Sunday, January 30, 2022

సనాతన ధర్మం* - _ఖాలిద్ ఉమర్_

 _Forwarded_


*సనాతన ధర్మం*

- _ఖాలిద్ ఉమర్_


సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం ఒక నిర్దిష్ట వ్యక్తి చే సృష్టించబడలేదు. ప్రకృతి నుండి ఉద్భవించిన ఏకైక విశ్వాసం హిందూ ధర్మం.. అలాగే హిందువులు ఆరాదించే దేవీ దేవతలు, ఆనందంగా జరుపుకునే పండుగలు వండే వంటలు తినే ఆహారం, ఆచారాలు అన్నీ కూడా ప్రకృతి నుండి ప్రేరణ పొందాయి.


జననం నుంచీ మరణం వరకు పుడమి తల్లి తన ప్రాణులను ఎంత ప్రేమగా చూసుకుంటుందో అంతే ప్రేమగా ఈ భూమిని ప్రకృతిని.. తనను పోషించే ప్రతి జీవినీ చెట్టునూ పుట్టనూ ఆఖరకు సర్పంలో సైతం  తన మాతృమూర్తిని దర్శించుకునే అత్యంత సంస్కార జీవన విధానం సనాతన ధర్మానిది..


సనాతన ధర్మం కొన్ని పరిమితులకు లోబడి లేదా జీవుల మీద పరిమితులను విధించే 'బొన్సాయ్' మతం కాదు.. హిందూధర్మం  అన్నిరకాల ఫల పుష్పాలకు  తననుంచి జన్మనిచ్చింది.. నిజానికి హిందూ ధర్మం ఒక పురాతన మహా వృక్షం, దాని కొమ్మలు చాలా విశాలంగా  వ్యాపించి మధుర రసాలను ఇచ్చే  పండ్లు, సువాసన గల పుష్పాలను కలిగి ఉండే శాశ్వత కల్పవృక్షం..


ఆ మహావృక్షం  అనేక జాతులకు సురక్షితమైన ఆశ్రయం అవుతుంది, అలసిపోయిన పాదచారులపై చల్లని నీడను వేస్తుంది. హిందూ ధర్మం తన  స్వభావంలో ఉదాత్తమైనది.. దాని ఆత్మలో లౌకికమైనది.


ప్రకృతిలో మనం చూస్తున్నట్లుగా జీవితం అనేది జనన మరణాల చక్రం అని హిందూ ధర్మం మనకు ఉద్బోధిస్తుంది, గొప్ప పనులు లేదా తప్పుల ద్వారా జీవులకు పాఠాలు నేర్పే వ్యవస్థ సహజంగా హిందూ ధర్మం లో ఉంటుంది.. దీని వలన జీవుల సర్వతోముఖాభివృద్దికి ఆ లక్షణాలన్నీ దోహదం చేస్తాయి..


ప్రకృతిలోని ఈ సహజ పరిణామం చెందిన సమాజం వేలాది సంవత్సరాలుగా  ఈ భూమండలాన్ని సుసంపన్నం చేసింది.


హిందూ ధర్మంలో మానవ నిర్మిత మతాల వలే ఏదో ఒక  ప్రవక్తకు కేంద్ర అధికారం లేదు. అలాగే వేలాది సంవత్సరాలుగా సహజంగా వచ్చిన పరిపూర్ణత యొక్క అహం లేదు.. సత్యం.. శివం.. సుందరం మాత్రమే చివరి, నిత్య నూతన సనాతన సత్యం అని హైందవం నమ్ముతుంది..


అన్ని ఇతర మానవ నిర్మిత విశ్వాసాలు మానవుని యొక్క దూకుడు, నీచమైన, అహంకార, కుత్సితమైన, సంకుచితమైన,  శిక్షాత్మక స్వభావం యొక్క భారాన్ని మోస్తున్నాయి.


దురదృష్టవశాత్తూ హిందువుగా జన్మించినందుకు విశ్వం తమకు ప్రసాదించిన అనుగ్రహాన్ని గుర్తించలేని హిందువులు అందమైన సాక్షాత్కారాన్ని కోల్పోతున్నారు.


సనాతన ధర్మం అంటే ప్రకృతికి మరొక పేరు.. అందుకే ఇది శాశ్వతమైనది, అత్యంత శక్తివంతమైనది. ప్రకృతికి అనుగుణంగా విశ్వం యొక్క దైవిక మార్గదర్శకాల క్రింద పనిచేసే ధర్మంతో పోలిస్తే, మానవ నిర్మిత మతాల యొక్క కఠినమైన మాన్యువల్‌ల క్రింద ఉండవలసిన భారం దురదృష్టవశాత్తూ ఆ మతాలలో జన్మించిన వారికి ఒక శాపం..


ప్రకృతి తన కనికరంలేని జీవిత చక్రం నుండి తనను తాను పోషించుకోవడం..అలానే సమస్త జీవజాతులనూ పోషించడం  ఎప్పటికీ ఆగిపోదు లేదా లొంగిపోదు.. హైందవం లో మరణం కూడా ఒక కొత్త ప్రారంభం.. మరో జన్మకు ఇది శ్రీకారం.. మీరు చేసిన పాప పుణ్యాల ఫలితంగా మరు జన్మలో మీరు కర్మఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది.. ఎంత అద్భుతమైన వివరణ!!..


కోట్ల సందేహాలకు ఒకేఒక్క సమాధానం 'కర్మఫలం ', 'పునర్జన్మ', చివరకు 'కైవల్యం', ఇంతకంటే శాస్త్రీయమైన ధర్మం ఈ భూమి మీద మరెక్కడ??..

లక్షలాది సంవత్సరాలుగా..కోట్లాది మునుల తపఃఫలం.. తాము దర్శించిన సత్యాన్ని సామాన్యులకు నిష్కామంగా అందించడం.. ఇదే కదా మానవాళికి హైందవం ఇచ్చిన అమృతగుళిక.. ధన్యోస్మి శివా.. ధన్యోస్మి..  


మానవ నిర్మిత వస్తువులు అనివార్యమైన నశించకుండా ఉండేందుకు స్థిరమైన నిర్వహణ అవసరం.. ఆ నిర్వహణ ధర్మాచరణ ద్వారా సిద్దిస్తుంది.


వివాహాలు విఫలం కావొచ్చు.. కానీ ప్రేమ ఎప్పుడూ విఫలం కాదు!! హిందూ ధర్మంలో మీకు కాంట్రాక్ట్ వివాహాలు ఉండవు.. ప్రేమ ద్వారా ఏర్పడే బంధం ఉంటుంది.. కుటుంబం పట్ల.. కుటుంబ వ్యవస్థ పట్ల బాధ్యత ఉంటుంది..

మరణానంతర జీవితం కంటే ఇప్పటి జీవితాన్ని  సుఖమయమూ..మంగళకరంగా ఎలా చేసుకోవాలని అనే విషయం పట్ల మిమ్మల్ని కార్యోన్ముకులను చేస్తుంది హిందూ ధర్మం.. మానవ నిర్మిత మతాలు  ప్రకృతి యొక్క ప్రయాణంతో పాటు తననుతాను ఏర్పాటు చేసుకున్న సహజసిద్ద వ్యవస్థలకు ఎలా పోటీ కాగలవు?? 


అవి దేవునికి భయపడేవి.. నమ్మకపోతే నరకానికి పంపుతాను అనేవి.. 

మరొకటి హైందవం భగవంతుడిని ప్రేమించేది.. భగవంతుడితో పాటు ప్రయాణం చేయించేది..

ఇప్పుడు ప్రపంచానికి రెండే రెండు అవకాశాలు..

ఒకటి ప్రకృతిని ప్రేమిస్తూ జీవనాన్ని సాగించడం..

రెండోది అన్నిటినీ ద్వేషిస్తూ జీవితాన్ని నరకప్రాయం చేసుకోవడం..

జై శ్రీరాం..


(పాక్ లోని లాహోర్ లో నివసించే జన్మతః హిందూ..ప్రమాదవశాత్తూ ముస్లిం..

గతంలో బలవంతంగా మతం మార్చబడ్డ ముస్లిం శ్రీ ఖాలిద్ ఉమర్ గారి వ్యాసానికి స్వేచ్చానువాదం..)

నేటి..వివాహా భందాలు....భాందవ్యాలు...


🌸భార్యామణులకు విజ్ఞప్తి.🌸
భర్త ఎంత కష్టపడ్డా...కష్టం గురించి ఆలోచించడు..
....ఎంత సంపాందించిన...లెక్కలు వేసి ఆడగడు...
ఎన్ని భాదలు పడిన..భాదను గమనించడు...
.....ఎంత బరువులు మోసిన..బరువును చెప్పడు...
......కానీ....
ఇంటికెళ్లగానే.....
......ప్రేమతో కూడిన..
అప్యాయతపు పిలుపులు....
....అనురాగపు మాటలు...
కాకుండా...
....ఉడికించే మాటలు..
వెటకారపు..వెక్కిరింతలు...
ఉంటే....
.....సహనంగా ఉండే మనస్సు..
అసహనానికి లోనై...
.....ఆవేశానికి గురై...
మాటల యుద్ధం మొదలయితే...
...దీనమ్మా..జీవితం...
ఉంటది...కోపంలో..పిచ్చి..పీక్స్.. కెళ్లిపోయిద్ది..

....అలిసిన తనువుకు...
చెమటే...పడుతుంది...
...కానీ...

ఆలీ..సూటిపోటిమాటలకు...
....మనస్సున జరిగే..అలజడి...
ఓ...ఉవెత్తు..ఉప్పెనెలా...ఎగిసిపడుతుంది...

.......కష్టపడితే....శరీరమే..
అలిసిపోతుంది...
.....కానీ....
భార్య...చేష్టలకు...ప్రాణమే చచ్చిపోతుంది...

.....ఎంత ఆనందంగా...
ఇంటికెళ్లతామో...
.....అంత అవమానాలే..ఎదురైతే...
నరకానికి...ఇంటికి..తేడాలేదనిపిస్తుంది...

....ప్రేమించమని ఎప్పుడు...అడగము...
కొంచెం..సునితంగా మాట్లాడమని కోరుకుంటాం...

ఆనందాన్నీ పంచమని..ఆశించం...
కాస్త చెప్పేది సావదానంగా వినమంటున్నాం...

....ప్రశాంతత లేని ఇల్లు...

సంతోషం లేని సంసారం...

.....అప్యాయత చూపని..భార్య...

అనురాగాలు లేని భందం...

...శరీరాలే తప్పా...మనస్సులు కలవని ప్రేమలు...

అర్ధంచేసుకోలేనీ...వెక్కిరింపులు...

....అపార్ధాలతోనే...సాగే పంతాలు...

అనుమానాలతో....బిగిసిపోయిన పౌరుషాలు...

పస్తులతో...కడుపు..

భాదతో పొంగే..కంట్లో కన్నీరు..

గందరగోళపు..ఆలోచనలు...

ఆందోళనలతో..నిండిన మనస్సు...

బ్రతుకే...నరకప్రాయమై...

జీవితమే...విరక్తికి...కారణాలై...

ప్రాణాలే..తృణప్రాయాలైతున్నవి....

నేటి..వివాహా భందాలు....భాందవ్యాలు...

#మగవాడిలో...వ్యసనాలకు దారితీస్తుంది..
#ఆడవారిలోని..అహంకారం..

#ఆడవారిలో..సహనాన్నీ చంపేస్తుంది..
#మగవారిలోని...ఆవేశం...

సేకరణ

తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఎందుకు💐⁉️

 *‼️⚜తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఎందుకు💐⁉️*


*https://chat.whatsapp.com/DnuAsVF1UnTJNC3k7yo3yp*


*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*


*తెలుగు సంవత్సరాలు 60మాత్రమే ఎందుకు తెలుసుకోవాల్సినదంతా ఇక్కడే ఉంది... తెలుగు సంవత్సరాలు అరవై అని అందరికీ తెలుసు.ప్రభవనామ సంవత్సరంతో మొదలైన ఈ పేర్లు అక్షయ వరకూ ఉంటాయి. అసలు ఈ పేర్లు ఎలా వచ్చాయి? కేవలం అరవై మాత్రమే ఉండటానికి కారణం ఏంటి? పురాణగాథ ఏం చెబుతోంది? ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, తానొక గొప్ప త్యాగిని, సన్యాసిని అనుకొని ఆ గర్వంతో విర్ర వీగుతున్నాడట. అప్పుడు శ్రీమహా విష్ణుడు అతడికి జ్ఞాన బోధ చేయాలని తలంచాడు. దీంతో నారదుడిని మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి, స్త్రీ రూపం ఎత్తాడు. అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60మంది పిల్లలను కన్నాడు. వారే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరిగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు. సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు. అప్పుడు నారదుడిని ఆవరించిన మాయను శ్రీహరి తొలగించి, ఇదీ సంసారం అంటే.. నీవు ఏదో గొప్ప భక్తుడవని భావిస్తున్నావు. అని జ్ఞానబోధ చేశాడట. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. మనం సౌరమానంలో జీవిస్తున్నాం. ఏదైనా బిందువును 360 డిగ్రీల కోణంలో మనం చూడవచ్చు. అదే మనిషి కేంద్రం అయినా వర్తిస్తుంది. మనిషి ముందువైపు 180 డిగ్రీలు ఉంటే, వెనుకవైపు మరో 180 డిగ్రీలు ఉంటుంది. అంటే వెనుక ఉన్న గతం 180.. ముందు ఉన్న వర్తమాన, భవిష్యత్ లు మరో 180డిగ్రీలు. కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సంవత్సరాలు. కలియుగానికి వచ్చే సరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది. అందుకే 60ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తి చేస్తారు. అంటే దీనర్థం. మొదటి 60ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి. మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తీసుకుంటే, ద్విశతోత్తరి దశ అనే ప్రమాణంలో 120 సంవత్సరాలుగా సూచిస్తోంది. ఇలా రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు.. ఇలా నవగ్రహాలు మన ఆయుర్థాయాన్ని పంచుకుంటే 120ఏళ్లు బతకాలి. మన తెలుగు సంవత్సరాల పేర్లు : 1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ. అరవై సంవత్సరాలకు ఒకసారి మానవుడి మనో ధర్మాలతో పాటు, మానవ ధర్మాల విషయంలో మార్పులు సంభవిస్తాయి. మానవుడి బుద్ధి శక్తి కూడా 60ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. అక్కడి నుంచి మానవ శరీరంలో మార్పులు మొదలువుతాయి. క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తూ వస్తుంది. శరీరంలోని కండరాలు కరిగిపోతుంటాయి. అరవై సంవత్సరాలలోపు మృత్యుశక్తి ఒకసారి ప్రభావం చూపుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. అంటే ఏదో విధమైన ప్రాణాపాయం దగ్గరి వరకూ వచ్చి వెళ్తుందన్నమాట. అరవై సంవత్సరాల నుంచి ప్రతి పదేళ్లకు మృత్యుశక్తి పలకరిస్తూ ఉంటుంది. ప్రభవ నామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి.అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలువుతుంది. అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది. అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగడం, అవీ.. ఇవీ తినాలని అడగటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి. ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి షష్టిపూర్తి చేస్తారు. ఇక ఒక పక్షానికి రెండు వారములు.. ఒక వారమునకు ఏడు రోజులు... ఒక రోజుకు ఎనిమిది ఝాములు... ఒక ఝాముకు మూడు గంటలు.. ఒక గంటకు అరవై నిమిషములు.. ఇలా ప్రతి నిమిషమునకు వచ్చే నక్షత్రంతో సహా మన పంచాంగం చాలా నిర్దిష్టంగా నిఖ్ఖచ్చితంగా ఉంటుంది.. ఎంత ఖచ్చితత్వమంటే భారత యుద్ధం జరిగే సమయమున సూర్యగ్రహణాన్ని కూడా నమోదు చేయగలిగినంత. అందుకే మన హిందూ సాంప్రదాయాలు గొప్పవయ్యాయి. ఇప్పుడు మనం పాటించే అర్థంపర్థం లేని జనవరి ఒకటి క్రొత్త సంవత్సరం కాదు. మనకు అసలైన నూతన సంవత్సరం ఉగాదే. ఇప్పటి నుండే మన వాతావరణంలో మార్పు మొదలవుతుంది. పంచాగం మొదలవుతుంది. సృష్టి మొదలవుతుంది. అందుకే ఇది యుగ ఆది అయింది. కాల క్రమెణా  ఉగాది అయింది.*


