Wednesday, October 16, 2024

 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
ఇవి వచ్చి చేరిన కొన్ని రోజుల తర్వాత విచిత్రంగా నాకు ఆకలి, దాహము, కామము, దుఃఖం లాంటి భావాలు ఆరంభం అయినాయి.నాలో తెలియని భయం మొదలైంది. ఎందుకంటే ఏదైనా ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది ఏమో అని కంగారు పుట్టేది. ఒక పక్క నాకు ఇష్టమైన పదార్ధాలు ఎదురుగా ఉన్న తినాలని అనిపించకపోవటం, ఎవరైనా చనిపోయిన  దుఃఖం రాకపోవటం ఇలాంటి లక్షణాలు ప్రస్ఫుటంగా కనబడుతూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ  చక్ర సాధన నాకు పరిసమాప్తి అయినదని సూచనగా ఈ నల్ల శంఖము వచ్చినది. అప్పటిదాకా నాకు తెలుపు, లేత గోధుమ రంగు శంఖములే చూడటము జరిగింది.మొట్టమొదటిసారిగా ఈ నల్ల రంగు శంఖము చూడటం జరిగింది.
జిఙ్ఞాసి కి ఈ చక్రానుభవాలు
ఒక రోజు నా టెలిపతిలోనికి జిఙ్ఞాసి రావడము జరిగినది.మరి వాడి స్వాధిష్టాన చక్రం పరిస్థితి వాటి అనుభవాలు ఏమిటో తెలుసుకోవాలని ఉందని చెప్పటంతో వాడు నాతో, ఆర్యా! నేను మూలాధార చక్ర సమయంలో వచ్చిన చింతామణి గణపతిని వదిలి పెట్టిన రెండు నెలల తర్వాత నాకు ధ్యానములో మహాలక్ష్మీదేవి అగుపించి “నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. నన్ను అందుకో” అని మాయమైందట.ఇప్పుడు లక్ష్మీదేవి వస్తే ఏమి చేసుకోవాలి? అన్ని వదిలేసిన వాడికి ధనముతో ఏమి పని ఉంటుంది. మనకు కావలసిన అవసరాలు ఆ ప్రకృతియే చూసుకుంటుంది కదా అనుకొని ఇది అంతా స్వాధిష్టాన చక్రం జాగృతి సూచన అని అనుకొని సాధన కొనసాగిస్తూ ఉంటే వాడికి కృష్ణానదిలో అతి అరుదైన ఎడమచేతితో ఊదే దక్షిణావృత శంఖము కనపడినది.(నిజానికి ఈ శంఖమును ఊదటానికి రంధ్రము ఉండదు ) దానిని తీసుకొని మూడుసార్లు శంఖనాదము చేసి అమ్మవారికి కానుకగా ఇచ్చివేసి శ్రీశైలం నుండి కాశీ క్షేత్రమునకు చేరుకున్నాడు.ఇలా తీవ్ర ధ్యానంలో ఉండగా అతనికి వివిధ రకాల తన ఇష్ట పదార్థాల రుచులు గుర్తుకు రావటం దానితో ధ్యాన భంగం అవ్వటం జరిగింది. ఇక వాడికి ఈ చక్ర శుద్ధి ఆరంభమైనదని చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ తిరిగి మళ్లీ ధ్యానం చెయ్యటం ప్రారంభిస్తే వెంటనే తిరిగి ఆ పదార్ధాల రుచి వాసనలు తన ముక్కుకి వచ్చే విధంగా అనిపించేసరికి కళ్ళు తెరిచి చూస్తే ఏమీ ఉండేవి కాదని మళ్లీ ధ్యానములో కూర్చుంటే ఇవే పదార్థ ఆలోచనలు రావటంతో ధ్యానం వైపు మనస్సు వెళ్లేది గాదని అలాగని ఆ పదార్థాలు కొన్ని తెచ్చుకునేందుకు తన దగ్గర డబ్బులు లేవు.