*నిశ్శబ్దం యొక్క విలువ వినాయకుడి*
*మాటల్లో*
*వేదవ్యాసుడు మహాభారతాన్ని ఆశువుగా చెప్తుంటే, వినాయకుడు నిరాటంకంగా వ్రాసి ఆ పంచమవేదాన్ని మనకందించిన విషయం తెలిసిందేగదా ! అంతా వ్రాయటం పూర్తిచేసిన తర్వాత, వేదవ్యాసుడు విఘ్నేశ్వరుని, ‘ విఘ్నేశా ! ఇది వ్రాయటంవలన నీవు, దీనిని చదవటంవలన మానవకోటి పునీతులౌతారు. పరమాత్మ నానోటిద్వారా చెప్పించిన అమృతవాక్కులు నీవు వ్రాశావు. అయితే, నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటుంది. అది ఏమంటే, నేను నీకు ఎన్నో వేలపదాలు శబ్దరూపంలో చెప్పాను. కానీ, నీనోటి నుండి ఒక్క వాక్యం కూడా రాలేదు. నీకు ఇంతటి సంయమనం ఎలా అలవడింది ? ‘ అని అడిగాడు.*
*దానికి విఘ్నేశ్వరుడు చిరునవ్వుతో తలపంకించి, ‘ మహర్షి వేదవ్యాసా ! కొన్నిదీపాలలో చాలా ఎక్కువనూనె వుంటుంది. కానీ, కొన్నింటిలో చాలా తక్కువనూనె వుంటుంది. అయినా, యే దీపానికీ చిరకాలం నిరంతరంగా* *వెలిగేంతనూనె కలిగివుండడం అయ్యే పనికాదు. అదే విధంగా, మానవులకైనా, రాక్షసులకైనా, దేవతలకైనా సరే, పరిమితమైన జీవితం వుంటుంది. ఎవరైతే ఆత్మ సంయమనంతో, వాళ్ళవాళ్ళ శక్తులని ఓర్పుతో పరిస్తితులను అర్ధం చేసుకుని ఉపయోగించుకుంటారో, వాళ్ళు తమ జీవితాంతం పూర్తి తేజస్సుతో జీవిస్తారు.*
*ఆత్మ సంయమనానికి మొదటి మెట్టు, వారివారి వాక్కును నియంత్రించుకోవడం. ఎవరైతే నియంత్రించుకోలేరో వారి శక్తి వృధాగా పోతుంది. వాక్కు నియంత్రణ వలన దానిని నివారించవచ్చు. అందుకనే నేనెప్పుడూ, నిశ్శబ్దానికి వున్న శక్తిని నమ్ముతాను.‘ అని విపులంగా నిశ్శబ్దానికి వున్న శక్తిని గురించి వినాయకుడు వ్యాస భగవానునికి విపులీకరించాడు.*
*┈┉┅━❀꧁ జై గణేశా ꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🏵️🍁 🙏🕉️🙏 🍁🏵️🍁
No comments:
Post a Comment