Sunday, September 27, 2026

300 కిలోల జంధ్యాలు! 😱 The Bloody History & Secret Science of Janeu | Voice of Maheedhar

300 కిలోల జంధ్యాలు! 😱 The Bloody History & Secret Science of Janeu | Voice of Maheedhar

Author Name:Voice of MAHEEDHAR

Youtube Channel Url:https://www.youtube.com/@VoiceOfMaheedhar

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gefsQVfB-B4





Title: 300 కిలోల జంధ్యాలు! 😱 The Bloody History & Secret Science of Janeu | Voice of Maheedhar

Author Name: Voice of MAHEEDHAR

Description: 300 కిలోల జంధ్యాలు! 😱 ప్రాణాల కంటే ఆ 3 పోగులు ఎందుకు ముఖ్యం? 🚩 The Bloody History & Secret Science of Janeu! The Untold Truth of Yagyopavitam Exposed | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive...

Join this channel to support me and get access to perks:
https://www.youtube.com/mplanetleaf/join

OUR OTHER CHANNELS:

►FOLLOW US ON AUDI9 (Website) :- https://www.audi9.com
►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :-    / mplanetleaf  
►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :-    / factshive  
►SUBSCRIBE TO SMB AUDIOBOOK (Channel) :-    / smbab  
►SUBSCRIBE TO WHATSAPP (Channel) :- https://whatsapp.com/channel/0029VaAU...

SOCIAL MEDIA:

►SUBSCRIBE TO WHATSAPP (Group) :- https://goo.gl/Y3Sa7S
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- https://goo.gl/CBhgyP
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- https://goo.gl/ZTwU1K
►SUBSCRIBE ON TELEGRAM (Group) :- https://t.me/mplsd

Did you know that during Akbar's reign, a staggering 300 kilograms of sacred threads (Janeu) were collected from the bodies of massacred Hindus at Chittorgarh? Or that Acharya Brahmabhatt willingly sacrificed his life and offered his own blood to protect the Somnath Jyotirlinga from the ruthless Mahmud of Ghazni?

Welcome to another eye-opening documentary by Voice of Maheedhar. In this in-depth video, we dive deep into the blood-stained history, the supreme sacrifices, and the profound spiritual science behind the "Janeu" or "Yagyopavitam"—the sacred thread of Sanatana Dharma.

For decades, modern narratives and so-called liberals have falsely labeled the Yagyopavitam as a tool of "Brahmanical Patriarchy" and caste oppression. But the ancient Hindu scriptures reveal a mind-blowing truth!

In this video, we uncover:
🔹 The spine-chilling history of Islamic invasions and the mass persecution of Janeu-dharies.
🔹 Proof from ancient texts (Sushruta Samhita) & Dharampal's records that Shudras underwent Upanayana and studied in Gurukuls.
🔹 Did you know women went through Upanayana at the age of 8? The truth about Brahmavadinis!
🔹 The hidden anatomy of the sacred thread: How the 3 threads connect to Ida, Pingala, and Sushumna nadis.
🔹 The 9 deities residing in the Janeu, the Brahma Granthi, and the 3 eternal debts of human life (Rishi, Deva, and Pitru Runa).
🔹 The scientific positioning of the thread: Upavita, Prachinavita, and Nivita.

Discover why our ancestors chose death over abandoning their Dharma. If you want to know the real, unfiltered history of India and the eternal essence of Sanatana Dharma, watch till the end!

🙏 Lokah Samastah Sukhino Bhavantu

🔔 Don't forget to LIKE, SHARE, and SUBSCRIBE to Voice of Maheedhar for more deeply researched documentaries on ancient Indian history and Sanatana Dharma!

© Voice of Maheedhar. All rights reserved. Unauthorized reproduction or redistribution of this documentary is strictly prohibited.