ఇలాగాదని అనుకొని కాశీ గుడికి వెళ్లి దర్శనం చేసుకొని ఎవరో తనకి డబ్బులు ఇస్తే మొహమాటం కొద్దీ ఆ డబ్బులు తీసుకొని కావలసిన పదార్థాలు తినటం ప్రారంభించేసరికి అది నీళ్ళ విరేచనాలకి దారి తీసిన కూడా భయపడకుండా మనస్సు తృప్తి పడే సరికి ధ్యానం చేసుకునేవాడట.ఆరోజు మళ్లీ ఎలాంటి పదార్థ రుచులు వాసన అగుపించలేదు. మరుసటి రోజు మళ్ళీ కథ మొదలు. మళ్ళీ ధ్యానానికి కూర్చోగానే పదార్థం రుచులు వాసన భావాలు కలగటం అతనికి ధ్యాన భంగం అవ్వటం జరిగినది. ఎలాగైనా ఈ రోజు వీటిని తినాలని మనస్సు గోలపెట్టేది.నిన్నంటే ఎవరో డబ్బులు ఇచ్చారు. ఈరోజు ఎవరు ఇస్తారు అని తన మనస్సు కి ఎంత సర్ది చెప్పుకున్నా వినేది కాదట. అంటే షుగరు వ్యాధి వచ్చిన వాడికి  తీపి పదార్థాలు ఎలా అయితే తినాలని జిలగా ఉంటుందో అలా వీడి పరిస్థితి తయారైందట.ఎవరైనా తన మీద జాలి చూపి డబ్బులు ఇస్తారేమోనని ప్రయత్నించి చూడాలని విపరీతంగా అనిపించేసరికి తట్టుకోలేక ఘాట్ల వద్ద నిలబడి ఎవరైనా ధనమును వేస్తారేమోనని ఎదురుచూస్తే విచిత్రంగా డబ్బులకు బదులుగా ఏవో ప్రసాదాలు తినటానికి చేతిలో పెట్టేవారట. దాంతో వారి మీద విపరీతమైన కోపావేశాలు వచ్చేవట. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇస్తే డబ్బులు ఇవ్వండి లేదంటే ఇక్కడ నుండి వెళ్ళండి అని గదమాయించే స్థితికి చేరుకున్నాడట.ఒకవేళ డబ్బులు దొరకకపోతే తనకు కావలసినవి తినటానికి ఏదో ఒక పని చేయాలని విపరీతంగా అనిపించేదట. ఇది ఈ చక్ర మాయేనని తెలిసినా గూడ మనస్సుని ఎలా అదుపులో పెట్టుకోవాలో అర్ధం అయ్యేది కాదట. పదార్థాల రుచులు కోసము మనస్సు  కాస్తా బిక్షగా వచ్చే నాలుగు కాసుల కోసం పడే ఆరాటం చూసేసరికి అతనికి ఏడుపు వచ్చేదట.ఈ పదార్థాలు తినటం వలన నీళ్ల విరేచనాలు వస్తున్నా పట్టించుకునేది కాదట. ఇది ఇలా ఉండగా ఒకరోజు లలిత ఘాట్ మీద కూర్చుని ఉండగా ఒకాయన తన శిష్య పరివారంతో స్నానాలు చేయటానికి వచ్చి స్నానాది పూజా కార్యక్రమాలు చేస్తుండగా వీడి మనస్సు అలాగే వీడి చూపు వారి మీద పడినది.నాలుగు రోజులనుండి ఒక్క పైసా కూడా తనకి బిక్షగా లభించలేదు. వీళ్ళ దగ్గర చేయి చాచి అడిగితే ఎవరైనా నాలుగు కాసులు వేయక పోతారా అని మనస్సు విపరీతంగా గోల చేయటం ప్రారంభించింది. ఇంతలో అందరి స్నానాదికాలు పూర్తి అయినాయి. వీరిలో పెద్దవాడుగా ఉన్న ఒక వ్యక్తి తన వైపుకి రావటం గమనించిన వీడు మౌనముగా అతడికేసి చూస్తుంటే అపుడు వారి శరీరము మీద బంగారు రుద్రాక్ష,  స్పటిక, తామర, తులసి మాలలు బంగారు కంకణాలు భుజాలకి బంగారు ఆభరణాలు కాళ్ళకు బంగారు కంకణాలు చూస్తుండేసరికి మన వాడికి మతిపోయిందట.మహాలక్ష్మి పుత్రుడిలాగా ఉన్న ఇతడి అవతారమును మన వాడు గమనించేసరికి ఆయన మన వాడికేసి చూస్తూ “ఏమిరా! నీ చూపు నా మీద పడినది. చూపు మళ్ళించుకో... లేదంటే బందీ అవుతావు. బయటికి రాలేవు.