*https://www.facebook.com/groups/638078683192004*

మెరిసేదంతా బంగారం కాదు ..తృప్తితో కూడిన సామాన్య జీవితం ఎంతో ఉత్తమం

 *⚛‼️మెరిసేదంతా బంగారం కాదు ..‼️⚛*


*https://chat.whatsapp.com/DnuAsVF1UnTJNC3k7yo3yp*


*తృప్తితో కూడిన సామాన్య జీవితం ఎంతో ఉత్తమం*


*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*


*ఎవరైతే దుర్బుద్ధి,  అక్రమ సంబంధం (స్త్రీ వ్యామోహం), అసత్యం, అవినీతి (ధనాశ), అధర్మం, అన్యాయం, మోసం, జూదం, మద్యపానం, ద్వేషం (క్రోధం - హింస) కలిగియుంటారో వారిని పాపకూపంలోకి లాగుతాడు కలిపురుషుడు.*


*వారిని చూస్తే భోగములతో వైభవంగా ఉన్నట్లనిపిస్తుంది. ఇది సరిగా అర్థంచేసుకోలేక, సామాన్యులు కొంతమంది "మనకి మాత్రమే ఈ పేదరిక బాధలు, కష్టాలు ఎందుకు? " అని చాలా మంది భగవంతుడిని దూషిస్తూ ఉంటారు.*


*నిజానికి భగవంతుడు పరీక్షించేది వీరిని కాదు, పైన చెప్పిన వారిని.*


*కలి ప్రభావానికి లోనైనవారు మాత్రం తమ భోగాలు చూసి మురిసిపోతుంటారు కాని ఇది ముందు ముందు జన్మలకి ఎంత ప్రమాదమో గ్రహించలేరు.*


*తద్విరుద్ధంగా, నిత్యం భగవన్నామ స్మరణ, సత్యం, ధర్మాచరణతో, పరోపకారంతో సరళమైన జీవితం గడిపేవారికి ప్రశాంతమైన జీవితంతో పాటు, ముందు ముందు ఉత్తమ జన్మ లభిస్తుంది.*


*ఈ సూత్రం ఎవరికైనా, ఎంతటి వారికైనా, ఆధ్యాత్మిక వ్యాపారం చేసే వారికైనా ఒక్కటే.*


*ఎక్కడి నుండి వచ్చామో, ఏ రూపాంతరం చెందామో ఎవరికీ తెలియదు.*


*ఒక్కటి మాత్రం సత్యంగా కంటిముందే సాక్ష్యం.*


*ఎన్నో జీవరాసులు, చీమలు, వానపాములు, కుక్కలు, పాములు, పులి, పంది, పక్షులు, పురుగులు మరెన్నో లక్షల జీవులు. వాటికి ఆ జీవితం, మనది మనుష్య జన్మ. ఎలా ? ఇదే అలోచిస్తే జ్ఞానం. నిర్లక్ష్యిస్తే అజ్ఞానం.*


*కనుక, మెరిసేదంతా బంగారం కాదు. ఆ భోగాలకి తాపత్రయపడి ఆర్భాటాలకి, కట్టడాలకి, దైవం ముసుగులో లౌకికులకి లొంగి అసూయలో పడి నీచజన్మకి లోనుకాకూడదు.*


*ఆధునిక  ఆధ్యాత్మికం అత్యంత ప్రమాదకరం, మహాపాపం.*


*గరుడపురాణం చదవండి. మన జీవిత లక్ష్యాన్ని, ఫలితాలను తెలియచేస్తుంది.*


*తృప్తితో కూడిన సామాన్య జీవితం ఎంతో ఉత్తమం*


*https://www.facebook.com/groups/638078683192004*

మనం ఎలాంటి అద్దాల లొం ఛి చూస్తే ప్రపంచం మనకు అలాగే కనిపిస్తుంది

 *🌹మనం ఎలాంటి అద్దాల లొం ఛి చూస్తే ప్రపంచం మనకు అలాగే కనిపిస్తుంది🌹*


*https://chat.whatsapp.com/Hn9td4orXeXEJWnAtY9TtM*


*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*


*ఒక యువ జంట ఒక కొత్త ప్రదేశంలో నివాసం ఉంటున్నారు ఆ భార్యా భర్తలు ఇద్దరు ఉదయమే అల్పాహారం తింటూండగా పొరుగున  ఉన్న ఆమె ఉతికి దండెం మీద ఆరవేసిన బట్టలు కనిపించాయి. భార్య ఆ బట్టలు చూసి “అవి శుభ్రం గా లేవు కొంచెం మంచి సబ్బుతో ఉతికితే బాగుండేది ఆమెకు బట్టలు బాగా ఉతకడం రాదు ” అని విమర్శిం చింది.  ప్రతి రోజు పొరుగింటా విడ ఆరవేసిన బట్టలు చూసి ఇలాగే మాటలాడేది*


*ఒక నెల తరువాత పొరుగింటా విడ ఉతికి ఆరవేసిన బట్టలు శుభ్రం గా అందం గా కనిపించడం చూసి ఆమె ఆశ్చర్య పొయిం ది   భర్తని చూసి  చూడు ఆమె బట్టలు బాగా ఉతకడం నేర్చుకుంది ఎవరు నేర్పారో ఆమెకు నాకు చాల ఆశ్చర్యం గా ఉంది అని పలికిం ది.  అప్పుడు భర్త ఈరోజు ఉదయం పెందలకడనే లేచి కిటికీలు శుభ్రం చేసాను  .నీకు బట్టలు శుభ్రం గా కనిపిం చడానికి కారణం అది అని చెప్పాడు శుభ్రమైన కిటికీ లోంచి బట్టలు శుభ్రం గా కనిపించినట్లే మనం  ఇతరులను  ఏదృష్టి తో చూస్తామో వాళ్ళు మనకదే  విధం గా కనిపిస్తారు.*


*నీతి:-*


*ఇతరుల విషయం లో నీకు తోచినట్లుగా ఎప్పుడూ ఒక నిర్ణయానికి  రాకూడదు*


*మనం ఎలాటి అద్దాల లొం ఛి  చూస్తే ప్రపంచం మనకు అలాగే కనిపిస్తుంది*


*మనం మాటలాడే మాటల్లో మన ఆలోచనలు ప్రతి బింబిస్థాయి.*


*ఇతరులను విమర్శిం చడానికి ముందు  మనలను మనం పరిశీలించుకోవాలి*


*https://www.facebook.com/groups/638078683192004*

ఉత్తమ యోగి

 **ఉత్తమ యోగి*


*https://chat.whatsapp.com/Hn9td4orXeXEJWnAtY9TtM*


*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*


*అందరం బావుండాలి అనేది ఒక గొప్ప మంత్రం. అందరూ అంటే ఒక్క మనుషులే కాదు. సర్వజీవులు కూడా.*


*మన ఆలోచనలు మంచిగా ఉంటే మన పనులూ మంచిగా ఉంటాయి. మన భావాలు గొప్పగా ఉంటే మన ఆచరణ దివ్యంగా ఉంటుంది. కోతి, సింహంలా ఉండగలదా? సింహం నరుడిలా మసలగలదా? నరుడికొక్కడికే బుద్ధి ఉంది. మంచి చేసే అవకాశం ఉంది. అందరూ బావుండాలని ఉద్యమించే దమ్ము, దైర్యం ఉంది. లోక కల్యాణం- నరుడి రూపంలో మాత్రమే దైవం చెయ్యగలడు.*


*మనిషి భగవంతుడికి ప్రతిరూపం. భగవంతుడిలో ఉన్నవే మనిషిలో కనిపించాలి. దైవ లక్షణాలు ప్రతి మనిషిలో కనిపించవు. తనలో దైవత్వం ఉందని మనిషి తెలుసుకోవాలి. దాన్ని నిరూపించాలి. అటువంటి సాధకుడే నిజమైన మనిషి అంటారు స్వామి వివేకానంద.*


*మన బాగు కోసం మనం పని చేద్దాం. అదే సమయంలో అందరి మంచినీ కోరుకుందాం. తోటంతా ఆకుపచ్చగా ఉండాలి. పుష్పాలతో, పండ్లతో పరిమళభరితంగా ఉండాలి. అప్పుడు పక్షులు, తుమ్మెదలు వాటికవే వస్తాయి. అంతా బావుంటే అందరూ వస్తారు. ఒక దగ్గరకు చేరతారు. సుఖం-సంతోషం చవి చూస్తారు.*


*ఇతరుల మంచిని కలలోనైనా తలవని మనసుకు ఆరోగ్యం ఉండదు. అనారోగ్యం పోదు. స్వార్థానికి మించిన అస్వస్థత లేదు. ప్రేమే ప్రేమను తెస్తుంది. అందరి సుఖాన్ని కోరుకుంటేనే మనకు నిజమైన సుఖం లభిస్తుంది. హృదయమే హృదయాన్ని తెరుస్తుంది. కలిసి ఉండటంలో, మంచిని కోరుకోవడంలో మాత్రమే నిజమైన ఏకత్వం ఏర్పడుతుంది. ఈ గొప్ప భావన నీరసాన్ని, నిస్సత్తువను, భయాన్ని తొలగిస్తుంది. అందరిలోకి నదిలా ప్రవహించి, సముద్రంగా బతికిన వాళ్లే దివ్యపురుషులుగా మిగిలిపోయారు.*


*దైవ భాష మనకు అర్థం కాదు. ప్రేమ అనే లిపితో అది తయారయింది. మనల్ని గురించి ఆలోచనలు తగ్గాలి. దాదాపుగా మనల్ని మనం మరచిపోయి, అందరి గురించి ఆలోచించాలి. అప్పుడు మన శక్తి మరింత పెరుగుతుంది. హద్దులు చెరిగిపోతాయి. ఆనందం పెల్లుబుకుతుంది.*


*పువ్వులు తీసుకెళ్ళి మనం దేవుడికి పెట్టొచ్చు. మరో నలుగురి చేతికి నాలుగుపువ్వులు ఇచ్చి ఆయనకు పూజ చేయించడం మరింత మెరుగు. అలాగే నాలుగు ఆలోచనలు కలుపుకోవాలి. అందరూ బావుండాలని కోరుకోవడానికి దేవతల్లాంటి పుణ్యపురుషులు కావాలి. అందరూ బావుండాలి అని అందరూ అనరు. కాని అలా అనేవాడు మాత్రం మనిషి కాడు, మహనీయుడే. వేదశాస్త్రాలు మనిషి బాగుకోసమే. మనిషి బాగుండాలంటే అతడి మనసు బావుండాలి. మనసు బావుండాలంటే, అది యోగం అనే చెట్టు మీద కూర్చుని క్షేమం అనే పాటను పాడుతూనే ఉండాలి.*


*పది మంది బాధల గురించి, వాళ్లలో ఒకడిగా మారి బాధపడితే మన బాధను వెంటనే మరచిపోతాం. అది చిన్నదై, కనుమరుగై పోతుంది. అటువంటి అవగాహన రావాలి మనిషికి. ఆ మనిషే విశ్వానికి మిత్రుడు. ప్రకృతికి పుత్రుడు.*


*మన ఇల్లు మనం ఎన్ని అంతస్తులైనా అందంగా కట్టుకోవచ్చు. నిలువ నీడలేని వాళ్లందరికీ ఒక నీడ ఉండాలని కోరుకోవాలి. ఆ పనిలో సహకరించాలి. ఈ విధమైన ఆలోచనా విధానానికి మించిన పూజ, ప్రార్థన లేవని సత్పురుషులు ఏనాడో చెప్పారు.*


*భూమ్మీద జన్మించిన ప్రతి మనిషీ వేదాంతి కానక్కరలేదు. పరోపకారార్థమిదం శరీరం అన్న ఆర్యోక్తిని అర్థం చేసుకొని ముందుకు సాగేవాడే నిజమైన ఆత్మజ్ఞాని. దీనులు, హీనుల దారిలో పూలను చల్లి అక్కున చేర్చుకోలేకపోయినా, ముళ్లను తొలగిస్తే చాలు. అటువంటి వాడికి మించిన యోగి ఉండడు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలియజేసిన ఉత్తమ యోగి అతడే. సందేహం లేదు!*


*https://www.facebook.com/groups/638078683192004*

వైరాగ్యం

 *🕉️వైరాగ్యం...🕉️*


*https://chat.whatsapp.com/BZHH4OZ0OGhDgSs7k9N1Xu*


*ప్రపంచం దృష్టిలో అన్నీ వదులుకోవటం. బాధ్యతల్ని విస్మరించటం. సోంబేరులైపోవటం. ముఖ్యంగా కుటుంబసభ్యుల్ని బాధపెట్టడం. నిజమేనా? నిజమే. అర్థం అదే. కానీ అంతరార్థం వేరు, భావార్థం వేరు, ఆధ్యాత్మికార్థం వేరు. దిగంబరత్వాన్ని అశ్లీలంగా భావించవచ్చు. ఆత్మ భావస్థితిగానూ అంగీకరించవచ్చు అలాగే ఇదీ. వాస్తవ స్థితిని, పరిస్థితిని అవగాహన చేసుకోవాలి. అశ్లీలతను, ఆత్మభావాన్ని ఒకే గాటన కట్టరాదు. వైరాగ్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని ఏకదృష్టితో చూడరాదు. ఉప్పు వేరు, కర్పూరం వేరు. వైరాగ్యం మంచి కర్పూరం. కర్పూరంలా 'నేను' హరించిపోయే పరిణామశీల భావౌన్నత్యం. ఇది అందరికీ అర్థం కాదు. చాలామంది దృష్టిలో వైరాగ్యం అంటే సోమరితనమే. బాహ్యదృష్టికి మాత్రం అంతమటుకే అనిపిస్తుంది. కానీ... అంతేనా? ఎంతమాత్రం కాదు. బాహ్య ఆడంబర స్పృహ లేకుండా నిర్వికారంగా ఉండిపోయే వైరాగ్యవంతుడు ఆంతర్యంలోనూ అంతే నిర్వికారంగా ఉంటాడు. అంతే నిరహంకారంగా ఉంటాడు. ముఖ్యంగా నిత్యానిత్య వస్తు వివేకాన్ని కలిగి ఉంటాడు. అందుకే అనిత్యమైన సంసారం పట్ల ఆ నిర్లిప్తత, నిర్వికారత. అయితే సాధారణ ప్రపంచానికి సందేహం- ప్రాపంచిక జనసందోహానికి అనుమానం. ఏమిటీ వైరాగ్యం! ఏమానందముంది ఇందులో! ప్రాణాలొడ్డి సంపాదించుకున్న ధన కనక వస్తురాశుల్ని పిల్లాపాపలతో అనుభవించకుండా ఏమిటీ అర్థంలేని అవివేక ప్రవర్తన! నిజమే... అలాగే అనిపిస్తుంది. ఔను మరి... ప్రపంచానికి వెన్నుచూపి వైరాగ్యాభిముఖుడై వెళ్లిపోతున్న మనిషి ఏం పొందుతున్నాడు? ఏ కొండ కొసనో, ఏ అరణ్య మధ్యంలోనో, ఏ వల్మీకపు చాటునో నిమీలిత నేత్రుడై కూర్చుండిపోయే మనిషి ఏమాలోచిస్తున్నాడు? ఏ ధనరాశులకోసం, ఏ నిధినిక్షేపాలకోసం తపిస్తున్నాడు? విచిత్రంగా... ఏమీ లేదు! అద్భుతంగా... దేనికోసమూ కాదు! అతడు అతడుగా మిగలని తీవ్ర వైరాగ్య భావనలో, ఆ భావన కూడా అంతరించి నిర్వికార ఏకాకార దివ్యత్వంలో ఉండిపోతున్నాడు. ఒకసారి... ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం. 'నాకేమీ వద్దు. నేనేమీ కాను, నేనేమీ లేను' అనే నిర్వికార అనుభూతి మనసును ఎంత భావరహితం, ఎంత భారరహితం చేసి ఆనందమో, ఆసవమో, రసమో... ఇవేమీ కాని శుద్ధ చైతన్య ఆవాహనమో... అది అనుభవించాలి... కాదు... అనుభూతించాలి. అదీ కాదా? ఏదీ కానిదేదో అదే అప్పటి... ఆ క్షణాన నీవు, నేను, మనం... నిజానికి అవీ మిగలవు!*