#Janeu #Yagyopavitam #VoiceOfMaheedhar #SanatanaDharma #IndianHistory #Hinduism #UntoldHistory #AncientIndia #HinduFacts #Upanayana #Dharma #TeluguDocumentary #HistoryFacts #SpiritualAwakening #HinduismAndScience #DeepDive #TrueHinduism #AncientIndia

Voice of Maheedhar documentaries, history of janeu in telugu, yagyopavitam significance, untold indian history, akbar chittorgarh massacre 300 kg janeu, mahmud of ghazni somnath temple attack, acharya brahmabhatt sacrifice, true science behind sacred thread, upanayana sanskar for women, shudras in ancient gurukuls, dharampal indian education system, brahmanical patriarchy myth busted, ida pingala sushumna nadis, 3 debts of human life rishi deva pitru, upavita prachinavita nivita meaning, brahma granthi significance, 9 deities in yagyopavitam, why do hindus wear janeu, sanatana dharma history telugu, breaking myths about hinduism, real history of india, telugu historical documentary, voice of maheedhar latest video.

Transcript:
(00:01) నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మహీధర్ చరిత్ర పుటలను ఒక్కసారి తీరిగ్గా పరిశీలిస్తే నెత్తుటి మరకలతో తడిసిన ఎన్నో చీకటి అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. [సంగీతం] ఇస్లామిక్ దండయాత్రల నుండి వలసవాదుల క్రూరమైన పాలన వరకు చివరకు నేటి ఆధునిక కాలంలోని సైద్ధాంతిక [సంగీతం] విభేదాల వరకు బ్రాహ్మణులు మరియు ధర్మరక్షకులు ఎన్నో దారుణమైన అణచివేతలను ఎదుర్కొన్నారు.
(00:30) కానీ ఎన్ని దాడులు జరిగినా ఎంతటి విపత్క్ర పరిస్థితులు ఎదురైనా ఒక ప్రతీక మాత్రం చెక్కు చెదరకుండా నిలబడింది. అదే జంధ్యం లేదా యజ్ఞోపవీతం సనాతన ధర్మ జీవన విధానానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఒక పవిత్రమైన దారం కేవలం మూడు పత్తిపోగులతో పేనిన ఈ దారం చూసేందుకు చాలా సాధారణంగా అనిపించవచ్చు. [సంగీతం] నేటి ఆధునిక సమాజంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు ఉదారవాదులు దీనిని ఒక అణచివేత సాధనంగా ఒక వర్గపు ఆధిపత్యానికి ప్రతీకగా [సంగీతం] చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
(01:08) కానీ వాస్తవానికి ఈ చిన్న దారం వెనుక వేల సంవత్సరాల నెత్తుటి త్యాగాల [సంగీతం] చరిత్ర దాగి ఉందన్న నిజం వారికి తెలియదు. ఒకప్పుడు ఈ జంధ్యాన్ని ధరించడం అంటే సాక్షాత్తు మృత్యువుకు ఎదురెళ్ళడం [సంగీతం] విదేశీ మూకలు మన దేవాలయాలను నేలమట్టం చేసి మన గ్రంథాలను తగలబెట్టి మన సంస్కృతిని వేర్లతో సహా పెకలించి వేయాలని ప్రయత్నించిన ఆ భయంకరమైన రోజులలో మన పూర్వీకులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ ఛాతిపై ఈ యజ్ఞోపవీతాన్ని గర్వంగా ధరించారు.
