగ్గిళ్ళు భక్తులు తమ ఇళ్లల్లో వండి శివాలయంలో నైవేద్యం పెట్టవచ్చునా లేక అర్చకులే వండి వడ్డించాలా? వారి ఇంట్లో వండిన అన్నం నైవేద్యం పెట్టవచ్చా?*

జ: దేవాలయంలో శుచి ప్రధానం. అది కాపాడబడినప్పుడే దేవాలయంలో శక్తి స్థిరంగా ఉంటుంది. వేరేచోట వండి తెచ్చిన ఆహారం నివేదనకు పనికిరాదు. ఎంత శుచిగా వండినా, ప్రాంతం మర్చి తెచ్చిన వంట నివేదించరాదు. 

దేవసన్నిధానంలో శుచిగా వండినది, అన్యదృష్టి సోకకుండా దైవానికి నివేదించాలి. అర్చకుల ఇళ్లల్లో వండినా సన్నిధిలో నున్న గృహంలోనైతే ఫరవాలేదు. వారైనా సరే శుచిగా వండవలసిందే. లేకపోతే నివేదించడం కుదరదు.        

No comments:

Post a Comment