బంగారముకు ఆశపడితే బంగారముగా మారవు” అంటూ నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఇచ్చేయ్యి” అన్నాడట. దానికి మనవాడు “అయ్యా! నా దగ్గర ఏమీ లేవు.అసలు నాలుగు పైసలే నేను భరించలేక చస్తుంటే మీరేమో ఏకంగా నాలుగు భోషాణాలలో పట్టే నగలతో ఉన్నారు. వీటిని ఎలా భరిస్తున్నారో నాకు అర్థం కాక ఆ విధంగా చూశాను” అని మా వాడు చెప్పే సరికి ఆయన వీడి పక్కన కూర్చుని “సరే నీ దగ్గర డబ్బులు ఉంటే నేను నిరుత్సాహ పడే వాడిని. నీ పరిస్థితి బాగుంది ధైర్యంగా సాధన చేసుకో” అన్నాడట.దానికి మన జిఙ్ఞాసి వెంటనే “స్వామి! నా పరిస్థితి అసలు ఏమీ బాగాలేదు. బ్రహ్మపదార్థము చూద్దామంటే భౌతిక పదార్థం రుచి దాటలేక పోతున్నాను. నా స్థితి బాగా లేదని నాకు అర్థం అవుతోంది స్వామి” అనగానే దానికి ఆయన నవ్వుతూ “నాయనా! నీ ముఖంలో విభూది ధారణ కనబడుతుంది. వైరాగ్యమే ఆలంబనగా ఉన్నావు.శివశక్తితో ఉన్నావు. నాలుగు పైసలు కూడా దాటలేని స్థితిలో నువ్వు ఉన్నావని నేను అనుకోను. నీ స్థితి అలాగే నీ పరిస్థితి నాకు తెలుసు. కర్మ ఉన్నంత వరకే రుచి ఉంటుంది.రుచి కోసమే ధనము సంపాదించాలి అని ఆరాటం ఎందుకు.ఆ రుచికి కారణమైన దాని మీద దృష్టిని నిలుపు. బ్రహ్మ పదార్థము గూర్చి ప్రస్తుతము నీవు ఆలోచనలు చేస్తున్నావు. ఈ పదార్థానికి కారణమైన బ్రహ్మము గుర్తించి వాడిని గురించి ఆలోచించు. అంతా అర్థమవుతుంది.పదార్థము దాటితేగాని యదార్థము గుర్తుకు రాదు.అంతదాకా ఈ పదార్థం మాయలో నాకు లాగా పడతావు. పడితే దాటవచ్చునని అనుకుని ఇన్ని రకాలుగా బ్రహ్మ పదార్థాలు సేకరించి ధరించి నేనే ఒక మాయా శక్తి పదార్థంగా మారినాను” అంటూ ఆయన వెళ్లిపోతుంటే లక్ష్మీనారాయణుడు వచ్చాడా అనుకునే లోపల “స్వామి! నారాయణ స్వామి! మీ కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు” అనే మాటలు మా వాడికి వినబడేసరికి బుర్ర తిరిగినది. ఆయన చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చేసరికి గతుక్కుమన్నాడు. ఆయనే వచ్చాడా? ఈయన మీదకి ఆయన వచ్చాడా? అదే లక్ష్మీపతి నారాయణుడు అనుకుంటూ నమస్కారము చేయగానే గాలిలో తిరుపతి వెంకన్న వారి వరద ముద్ర కనపడగానే వామ్మో నిజంగానే లక్ష్మీపతియే అనుకోగానే నిద్ర మత్తు ఆవరించింది.తెలియకుండానే అక్కడ ఉన్న చోటే నిద్రలోకి జారుకున్నాడు. మధ్యాహ్నానికి నిద్ర మెలుకువ వచ్చింది.