(01:42) కరుడు కట్టిన మతోన్మాదుడు గొంతుపై కత్తి పెట్టి మతం మారతావా ప్రాణాలు వదులుతావా అని బెదిరించినప్పుడు నవ్వుతూ మరణాన్ని ఆలింగనం చేసుకున్నారే తప్ప తమ మెడలోని జంధ్యాన్ని మాత్రం వదులుకోలేదు. వారు తమ నెత్తురు ధారబోసి కాపాడిన సనాతన ధర్మపు వారసత్వం ఈ జంధ్యం. [సంగీతం] ఈ దారాన్ని తెంచేస్తే సనాతన ధర్మం రూపుమాసిపోతుందని ఆనాడు ఆక్రమణదారులు పగటి కలలు కన్నారు.
(02:12) ప్రాణభయంతోనైనా హిందువులు తమ ఆచారాలను వదిలేస్తారని భావించి కని విని ఎరుగని మారణ హోమాలకు తెగబడ్డారు. కానీ ఆ కిరాతకులకు తెలియని సత్యం ఏమిటంటే జంధ్యం అంటే కేవలం శరీరంపై ధరించే నూలుపోగు కాదు అది మన పూర్వీకుల ప్రాణవాయువు అని మన సంస్కృతికి అదృశ్య కవచం అని ఆ కవచాన్ని ఛేదించడానికి ఆ పవిత్ర దారాన్ని మట్టిలో కలపడానికి వారు ఎంతటి పైశాచికత్వానికి ఒడిగెట్టారో వింటే ఈనాటికి మన గుండెలు బరువెక్కుతాయి.
(02:42) రక్తం కన్నీరై కారుతుంది. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్ ప్రముఖ బ్రిటిష్ చరిత్రకారుడు జేమ్స్ టాడ్ రాజస్థాన్ చరిత్ర గురించి రాసిన ఒక భయంకరమైన వాస్తవం [సంగీతం] మీకు తెలుసా? అక్బర్ కాలంలో చిత్తూర్గడపై జరిగిన ఒక మారణ హోమంలో వేలాది మంది అమాయక హిందువులను ఊచకోత కోసారు.
(03:14) ఆ చంపబడిన వారి శరీరాల నుండి జంధ్యాలను తీసి తూకం వేయాలని సాక్షాత్తు అక్బర్ ఆజ్ఞాపించాడు. ఊహించండి ఆ జంధ్యాల బరువు ఎంతుందో అంచనా వేయగలరా సుమారు 74.5 ఐ మణగులు అంటే దాదాపు 300 కిలోల బరువు తూగాయి ఆ పవిత్ర దారాలు ఇది కేవలం ప్రాణ నష్టం గురించి చెప్పే లెక్క కాదు అల్లా మాలిక్ అల్లాను తప్ప మరెవరిని పూజించకూడదనే ఉన్మాదంతో సనాతన ధర్మ ప్రాచీన సంప్రదాయాలను పాటించే వారి గుండెలలో భయం పుట్టించడానికి అత్యంత పగడ్బందీగా వేసిన వ్యోహం ఇది.
(03:53) కేవలం జంధ్యాలను మాత్రమే కాదు మన దేవాలయాల పవిత్రతను కాపాడడానికి మన పూర్వీకులు చేసిన త్యాగాలు వర్ణనాతీతం మొహమ్మద్ గజిని ఆ మహా సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి దండెత్తి వచ్చినప్పుడు జరిగిన ఒక ఉదంతం వింటే మనకు రోమాలు నిక్కబడుచుకుంటాయి. గజిని సైన్యం గుడిని సమీపిస్తున్నప్పుడు అక్కడి రాజపురోహితుడు ఆచార్య బ్రహ్మభట్ రాజుతో ఇలా అన్నాడు.
(04:21) [సంగీతం] మహారాజా రాజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపం కాబట్టి ఈ జ్యోతిర్లింగంలోని దివ్య కాంతిని నేను ఇప్పుడు మీ శరీరంలోకి ఆవాహన చేస్తున్నాను. [సంగీతం] ఆ పవిత్రమైన ప్రక్రియ పూర్తయిన వెంటనే రాజును అక్కడి నుండి సురక్షితంగా వెళ్ళిపోవలసిందిగా ఆచార్యుల వారు ఆదేశించారు. ఆ తర్వాత గజిని ఆ గర్భగుడిలోకి ప్రవేశించగానే ఆచార్య బ్రహ్మభట్ ఏమాత్రం భయపడకుండా గజినికి ఎదురెళ్లి కళ్ళలోకి సూటిగా చూస్తూ [సంగీతం] నీ చేతిలో ఉన్న గదతో నా తలమీద కొట్టు అని గర్జించాడు.
