Thursday, October 17, 2024

 16-10-2024-గురువారము - శుభమస్తు...
             🌹గుడ్ మార్నింగ్ 🌹
మనసు పరుగులాటలో ద్వంద భావాలు అంటే ఒకే విషయము పట్ల అనేక ఆలోచనలు లేకుండా ఉండేలా - మనసును ధ్యానములో స్థిరపరచుకోవటం  కొద్ది కొద్దిగా నిదానముగా అలవాటు చేసుకోవాలి.........
ధ్యానము అంటే ధ్యాసను ఏ విషయముపై ఉంచకుండా - ప్రశాంతముగా ఖాళీగా ఉండటం. అప్పుడు మనలోని శక్తి అనేక ఆలోచనల రూపములో సంకల్ప - వికల్పాలుగా పరిగెత్తకుండా రోజు కాసేపు చేసే ధ్యానములేక తపస్సు ద్వారా స్థిరతను అలవాటు చేసుకుంటుంది................
దీనివలన కొంత మనో నియంత్రణ వస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే కదలే విధముగా మనపై మనకు పట్టు వస్తుంది...
ఇదే విధముగా ఇతరుల గూర్చి ఎటువంటి చెడును అనుకోకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఎవరికి ఎదుటివారి పరిస్థితులు పూర్తిగా తెలియవు - వారి మానసిక భావాలు అసలు తెలియవు. కనుక ఎదుటివారి గూర్చి లేనిపోని ఊహలు ఊహించడం - అనేక అపోహలతో వ్యవహరించడం మానుకోవాలి. ఇదంతా మానసిక ప్రక్రియే.. ఇలా ఉండటం వలన కూడా మనో చంచలత తగ్గి బలం పెరుగుతుంది..............
మనను మనం గమనించుకుంటూ అంతరంగములోని అనవసరాలను ఏరి వేయటమే ఆధ్యాత్మికత. ఈ సాధన సరిగా చేసుకోగలిగితే మనో శక్తే - ఆత్మ శక్తిగా అర్ధమవుతుంది. ముందు లోపలి చెడును - అనవసరాలను ఏరి వేయాలి... అంతరంగ శుభ్రతే అంటే మంచి మాత్రమే దైవ లేక ఆధ్యాత్మిక సాధన. ఒక్క మాటలో గుణ మార్పు... గుణ మార్పే సర్వ సాధనల సారము.ఇది ఎవరికి వారే ప్రయత్నించి చేసుకోవాలి. ఎందుకంటే ఎవరి అంతరంగము వారికే తెలుస్తుంది కనుక....
             🌹god bless you 🌹

No comments:

Post a Comment