Wednesday, October 16, 2024

 *శ్రీ మహా లక్ష్మి అనుగ్రహం.....*

శ్రీ మహా లక్ష్మి సంపదలను ప్రసాదిస్తుంది. సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలే కాదు.. భౌతిక సంపాద అశాశ్వతమైనది. ఈ భౌతిక సంపాద అశాశ్వతమైంది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది, కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేంది. కష్టాల నుంచి తప్పించుకోవడం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. 

లక్ష్మీదేవిని శుక్రవారాలలో ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజులలో దేవిని ప్రసన్నం చేసుకుని, ఆమె ఆశీర్వాదం పొందేందుకు వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన స్తోత్రాలు, స్తుతులు పఠిస్తారు. శుక్రవారం కొంతమంది ఉపవాసం ఉంటారు. ఈ తరం మానవులే కాదు, పురాణాలలో రాక్షసులు కూడా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించేవారనడానికి ఉదాహరణగా అనేక కథలున్నాయి.

రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఈ శుక్రాచార్యుల పేరు మీదుగానే శుక్రవారం ఏర్పడిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. మరోవైపు శుక్రాచార్యుడి తండ్రి భృగుమహర్షి. ఈ భృగుమహర్షి బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరు. ఇతడు లక్ష్మీదేవికి తండ్రి కూడా. ఈ విధంగా లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు. అందుకే ఆమెకు శుక్రవారం అంటే ప్రీతికరమైంది.  

లక్ష్మీదేవి రూపురేఖలలో వస్త్రధారణలో రంగులకు కూడా ప్రాధాన్యం ఉండి. లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు. ఎరుపు రంగుకి శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, ప్రకృతికి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిథి. అందుకే ఆమెను ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు. ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు. బంగారం ఐశ్వర్యనికి సంకేతం. ఐశ్వర్యాధిదేవత లక్ష్మీదేవి కాబట్టే ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీపూజకు ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కానీ, విష్ణుమూర్తిని దరిచేరలేరు. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు భక్తులకు అందుబాటులో ఉండరు. సదాచారం, సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు. ఈ రెండూ ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు.

No comments:

Post a Comment