*ప్రణవోపాసన.....*
*ఆర్ష సంప్రదాయంలో ఆధ్యాత్మిక సాధనా ప్రక్రియ అంతా ప్రణవంతోనే ముడివడి ఉంటుంది. ప్రణవోచ్చారణ గృహస్థులకు, ప్రణ వోపాసన యోగులకు శ్రేష్ఠమంటారు పెద్దలు. పూజ, వ్రతం, యజ్ఞం, జపం, ధ్యానం... ఇలా దైవకార్యాలన్నీ ప్రణవంతోనే ప్రారంభమవు తాయి. ప్రణవంతోనే ముగుస్తాయి. వేదం మని షిని అమృత పుత్రులు (అమృతస్య పుత్రః)గా సంబోధించింది. ప్రణవోపాసన మనిషిని అమృత పుత్రుల్ని చేస్తుంది. ప్రణవాన్ని సర్వ వ్యాపకమైన శబ్దాత్మక తేజస్సుగా యోగులు వర్ణించారు. ఇది మనిషి హృదయకుహ రంలో వెలుగులీనుతుంది. ప్రణవం అంటే నిత్యనూతనమని అర్థం.*
*ఓంకారాన్ని ప్రణవం అంటారు. దీనిలో అకార, ఉకార, మకార, నాద బిందువులు ఉంటాయి. వరసగా ఇవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఈశ్వర, సదాశివులను బోధిస్తాయి.*
*'ఓం' సర్వ దేవతా సమష్టి రూపం. ఇది సాక్షాత్ పరబ్రహ్మాన్ని బోధిస్తుంది. ప్రణవం మనిషిని తరింపజేస్తుంది కనుక తారం* *అని, అజ్ఞానాన్ని నశింపజేస్తుంది కనుక వైద్యుతం అంటారు. ఇది సంసార సాగరాన్ని దాటించే సేతువుగా చెబుతారు. పరమాత్మలా ఓంకారమూ సాకార నిరాకార స్థితులు కలిగి ఉంటుంది. ఇది సగుణ, నిర్గుణోపాసనలను సిద్ధింపజేస్తుంది.*
*"ఏ శబ్దం నుంచి అన్ని శబ్దాలూ వ్యక్తమవు తున్నాయో అదే ఓంకారం. సృష్టిలో మొదట ఉద్భవించింది ఓంకార ధ్వని. యోగులు దీన్ని వింటున్నారు. ఇది పారమార్దిక, లౌకిక ప్రయోజనాలు అందిస్తుంది' అంటారు వివేకానందులు. ఉపనిషత్తులు ప్రణవ సాధ నను ప్రధానంగా బోధిం చాయి. ప్రణవ రహస్యాన్ని ఛేదించి, మానవాళికి అందిం చాయి. 'త్రివేదాలు (ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలు), త్రిగుణాలు, త్రిమూర్తులు, త్రికాలాలు, త్రిధామాలు (సూర్యచంద్రాగ్నులు) ప్రణవం నుంచి పుట్టాయి. ఓంకార మంత్ర విస్తరణే గాయత్రి మహామంత్రం' అంటుంది ఉపనిషత్తు.*
*దైవకార్యాల్లో చేసే ప్రణవో పాసన వల్ల అనేక ప్రయోజనాలు సాధించవచ్చు. సహ జసిద్ధ ప్రాణాయామం అలవ డుతుంది. శరీరంలో రక్తప్రస రణ సజావుగా సాగేందుకు దోహదపడుతుంది. మానవ శరీరంలోని షట్చక్రాలు ఊర్ద్వముఖమై వికసిస్తాయి. శరీరంలోని 72 30 నాడులు ఉత్తేజితమవు తాయి. కుండలిని జాగృతం అవుతుంది. విశ్వజనీనమైన చైతన్య కిరణాలను మనిషి పూర్ణంగా స్వీకరించగలడు. మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ఉన్నతికి సర్వవిధాలా తోడ్ప డుతుంది. మానసిక ప్రవృత్తు లను శాసించే రజో తమో గుణాలు అదుపులో ఉంటాయి. దీనితో మనోని గ్రహం పొందుతాడు. సాత్విక ధృతి అలవడు తుంది. నిస్వార్ధ కర్మానుష్ఠానానికి ఎదుగుతాడు.*
*ప్రణవోపాసనతో అంతఃకరణ పూర్తిగా శుద్ధి అవుతుంది. యోగమార్గం సులభం అవుతుంది. 'ప్రణవోపాసకుడి హృదయమే ధనుస్సు, ప్రణవం బాణం, లక్ష్యం పరమాత్మ' అంటుంది దేవీ భాగ వతం. ఓంకారాన్ని నిరంతరం జపించడమే ప్రణవోపాసన. 'తైలధారా మివాచ్చిన్నం దీర్ఘ ఘంటా నినాదవత్' అనే ఉపనిషత్తు వాక్యం ప్రణవాన్ని ఎలా జపించాలో వివరించింది. తైల ధారలాగా విరామం లేకుండా ఉచ్చరించాలి. ఘంటానాదంలా మృదులంగా ప్రారంభించాలి. క్రమక్రమంగా శబ్దాన్ని పెంచాలి. తిరిగి మృదుల స్థాయికి తీసుకురావాలి అనేది దీని అర్ధం.*
*అకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు హృదయ కమలం ముకుళిస్తుంది. ఉకారానికి వికసిస్తుంది. మకారానికి నాదం వెలువడుతుంది. అధోముఖంగా ఉన్న హృదయ కమలం ఊర్ధ్వముఖమవుతుంది. ప్రణ వోపాసనలో పరిణతి పొందితే, ఓంకార ధ్యానం సిద్ధిస్తుంది. 'ఓంకారాన్ని శబ్దరూ పంగా హృదయకమలంలో నిశ్చలమైన దీపంలా ధ్యానించాలి' అంటుంది ధ్యాన బిందూపనిషత్తు. ప్రణవోపాసన అంటే మనిషి శరీరంలో నిగూ ఢంగా ఉన్న అగ్నిని ఓంకార సాధన ద్వారా ప్రజ్వలింపజేయడం. ఓంకార సాధన శరీరాన్ని ఒక అరణి (రాపిడితో అగ్నిని పుట్టించేందుకు ఉపయోగించే కట్టె)గా చేస్తుంది. ధ్యానంతో దీన్ని మధిస్తే, మనిషిలో జ్ఞానాగ్ని పుడుతుంది. బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. ఆత్మానుభవం లభిస్తుంది. సర్వత్రా పరమాత్మను దర్శిస్తాడు!*
*┈┉━❀꧁గురుభ్యోనమః꧂❀━┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌼🪷🌼 🙏🕉️🙏 🌼🪷🌼
No comments:
Post a Comment