*తీవ్ర వైరాగ్యం ఎంత హృద్యమైంది! ప్రళయ ప్రభంజనాలకూ చలించకుండా అత్యంత కోమలమైన పూలరేకుల్లా అర్ధనిమీలితమై ఉన్న కనురెప్పలతో... కాదు... కనురేకులతో అత్యంత తేజోవంతమైన, అయినా అత్యంత ఆహ్లాదకరమైన ఒక వెలుగు హిమపాతం, ఒక వెన్నెల జలపాతం- ఆ తీవ్ర వైరాగ్యవంతుడి అణువణువునా జాలువారుతూనే ఉంటుంది.*


*మనిషి వైరాగ్యంతో తప్ప పరమేశ్వరాభిముఖుడు కాలేడు. ఏం? పరమేశ్వరునికి అభిముఖుడే కావాలా? అసలు అయ్యేతీరాలా? ఔను. తప్పదు. నిజానికి విశ్వాకారుడైన భగవంతుడికి మనిషి సదా అభిముఖుడే అయిఉన్నాడు. ఎందుకంటే- అన్నివైపులా తానే అయి ఉన్న ఆ పరాత్పరుడికి మనిషి అభిముఖుడయ్యే ప్రత్యేక ప్రయత్నమే అవసరం లేదు. మనిషి ఏ ముఖుడైనా సదా భగవన్ముఖుడయ్యే ఉన్నాడు. అయితే అది గొర్రెదాటు వ్యవహారం కాకూడదు. తెలిసి అభిముఖంగా సాగాలి. వివేకంతో వెళ్లాలి. లేకపోతే ఒడ్డున కట్టిన పడవకు తెడ్డు వేసినట్లే ఉన్నచోటునే ఉండిపోతాడు. మనిషి సాగాలి... భగవంతుడి వైపు. నిత్య సత్య స్వరూపుడైన భగవంతుడి వైపు. అందుకు నిత్యానిత్య వస్తు వివేకం ఉండాలి. అలా ఉన్నవాడే సాగగలడు. అది ఉన్నవాడే వైరాగ్యవంతుడు... అనంతాన్ని ఔపోసన పట్టినవాడు!*

పిల్లలు మట్టి ముద్దల్లాంటి వాళ్ళు. వాళ్ళని మీరు ఎలా తయారుచేస్తే వాళ్ళు అలా తయారౌతారు.

 *🕉సదా నీ క్షేమం కోరే...🕉*


*https://chat.whatsapp.com/HUM3Q7JuavCEfTTLB5cTPQ*


*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*


*చాలా మంచి వ్యాసం. అందరూ చదవండి !!*

*పిల్లలు మట్టి ముద్దల్లాంటి వాళ్ళు. వాళ్ళని మీరు ఎలా తయారుచేస్తే వాళ్ళు అలా తయారౌతారు.*


*ముఖ్యంగా భార్యాభర్తలు ఒక విషయం గ్రహించాలి.*

*పిల్లలెదురుగా ఆర్థిక విషయాలు మాట్లాడుకొని, అసహనంగా మాటలు విసురుకోరాదు. వారి ఎదురుగా, నువ్వెక్కువంటే నువ్వు తక్కువ అనుకోకూడదు.*

*చుట్టాల గురించీ, బంధువుల గురించీ చులకన చేసి మాట్లాడకూడదు.*

*అలాగే,వాళ్ళు చదువుతున్న స్కూలు గురించీ, టీచర్ల గురించీ తక్కువజేసి మాట్లాడకూడదు.*


*ముఖ్యంగా పిల్లలకు సరైన అవగాహన ఏర్పడే వరకు,తల్లితండ్రుల పట్ల భయం, భక్తి, ప్రేమ కలిగేలా చూడాలి కానీ,అతి చనువు ఇవ్వకూడదు. బాల్యంలో అడిగినంత డబ్బులివ్వడమంటే వారిని మనం మన చేతులారా పాడుచేసినట్లే. పిల్లలు తల్లితండ్రులను ఎదిరించి మాట్లాడుతున్నారంటే ,వారికి మీరు అతి స్వేఛ్ఛ ఇచ్చినట్లే. పిల్లలకు చిన్నప్పటినుండే డబ్బు విలువ, మాట విలువ, మనిషి విలువ నేర్పాలి.*


*ఖాళీ సమయంలో లాప్ టాప్ లు ముందువేసుకు కూర్చొనేముందు, నాలుగు మంచి మాటలు ,కనీసం ఒక నీతి కథైనా చెప్పాలి.*


*పిల్లలకు చదువు ముఖ్యమే కానీ, చదువుతో పాటుగా*

*లోకజ్ఞానం వుండాలి. పదిమందిలో వున్నప్పుడు ఎలా వుండాలన్నది, ఇంటికి వచ్చిన బంధువులను ఎలా గౌరవించిలన్నది తప్పకుండా నేర్పాలి.*


*అతి గారాబం అనర్థదాయకం, అలాగే అతిగా శిక్షించడం కూడా అనర్థమే!*

*అడగగానే కొండమీద కోతైనా వస్తుంది అనే భావన పిల్లలలో కలగ కూడదు.వారి పట్ల మీకు అతి ప్రేమవుందనే విషయం వారికి తెలిస్తే, దాన్ని వారు దుర్వినియోగం చేస్తారు. మనం చూస్తూనేవున్నాం అలా పెరిగిన పిల్లలు ఎలా తయారై, తల్లితండ్రులను ఎలా బాధ పెడుతున్నదీ చూస్తునేవున్నాం.*


*పిల్లల సరదాలు తీర్చటం తప్పులేదు. తీర్చాలి కూడా. అలా తీర్చలేనంత మాత్రాన వారుమిమ్మల్ని నిరసన చేేసే విధంగా వారు తయారు కాకుండా పెంచే భాద్యత కూడా మీదే!*


*ఈ విషయాలన్నీ భార్యా భర్తలకు తెలియవని కాదు కానీ ,పిల్లల విషయంలో భార్యా భర్తలది ఒకేమాట అన్న విషయం మీరు మీ పిల్లలకు కలిగించలేకపోతున్నారు. అదే యీనాడుపిల్లలు పెడమార్గం పట్టడానికి కారణమౌతోంది. నేటి పిల్లలకు ,తండ్రంటే భయం లేదు, తల్లంటే గౌరవం లేదు.*

*ఇంటికి వచ్చిన చుట్టాలు బంధువులు గతిలేక వచ్చినట్లు, అనవసర బర్డెన్ గానూ భావిస్తున్నారంటే, మీరు బంధువుల పట్లా,చుట్టాలపట్లా వారికి అవగాహన కలిగించడం లేదని అర్థం.*


*ఇక ఆఫర్లంటూ షాపులు ప్రకటిస్తే, అవి మనకు అవసరమా కాదా అన్న ఆలోచన లేకుండా కొనెయ్యడం. వాడే టైమ్ దాటిపోయిందంటూ నిర్లక్ష్యంగా పారేయడం.బట్టలు కొనడానికైతే హద్దేలేదు. ఇలా తొడగడం, అలా పారెయ్యడం. వేలరూపాయలు పెట్టి బట్టలు కొనేటప్పుడు ,అవి ఎన్ని రోజుల వరకూ పనికొస్తాయన్నది కూడా ఆలోచించి కొనాలి.*


*చినుకు చినుకు చేరితేనే చెరువులో నీరుంటుంది. లేకపోతే చెరువెండిపోతుంది. డబ్బుకూడా అంతే, రూపాయికి రూపాయి కలిపితేనే పొదుపౌతుంది. పిల్లలు పెరుగుతుంటే ముందు ముందు అధిక ఖర్చులే, రూపాయి రూపాయి కలిస్తే పాపాయెత్తు డబ్బౌతుంది అని సామెత.*


*మనిషికి ఉన్నది బలము, గొడ్డుకు తిన్నది బలము అంటారు. అందుకని డబ్బు విషయంలో ముందు జాగ్రత్త అవసరం.*


*నేను చెప్పిన విషయాలన్నీ మీ బాగుకోసం చెప్పినవే.* *కోపగించుకోకు. ఉత్తరంలో వ్రాసినట్లు ముఖా ముఖీ చెప్పలేను. నేను చెప్పినపుడు మీరు మొఖం చిట్లించినా నా మనసు గాయపడుతుంది. ఆపై చెప్పాలన్న విషయాలు చెప్పలేక పోవచ్చు.*

*అవసరమనుకొంటే భార్యాభర్తలిద్దరూ ఈ లేఖ చదవండి. ముందులోనే చెప్పినట్లు, అవసరమనుకొంటే ఆచరించు.* *లేదూ... చాదస్తం అనుకుంటే నేనేంచేయలేను. వుంటాను సదా నీ క్షేమం కోరే*


*https://www.facebook.com/groups/638078683192004*

చివరకు మిగిలేది ఏది

 *🕉️చివరకు మిగిలేది ఏది🕉️*


*https://chat.whatsapp.com/JSzEdsAtvS2HVhj2yjmbik*


*ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది.*


*దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.*


*మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!*


*దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.*


*మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను*


*దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.*


*మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?*


*దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి*


*మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?*


*దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి*


*మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!*


*దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు*


*మనిషి: నా స్నేహితులున్నారా అందులో?*


*దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే*


*మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?*


*దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు*


*మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!*


*దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.*


*మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?*


*దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.*


*మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.*


*మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.*


*మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?*


*దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.*

*ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.*

*అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి.*

*పశ్చాతాపులను క్షమించాలి.*

*తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.*


*ఇప్పటికైనా కాస్త మారండి....🙏🙏👺*

ధర్మం’ అంటే ఏమిటి?

 *🙏శ్రీ గురుభ్యోనమః🙏*


*https://chat.whatsapp.com/Ix1ud3H1KecIxwl5ReXSxp*


*ధర్మం’ అంటే ఏమిటి?*


*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*


*ఇది చాల క్లిష్టమైన ప్రశ్న! వెంటనే వివరించి చెప్పటానికి కుదరని గంభీరమైన ప్రశ్న!  ఎందుకంటే ధర్మం అనే రెండక్షరాల శబ్దానికి చాల లోతువుంది. చాలా సంక్లిష్టత ఉంది. చాలా నిగూఢత ఉంది. చాలా విశాలత ఉంది.*


*‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతమ్’*


*ధర్మాలన్నియు సాక్షాత్ పరమాత్ముని నుండి లభించాయి.*


*ధరించునదిగాబట్టి ధర్మము అని ధర్మ శబ్దానికి ఉత్పత్తి అర్ధము. (ధృ – ధారణే). ధర్మము నిత్యసత్యమై వుండేదైనా దేశకాల ప్రాంతాదుల ననుసరించి ధర్మం మారుతుంటుంది.*


*ధర్మము – సామాన్యధర్మం, విశేషధర్మం అని రెండు రకాలు.*


*శ్లో|| ధృతిః క్షమా దమో స్తేయం, శౌచమింద్రియ నిగ్రహః|*

       *హ్రీర్విద్యాసత్య మక్రోధః ఏతత్ ధర్మస్త్య లక్షణమ్||*


*“ధృతి – క్షమ – దమం – అస్తేయం – శౌచం – ఇంద్రియ నిగ్రహం – హ్రీః (సిగ్గు) – విద్య – సత్యం – అక్రోధం”, ఈ పది లక్షణాలు కలిగియున్న ధర్మమని శాస్త్రం చెబుతోంది. అంటే;*


*1. మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. తనకు సంబంధించినది కానివ్వండి, కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు. కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి. కువిమర్శలు ప్రారంభమౌతాయి. ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంటిత దీక్షతో ‘ధృతి’ చెడకుండా ముందుకి సాగిపోవాలి. ‘ఇది ధర్మం’.*


*2. మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. క్షమాగుణంతో ఉండాలి. ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కోనాలి. కోపగించుకోకూడదు. ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు. ‘ఇది ధర్మం’.*


*3. మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనైనా ముఖ్యం. చదువుతున్నా, వింటున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుండాలి ‘ఇది ధర్మం’.*


*4. తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసికోనలేక, నిస్తేజంగా నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా, నియమరాహితుడుగా, ఉండకూడదు. ‘ఇది ధర్మం’.*


*5. మనిషి ఎల్లపుడూ మనస్సునూ, శరీరాన్నీ, మాటనూ ఆలోచననూ, సంసారన్నీ, ఇంటినీ, పరిసరాన్నీ, ధరించే వస్త్రాలనూ పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. మనసు పరిశుభ్రంగా వుండాలి. మాత్రమే పరిశుభ్రంగా ఉండాలి. మనిషి పరిశుభ్రంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.*


*6. చదువువున్నా, సంపదలున్నా, కీర్తివున్నా, బలంవున్నా ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దాని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. ‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడైనా గెలుస్తాడు’ మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో వారిని భూతప్రేతాలుగాని, దెయ్యాలు గాని, యక్షకిన్నర కిమ్పురుశులుగాని, గ్రహాలు గాని, రోగాలు గాని, కష్టసుఖాలుగానీ, మరణంగానీ, వశంలో వుంటాయి. కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయాలి ‘ఇది ధర్మం’.*


*7. ప్రతి విషయానికీ సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించటం కూడదు ‘ఇది ధర్మం’.*


*8. మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి. అకారణంగా, అనవసరంగా, ఒకరి మెప్పుకోసం, ఒకరిని మెప్పించటంకోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం. తనవారిని తృప్తిపెట్టట్టంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం కలిగిస్తుంది. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరోకనాటికి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. మన శక్తినీ, మనకీర్తినీ, మన గోప్పదనాన్నీ పాతాళానికి త్రోక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు. ‘ఇది ధర్మం’.*


*9. మానవునికి ఆహరం ఎంత ముఖ్యమో, వివేకం కూడ అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి. ‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవిత గడపకూడదు. ఎంతటి పెడతానం పెనవేసుకొనివున్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా,భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.*


*10. పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని  పతనావస్థకు నేడతాయి. పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. తనను కన్నవారికీ, తాను జన్మనిచ్చిన వారికీ, తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది.*


*అకారణంగా సాటి ప్రాణుల్ని హింసించట, ఆహారం తింటూవున్న ప్రాణుల్ని, నీరు త్రాగుతున్న ప్రాణుల్ని, ఆడమగ కలుస్తున్న జంటల్ని హింసించటం, భయపెట్టటం, రాళ్ళతో కర్రతో హింసించతం, తన దారిన తాను వెళుతున్న ప్రాణుల్ని భయపెట్టి పరుగెత్తించటం మంచిది కాదు.*


*కోపాన్ని జయించితే మనుష్యుల్ని జయించవచ్చు. సమస్యల్ని అధిగమించవచ్చు. కోపం ఎప్పుడూ మనకే నష్టాన్ని కల్గించి ఎదుటివారికి లాభాన్ని కల్గిస్తుంది. కోపం ఆత్మీయుల్ని దూరం చేస్తుంది. కోపం భవిష్యత్తును ఛిద్రం చేస్తుంది. కోపం జీవితాన్ని పతనం చేస్తుంది. కోపాన్ని అడుపులో ఎల్లపుడూ వుంచుకోవాలి. ‘ఇది ధర్మం’.*


*వీటినే ధర్మంగా గుర్తించారు పెద్దలు.*


*https://www.facebook.com/groups/638078683192004*

దేహమే దేవాలయం; జీవుడే దేవుడు!