(04:57) ఆచార్య బ్రహ్మభట్కు ఒక విషయం స్పష్టంగా తెలుసు మనిషి తలలో ఉండే రక్తాన్ని బ్రహ్మకపాలి అంటారు. ఇది అత్యంత పవిత్రమైనది. గజని తన తలపై కొట్టినప్పుడు ఆ కారి రక్తంతో శివుడికి అభిషేకం జరిగిపోతుంది. శాస్త్రాల ప్రకారం ప్రాణ ప్రతిష్ట జరిగిన ఏ విగ్రహమైనా ఇలా రక్తంతో అభిషేకించబడితే ఆ విగ్రహం తన దివ్యత్వాన్ని వదిలేసి ఒక సాధారణ రాయిలా మట్టిలా మారిపోతుంది.
(05:27) [సంగీతం] అంటే తన రక్తం చిందించి తన ప్రాణాన్ని త్యాగం చేసి మరి ఆ కిరాతకుడైన గజిని ఆ పవిత్రమైన జ్యోతిర్లింగాన్ని అపవిత్రం చేయకుండా ఆచార్యుల వారు అడ్డుకున్నారు. [సంగీతం] ఆచార్య బ్రహ్మ భట్ లాంటి అసంఖ్యాకమైన మహనీయుల అత్యున్నత ప్రాణత్యాగాల పునాదుల మీదే మన శాశ్వతమైన సనాతన ధర్మం నేటికీ ఇంత పవిత్రంగా సజీవంగా నిలబడి ఉంది.
(05:54) అయినా సరే కళ్ళెదుటే ఇలాంటి మారణకాండలు జరుగుతున్న ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న మన పూర్వీకులు మూకుమ్మడిగా ఉపనయన సంస్కారాలను నిర్వహించడం ఆపలేదు. ఆ పవిత్రమైన దారాన్ని రక్షించుకోవడానికి తమ నెత్తులు ధారపోశారు. [సంగీతం] అసలు ప్రాణాల కంటే ఈ దంధత్యానికి ఉన్న విలువఏమిటి? సనాతన ధర్మంలో మానవుడి శారీరక మానసిక వికాసానికి నిర్దేశించిన [గొంతు సవరించుకోవడం] 16 సంస్కారాలలో అత్యంత అపురూపమైనది ఉపనయనము లేదా యజ్ఞోపవీత సంస్కారము ఉప అంటే దగ్గరగా అని అర్థం నయనం అంటే నడిపించడం ఉపనయనం అంటే సత్యం వైపు దగ్గరగా నడిపించడం సామాన్య పదాలలో చెప్పాలంటే విద్యార్థి దశ
(06:40) లేదా గురుకులంలో విద్యాభ్యాసానికి నాంది పలకడం ఈ పవిత్రమైన సంస్కార సమయంలోనే విద్యార్థి జంధ్యాన్ని ధరిస్తాడు. సరే [సంగీతం] ఇది బాగానే ఉంది. కానీ జంధ్యం కేవలం బ్రాహ్మణులు మాత్రమే ధరించాలి కదా సమాజంలోని శూద్రులను ఇతర వర్గాలను విద్యకు దూరం చేయడానికి బ్రాహ్మణులు పన్నిన కుట్ర కదా ఇది అని కొందరు మేధావులు దశాబ్దాలుగా మన మెదళ్లలో విషం నింపారు. ఇదొక పెద్ద అబద్ధం.
(07:12) నిజం ఏమిటంటే ఆధునిక భావజాలం ఉన్న ఉదారవాదులకు ఏమాత్రం రుచించని ఒక చారిత్రక సత్యం [సంగీతం] ఉంది. ప్రాచీన కాలంలో జంధ్యాన్ని అన్ని వర్ణాల వారు ధరించేవారు. ఎందుకంటే సనాతన ధర్మంలో బ్రాహ్మణుడు అనేది పుట్టుకతో వచ్చేది కాదు. వారి కర్మల ద్వారా నిర్ణయించబడే ఒక ఉన్నత స్థితి మన హిందూ గ్రంథాలు ఇదే విషయాన్ని పదే పదే స్పష్టం చేశాయి.