వచ్చి రాగానే వాడికి అన్ని విషయాలు గుర్తుకు వస్తున్నాయి. ఆకలి వేస్తుందని భోజనాలుపెట్టే మఠాలవైపుకి వెళ్ళి భోజనము చేసుకొని వస్తుండగా బంగారపు కాసు బిళ్ళ అతనికి కనపడినది. వెంటనే చేతిలోకి తీసుకుని అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూస్తే ఎవరూ లేరట. మనకి ఎందుకు అని దగ్గర్లో ఉన్న హుండిలో వేద్దామని అనుకునేసరికి మన వాడికి ఏదో స్ఫురణకు వచ్చిందట.అది ఏమిటంటే తను ఈ హుండీలో ఇది వేశాక దీనిని పోగొట్టుకున్న యజమాని పాపము వెనక్కి తిరిగి వస్తే ఎలా అనే ఆలోచనలు రాగానే దానిని ఎక్కడ దొరికినదో అక్కడే వదిలి పెడుతుండగా అసలు ఇది ధనమని ఇది బంగారమని గుర్తించడం కూడా దోషమే గదా.అది మట్టిగా లేదా చిల్ల పెంకుగా తను గుర్తించకుండా బంగారంగా గుర్తించటంలో తను చేస్తున్న తప్పు ఏమిటో అర్థం అయినది. ధనము అవసరము లేని వాడికి ధనముతో ఏమి పని? ఇలా దీనిని తాకితే లేదా తీసుకుంటే దానికి సంబంధించిన కర్మ తిరిగి బంధనము కాదా. నిజమే! సిరిని కాకుండా హరిని అలాగే లక్ష్మిని కాకుండా లక్ష్మీపతిని ఆరాధిస్తే తను ధనమును చూసినా కూడా బ్రహ్మ పదార్ధం గా కనబడుతుంది కదా!అలాగాకుండా చూస్తే బంధనమై భౌతిక పదార్థముగా మాయగా మారుతుంది కదా!ఆయన అన్నట్లుగా పదార్ధం మాయ దాటితే యదార్థము తనకి తెలుస్తుంది అనగానే తనలో ధనమాయ తొలగినట్లుగా అనుభూతి వస్తుండగా ఏదో తెలియని ఆనందం ఆవరించగా విపరీతంగా దాహం వేసింది.
దాంతో గంగానది దగ్గరికి వెళ్లి నీళ్లు త్రాగుతుండగా చేతికి వెండి తొడుగుతో ఉన్న మహాలక్ష్మి శంఖం పెద్దది పైకి కనిపించగానే నవ్వుకుంటూ అది శంఖం కాదని దాని మూలం మట్టి నుండి వచ్చింది కదా అని “అమ్మా! తల్లి!నీ శంఖంను ఉపయోగించుకొని విశ్వానికి లక్ష్మిపతిని గావచ్చును.కానీ నాకు కావలసినది సిరికి అధిపతి కాదు. మోక్షానికి అధిపతి. నువ్వు నాకు లక్ష్మి కాంతగా వద్దు. మోక్ష కాంతగానే కావాలి. నాకు పదార్థ భేదము లేదు. నాకు భౌతిక పదార్థము అంతా బ్రహ్మపదార్థం గానే కనిపించడానికి నువ్వు సహకరించు తల్లి. నేను ఈ మానసిక స్థాయికి ప్రస్తుతానికి ఇంకా చేరుకోలేదు. ఇకనుంచి దానికి కృషి చేసి సాధించి తీరుతాను” అనగానే గంగానదిలో ఈ లక్ష్మీ శంఖం తిరిగి వెనక్కి పోయేసరికి మన వాడి ముఖము మీద ఆనందం తాండవం చేసినది. ఆ నది ఒడ్డున మనవాడికి ఒక పెద్ద చాలా అరుదైన శాలిగ్రామము కనపడినది.దానిని చేతిలోనికి తీసుకోగానే అది రెండుభాగాలు విడిపోయి అందులో ఉన్న బంగారము కనిపించేసరికి...తను చదివిన విషయము అనగా నిజమైన విష్ణు సాలి గ్రామము లోపల బంగారముంటుందని ఆనాడు చదివినదానిని నమ్మలేదు.ఈనాడు నమ్మక తప్పడము లేదని దానికి ఒక నమస్కారము చేసి దానిని యధావిదిగా ఆ గంగానదిలో నిమజ్జనము చేసినాడు.