 *🙏🌷దేహమే దేవాలయం; జీవుడే దేవుడు!🌷🙏*


*https://chat.whatsapp.com/G9JYO020qwIEZux1f10tNR*


*దేహస్తాః సర్వవిద్యా శ్చ దేహస్తా స్స ర్వదేవాతః*


*దేహస్తాః సర్వతీర్ధాని, గురువాక్యేన లభ్యతే*


*బ్రహ్మాండలక్షణం సర్వం దేహమధ్యే వ్యవస్థితమ్ (జ్ఞానసంకలినీతంత్రం)* 


                                * * *

*దేహమే దేవాలయం; ఆత్మయే దైవం. (వేదాంతుల వాక్కు)*

                                * * *

*దేహమే దేవాలయం; జీవుడే దేవుడు. (మహర్షుల మాట)*

                                 * * *

*ఈ దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం; దీని లోపల ఆత్మయే దైవం. (శాస్త్ర వచనం)*


                                * * *


*మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు, మనో మూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు. మనో మూలంలోనికి వెళ్ళినవారి దేహమే దేవాలయమౌతుంది. (శ్రీ రమణమహర్షి)*

                                  * * *


*భగవంతున్ని చిత్రాలలో వెతకొద్దు, చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు కదా...*


*దీనిబట్టి మనకి తెలుస్తుందేమిటంటే* -


*భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. కానీ, మనకి కానరావడం లేదు... ఎందుకనీ?*


*మన మనస్సులో ఉన్న మాలిన్యాలు వలన!*


*మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు! మొదటిది 'నేను' అనే తలంపు, ఇక రెండవది 'నాది' అన్న తలంపు. మొదటిది అహంకారం, రెండవది మమకారం! ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు.*


*మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడుని పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి... ఎలా?*


*ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని, ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని - ఒకటే. అది ముందురోజు నిర్మాల్యములను తీసేసి, పుజాసామగ్రిని, పూజగదిని శుభ్రపరిచి, అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం. ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనో మాలిన్యాలను తొలగించాలి. అజ్ఞానమను నిర్మాల్యమును తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో, అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలును తొలగించాలి. (కర్తృత్వ భావనను తొలగించుకోవాలి). మనలో ఉన్న అజ్ఞాననిర్మాల్యలను తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములనెడి  ఆరు అడ్డంకులు ఉన్నాయి. వాటిని తొలగించాలి. సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదావగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు. శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేద్రియాలు ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది. అందుకే చెడు ఎవరైనా చెబితే చెవిటివాడులా ఉండు, చెడు మాట్లాడే సంభాషణ సంభవిస్తే మూగవాడిలా వుండు, చెడు చూసే పరిస్థితి తారసపడితే గుడ్డివానిలా వుండు అని 'బాబా' అంటారు. మనస్సునూ, బుద్ధిని సంస్కరించుకుంటూ, ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో, మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి. మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే. మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం. మనలో అనేక బలహీనతలుంటాయి, అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి. (ఆలోచనలతో నిండి ఉన్న భాగాన్ని మనస్సు అనియు, విచక్షణతో నిర్ణయం తీసుకునే భాగాన్ని బుద్ధి అని అంటారు). రామకృష్ణ పరమహంస చెప్పేది ఇదే - 'ఆకర్షణల మధ్య ఆకర్షణ లేకుండా ఉండగలగడమే వివేకం' అని! ఏది మంచో, ఏది చెడో బుద్ధిద్వారా గ్రహించాలి. మనబుద్ధి చేతిలో మనస్సు ఉంటే మనకు పురోగతి, మన మనస్సు చేతిలో బుద్ధి ఉంటే మనకు తిరోగతి. శ్రీ రమణులు అన్నట్లు, మనస్సు బయటికి వెళితే బంధం, లోపలి వెళితే మోక్షం!*


*ప్రాపంచిక మార్గమైన, పారమార్ధిక మార్గమైన సరే, మన జీవన గమనంలో బయట లోపల ప్రతిబంధకాలు ఉంటాయి. ఇవి సహజం. ఇవన్నీ ఓర్పు, దైర్యం, నమ్మకం, ఏకాగ్రత లాంటి సద్గుణములతో ఎదుర్కొని పయనించినప్పుడే గమ్యమును చేరుకోగలం. జీవితంలో కష్టాలు, దుఃఖం, ఆవేదన..... ఇత్యాదులు అనుభవిస్తేనే ఆనందములోని పరిపూర్ణత, అమృతత్వం అర్ధమౌతాయి. ఇవన్నీ అనుభవిస్తేనే మనిషి మనస్సును అదిగమించే ధైర్యవంతుడు కాగలడు. ఇవన్నీ అనుభవించి అనుభవించి చివరికి ఆత్మజ్ఞానియై ప్రాజ్ఞుడౌతాడు.*


*హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసిన దాని గురించి ఆలోచించం. ఇదే మాయ. శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ, ఈ దేహం శిధిలమవ్వకముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి. మానవుడు ఆనందం అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ప్రేమ, జ్ఞానం!  ప్రేమ, జ్ఞానం ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుంది.*


*మానవుని నడత నవగ్రహాల మీద ఆధారపడి లేదు. రాగద్వేషాలనే రెండింటిమీదే ఆధారపడి ఉంది. మన ఆలోచనల్లోగానీ, మాటల్లోగానీ, పనిలోగానీ రాగద్వేషాలు ఉండకూడదు. అప్పుడే మనస్సులో మాలిన్యాలు తగ్గి మనస్సు పవిత్రంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది.*


*ఒకోసారి అన్పిస్తుంది - భగవంతున్నే నమ్ముకున్నాను, ఎన్నెన్నో పూజలు చేస్తున్నాను, ఎంతగానో ప్రార్ధిస్తున్నాను, మంచిగా జీవనగమనం సాగిస్తున్నాను, ఎంతో సాధన చేస్తున్నాను, అయినా నాకెందుకు ఈ కష్టాలు? అనుకోని సంఘటనలు ఎందుకు నాకెదురౌతున్నాయి? ఏమిటీ బాధలు....అని!*


*ఇంకా ఉంది తర్వాతి పోస్టులో*


*ప్రతి మనిషి తన జీవన యానంలో మోయలేని 'భారాల్ని' మోస్తున్నాడు! ఏమిటా భారాలు? బంధాలు, భౌతిక వస్తు లాలసలు. ఇన్ని బరువులతో ప్రయాణిస్తే జీవితం ఏమంత సుఖంగా ఉంటుంది? తక్కువ సామాన్లు వెంట తీసుకెళితే ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని అందరికీ తెలుసు. ఈ సత్యాన్ని మన జీవితానికి మాత్రం అన్వయించుకోలేకపోతున్నాం? భౌతిక అవసరాలు తీరినంత మాత్రాన శాశ్వత ఆనందం రాదు. ఆత్మసాక్షాత్కారంతో మాత్రమే అది సాధ్యం. మరి ఆత్మసాక్షాత్కారం కోసం మనం ఏం చేయాలి?*


*https://chat.whatsapp.com/G9JYO020qwIEZux1f10tNR*


*'నేను' అన్న పదంలోనే 'అహం' దాగివుంది. నేను అంటేనే స్వార్థం. ఇంతకీ నేనెవరినీ అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే నా అస్తులు, నా బంధాలు అనే సమాధానాలు వస్తాయి. అంతేనా? నేను అంటేనే నేను మోస్తున్న బరువు అని అర్థం. ఈ బరువు మనల్ని కట్టిపడేస్తూ ఉంటుంది. మనల్ని మనలా బతకనివ్వదు. పక్షికున్న స్వేచ్ఛ మనిషికుందా? మనను మనం ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది. ప్రతి మనిషి నిత్యం జీవనయానం చేస్తూనే ఉంటాడు.*


*అయితే ఈ బంధాలు, భౌతిక వస్తు లాలసలు అనే భారాలు మనిషి తాను కోరుకునే స్వేచ్ఛా జీవితాన్ని పొందడానికి అవరోధాలుగా మారుతున్నాయి. మనం ఈ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి పది మందిలో గుర్తింపు పొందడానికి తహతహలాడుతుంటాం. మంచి స్థితిమంతునిగానో, కీర్తి ప్రతిష్ఠలు సంపాదించో సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. దీన్నే జీవితంలో గొప్ప విజయంగా భావిస్తాం.*


*'నేను ఎవరిని' అని మనల్ని మనం ప్రశ్నించుకున్నపుడు సమాజంలో మనకున్న గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్ఠలను మాత్రమే పరిగణనలోకి మనం తీసుకుంటాం. మనం మోస్తున్న 'భారం' మన ఉనికిగా మారడానికే ఇష్టపడతాం. తాత్విక దృష్టిలో ఆలోచిస్తే 'నేను ఎవరిని ?' అన్న ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనను మనం ఆత్మపరిశీలన చేసుకోవలసి వస్తుంది.*


*నిజంగా 'నేను' నేనుగా, నా కోసమే నేను బతుకుతున్నానా అని ప్రశ్నించుకోవలసి వస్తుంది. "గతం, భవిష్యత్తు అంతా ఈ బంధాలతోనే సాగుతుంది. ఈ బంధనాల్లో చిక్కుకుని, నీలోపలకి నీవు తొంగి చూసుకునేదెప్పుడు? అలా చూడలేనంత కాలం దివ్య జ్ఞానజ్యోతి మనకు గోచరించదు. ఈ 'భారాన్ని' మోస్తున్నంత కాలం నేను నేను కాదన్న వాస్తవం బోధపడుతుందంటారు భగవాన్ రమణమహర్షి.*


దైవసంపద 26 సుగుణములు

 *🚩🕉️దైవసంపద 26 సుగుణములు🕉️🚩*


*https://chat.whatsapp.com/Gw1SZUg4oCi0FntKOhGE1d*


*1. భయము లేకుండుట*


*2. అంతఃకరణశుద్ధి*


*3. జ్ఞానయోగమునందుండుట* 


*4.దానము*


*5.బాహ్యేంద్రియనిగ్రహము*


*6. (జ్ఞాన) యజ్ఞము*


*7.( వేదశాస్త్రముల ) అధ్యయనము* 


*8.తపస్సు*


*9.ఋజుత్వము*


*10.ఏప్రాణికిన్ని బాధ గలుగజేయకుండుట ( అహింస )*


*11. సద్వస్తువగు పరమాత్మ నాశ్రయించుట, లేక , నిజము పలుకుట (సత్యము),*


*12.కోపము లేకుండుట*

 *13.త్యాగబుద్ధిగలిగియుండుట*


*14. శాంతిస్వభావము*


*15.కొండెములు చెప్పకుండుట*


*16. ప్రాణులందు దయగలిగియుండుట*


*17.విషయలోలత్వము లేకుండుట*


*18.మృదుత్వము (క్రౌర్యము లేకుండుట)*


*19. (ధర్మ విరుద్ధ కార్యములందు) సిగ్గు*


*20.చంచల స్వభావము లేకుండుట*


*21.ప్రతిభ (లేక, బ్రహ్మతేజస్సు )*


*22. ఓర్పు(కష్ట సహిష్ణుత)*


*23. ధైర్యము*


*24.బాహ్యాభ్యంతర శుచిత్వము*


*25.ఎవరికిని ద్రోహముచేయకుండుట (ద్రోహచింతనము లేకుండుట)*


*26. స్వాతిశయము లేకుండుట (తాను పూజింపదగినవాడనను అభిమానము, గర్వము లేకుండుట) - అను నీ సుగుణములు దైవసంపత్తియందు పుట్టిన వానికి కలుగుచున్నది. (అనగా దైవసంపత్తిని పొందదగి పుట్టినవానికి కలుగుచున్నవని భావము).*

కోడి రామ్మూర్తి నాయుడు

 *కోడి రామ్మూర్తి నాయుడు*


*https://chat.whatsapp.com/Gw1SZUg4oCi0FntKOhGE1d*


*కోడి రామ్మూర్తి నాయుడు గారు*


*'ఇండియన్ హెర్కులస్' గా బిరుదు గడించి, తెలుగువారే కాక భారతీయులందరూ గర్వించదగిన మహనీయుడు, దేశభక్తుడు, 'కలియుగ భీమ' కోడి రామమూర్తి నాయుడుగారి జయంతి జనవరి 16. క్లుప్తంగా ఆయన గురించి.....*

             

*ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులు. ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. కోడి రామ్మూర్తి నాయుడు జనవరి 16, 1882 న శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు.*


*కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయమశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు.*


*21 సంవత్సరాల వయసులోనే ఇతడు రొమ్ముపై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు.*


*రామమూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. శరీరమునకు కట్టిన ఉక్కు గొలుసును, ఊపిరితిత్తులలో గాలిని పూరించుకుని ముక్కలుగా తుంచి వేశాడు. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకునేవాడు.*


*కార్లను శరవేగంగా నడపమనేవాడు. కార్లు కదలకుండా పోయేవి. రొమ్ముపై పెద్ద ఏనుగును ఎక్కించు కునేవాడు.  5 నిమిషాల పాటు, రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవాడు.*


*తండోపతండాలుగా ప్రజలు వారి ప్రదర్శనలు చూచేవారు.*


*పూనాలో లోకమాన్య తిలక్ గారి కోరిక మేరకు ప్రదర్శనలిచ్చాడు. తిలక్ రామమూర్తిగారికి 'మల్లమార్తాండ', 'మల్లరాజ తిలక్' బిరుదములిచ్చారు. విదేశాలలో భారత ప్రతిభను ప్రదర్శించమని ప్రోత్సహించాడు తిలక్.*