(07:41) [సంగీతం] జన్మనా జాయతే శూద్రః సంస్కార ద్విజ ఉచ్యతే అంటే పుట్టుకతో ప్రతి మనిషి శూద్రుడే ఏమి తెలియని అమాయకుడే కానీ శుద్ధి క్రమశిక్షణ మరియు విద్యాభ్యాసం అనే సంస్కారాల ద్వారా ఒక సాధారణ వ్యక్తి రెండవ జన్మ పొందిన ద్విజుడిగా ఒక జ్ఞానిగా ఎదుగుతాడు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమన్నారో మనం గతంలో కూడా చెప్పుకున్నాము.
(08:09) మంచి విషయాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడంలో తప్పు లేదు. చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మ విభాగశః అంటే ఈ నాలుగు వర్ణాలను మనుషుల గుణాలను వారు చేసే కర్మలను బట్టి సృష్టించానే తప్ప వారి పుట్టుకను బట్టి కాదు అంతేకాదు మహర్షి సుశృతుడు రచించిన సుశృత సంహితలోని సూత్రస్థానం ప్రకారం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులతో పాటు శూద్రులు కూడా ఉపనయన సంస్కారం పొంది జంధ్యాన్ని ధరించి విద్యను అభ్యసించడానికి అర్హులే బ్రిటిష్ పాలనా కాలంలో అనగా సామాన్య శకం 18, 19వ శతాబ్దాలలో భారతీయ విద్యా విధానంపై లోతైన పరిశోధన చేసిన ప్రఖ్యాత చరిత్రకారుడు ధరంపాల్ గారి రికార్డులను
(08:55) ఒకసారి చూడండి. [సంగీతం] నాటి భారతీయ గురుకులాలలో చదువుకున్న విద్యార్థులలో అత్యధికుల సూద్రులే ఈ వాస్తవాన్ని పక్షపాత బుద్ధితో వ్యవహరించే నేటి ఫ్యాక్ట్ చెక్కర్స్ కూడా కాదనలేరు. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వైద్యం వాస్తు ఖగోళం లాంటి అనేక శాస్త్రాలలో వారు బ్రాహ్మణుల కంటే అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన దాఖలాలు ఆ రికార్డులలో స్పష్టంగా [సంగీతం] ఉన్నాయి.
(09:24) హిందూ సమాజంలో చొరబడిన ఈ అంటరానితనం అనే జాడ్యాన్ని పారద్రోలడానికి స్వతంత్ర సమరయోధుడు వీరసావర్కర్ వేలాది మంది అనగారిన వర్గాల పిల్లలకు స్వయంగా ఉపనయనాలు చేయించారు. సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. దళిత పూజారులతో దేవాలయాల తలుపులు తెరిపించి సనాతన ధర్మపు అసలైన స్వరూపాన్ని ప్రపంచానికి చాటారు. ఇక భారతదేశంలో బ్రాహ్మణికల్ పితృస్వామ్యం ఉందంటూ [గొంతు సవరించుకోవడం] గొంతు చించుకునే వారికి మరో చెంప పెట్టు లాంటి చారిత్రక వాస్తవం ఇది.
(09:59) హారీత ధర్మ సూత్రాలు అశ్వలాయన గృహ్య సూత్రం మరియు యమస్మృతి వంటి ప్రాచీన గ్రంథాల ప్రకారం మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా ఎనిమిదవ ఏట ఉపనయన సంస్కారం జరిగేది. ఆ తరువాత వారు అత్యున్నత విద్యను అభ్యసించి బ్రహ్మవాదినులు అని సగౌరవంగా పిలువబడేవారు. గార్గి మైత్రి లాంటి విదుషీమణులు వేద సభలలో మహా పండితులను సైతం తమ వాగ్దాటితో ఓడించిన చరిత్ర మనది మరి ఇన్ని అద్భుతమైన విషయాలు దాగి ఉన్న ఆ జంధ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణత్యాగాలు ఎందుకు చేశారు? అందులో ఏముంది? సనాతన ధర్మ ప్రాచీన గ్రంథాలు స్మృతులు ఈ యజ్ఞోపవీతం యొక్క పుట్టుక గురించి అద్భుతమైన విషయాలను వివరించాయి.
