*ధర్మం.....*
*శాస్త్రవిహితమైన కర్మలు ధర్మం అనబడ తాయి. మన నడవడి, మన చేష్టలు, మన వృత్తి ఇతరులకు ఇబ్బంది కల్గించనవి, సజ్జనులకు హాని కలిగించనివే ధర్మం అన్పించుకుంటాయి. వ్యవస్థా గతంగా వున్న నియమాలు సంఘ నియమాలు, సంస్కృతి నియమాలు ధర్మమార్గాలు అనిపించు కుంటాయి.*
*స్వాధ్యాయం, బ్రహ్మచర్యం, దానం, యజనం, ఔదార్యం, సారళ్యం, దయ, ఆహింస, ఇంద్రియ విజయం, క్షమాగుణం, ఆత్మ సంయమనం, శుచిత్వం, సత్సంకల్పత్వం శివకేశవ భాస్కర దేవా దులపట్ల భక్తి- ఇవి మనం అనుష్టించవలసిన ధర్మాలు. వీటిలోనే వృత్తిరీత్యా, కుల రీత్యా కొన్ని మార్పులు శాస్త్రాలలో చెప్పారు. ఉదాహరణకు అందరికీ ఆహింసయే పరమధర్మం అని చెప్పినా సైనికులకు మాత్రం శత్రుజయం ధర్మం అని చెప్పారు.*
*ధృతి, క్షమ, దమం. ఆస్త్రీయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, హ్రీః (సిగ్గు), విద్య, సత్యం, ఆక్రోధం- ఈ పది లక్షణాలు కల్గియున్న ధర్మం అని శాస్త్రం చెబు* *తోంది.*
*అంటే మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. తనకు సంబంధించినది కానివ్వండి, కుటుంబానికి సంబంధించినది కానివ్వండి. సమాజానికి సంబం ధించినది కానివ్వండి- ప్రారంభించేటపుడు ఏ సమస్యలుండవు. కానీ ప్రారంభించిన కొన్ని రోజు లకే సమస్యలు ప్రారంభమవుతాయి. కువిమర్శలు వస్తాయి. ఎన్నో అడ్డంకులు కల్గి నిరాశ కల్లు తుంది. కాని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మల లంతో అకుంఠిత దీక్షతో ధృతి చెడకుండా. ముందుకు సాగిపోవాలి. ఇదే ధర్మం.*
*మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి, క్షమాగుణంతో ఉండాలి. ప్రతిదానికీ, ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ క్షమాశ క్తితో ఎదుర్కోవాలి, కోపగించుకోకూడదు. ఓర్పు గుణం వున్నవారిని ఏ శక్తులు ఏమీ చేయలేవు. ఇదే ధర్మం.*
*మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆవిషయంలోనే లగ్నం కావాలి. ఒక పనిచేస్తూ మరోదానిని గురించి ఆలోచించకూ వదు. తనకు తెలియని విషయాలను తాను తెలు సుకొనక, పెద్దలు, పూర్వులు చెప్పినదానిని అంగీ కరించక, స్వతంత్ర నిర్ణయం తీసుకొనక, నిస్తే అంగా, నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా నియమ రహితుడిగా ఉండకూడదుగాక కూడదు. ఇది ధర్మం.*
*మనిషికి చదువున్నా, సంపదలున్నా కీర్తి వున్నా బలం వున్నా ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పడు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి వదిలేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. మనస్సును గెలిచినవాడు దేవేంద్రు డినైనా గెలుస్తాడు. మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకుంటారో వారిని భూత ప్రేతాలు గాని, దెయ్యాలుగాని, యక్ష డిన్నెరలుగానీ, గ్రహాలు, రోగాలు కానీ, కష్టసుఖాలు గానీ, మరణంగానీ వారి వశంలో వుంటాయి, మన మనస్సును, మాటను, దృష్టిని శరీరాన్ని చేతలనూ అదుపుచే యాలి. ఇదే ధర్మం.*
*మనిషి ప్రతి విషయానికి సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించడం కూడదు. మనిషి సత్య వ్రతం కల్గివుండాలి. ఆకారణంగా, అనవసరంగా ఒకరి మెప్పుకోసం, ఒకరిని మెప్పించటం కోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏవి ధంగానైనా ప్రయోజనం పొందటం కోసం, తనవా రిని తృప్తి పెట్టడం కోసం అబద్దాలు చెప్పకూడదు. ఆబద్దం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. మరో వాటికి అవమానంపాలు చేస్తుంది. మనిషి విలు వను మట్టిపొట్టేస్తుంది. మన శక్తినీ, కీర్తినీ, గొప్పద నాన్నీ ఆధఃపాతాళానికి తొక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు.*
*మానవునికి ఆహారం ఎంత ముఖ్యమో వివేకం కూడా అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు విన్నంత మాత్రాన వివేకం సిద్ధిం చదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్లిం చుకోవాలంటే మనిషికి విద్య కావాలి. 'విద్యా విహీనః పశు:' అని ఆర్యోక్తి, మనిషిగా పుట్టి మట్టి బొమ్మగా జీవితం గడపకూడదు. ఎంతటి బంధాలు పెనవేసుకొని వున్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరమైవున్నా భిక్షమెత్తైనా చదువుకో వాలని ఋషివాక్యం. ఇది ధర్మం.*
*మనిషికి పగ హింస, కోపం, ప్రతీకార మన స్తత్వం-ఇవన్నీ మనిషిని పతనం చేస్తాయి. తన అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తాయి. తనను కన్న వారికీ, తాను జన్మనిచ్చినవారికీ, తనను నమ్మి బ్రతికేవారికి అన్యాయం కల్గుతుంది. ఆకారణంగా పాటి ప్రాణుల్ని హింసించటం, రాళ్ళు కర్రలతో కొట్టడం ధర్మం కాదు. కోపాన్ని జయిస్తే మనుషు లను జయించవచ్చు. సమస్యలను అధిగమించ వచ్చు, కోపం భవిష్యత్తును, జీవితాన్ని పతనం చేస్తుంది.*
*అందుకే శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్లు "యదా యదాహి ధర్మస్య గ్లా నిర్భవతి భారతా! అభ్యుతాదనమ ధర్మస్య తదాత్మానం సృజొమ్మ హమ్'- పాండవులు ధర్మపరాయణులు కాబట్టి శ్రీకృష్ణుడు పాండవ పక్షాన నిల్చి వారికి సహకరిం చాడు. అధర్శంతోనే తొక్కివేశాడు. ఆదర్శపరు లను ఆధర్శంతోనే ఎదుర్కొనవచ్చు, తప్పుకాదు.. ధర్మపరులను ఆధర్మంతో దెబ్బతీయకూడదు. ఇది పాపకార్యం ఋతుధర్మంవల్లనే వర్షాలు కురుస్తు న్నాయి. చెట్లు పండ్లు ఫలాలనిస్తున్నాయి. కాలద ర్మంవల్లనే మనిషి మరణిస్తున్నాడు. మరలా సంయోగ ధర్మంవల్లనే మళ్లీ జన్మిస్తున్నాడు. కనుక అంతా దర్శమే. ధర్మ ఆచరణీ మానవాళికి మోర్ల మార్గం.*
*┈┉┅━❀꧁హరేకృష్ణ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🕉️🙏🕉️ 🙏🕉️🙏 🕉️🙏🕉️
No comments:
Post a Comment