ఆనాటి నుండి మన వాడికి వివిధ రకాల పదార్థ రుచులు చూడాలనే ఆకలి,వివిధ రకాల ద్రవ పదార్థాలు త్రాగాలనే దాహము, కామము దొరకకపోతే వచ్చే దుఃఖం నానాటికీ తగ్గుతూ వచ్చేసరికి తను ఈ స్వాధిష్టాన చక్రం ఇచ్చే అనూర్మిమతత్వము సిద్ధికి దగ్గర ఉన్నాము అని తెలుసుకుని ఇక పంచభూతాలలో రెండవది అలాగే ఈ చక్ర ఆధీన శక్తి జలతత్వ ఆధిపత్య శక్తి ఆధీనము కోసము మన వాడు అరుణాచలం చేరుకోవటము అక్కడి గుహకి వెళ్ళి తనకి వచ్చిన ఖేచరి ముద్ర సాధన సిద్ధితో 18 నెలలు తర్వాత జలము మీద ఆధిపత్యం సంపాదించుకుని నీటిమీద పడవలాగా తేలియాడే శక్తిని పొందినాడని వాడు చెప్పే సరికి నాకు ఆనందం వేసింది.అంటే వీడు కూడా ధన మాయను దాటి స్వాధిష్టాన చక్రం శక్తి అయిన నీటి ఆధిపత్యమును పొందినందుకు నాకు ఆనందం వేసింది. వీడి మాటలను బట్టి చూస్తే నాకు ఆకలి, దాహము, దుఃఖము, కామము లేకపోవటం అనేది జబ్బు కాదని అది అనూర్మిమతత్వము సిద్ధి సూచన అని తెలియగానే నా మనస్సుకి ఆనందం వేసినది. లక్ష్మీపతికి వాడికి లాగానే నేను కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి నా పూజా మందిరం వైపు అడుగులు వేస్తున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు? మీరు కూడా నాతో పాటు ముందుకు అడుగులు వేయండి.

గమనిక:   ఈ చక్ర శుద్ధి సమయంలో మనకి విపరీతంగా నీళ్ళ విరేచనాలు మన ప్రమేయం లేకుండా అవుతాయి. కంగారు పడకండి. అలాగే ఈ చక్ర జాగృతిలో మహాలక్ష్మి దేవి విగ్రహం,శుద్ధిలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి గండకి శిల సాలగ్రామము అలాగే ఆధీనమయ్యే సమయములో మహాలక్ష్మి శంఖము వస్తాయి. వీటిని జాగ్రత్త పరచుకోండి. ఎవరికీ ఇవ్వవద్దు. వీటిని జాఱ విడుచుకోవద్దు. అలాగని వీటిని మీ బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యుల నుండి తెప్పించుకోవద్దు. మా శ్రీమతి తనకి ధ్యానములో పదార్ధాల రుచులు వాసనలు వస్తున్నాయి అంటే ఇక ఆలస్యం చేయకుండా నాకు ఈ చక్రం లో వచ్చిన అన్ని దైవిక వస్తువులు ఆమెకి ఇచ్చి పూజించుకొమ్మని ఈ చక్రం మాయను దాటమని చెప్పటం జరిగినది. దాంతో నాకు నల్లటి చిన్న శంఖము వచ్చినది. అనగా ఈ చక్ర దైవిక వస్తువులు మాయను కూడా దాటేసరికి ఈ  చక్ర సాధన నాకు పరిసమాప్తి అయినదని సూచనగా ఈ నల్ల శంఖము వచ్చినది. అప్పటిదాకా నాకు తెలుపు, లేత గోధుమ రంగు శంఖములే చూడటము జరిగింది.