(10:44) యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ అనే మంత్రం మీలో చాలామంది వినే ఉంటారు. దీని అర్థం ఈ యజ్ఞోపవీతం అత్యంత పవిత్రమైనదని సృష్టికర్త అయిన బ్రహ్మదేవునితో పాటే ఇది కూడా ఉద్భవించిందని దీనిని ధరించడం వల్ల మనిషికి ఆయుష్యు తేజస్సు మరియు అపారమైన బలం చేకోరుతాయని మన వేదాలు ఘోషిస్తున్నాయి. ఇది కేవలం ఒక పత్తిదారం కాదు.
(11:14) సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపంగా భావించే బ్రహ్మ సూత్రం బయటకు చూసే వారికి అందులో మూడు దారాలే కనిపిస్తాయి. కానీ దేవల స్మృతి మరియు ఇతర ఆగమ శాస్త్రాల ప్రకారం ఒక్కో దారాన్ని మళ్ళీ మూడు సూక్ష్మమైన పోగులతో పేనుతారు. అంటే జంధ్యంలో మొత్తం తొమ్మిది పోగులు ఉంటాయి. ఈ తొమ్మిది పోగులలో ఓంకారము అగ్ని నాగులు సోముడు పితృ దేవతలు ప్రజాపతి వాయువు సూర్యుడు మరియు విశ్రే దేవతలని తొమ్మిది మంది దేవతలు కొలువై ఉంటారని ప్రాచీన సాహిత్యం చెబుతోంది.
(11:50) ఇక ఈ దారాలను కలిపి వేసే ముడిని బ్రహ్మ గ్రంథి అంటారు. ఇది సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయకకు సజీవ సంకేతం. అంతేకాదు [సంగీతం] తైత్రియ సంహిత మరియు మనుస్మృతి లాంటి ధర్మశాస్త్రాలు ఈ జంధ్యాన్ని ధరించే విధానం వెనుక ఉన్న శాస్త్రీయతను కూడా స్పష్టంగా వివరించాయి. మనం చేసే కర్మను బట్టి ఈ దారం యొక్క స్థానం మారుతుంది.
(12:19) దైవ కార్యాలు శుభ కార్యాలు చేసేటప్పుడు ఎడమ భుజం మీదుగా ధరిస్తారు. [సంగీతం] దీనిని ఉపవీతం అంటారు. పితృ దేవతలకు సంబంధించిన కర్మలు అంటే శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు కుడి భుజం మీదుగా ధరిస్తారు. దీనిని ప్రాచీనావీతం అంటారు. ఇక ఋషులకు సంబంధించిన లేదా సాధారణ దైనందిన పనులు చేసేటప్పుడు మెడలో పూలమాలలా వేసుకుంటారు. దీనిని నివీతం అంటారు.
(12:48) మనిషి తన జీవితంలో నిర్వర్తించాల్సిన ప్రతి బాధ్యతకు ఆచరించాల్సిన ప్రతి ధర్మానికి ఈ యజ్ఞోపవీతం ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. కేవలం బాహ్యంగా కనిపించే ఈ నియమాలే కాకుండా ధర్మ గురువులు మరియు ఆధ్యాత్మిక పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం జంధ్యన్లోని మూడు పోగులకు ఎంతో లోతైన అంతర్గత అర్థం ఉంది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే మన శరీరంలో ప్రాణశక్తి ప్రవహించే నాడులకు ఇది ప్రతీక.
(13:18) మన సూక్ష్మ శరీరంలో ముఖ్యంగా మూడు నాడులు ఉంటాయి. ఈడ పింగళ మరియు సుషుమ్న. యోగ సాధన ద్వారా నియమ నిష్టల ద్వారా ఈ నాడులను శుద్ధి చేసుకున్నప్పుడు ప్రాణశక్తి ఎటువంటి ఆటంకాలు లేకుండా మధ్యలో ఉన్న సుషుమ్న నాడి గుండా స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. అప్పుడే మనిషి భౌతిక ప్రపంచపు సరిహద్దులను దాటి శాశ్వతమైన శాంతిని మోక్షాన్ని అనుభవిస్తాడు.