*హైదరాబాద్ లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి 'జగదేకవీర' బిరుదమిచ్చారు.*


*అప్పటి వైస్రాయి లార్డ్ మింటో, రామమూర్తిగారి ప్రదర్శనలను చూడాలని వచ్చాడు. రామమూర్తి అప్పట్లో ఆంజనేయ ఉపాసనలో వుండినందున పది నిమిషాలు వేచాడు.*


*రామమూర్తి ప్రదర్శనలను చూచి ముగ్ధుడయ్యాడు. తానే పరీక్షించాలనుకుని తన కారును ఆపవలసిందని కోరాడు. కారులో కూర్చుని లార్డ్ మింటో కారును నడపసాగాడు. త్రాళ్ళతో కారును తన భుజాలకు కట్టుకున్నాడు. అంతే, కారు ఒక సెంటీమీటర్ కూడా కదలక పోయింది.*


*ఈ సంఘటనతో వైస్రాయి ప్రశంసలను, దేశమంతటా గొప్ప పేరును సంపాదించాడు రామమూర్తి నాయుడు.*


      *పండిత మదనమోహన మాలవ్యా ఎంతగానో మెచ్చుకున్నారు. విదేశాలలో ప్రదర్శనలివ్వమని ప్రోత్సహించారు.*


     *లండన్ లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి, రామమూర్తిగారి ప్రదర్శనలను చూచి తన్మయులయ్యారు. రామమూర్తిగారిని తమ బక్కింగి హామ్‌ రాజభవనానికి ఆహ్వానించి, విందు ఇచ్చిన తర్వాత 'ఇండియన్ హెర్కులస్' బిరుదంతో సత్కరించారు.*


*ఆ విధంగా బ్రిటిష్ రాజదంపతులచే, గౌరవింపబడిన భారతీయులలో మొదటి వాడు కోడి రామమూర్తి నాయుడు. రామమూర్తి గారు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలలో పలు ప్రదర్శనలిచ్చారు.*


*స్పెయిన్ దేశంలో 'కోడె పోరాటం' (బుల్ ఫైట్) చాలా ప్రసిద్ధమైంది. ఈ పోరాటం చాల భీకరంగా ఉంటుంది. రామమూర్తిగారిని ఆ పోరులో పాల్గొనమన్నారు.*


*అట్టి పోరాటంలో ఏలాటి అనుభవంలేని రామమూర్తిగారు ' సరే ' అన్నారు. రామమూర్తిగారు రంగంలో దుకారు. దూసుకుని వస్తున్న కోడె కొమ్ములను పట్టుకుని క్షణాల్లో క్రింద పడవేశారు. కోడెచిత్తుగా పడిపోయింది. వేలాది ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది.*


*కోడి రామమూర్తిగారు కోట్లు గడించారు. అంత కంటే గొప్పగా దాన ధర్మాలకు, జాతీయోద్యమాలకు ఖర్చు చేశారు. ప్రతిరోజూ పత్రికల్లో రామమూర్తిగారి ప్రశంసలుండేవి. భారతదేశం అంతటా రామమూర్తిగారి పేరు ప్రతిధ్వనించింది.*


*ఆంధ్రరాష్ట్రానికి చెందిన వస్తాదు మరియు మల్లయోధులు ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు . ఈయన శాకాహారులు.*


*భారతీయ యోగశాస్త్రం. ప్రాణాయామం, జల, వాయుస్థంభన విద్యలను శారీరక బలప్రదర్శనలకు జోడించడం వల్లనే ఆయన జగదేక మల్లుడయ్యారు.*


*ఆయన శక్తి, కీర్తి కొందరికి అసూయ కలిగించడంతో కొన్ని హత్యాప్రయత్నాలు కూడా జరిగాయి.*


*లండన్లో ఏనుగు ఫీట్ చేస్తున్నప్పుడు ఒక ద్రోహి బలహీనమైన చెక్కను ఛాతిపై పెట్టాడు. ఏనుగు ఎక్కగానే, చెక్క విరిగి ఆయన పక్కటెముకల్లోకి దిగబడింది. శస్త్రచికిత్స చేయించుకొని రెండు నెలలపాటు ఆయన లండన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.*


*మరోసారి రంగూన్లో హత్యాప్రయత్నం చేసిన వ్యక్తులను చితకబాది, సురక్షితంగా బయటపడ్డారు.*


*మాల్కానగరంలో భారతంలో భీముడి మాదిరిగా విషప్రయోగాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఒక విందులో విషం కలిపిన పాలు తాగారు. అప్పుడు ఆయన్ని కాపాడింది యోగ విద్యే.*


*విషాన్ని జీర్ణించుకొని మూత్రం ద్వారా విసర్జించారు.*


*కీ.శే. మేడేపల్లి వరాహనరసింహస్వామిగారు రచించిన దానిని బట్టి రామమూర్తిగారు కాలిపై రాచపుండు లేచినందున కాలుతీసివేయవలసి వచ్చింది.*


*సేకరించిన ధనం కరిగిపోయింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎటువంటి మత్తుమందును (క్లోరోఫామ్‌) తీసుకోలేదు. ప్రాణాయామం చేసి నిబ్బరంగా వుండిపోయారు.*


*1942 జనవరి భోగి పండుగ.. ఆ రోజు రాత్రి ఆయన వెంట ఉన్నది ఒకే శిష్యుడు.. ఆయన విజయనగరానికి చెందిన కాళ్ల పెదప్పన్న. ఆ రాత్రి కొంచెంసేపు తలపట్టమని శిష్యునికి చెప్పి, తాను లేచేవరకు లేపవద్దని చెప్పి పంపించారు రామ్మూర్తినాయుడు.*


*మరునాడు సంక్రాంతి.. కాని ఆయన నిద్ర లేవలేదు. అదే ఆయన శాశ్వతనిద్ర. సంక్రాంతితోనే జీవితానికి సమాప్తి. కాని ప్రపంచాన్ని జయించిన కీర్తి భారతదేశానికి మిగిల్చిన అమరజీవితమది.*

సనాతన ధర్మం అంటే ఏమిటో ఒక్క మాటలో చెప్పగలిగే నిర్వచనం కాదు.

 *🙏🌷శ్రీ గురుభ్యోనమః 🌷🙏*


*🕉సనాతన ధర్మం అంటే ఏమిటో ఒక్క మాటలో చెప్పగలిగే నిర్వచనం కాదు.🕉* 


*https://t.me/+5gVEZGFAscQ3N2Fl*


*సనాతన అంటే ఎప్పుడూ వుండేది అని అర్థం, ఇంచుమించు శాశ్వతానికి పర్యాయపదం.*

🌹🚩🌹

*ధర్మం అంటే సత్యాన్ని కాపాడుకుంటూ వుండే ఒక జీవనశైలి (ఇంచు మించు నాగరికత అని అనవచ్చు). మరి సత్యం అంటే ఏమిటి అని అడుగుతారేమో…*

🌱🌸🌱

*నారదుడు ఇంద్రుడి చెరనుండి ప్రహ్లాదుడి తల్లిని (ప్రహ్లాదుడు గర్భంలో వున్నప్పుడు) విడిపించి తనకు సత్యం అంటే ఏమిటో ఇలా చెప్తాడు.*


*సత్యస్య వచనం శ్రేయః సత్యాదపి హితం వదేత్*


*యావత్భూతానాం హితం ఏతత్ సత్యం మతం మమ.*


*నిజం మాట్లాడటం మంచిది, నిజం కన్నా హితం మాట్లడటం  అలవాటు చేసుకోవాలి. యావత్ భూతానాం అంటే సకల చరాచర జగత్తుకు హితం చేసేది సత్యం అని నా అభిమతం అంటాడు.*


*వ్యక్తి స్వేచ్ఛ విశృంఖలతగా మారి ప్రమాదంగా  పరిణమించకుండా ,నియంత్రించడానికి చట్టాలు,సంస్కారం సహకరిస్తాయి. భారతదేశంలో చట్టాలకంటే సంస్కారానికే ప్రాధాన్యత  ఎక్కువ. మతము ,సంస్కృతి ,సాంప్రదాయం ,కళలు, వేదాంతం ఇవన్నీ సంస్కారాన్ని పెంపొందించడానికే ఉన్నాయి. చట్టాలకు ప్రాధాన్యత ఇచ్చే  పాశ్చాత్యులు ఈ దేశాన్ని పరిపాలించడం వల్ల , ఇప్పటి పాలకులు పాశ్చాత్య పద్ధతికే ప్రాధాన్యత యిస్తూ స్వేచ్ఛను నియంత్రించడానికి, ప్రత్యేక చట్టాలను రూపొందించడం, చట్టాల పట్ల అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ దేశ సాంప్రదాయం కాకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడంలేదు. దేశం(వ్యక్తి) ఆత్మ పరిశీలన చేసుకుని మళ్ళీ సాంస్కృతిక పునరజ్జీవనాన్ని పొందితే , అపుడు చట్టాలు చేసే పనిని సంస్కారం చేస్తుంది .*

         *గురువు లేకపోయినా ఏకలవ్యుడు విలువిద్యను సాధించినట్లు, సంస్కారాన్ని పెంపొందించే పరిస్థితులు సమాజంలో లేకపోయినా, స్వయంసంస్కారాన్నిసాధించవచ్చు. అలా సంస్కృతి ఫై నమ్మకముంచి స్వయం సంస్కారాన్ని సాధిస్తున్నవారికి, నాస్తికవాదులు, హేతువాదుల్లోని అతివాదులు అడుగడుగునా అడ్డుతగులుతూ ఉంటారు. వీరికి నిర్మూలించడమే గానీ , నిర్మాణం చేసే శక్తి లేదు. కొండనాలుక్కి మందేయ్యమంటే ఉన్న నాలుకను ఊడగోడతారు. మూఢనమ్మకాలను పోగట్టవలసిన హేతువాదంతో ,ఏకంగా నమ్మకాలనే నిర్మూలించే ప్రయత్నం చేస్తారు . ఇది అయ్యే పని కాదని చరిత్ర పరిశీలిస్తే తెలుస్తుంది .*

     *భారతీయ సంస్కృతిలో జీవం ఉంది. అందుకే తరతరాలుగా ఎవరెన్ని దండయాత్రలు చేసినా ప్రతిఘటించి నిలబడుతోంది. హేతువాదులు ప్రజల విశ్వాసాలను ప్రశ్నించే బదులు అసలు ఈ నమ్మకాలు తరతరాలుగా నిరాటంకంగా కొనసాగుతూ రావడంలోని అంతర్యం ఏమిటి? అని ప్రశ్నించుకుంటే బావుంటుంది.*

       *నేటి పరిస్థితుల్లో , సాంకేతిక విప్లవంతో సమానంగా సాంస్కృతిక విప్లవం సాగాల్సిన అవసరాన్ని  గుర్తించి ఈ రచన చెయ్యడం జరిగింది*


*https://www.facebook.com/groups/638078683192004*

ఙ్ఙాని సన్నిధి !

 *✳️💐ఙ్ఙాని సన్నిధి !💐✳️*


*https://t.me/+5gVEZGFAscQ3N2Fl*


*ఒకసారి  పాత పుస్తకం చదువుతున్నప్పుడు  ఆ పుస్తకంలో ఒకచోట బ్రహ్మరాసిన నుదుటి వ్రాతను మార్చలేము అని ఉన్నది. మరి కొన్ని పేజీల తరువాత మన ఆయువును మనం వృద్ది చేసుకోవచ్చు అని ఉన్నది.   నుదుటి వ్రాత మార్చలేమంటారు మళ్ళీ ఆయువుని వృద్ది చేసుకోవచ్చంటారు. ఈ  తికమక పరిస్దితి అర్దంగాక ఒక గురువు గారీని అడిగితే దానికి ఆయన నవ్వి రెండూ సరియ్తెనవేనని వివరణ ఇచ్చారు.*


*మొదటి ప్రశ్న:*


*బ్రహ్మరాసిన నుదుటి వ్రాతను తప్పించలేము.*

*బ్రహ్మగారు ఇన్నేళ్ళు ఆయువు అని వ్రాయడు. ఉదాహరణకు ఒక మానవునడు ఇన్ని లక్షల ఉచ్వాశాలు (Breathings), ఇన్ని లక్షల నిచ్వాశాలు (Breathouts)  అని లలాటములో లిఖిస్తాడు. ఆ   ఉచ్వాశాలు  మరియు   నిచ్వాశాలు లక్షసార్లు  అయినవెంటనే ఆ మనిషి వెంటనే మరణిస్తాడు.*


*రెండవ ష్రశ్న :*


*మన ఆయువుని మనం వృద్దిచేసుకోవచ్చు.  బ్రహ్మ గారు చెప్పిన ఆ   Secreate (రహస్వాన్ని)  అదే  ఉచ్వాశ ,నిచ్వాశాలని  నియంత్రణలోనికి తెచ్చుకొంటే ఎన్నోఏండ్లు జీవించవచ్చు. ఈ రహస్యం తెలుసుకొని మన బుషులు , హిమాలయాలలో యోగము మరియు తపస్సు ద్వారా   ఈ Technic ని ఉపయోగించుకొని  వందల సంవత్సరాలు  యోగులు  జీవించినట్లు  ఎన్నో ఆథారాలున్నాయి.*


   *ఎవర్తెనా కోపంగా ఉండి అరుస్తుంటే, BP తెచ్చుకోకురా చాలా Danger అని చెబుతాము. BP వల్ల, కొన్ని  లేనిపోని భయాలవల్ల ,విపరీత ఆలోచనల వల్ల కూడా మన  ఉచ్వాశ, నిచ్వాశాల వేగం  పెరుగుతుంది.  దానివల్ల కూడా మనకు Lifespan తగ్గవచ్చు.*


*మనమందరం ప్రశాంత చిత్తంతో ఉండటానికి ఒక యోగ  చేద్డాం , ద్యానం  చేద్డాం ఒక    మంచి   ప్రయత్నం చేద్దా......*


*https://www.facebook.com/groups/638078683192004*

తెలుగు సంవత్సరాల పేర్లు... వాటి అర్థాలు

 *🔱తెలుగు సంవత్సరాల పేర్లు... వాటి అర్థాలు🔱*


*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*


*1. ప్రభవ అంటే... ప్రభవించునది... అంటే... పుట్టుక.*


*2. విభవ - వైభవంగా ఉండేది.*


*3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.*


*4. ప్రమోదూత.... ఆనందం..  ప్రమోద భరితంగా ఉండేది ప్రమోదూత.*


*5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.*


*6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.*


*7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.*


*8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.*


*9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక.*


*10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.*


*11. ఈశ్వర... పరమేశ్వరుడు.*


*12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం.*


*13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.*


*14. విక్రమ... విక్రమం కలిగిన వాడు.*


*15. వృష ... చర్మం.*


*16. చిత్రభాను... భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.*


*17. స్వభాను... స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం*


*18. తారణ... తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.*


*19. పార్థివ... పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.*


*20. వ్యయ... ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.*


*21. సర్వజిత్తు.... సర్వాన్ని జయించినది.*


*22. సర్వధారి -...సర్వాన్ని ధరించేది.*


*23.విరోధి.... విరోధం కలిగినట్టువంటిది.*


*24. వికృతి... వికృతమైనటువంటిది.*


*25. ఖర.... గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.*


*26. నందన ... కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.*


*27. విజయ... విశేషమైన జయం కలిగినది.*


*28. జయ.... జయాన్ని కలిగించేది.*


*29. మన్మథ... మనస్సును మధించేది.*


*30. దుర్ముఖి... చెడ్డ ముఖం కలది.*


*31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.*


*32. విలంబి... సాగదీయడం.*


*33. వికారి.... వికారం కలిగినది.*


*34. శార్వరి... రాత్రి.*


*35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.*


*36. శుభకృత్... శుభాన్ని చేసి పెట్టేది.*


*37. శోభకృత్... శోభను కలిగించేది.*


*38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.*


*39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.*


*40. పరాభవ ... అవమానం.*


*41. ప్లవంగ... కోతి, కప్ప.*


*42. కీలక.... పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.*


*43. సౌమ్య... మృదుత్వం.*


*44. సాధారణ... సామాన్యం.*


*45. విరోధికృత్... విరోధాలను కలిగించేది.*


*46. పరీధావి... భయకారకం.*


*47. ప్రమాదీచ... ప్రమాద కారకం.*


*48. ఆనంద... ఆనందమయం.*


*49. రాక్షస... రాక్షసత్వాన్ని కలిగినది.*


*50. నల.... నల్ల అనే పదానికి రూపాంతరం.*


*51. పింగళ... ఒక నాడి, కోతి, పాము, ముంగిస.*


*52. కాలయుక్తి... కాలానికి తగిన యుక్తి.*


*53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.*


*54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.*


*55. దుర్మతి... దుష్ట బుద్ధి.*


*56. దుందుభి ... వరుణుడు.*


*57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.*


*58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.*


*59. క్రోదన... కోప స్వభావం కలది.*


*60. అక్షయ... నశించనిది..*


*https://www.facebook.com/groups/638078683192004*

మనిషికి సంకల్పాలు ఎందుకు వస్తాయి?

