Thursday, October 17, 2024

 *పాప ఫలితమే నేటి దారిద్ర్యం..!*
```
మానవులలో కొందరికి ఉండటానికి చక్కని ఇల్లు,   తినడానికి మంచి భోజనం,కట్టుకోవడానికి మంచి వస్త్రం, మొదలైన వసతులన్నియు వుంటాయి.
కాని కొందరికి తినడానికి తిండియుండదు, కట్టుకోవడానికి బట్ట యుండదు, ఉండటానికి ఇల్లు యుండదు.జీవితంలో నానా అగచాట్లు పడుతూంటారు.వాళ్ళు,శాంతి,సుఖం, ఆనందాలకు కొద్దిసేపైనా వారు నోచుకోలేరు, దీనికంతటికి కారణమేమిటి?

భగవంతునికేమీ పక్షపాతం లేదు కదా! ఆయనకు ప్రాణికోట్లందరు సమానులే.
కానీ ఈ భేదం ఎందుకేర్పడింది, వారివారి పాపఫలితమే ఈ దారిద్ర్యం. 

వారు పూర్వజన్మలో కాకికి మెతుకైనా పెట్టియుండరు,   పిల్లికి బిచ్చమైనా పెట్టియుండరు, దానధర్మాలు అసలే చేసియుండరు, ఆ అదానదోషమే ఈ దారిద్ర్యం.

దరిద్రుడుగా ఉన్నవాడిని ఎవరూ పట్టించుకోరు. అతని గోడు వినిపించుకోరు, అతడు వ్యక్తిగా ఉన్నా,  వ్యక్తిత్వం లేనివాడుగా వుంటాడు.

ప్రపంచంలో కొన్ని సిద్ధులున్నాయి. 
వాటిలో ఒక రకం సిద్ధిని సంపాదిస్తే ఆ సిద్ధిని సంపాదించిన వాడు ఇతరులకు కనుపించడు. 
కాని ఇతరులు మాత్రం అతనికి కనుపిస్తారు.

ఈ విషయాన్ని గుర్తునందుంచుకొని ఒక బీదవాడు దారిద్ర్యాన్ని గురించి ఈ కింద విధముగ చమత్కారంగా పలికాడు.
"ఓ దారిద్ర్యమా! నీకు దణ్ణం. నీ దయవల్ల నాకొక సిద్ధి లభించింది"...
ఆ "సిద్ధి మహిమవల్ల నాకు అందరూ కనుపించినప్పటికిని, నేను మాత్రం ఎవరికి కనుపించను."```
*నిజానికి ఇంతే..!*```
దరిద్రునిగూర్చి పట్టించుకునే వారెవరు? అతని బాధలు అతను అనుభవిస్తూనే యుంటాడు.అతనిగోడు వినేవారుకాని, అతని బాధలు పోగొట్టేవారు కాని చాలా అరుదు. 
కాబట్టి దుఃఖహేతువైన అట్టి దారిద్ర్యం సంభవించకుండా, అట్టి దుఃఖం దాపురించకుండా జనులందరూ త్యాగభావన అలవరచుకోవాలి." విరివిగా దానధర్మాలు చేయాలి.

పరప్రాణికి మేలు కలుగజేయాలి, స్వార్థం తొలగించుకొని, పరార్ధం కొరకు పాటుపడాలి.

పుణ్యకార్యాలు విరివిగా చేయాలి. 
అట్టి పుణ్య ప్రభావంచే మానవుడికి ఎంతో శ్రేయస్సు, సుఖం, శాంతి కలుగుతాయి. అమూల్యమైన ఈ మానవజీవితాన్ని పాపకార్యాలకై వినియోగించక జనులు పుణ్యకార్యతత్పరులై, ధర్మాచరణ కలవారై భగవత్కృపకు పాత్రులై ధన్యులగుదురుగాక!✍️```
*దరిద్రాయ నమస్తుభ్యం*
*సిద్ధ్యోహం త్వత్ప్రసాదతః*
*సర్వం పశ్యామి దేవేశ*
*న మాం పశ్యతి కశ్చన*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       

No comments:

Post a Comment