(13:46) ఈ అద్భుతమైన అంతర్గత ప్రయాణానికి ప్రతీకే ఆ మూడు దారపు పోగులు కేవలం వ్యక్తిగత మోక్ష సాధనకే కాదు సామాజికంగా కూడా దీనికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. [సంగీతం] పుట్టినప్పటి నుండి ప్రతి మనిషి మూడు రుణాలను తన భుజాలపై మోస్తుంటాడు. [సంగీతం] మొదటిది ఋషి ఋణం మనకు జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకు మనం తీర్చుకోవలసిన రుణం రెండవది దేవ ఋణం మనకు జీవితాన్ని ఇచ్చి ప్రకృతి వనరులను ప్రసాదించి మనల్ని కాపాడుతున్న దేవతలకు తీర్చుకోవలసిన రుణం మూడవది పితృ ఋణం మన ఉనికికి కారణమైన మన తల్లిదండ్రులు పూర్వీకులకు తీర్చుకోవలసిన
(14:31) రుణం ఈ మూడు పోగులు ప్రతిక్షణం ఒక బాధ్యత గల పౌరుడిగా మనకు ఈ రుణాలను గుర్తు చేస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తి ఉపనయన సంస్కారం పొంది గురుకులాలలో విద్యను అభ్యసియించి బ్రహ్మజ్ఞానాన్ని పొందడం ద్వారా సనాతన ధర్మం నలుదిశల ఒక మహా వృక్షంలా విస్తరించింది. [సంగీతం] అయితే హిందూ సంప్రదాయాల పట్ల ఉన్న ఈ భక్తి సత్యాన్వేషణ పట్ల ఉన్న ఈ తపన ఆక్రమణదారుల కంట్లో నలుసులా మారింది.
(15:01) [సంగీతం] మతమార్పిడులకు ఇస్లామిక్ దండయాత్రదారులకు ఇది ఎంత పెద్ద సవాలుగా మారిందో భారతదేశంలో జీసస్ బోధనలను వ్యాప్తి చేయాలని ప్రయత్నించిన క్రిస్టియన్ మిషనరీలకు కూడా అంతే పెద్ద అడ్డంకిగా మారింది. తమ మతాన్ని రుద్దాలనుకున్న వారి ప్రయత్నాలను ఎదిరించి [గొంతు సవరించుకోవడం] ప్రజలను ధర్మ మార్గంలో నిలబెడుతున్న ఈ జంతంధారులను చూసి వారు భయపడ్డారు.
(15:25) ప్రజలపై ఎక్కడ తమ నియంత్రణ కోల్పోతామో అనే భయంతో తమకు ఎదురు తిరుగుతున్నారనే కోపంతో ఇస్లామిక్ ఆక్రమణదారులు మరియు బ్రిటిష్ వలసవాదులు ఇద్దరూ బ్రాహ్మణులను జంధ్యం ధరించిన ప్రతి ఒక్కరిని క్రూరంగా హింసించారు. ఆ పవిత్రదారాన్ని ఒక నేరంగా పరిగణించారు. కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా సనాతన ధర్మాన్ని ఒక వివక్షతో కూడిన మతమనో పితృస్వామ్య వ్యవస్థ అనో నిందిస్తే ఈ నిజాన్ని వారికి గట్టిగా చెప్పండి.
(15:55) ప్రాచీన గ్రంథాలలో ఉన్న ఈ అమూల్యమైన జ్ఞానాన్ని నలుగురితో పంచుకోవడం ద్వారా మన సనాతన ధర్మంపై అలుముకున్న అపోహలని చీకట్లను మనం కొంతైనా పారద్రోలవచ్చు. అలా చేయడం ద్వారా మన భుజాలపై ఉన్న ఆ సామాజిక రుణాన్ని కొంతవరకైనా తీర్చుకున్న వారం అవుతాము. సర్వేజనా సుఖినో భవంతు మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
(16:23) మరి ఆ వీడియోలు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసినా తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.

No comments:

Post a Comment