 *🌷మనిషికి సంకల్పాలు ఎందుకు వస్తాయి?🌷*


*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*


*అంతర్గతం గా ఉన్న (కారణ కోశం )వాసనా గుణాల వలన లేదా బయటి ప్రపంచం లొ ఉన్న విఆకర్షింప చేసి వాటిని పొందా లనే కోరికల వలన, మనిషికి సంకల్పం,భావం,ఆలోచన,కార్యాచరణ -ఇలా ఒక గొలుసు కట్టు చర్య లాగా క్రియలు జరుగుతూ మనస్సు,బుద్ది ఎల్లప్పుడు మహా ఆందోళన తో ఉంటాయి.*


*మనిషి బయట ఉన్న ఆకర్షణలకు ,బంధాలకు దూరం గా పారిపోయి అడవుల కెళ్ళినా, వాసనా మయ కారణ కోశాన్ని శుభ్రం చేసు కోక పోతే సంకల్పాలను ఆపలేము.*

*కారణ శరీరం అనేది మన పుట్టుకకు, ముఖ్యం గా మన మెదడు పని చేసే విధానానికి మూల కారణం .*

*EEG అనేది మెదడు లో ని విద్యుత్ స్పందనలను తెలుపుతుంది .(electrical impulses in gross matter i.e.brain).*

*ఆ మెదడు వెనక ఉన్న కారణ కోశం లోని స్పందనలను తెలుసు కొనే పరికరాలు ప్రస్తుతం లేవు .*

*ఆ స్పందనలను పూర్తిగా తుడిచి వేయాలి . we have to erase all old baggage.*


*శుద్ది జరగడానికి కారణ కోశం మొత్తాన్ని రి ప్రోగ్రామ్మింగ్ అనగా పునర్వ్యవస్థీకరణం చేయాలి.*

*అది ఒక్క రొజు,ఒక ఏడు,లేదా ఒక జన్మలో జరిగేది కాదు.*

*కానీ,పని కట్టుకొని,ఒక నిశ్చల మైన వివేక వైరాగ్య అభ్యాసం తో సంకల్పాలన్నింటినీ ఆలోచనలుగా మారకుండా కట్టడి చేసే ప్రక్రియే ధ్యానం.*


*ఉదాహరణ కు  రోజుకి  60000 రకాల ఆలోచనలతో మనస్సు హడావిడి గా ఉంటుంది.*

*ధ్యాన సాధన తొలి మెట్టులో వాటిని ఒకే రక మైన ఆలొచన కే పరిమితం చేయాలి. ఎలా?*

*ఒక మంత్రమో,ఒక రూపమో,ఒక శబ్దమో,ఒక జ్యోతి పైనో మనస్సుని కేంద్రీకరించి ధారణ చేయాలి.*

*ధారణ లో ఆలోచన ఉండదు. కేవలం ఒక్క విషయం పై గమనికే ఉంటుంది.*

*గమనిక లో   మానసిక స్పందన ఉండదు .*

*ఎప్పుడైతే స్పందన లేని స్థితి సుస్థిర మవుతుందో అప్పుడే కారణ కోశ శుద్ది ఆరంభ మవుతుంది .*

*ఈ విధ మైన ధ్యాన క్రియ తో శుద్ది పూర్తీ ఐన తర్వాత నే ఎరుక ఆత్మ గత మవుతుంది .*


*ఆత్మ గత మైన ఎరుక లొ మనిషి కున్న అన్ని కోశాల జ్ఞానం కలిసి ఉంటుంది.*

*ఎలా గంటే ,మనిషి ఎరుక శరీర స్థాయి నుండి మనస్సు కి ఎదిగిన తర్వాత శరీరం గురించి బాగా తెలుస్తుంది .*

*అలాగే బుద్ది  బాగా అభివృద్ధి చెందినప్పుడు ,మనస్సులోని మర్మాలు , మనస్సు ఎలా పని చేస్తుంది? అనే విషయాలు అవగత మవుతాయి .*

*బుద్దిని దాటి కారణ కోశం లేదా ఆనంద కోశం అవగత మైతే సృష్టి కి కారణం ఏమిటో అవగత మవుతుంది .*

*దానిని కూడా దాటి ఆత్మ స్థాయికి మనిషి ఎరుక చేరి నప్పుడు , సకలం తేట తెల్ల మవుతుంది .*

*ఆత్మ ఒక్కటే శుద్ద మైనది ,గుణాతీత మైనది.*

*మిగిలిన అన్నికోశాలు సంసారపు మకిలి అంటు కొని మలిన మై ఉంటాయి.*

*అలాగని వాటిని త్రుణీకరించ కూడదు*


*https://www.facebook.com/groups/638078683192004*

మనసు

 *🌺🕉మనసు🕉🌺*


*https://chat.whatsapp.com/H4PDHgYJM7nGD0ILJRI20V*


*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*


*మనసొక సత్యపదార్థం దానికి నామరూపాలు లేవు అంటారు స్వామి వివేకానంద. ‘అగోచరమైన శక్తి’ కానీ బాహ్యప్రపంచంతో సంబంధాలు ఏర్పరచుకొని అనుభవాలను గడిస్తుంది’ అంటుంది కేనోపనిషత్తు, సాగర గర్భంలో అంతులేని సంపదలున్నట్లు, మనసుపొరల్లో శక్తి కేంద్రాలు ఉంటాయి. వాటిని జాగృతం చేసే వివేకం, సాధన మనిషికి ఎంతైనా అవసరం. ఆంతరికశక్తుల సాధకుడు ప్రతిభాశాలిగా విరాజిల్లుతాడు. ఆధ్యాత్మిక జగత్తు సూక్ష్మశరీరం, సూక్ష్మరూపయానమంటూ ప్రస్తావిస్తుంది. మనసు ప్రవేశించని చోటు ఉండదు.*


*భూతభవిష్యత్కాలాలను అధ్యయనం చేసుకుంటూ వర్తమానానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటూ అది చక్కని రహదారి ఏర్పరచుకుంటుంది. ఏకాగ్రతతో ఉండే మనసు జ్ఞానార్జనకు మూలం. జ్ఞానం, జీవన ప్రస్తానంలో వెలుగులు నింపుతుంది.*

*విదేహ రాజైన జనకుడు తన సభకు విచ్చేసిన జ్ఞాన సంపన్నుడైన యాజ్ఞవల్క్య మహర్షిని ప్రశ్నిస్తాడు..*

*మానవులకు వెలుగునిచ్చేది ఏదని. చీకట్లో, ఆపదలో, భయవాతావరణంలో ముందుకు నడిపే సాధనం ఏమిటో సెలవివ్వండని అడుగుతాడు. ఈ రెండింటికీ సమాధానం మనసు ఒక్కటే అని సమాధానమిస్తాడు యాజ్ఞవల్క్యుడు.*


*మనసుకు విస్తృతమైన పరిధి ఉందని, సంకుచిత ధోరణితో దాన్ని కుదించక, వికసింపజేసే వివేకం, జీవన సాఫల్యతను ఇస్తుందని మనిషి గ్రహించాలి. మనసు మంచి సలహాదారుగా తన కర్తవ్యం నెరపుతుంది. మనసు ఇంద్రియాలతో సంయోగం చెందినప్పుడు మాత్రమే బాహ్య జగత్తులోని ‘దృశ్యం’ అవగతమవుతుందని పతంజలి యోగశాస్త్రం అంటుంది.*


*సాత్విక లక్షణాలతో గుబాళించే మనసు, సాధకుడిని ఉన్నత స్థితి పొందేలా చేస్తుంది. మానవుడు తననుతాను సంస్కరించుకునే సన్మార్గ ప్రబోధినిగా ఉంటుంది.* *ధ్యాస, ధ్యానమనే ప్రక్రియల సాధన ద్వారా మనసును అమృత కలశంగా చేసుకోవాలని యోగశాస్త్ర నిపుణులంటారు.*

*ఈ ప్రక్రియలు మనసును దారితప్పనీయవు.* *ఉద్రేక,ఉద్వేగాలను నియంత్రిస్తాయి. కోర్కెలపై అదుపు సాధించేలా చేస్తాయి. సమదృష్టి, సమభావన ఉండేలా చేస్తాయి. మనిషిఇక్కడే ఉండి, మనసు ఎక్కడో ఉండే స్థితిని దూరం చేస్తాయి. నిర్మల చిత్తాన్ని ప్రసాదిస్తాయి. శరీరానికి బలం, మనసుకుక స్థిరత్వం నిగ్రహశక్తి వల్లనే ఒనగూడతాయి. మావటి చేతిలోని అంకుశం మదగజాన్ని అదుపు చేస్తుంది. దాన్ని క్రమేపీ సాధు జంతువుగా మారుస్తుంది. ఇష్టం వచ్చినట్లుగా చరించే మనసును నిగ్రహశక్తి అదుపు చేస్తుంది.*


*మధురలో తనను రోజూ పుష్పమాలికలతో పూజించే మాలాకారుడైన సుదాముని ఏం కావాలో కోరుకొమ్మని శ్రీకృష్ణుడు అన్నప్పుడు.. నీ పాదపద్మాలపై నిలిచి ఉండే నిశ్చల మనసును అనుగ్రహించమని, అదే చాలునని కోరతాడతడు. మనసుకు తృప్తి చాలా ముఖ్యం. అసంతృప్తి కార్చిచ్చులా దహించివేస్తుంది. ఈ దీక్ష, దక్షత, ఆత్మీయత, ఆదరణ, కృతజ్ఞత, స్థైర్యం, సాహసం లాంటి సులక్షణాలు మనసుకు పోషకాలు. కరుణ, జాలి, దయ, దాక్షిణ్యంలాంటివి మనసును నవనీతంలా ఉంచుతాయి.*


*మనసు సుక్షేత్రమైన పంటభూమి. ఏ విత్తనాలు నాటితే ఆ పంటను సమృద్ధిగా పొందవచ్చు. కలుపు మొక్కలు పంటను ఎదగనీయవు, వాటిని వీకెయ్యాలి. మానవ బంధాల మాధుర్యవృష్టికి మూలం మనసే. అది జీవిత రథాన్ని నడిపే సారథి. నేటి ఆధునిక సమాజంలో మనుషుల మధ్య అగాధాలు పెరిగిపోవడానికి, భార్య భర్తల మధ్య సఖ్యత లోపించడానికి కారణం ఎదుటివారి మనసులను అర్థం చేసుకోలేకపోవడం. ప్రతికూల ఆలోచనలతో మనోభారాన్ని పెంచుకోవడం, ఎదుటి మనసును చదవడం, అర్దం చేసుకోవడం వివేకంతో కూడిన ప్రజ్ఞాసూచికలు. అద్భుతమైన మనోపరిణతికి అది నిదర్శనం. ఏ ఇద్దరి మనోభావాలూ ఒక్కటిగా ఉండవు. కానీ పరస్పర అభిప్రాయాల గౌరవంతో ఏకోన్ముఖంగా సాగడమే వివేకం.*


*https://www.facebook.com/groups/638078683192004*

కర్మ కర్మణా నశ్యతి కర్మ! అంటే కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది.

🍁 కర్మ కర్మణా నశ్యతి కర్మ!🍁

📚✍️ మురళీ మోహన్

🌊గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషికి ఒక సందేహం వచ్చింది!

వెంటనే గంగానదినే అడిగాడట!

అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు తల్లీ? అని.

అందుకా తల్లి "నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను" అని బదులిచ్చిందట.

అయ్యో అన్ని పుణ్య నదులు ఇంతేకదా! పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో? అనుకొని!

సముద్రాన్నే అడిగాడు!

ఎలా మోస్తున్నావు? ఈ పాపభారాన్ని!?! అని!

దానికా సముద్రుడు!

నేనెక్కడ భరిస్తున్నాను?! ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోకి పంపిస్తున్నాను' అని బదులు ఇచ్చాడట.

అరే!!! ఎంతో తేలికగా కదిలి పోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది! అని అనుకుంటూ!

ఓ మేఘ మాలికల్లారా ఎలా భరిస్తున్నారు? ఈ పాప భారాన్ని! అని అడగగా!!!

అవి పకపకా నవ్వి! మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటి కప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'! అని బదులివ్వగా,

ఓహో!!! ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నా మన్నమాట!

అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా! ఎవరూ కూడా! కర్మ ఫలితాలు వదిలించు కోలేమని!!!! గ్రహించాడు అక్కడ స్నాన మాచరిస్తున్న ఋషి!

ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః
ఆత్మతీర్ధం నజానన్తి కధం మోక్షః శృణు ప్రియే.

పరమశివుడు పార్వతీ దేవికి ఉపదేశించిన శ్లోకమిది!.

ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును! ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగును! అని తీర్ధ స్నానమునకై పరుగు లెత్తెడు మానవులు "భ్రమకు లోబడిన వారు"!

ఆత్మ జ్ఞాన తీర్ధంలో స్నాన మాచరించని వారికి మోక్ష మెటుల కలుగును?!? అని ఈ శ్లోకం అర్థం.



అంటే కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది.*

🙏🏻 ..

సేకరణ

కోరికలు తీరడం లేదని, కష్టాలు వదలడం లేదని దేవుని నిందించడం తగదు.

🌼🔅కోరికలు తీరడం లేదని🔅🌼
⚜️కష్టాలు వదలడం లేదని⚜️
📍దేవుని నిందించడం తగదు.📍
🔹🔸🔹🔸🌸🌸🔸🔹🔸🔹

🍁🌾 ఎందుకంటే ఒక పిల్లవాడు తళతళమని మెరిసే ఒక పదునైన కత్తిని ఆట వస్తువుగా భావించి అది కావాలని తల్లితో పదేపదే మారాం చేస్తాడు.

🍁🌾 పిల్లవాడు అడుగుతున్నాడు కదా అని కత్తిని తల్లి ఇచ్చేస్తుందా? మీరైతే మాత్రం ఇస్తారా!!!