మొట్టమొదటిసారిగా ఈ నల్ల రంగు శంఖము చూడటం జరిగింది. మనకి తోడుగా గురువులు ఉంటే ఇదే ఉపయోగము. వారికి కావలసింది ఇస్తే మనకు కావలసినవి ఇస్తారు. వారు మాయలు తీసుకొని మన కర్మ మాయలు మాయం చేస్తారు. ఇంతకుముందు మూలాధార చక్రములో కూడా పరిసమాప్తి సూచనగా నల్లటి గణపతి విగ్రహం వస్తే ఈ చక్ర పరిసమాప్తి సూచనగా నల్లటి శంఖము వచ్చినది అన్నమాట.ఇలా నల్లగా వచ్చే వాటిని గూడ జాగ్రత్త పరచుకోండి. అసలు నాకులాగా ఈ చక్రము నందు లక్ష్మీనారాయణుడు దర్శనం అలాగే ఈ చక్ర దర్శనం ఎవరైన ధ్యానానుభవము పొందినారా అని పరిశోధన చేస్తే...నాకు శ్రీ శ్యామా చరణ లాహిరీ ధ్యానానుభవాలు ఉన్న పురాణపురుష యోగి రాజ శ్రీ శ్యామ చరణ లాహిరి పుస్తకము కనిపించినది. అందులో నాకు కనిపించిన ఈ చక్రానుభవాలు వారికిగూడ కలిగినాయని తెలుసుకొని నేను ఆనందము పొందినాను. నిజ సాక్ష్యం ఉంటేనే గదా మనకి కలిగే ధ్యానానుభవాల మీద అచంచల విశ్వాసము కలిగేది.
నా సాధన పరిసమాప్తి సమయములో
ఇలాగే నా సాధన పరిసమాప్తి సమయములో నేను ఒకసారి మహలక్ష్మీ ఆవాసమైన కొల్హాపూర్ క్షేత్రమునకు వెళ్ళడము జరిగినది. అక్కడ నేను యధావిధిగా ధ్యానము పూర్తిచేసుకొని కళ్ళు తెరవగానే ఎదురుగా ఒక కోటీశ్వరుడు కనిపించాడు.వాడు నేను కళ్ళు తెరవడము చూసి "స్వామీ! మిమ్మల్ని చూస్తూంటే నాకున్న సమస్యను తీరుస్తారని  అనిపిస్తోంది.నాకు ధనానికి లోటు లేదు.100 తరాలు కూర్చున్న తరగని ఐశ్వర్యమున్నది. అన్నీ ఉన్న ఏదో లేదనే అసంతృప్తి నన్ను వెంటాడుతోంది.లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయించాను. గుడులకి దానాలు చేసినాను.పేదవారికి సహాయ సహకారాలు ఇచ్చాను.అయిన నాకు నాలో ఉన్న వెలితి పోవడము లేదు.దీనికోసమే భారతదేశంలో గల అన్ని తీర్ధయాత్రలు చేస్తున్నాను.నాలో ఉన్న వెలితి ఏమిటో కనీసము మీరైన చెప్పగలరా?మీకు గావాలసిన ధనమును ఇస్తాను అనగానే నేను వాడివైపు ప్రశాంతత వదనముతో చూసి"నాయన!తమరు డబ్బుయే సర్వసమని అనుకున్నారు.మీరు చనిపోయినపుడు మీ ఐశ్వర్యములో ఒక నగ గాని నవరత్న ఉంగరముగాని ఇసుమంత బంగారముగాని లేదా ధనమును గాని లేదా ఒక నయాపైస అయిన మీతోపాటుగా పైకి తీసుకొని వెళ్ళతారా...ఆలోచించు..ధనము గావాలి..ఎంతవరకు మన అవసరము వరకు గావాలి. మీరు ఈ పాటికే మీ అవసరాలకి మించి సంపాదించి మీ మనస్సుకి మోయ్యలేని భారమును ఇచ్చారు.అది మోయ్యలేక నానా అవస్ధలు పడుతోంది. మీ ఐశ్వర్యానికి కుక్కకాపల కాయలేక ఛస్తోంది.తద్వారా ప్రశాంతత కోల్ఫోతోంది. ముందు మీరు మీ ధన సంబంధ వ్యహారాలనుండి బాధ్యతల నుండి ముందు విముక్తి పొందండి.దానాలు చేస్తున్నపుడు నేనేగదా చేస్తున్నాను అనే ధనాహంకారముతో ఇన్నాళ్ళు దానకార్యక్రమాలు చేసినారు.            

No comments:

Post a Comment