🍁🌾 అవసరమైతే పిల్లవాడిని దండిస్తుంది, కాని కత్తిని అందించదు.

🍁🌾 ఎందుకంటే కత్తి వలన కలిగే ప్రమాదం పిల్లవాడికి తెలియదు.‌

🍁🌾 అదేదో ఆటవస్తువనే భ్రమలో ఉంటాడు.

🍁🌾 కానీ తల్లికి దానివలన కలిగే ప్రమాదం తెలుసు కనుక తన పిల్లవాడు ఆ కత్తితో తనకు తానుగా ఎక్కడ గాయపరచుకుంటాడో అని ఆ తల్లి దానిని దూరంగా దాచేస్తుంది.

🍁🌾 మరి ఈ జన్మకు కేవలం ఈ దేహానికి మాత్రమే తల్లిగా ఉండే మానవ స్త్రీయే తన బిడ్డల పట్ల ఇంత జాగ్రత్తగా ఉంటే జన్మ జన్మల నుండి మనతో ఉంటూ మన ఆత్మకు తల్లీ తండ్రీ తానుగా ఉండి మనలను సదా కాచుకు కూర్చుంటున్న ఆ భగవంతుడు ఆయన పిల్లలమైన మనపై ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి?

🍁🌾 మనం కోరుకునే వస్తువు వలన కలిగే దుష్పరిణామాలు మనకు తెలియవు కానీ భగవంతునికి సదా ఎరుకయే.

🍁🌾 భగవంతుడు మనం ఆడిగిన ప్రతిదీ ఇవ్వకపోవడానికి కారణం ఇదియే.

🍁🌾 భగవంతుని ఆర్థించండి పరవాలేదు‌. యివ్వ లేదని నిందించకండి.

🍁🌾 ఆయన మనకు కావాల్సిన ప్రతిదీ ఇవ్వక పోవచ్చు కానీ మనకు అవసరమైన ప్రతిదీ ఇచ్చి తీరుతాడు. సందేహాలకు చోటివ్వక విశ్వాసం పెంచుకోవాలి.

🍁🌾 భగవుంతునిపై విశ్వాసం ఉంచండి.

🍁🌾 సన్మార్గములో జీవితం కొనసాగించండి.

🍁🌾 గౌరవం అనేది గుణాన్ని చూసి ఇవ్వాలి. ధనాన్ని, అందాన్ని చూసి కాదు.

🍁🌾 చెప్పులు ఎంత ఖరీదైనవి అయినా గుడి బయట వదిలేస్తాం.

🍁🌾 కొబ్బరికాయ ఖరీదైనది కాకపోయినా దేవుడి పాదాలకు సమర్పిస్తాం.

🍁🌾 మనిషి వ్యక్తిత్వం కూడా అంతే.

🍁🌾 మన జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దుకోడానికి కావాల్సిన ఒకేఒక ఆయుధం మంచి ఆలోచన.

🍁🌾 ఆలోచనలు మంచివైతే మన పయనం మంచి వైపు.

🍁🌾 ఆలోచనలు చెడువైతే మన దారి చెడువైపు. అంటే, ఆలోచనల సమాహారమే మన జీవితాన్ని నడిపే ఆయుధం.

🍁🌾 మన ఆలోచనలు మారితే, మనకున్న అలవాట్లు మారుతాయి.

🍁🌾 మన అలవాట్లు మారితే, మన జీవితం మారుతుంది.

🍁🌾 మన జీవితంలో జరిగే మంచి, చెడు ఏదైనా మన ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటుంది.
🙏🙏🌹🔸🌷🌷🔸🌹🙏🙏

సేకరణ

ఈ రోజు ఆదివారం... కనీసం ఈ వారమైనా ప్రారంభిద్దాం...!!

ఈ రోజు ఆదివారం... కనీసం ఈ వారమైనా ప్రారంభిద్దాం...!!

అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే | సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||
స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి ||

(ఎంతో పవిత్రదినాన్ని కక్క, ముక్కల రోజుగా మార్చిన దౌర్భాగ్యుడు ఎవరు???
ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల లోని ఓక శ్లోకం మీకోసం)

తాత్పర్యం:--
మాంసం తినడం..!
మద్యం తాగడం..!
స్త్రీతో సాంగత్యం..!
క్షవరం చేసుకోవటం..!
తలకు నూనె పెట్టుకోవడం..!

ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించారు, కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం..!
ఈ కర్మలు చేసినవాడు జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి చెప్పారు మన పెద్దలు దరిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు.. ఆనారోగ్యం కూడా..!!

ఇలాంటి పవిత్రమైనరోజు తాగుబోతులకి, తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది..!!

మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు..!!

ఎందుకంటే.. అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు..
సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి..!! సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం..!!

అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారం గానే వస్తాయి..!!

ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి..!!

ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు... అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేశారు..!! చేస్తున్నాము..!!

మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు... ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి..!!

అది చూసి తట్టుకోలేక బ్రిటీషు వాడు (Thomas Babington Macaulay, ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే) ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు.. మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు..!!

ఆదివారం నాడు చర్చిలు కలకలలాడతాయి.! మన హిందూ దేవాలయాలు వెలవెల బోతాయి.!!

పూర్వకాలంలో వృత్తి పనులు చేసుకునే వారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు.! ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు.!

మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు.. ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు.. మధ్యాన్ని తాగేవారు కాదు..!!

కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది!!

ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మద్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారున్నారు.! ఇప్పటికైనా కళ్ళు తెరవండి.! విదేశీ సంస్కృతిని విడనాడండి. స్వదేశీ_సాంప్రదాయాలను పాటించండి..!

యోగ చేయండి.! ప్రాణాయామం చేయండి.! సూర్య నమస్కారాలు చేయండి.!

సూర్యోపాసన చేయండి.!!

ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి..!!

ఈ పోస్టు కొందరు సోదరులకు ఉత్సాహాన్ని మరియు కొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది..!!
కానీ దీన్ని పాటించడానికి ప్రయత్నించండి..!!

ఒకేసారి అన్నీ మార్పులు సాధ్యపడకపోవచ్చు కానీ క్రమ క్రమముగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలకు అన్నీ మార్పులు చేసుకోవచ్చు ఆదివారం సెలవు ఉండటం అనేది అతి పెద్ద కారణం కావచ్చు.

ఈ విషయం పై బాగా చర్చ జరగాలి మార్పు రావాలి.
🙏🙏🌹🌹🕉️🕉️🌹🌹🙏🙏

సేకరణ

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

కొన్ని బంధాలు దగ్గరే ఉన్నా దూరమౌతాయి కారణం అహాంకారం🌺

కొన్ని బంధాలు ఎంతో దూరంగా మనపక్కనే ఉన్నట్లుగా ఉంటుంది కారణం మంచితనం🌼

కొన్ని బంధాలు మరువద్దని అనుకున్నా పదేపదే గుర్తొస్తాయి అదే ప్రేమ🌸

కొన్ని బంధాలు గుర్తించుకోవాలన్న మరిచిపోతుంటాము కారణం ద్వేషం🏵️

కొందరు చేసిన మంచి శాశ్వతంగా నిలుస్తుంది. కొందరు చేసిన చెడు వాళ్ళ కుటుంబాలకు పట్టి పీడిస్తుంది.
కారణం నీలోనే మంచి &చెడు రెండుంటాయి............

నీవుచేసిన పనులను బట్టే నీజీవితం ఉంటుంది............. మంచివాడిగా చరిత్రలో మిగిలిపోతావో............ చరిత్ర అనే చీకటిలో కలుస్తావో. నీచేతుల్లోనే ఉంది.

శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

మనం అందరం ఏది జరిగినా దేవుడి ప్రసాదమని స్వీకరించగలిగే ప్రవర్తన కలిగి వుండాలి

నా జీవితంలో ఎన్నో సందర్భాల్లో అనుభవ పూర్వకంగా తెలుసుకున్న సత్యం.

ఒక రాజు గారికి భీముడు అనే అంగ రక్షకుడు వుండేవాడు.వాడు నిజాయితీగా పనిచేసేవాడు.అందుకని రాజుగారికి అతడంటే చాల యిష్టం.అతనెప్పుడు తేది జరిగినా అది అంతా మన మంచికే అని అన్తూందే వాడు.
ఒకసారి రాజుగారి పాదానికి గాయమైకాలి బొటనవేలు తీసేయాల్సి వచ్చింది. రాజు బాధపడుతూంటే భీముడు
దిగులెందుకు మహారాజా! ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అన్నాడు. రాజుకి చాలా కోపం వచ్చింది
నా వేలు పోయి నేను బాధ పడుతుంటే నీకు ఎగతాళిగా వుందా?అంటే భీముడు మరీ అదేమాట అన్నాడు ఏది జరిగినా మన మంచికే అని. రాజుకు కోపం వచ్చి అతన్ని చెరసాలలో పెట్టమని ఆజ్ఞాపించాడు.అతన్ని చెరసాలలో పెట్టేటప్పుడు కూడా అతను యిదీ మన మంచికే అంటూ లోపలి వెళ్ళాడు.కొన్నాళ్ళ తర్వాత రాజు వేటకి వెళ్ళాడు..అక్కడ దారి తప్పి అడవిలో చాల దూరం వెళ్ళిపోయాడు.అతని సైనికులూ,అంగ రక్షకుడూ
యేవరూలేరు.అక్కడికి కొంత మంది ఆటవికులు వచ్చి అతన్ని బంధించి తీసుకొని వెళ్ళారు.వారి నాయకుడి ముందు నిలబెట్టారు.అతడు ఇతన్ని మన దేవతకు బలి యిచ్చేద్దాం అని అన్నాడు. సరే అతనికి స్నానం అదే చేయించి దేవత దగ్గరికి తీసుకని రండి అని ఆజ్ఞాపించాడు.వారు అతనికి స్నానం చేయించేటప్పుడు అతని కాలికి బొటనవేలు లేక పోవడం గమనించారు.నాయకుడి దగ్గరకు వెళ్లి యితనికి అంగ వైకల్యం వుంది ఇతను బలి యివ్వటానికి పనికి రాడు. అన్నారు. సరే అయితే అతన్ని వదిలి వేయండి అని ఆజ్ఞాపించాడు. రాజు బ్రతికి జీవుడా నాయి తన గుర్రం యెక్కితిరిగి తిరిగి ఎలాగో ఒకలాగా తన రాజ్యానికి
చేరుకున్నాడు.అప్పుడు అతనికి తన కాలికి బొటనవేలు లేకుండా వుండడం వల్ల తను బ్రతికి బయట పడ్డాడు కదా! మరి భీముడు చెప్పింది నిజమే కదా!తనకు వేలు లేక పోవడ వల్ల తనకు మంచే జరిగింది అని అతన్ని చేరసాలనుంచి విడిపించి అతన్ని క్షమాపణ కోరాడు.భీముడు క్షమాపణ యెందుకు మహారాజా యిది కూడా నామంచికే గదా జరిగింది.అన్నాడు.అదెలా? అని రాజు అడిగాడు.నేను చెరసాల లో వుండకుడా వుంటే నేను మీ వెంట వేట కు వచ్చేవాడిని.
. అడవిలో మీ అంగ రక్షకుడిగా నా ధర్మం నిర్వర్తించేందుకు మీ వెంటే వుండేవాడిని.
అప్పుడు ఆ ఆటవికులు మిమ్మల్ని వదిలేసి బాగున్న నన్ను బలి యిచ్చేవారు కదా! మీరు నన్ను చెరసాలలో పెట్టి నందున నాకు మేలే జరిగింది.మీరు నా ప్రాణం కాపాడినట్టే కదా! నాకు మేలే జరిగింది.
మీరేమీ బాధపడకండి. ఏది జరిగినా మన మంచికే అని నేనందుకే చెప్తూ వుంటాను.అన్నాడు.రాజు అతనికి
మంచి బహుమానం యిచ్చి జీతం ఎక్కువచేసి గౌరవించాడు.దీని వల్ల నీతి యేమంటే. మనం అందరం ఏది జరిగినా దేవుడి ప్రసాదమని స్వీకరించగలిగే ప్రవర్తన కలిగి వుండాలి

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

మంచి మాట.లు

ఆత్మీయ బంధు మిత్రులకు ఆదివారపు శుభోదయం శుభాకాంక్షలు ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణుడి అనుగ్రహంతో మీరు మీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ... అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలిఅని కోరుకుంటూ
ఆదివారం :- 30-1 2022
ఈరోజు AVB మంచి మాట.లు


ప్రతి రోజు ఉదయాన్నేమీ లాంటి ఆత్మీయులను పలకరించే ఒక చక్కని వరందేముడు నాకు కల్పించిన భగవంతుడి కృతజ్ఞతలు తెలియజేస్తూ


జీవితంలో మనం ఎంత మారినా ఇష్టమైన వారిమీద ఉండే ప్రేమ అభిమానం మాత్రం ఎప్పటికి మారదు .

మనిషీ కాదు మారాల్సింది మనసు మారాలి ఆలోచించే విధానం మారాలి మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా కనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి ఇదే మన జీవిత రహస్యం .

మనం చేసే పని ఎంతమంది చూస్తారన్నది ముఖ్యం కాదు అది ఎంత మందీకి ఉపయోగపడిందీ అనేడే ముఖ్యం మంచి పని చేసేటప్పుడు మనం కనబడాల్సిన అవసరం లేదు మంచి తనం కన బడితే చాలు .తరువాత దానిలో మిరే ఉంటారు

మీరు చేసే మంచిపని ఏదైనా సరే దాని ఫలితం మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మిల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది మంచి పనులే చేయండి మంచి వారిగానే పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించండి .మంచి వారిగానే జీవిద్దాం

ప్రతి మనిషి చుట్టూ మంచి - చెడు , కష్టం - నష్టం , ప్రేమ - ద్వేషం అన్నీ ఉంటాయి.. దేన్ని వదిలేస్తాం దేన్ని తీసుకుంటాం అన్నదాన్ని బట్టే మన సంతోషం ఆధారపడి ఉంటుంది .

సేకరణ ✒️*మీ ...AVB సుబ్బారావు 🕉️🚩💐🤝

సేకరణ

Saturday, January 29, 2022

పరోపకారం ఇదం శరీరం

🍁పరోపకారం ఇదం శరీరం🍁

📚✍️ మురళీ మోహన్

-[ప్రతి ఒక్కరికి.. శరీరమే అతిపెద్ద నిధి]-

ప్రతి మనిషికి తన వద్ద మిగిలిపోయే అతి గొప్పదైన చివరి సంపద తన శరీరమే. మనిషి తన తోటి మనిషికి పంచివ్వాలన్నా, సహాయం చేయాలన్నా తన వద్ద ఉండవలసినది ధనం, సంపద, ఆస్తి పాస్తులు ఉండాలనుకోవడం చాలా పెద్ద పొరపాటు. అవి లేకపోతే మరేముండాలి, కేవలం నీ శరీరం ఉంటే చాలు, అదే ఒకపెద్ద నిధి. అందులోనే అనేక సంపదలు ఉన్నాయి. ఆ సంపదలతో ఎదుటి వారికి అనేక రకాలుగా సహాయం చేయవచ్చు.

రామాపురం అనే ఊరి చివరిగా ఓ గురువుగారు ఒకే ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు. ఒకసారి చాలా పేదవాడు ఆ ఆశ్రమానికి వచ్చి గురువుగారితో ఇలా అడిగాడు, స్వామి 'నేను ఎందుకు పేదవాడిగా పుట్టాను, ఆ భగవంతుడు ఎందుకు మనుషులను కొందరిని ధనవంతులుగా, మరికొందరిని పేదవారిగా పుట్టిస్తున్నాడు. ఈ బేధభావం ఎందుకు అని అడిగాడు. అందుకు గురువుగారు ఇలా సమాధానం చెప్పారు.

మీరు ఎందుకు పేదవారుగా పుట్టారు, అంటే అది మీరు గతజన్మలో చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి మీకీ జన్మ లభిస్తుంది. అంటే మీరు ఇతరులపైన ఎటువంటి జాలి దయ వంటి ఔదార్యము కలిగి ఉండరు. అలాగే ఇతరులకు ఉపయోగపడేలాగ దాన ధర్మాలు చేయరు.


అందుకా పేదవాడు మరి నేను ఇతరులకు దానధర్మాలు చేయడానికి నావద్ద ఏమున్నది అని ఆ పేదవాడు అడిగాడు. అప్పుడు గురువు గారు ఈ విధంగా చెప్పాడు.

నీ దగ్గర ఇతరులకు పంచడానికి నాదగ్గర ఏమీ లేదు అని నీవు అనుకుంటున్నావు. కానీ ప్రతి మనిషికి తన దగ్గర ఇతరులతో పంచుకోగల ఐదు నిధులను కలిగివున్నారు. అందులో మొదటిది మీ ముఖం. అది మీకు ఉందికదా. ఆ ముఖకవళికలతో మీరు ఇతరులతో మీ ఆనందాలను, నవ్వులను పంచుకోవచ్చు. దీనికి నీ దగ్గర ధనరాసులే ఉండక్కర్లేదు. ఇది ఉచితం. ఈ నీ నవ్వులే ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి. వీటిద్వారా నీవే కాదు నీతో ఉన్న ప్రతి ఒక్కరినీ సంతోషంగా జీవింప చేయవచ్చు. నీలో ఎన్నెన్నో బాధలు ఉండిఉండ వచ్చు. కానీ వాటిని బయటకు వ్యక్తపరచకుండా నీవు ఎప్పుడూ నవ్వుతూ, ఆ నువ్వులను అందరికీ పంచడమే నీవు ఇతరులకు చేసే గొప్ప సాయం. అదే నీకు పెన్నిధి.


ఇక రెండవ నిధి మీ కళ్ళు. అవి మీకు ఉన్నాయి. వాటితో మీరు ప్రేమ, కరుణ,దయా, జాలి, ఆప్యాయతా, అనురాగం వంటి అనేక రకాల రసాలను ఇతరులకు పంచవచ్చు‌. ఇది నిజం మీరు లక్షలాది మందిని కేవలం మీ ప్రేమానురాగాలు నిండిన కంటిచూపుతోనే గొప్పగా ప్రభావితం చేయవచ్చు. వాటిని మంచి అనుభూతిగా మార్చవచ్చు. కాబట్టి ఇకనుండైనా మీ కళ్ళతో కరుణరసాలనే నిధులను పంచే ప్రయత్నాలు చేయండి.

ఇక మూడవది మీ నోరు మీకు ఉంది. ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి సుభాషితాలు, మంచి మంచి విషయాలు చెప్పవచ్చు. మంచిని మంచిగా చర్చించండి. ఆ చర్చలే మనిషి జీవితానికి అతి విలువైనదిగా భావించండి. ఇలా చర్చించకనే అనేక ఉమ్మడి కుటుంబాలు చెల్లాచెదురుగా చెదిరి పోతున్నాయి. మంచి స్నేహితుల మధ్య పెద్ద పెద్ద అగాధాలని సృష్టిస్తున్నాయి. మనిషికి మనిషికి మధ్య ఆనందం మరియు సంతోషాలు కరువౌతున్నాయి. కాబట్టి సమస్యలు ఏవైనా మంచిగా చర్చించుకొని అపోహలు తొలగిపోతే ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు వ్యాప్తి చెందుతాయి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.

ఇక నాలుగవది మీకు గుండె ఉంది కదా. మీ ప్రేమగల హృదయంతో మీరు ఇతరుల ఆనందాన్ని, సంతోషాన్ని కోరుకోవచ్చు. మీరు కూడా ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు. ఆ అనుభూతులను ఇంకెందరితోనో పంచుకోవచ్చు. మీరు అందించే ఆ మమతాను రాగాలు వారి జీవితాలను తాకవచ్చు. వారిలో అనూహ్య స్పందనలను కలిగించవచ్చు. ఆ విధంగా బండరాతి గుండెలను కూడా సుతి మెత్తని పూబంతులవలే మలచవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఆ అనుభూతి మీకు కూడా అవగతమౌతుంది.

ఇక మీరు కలిగి ఉన్న అతి పెద్దదైన చివరిసంపద మీ శరీరం. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక రకాలుగా మంచి పనులు చేయగలరు. అవసరమైనవారికి అనేక రకాలుగా సహాయం అందించగలరు. సహాయం చెయ్యడానికి మనిషికి డబ్బే అవసరం లేదు. శారీరకంగా ఏంతో శ్రమను ఇతరులకు సహాయంగా అందించవచ్చు. నువ్వు చేసే ఆ శారీరక సహాయం వారికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. వారు ఇది నాకు అసాధ్యం అనుకొనే ఏ పనినైనా సుసాధ్యం చేసి వారికెంతో ఊరట కలిగిస్తుంది. ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి.

కాబట్టి ప్రియ ఆత్మీయులారా ! నీ ఒక చిన్న సహాయం, నీ చేయూత ఎదుటి వారి జీవితాలలో దేదీప్యమానంగా వెలుగులను వెలిగించగలవు. అందుకే పెద్దలు అంటారు భగవంతుడు మనకిచ్చిన జీవితం, కలకానిదీ ! విలువైనదీ ! సర్వోత్తమమైనదీ ! అలాంటి నీ జీవితాన్ని దుర్భరం చేసుకొంటూ నీవు ఏడుస్తూ, ఇతరులను ఏడిపించక ప్రతిక్షణం ఆనందంగా నీవు ఉంటూ, ఆ ఆనందాన్ని పదిమందికి అనేక రకాలుగా పంచుతూ శారీరకంగా, మానసికంగా అందరికీ సహాయపడుతూ, నీ జన్మను చరితార్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ..

🕉🌞🌎🌙🌟🚩

సేకరణ

మంచి మాట..లు

ఆత్మీయ బంధు మిత్రులకు మంగళవారం శుభోదయ శుభాకాంక్షలు మా ఇంటి దైవం శ్రీ రామభక్త వినుకొండ గుంటి ఆంజనేయ స్వామి వారు తిరుత్తని వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..

మంగళ వారం--: 25-01-2022 :--
ఈ రోజు AVB మంచి మాట..లు
మనం మనసులో ఒక ఆలోచన నాటితే అది పనిగా పెరుగుతుంది.. అదే పని చేయటం మొదలు పెడితే అది ఒక అలవాటుగా మారుతుంది.. అలవాటును క్రమబద్ధంగా ఆచరిస్తే మీ వ్యక్తిత్వం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం బాగుంటే మీ తలరాత మారుతుంది..అర్థమైందిగా మీ తలరాతను మీరే రాసుకోవచ్చు👍

మనస్సులో కల్మషం లేని వారు మన ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడుతారు ఒంటి నిండా విషము నింపుకొని ఉన్నవారు మన ముందు తియ్యగా మన వెనుకాల చేదుగా మాట్లాడుతారు ఒకటి మాత్రం నిజమనేది గమనించాలి సింహంతో స్నేహం చేసుకోవచ్చు కానీ ! గుంట నక్కతో దోస్తీ అత్యంత ప్రమాదకరం .

బంధాలు నిలవాలంటే మనలో క్షమించే గుణం ఉండాలి . బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి , ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకండాలి . నలుగురితో కలిసుండాలంటే చిన్ని నవ్వుతో పలకరింపులు ఉండాలి ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది .

మనం బాద పడితే మనల్ని ఓదార్చే వాళ్ళు కొందరు , మనం ఎప్పుడూ బాధ పడతామా అని ఎదురుచూసే వాళ్ళు మరి కొందరు మనతో ఏ బంధం లేక పోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు . అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోకూడదు

సేకరణ ✒️*మీ ...AVB సుబ్బారావు

సేకరణ

మంచి మాట..లు

🔱శుభోదయం🙏
ఆత్మీయ బంధు మిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం తో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ....
24-01-2022:- సోమవారం
ఈరోజు
AVB మంచి మాట..లు
చూడు మిత్రమా!!
క్షమాగుణం బలహీనత కాదు, క్షమించడానికి శిఖరమంత మనోబలం కావాలి,,

దేనినైనా సరే మన బలంతో సాధించాలి, అవతలివారి బలహీనతతో కాదు,,

నీ దగ్గర ఏమీ లేనప్పుడు అన్ని ఉన్నట్టుగా ఉండు, అన్ని ఉన్నప్పుడు ఏమి లేనట్టుగా ఉండు, ఇదే మనిషి మనుగడకు రహస్యం,,

ఈ మాట బాగా గుర్తుంచుకో,, మనం బాగుపడాలని కోరుకునే వారి కంటే, మనం ఎక్కడ బాగుపడతామో అని బాధ పడేవాళ్లే ఎక్కువ ఈ లోకంలో,,*
సేకరణ ✒️AVB సుబ్బారావు

సేకరణ

మంచి మాట...లు

ఆత్మీయ బంధు మిత్రులకు ఆదివారపు శుభోదయ శుభాకాంక్షలు ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుని అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ
💐🤝
ఆదివారం :-23-01-2022
ఈ రోజు AVB మంచి మాట...లు

ఓర్పు, ఓరిమి, సహనములు, కోల్పోయినట్లయితే ఎంతోకాలం శ్రమించి, కష్టించి, కృషిచేసి సంపాదించిన మంచిపేరు, ప్రతిష్ఠలు ఒక క్షణంలో మటుమాయం అయిపోతాయి. సంపాదించడం ఒక ఎత్తు.
దానిని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు......
సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నాం అనే దాన్నికన్న ఎదుటి వాళ్లు ఏం చేస్తున్నారు అనే దానిపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తారు..


ఏది నిజం ఏది అబద్ధం..
ఏది తప్పు ఏది ఒప్పు..
ఎటు చూసినా ఏమున్నది.
మనుషులు,తమ మనసులకి
ముసుగులు వేసుకుని బ్రతికేయటం తప్ప..

ఈ రోజుల్లో డబ్బు కి ఉన్న విలువ మనిషికి లేదు..
మనసుకి అసలే లేదు..
డబ్బుతో అన్నీ వస్తాయి
ప్రేమ,అనురాగం, ఆప్యాయత. ఇవన్నీ వస్తాయి..అనుకుంటున్నారు.
అందుకే డబ్బుని ప్రేమిస్తూ మనుషుల్ని దూరం చేసుకుంటూ..
ప్లాస్టిక్ నవ్వులతో బ్రతికేస్తూ..
ఆప్యాయతలు మరిచిపోతూ..
ఏదోలా బ్రతికేస్తున్నాం..!!


జీవితం అంటే ఇది కాదు
జీవితం తేలికైనదే...కానీ ఆశల భారమే అధికం అయినప్పుడు జీవితం భారమవుతుంది..జీవితానికి.. సమాధానం కావాలి...కానీ సమస్యలో భాగం కాకూడదు..ఆశ..సమస్య రెండూ ఒకదాని కీ ఇంకొకటి తోడుంటాయి .. జీవితాన్ని అయోమయంలో పడేస్తాయి...ఉన్నంతలో ఆశ..మనం తీర్చుకోగలిగే చిన్న సమస్య చాలు.. జీవితంలో ఆశ..సమస్య రెండూ లేకపోతే థ్రిల్ ఉండదు.అవునా కాదా?

☀️నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుస్తే,
ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.

☀️జీవితం చాలా కష్టమైన పరీక్ష.
దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం,
ప్రతీ ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే.

☀️కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది,
హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది,
మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.


జీవితమనేది మనం నడిచే
దారి లాంటిది.

మనకి తోడుగా నడిచే వారు వుంటారు కానీ...

మనకి బదులు గా నడిచే వారు ఉండరు..

మనమే నడవాలి ఎంత కష్టమైన..


వ్యక్తిత్వం అనేది.. వెలుగుతున్న 🪔దీపంలా ఉండాలి...
ఎందుకంటే... 🪔దీపం పూరి గుడిసెలో ఐనా...

ఇంద్ర భవనం లో ఐనా....
*ఒకేలా వెలుగునిస్తుంది

సేకరణ ✒️AVB సుబ్బారావు 💐🤝

సేకరణ

మంచి మాట..లు

ఆత్మీయ బంధు మిత్రులకు శనివారపు శుభోదయపు శుభాకాంక్షలు లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు, వల్లి దేవసేన సమేత తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి వారు మా ఇంటి దైవం రామ భక్త వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ....
22-01-2022:-శనివారం
ఈ రోజు AVB మంచి మాట..లు

కళ్ళకు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తే మీకు బయట వెలుతురు లేనట్టే అనిపిస్తుంది
మీరు మనసులో ఒకటి పెట్టుకొని ఉంటే ఎదుటివారు ఏమి చెప్పినా మీకు చెడుగానే అనిపిస్తుంది

వెనక మీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్లు గురించి ఆలోచించకండి . ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మీ వెనకే అని గమనించండి ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి

మన ఆలోచనలు కష్టాలను దూరం చేసేలా ఉండాలి అంతేకాని... కొత్త కష్టాలను కొని తెచ్చుకునేలా ఉండకూడదు మంచిగా ఆలోచించండి.. మంచిని చేయండి ప్రశాంతంగా జీవించండి
సేకరణ ✒️ AVB సుబ్బారావు

సేకరణ

మంచి మాట.. లు

ఆత్మీయబంధు మిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు పూజ్య గురుదేవుల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు అష్టైశ్వర్యాలతో సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ
20-01-2022:-గురువారం
ఈ రోజు AVB మంచి మాట.. లు
చూడు మిత్రమా!!
వినే ఓపిక లేనివాడు ఎప్పటికి అజ్ఞానిగానే మిగిలిపోతాడు, చెప్పే ధైర్యం లేని వాడు ఎప్పటికి పిరికివాడిగానే ఉండిపోతాడు,,


శత్రువుకు నీ బలాన్ని చూపించు, స్నేహితుడికి నీ గుణాన్ని చూపించు చాలు,,


మనల్ని తొక్కి బతుకుతాను అనే వాళ్ళ ముందు, ఎదిగి నిలబడతాను అనే ధైర్యంగా బ్రతకాలి, ధైర్యం లేకపోతే తాడు కూడా పాముగా కనబడుతుంది గుర్తుంచుకో,,


ఒకరి నమ్మకంతో పని లేదు, నిన్ను నువ్వు నమ్ముకో చాలు, మహా సముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది,,


గతం అంతా గమ్మత్తు గానే ఉంటుంది గడిచిపోయింది కాబట్టి,
భవిష్యత్ అంతా భయం గానే ఉంటుంది భరించాలి కాబట్టి.


గుర్తుంచుకో,, ఎదుటి వ్యక్తి నీపై గెలిచే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు,,
సేకరణ ✒️AVB సుబ్బారావు*

సేకరణ