Wednesday, October 16, 2024

 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹        నిజానికి నీకు మరియు బిచ్చగాడికి నా దృష్టిలో తేడా లేదు.ఎందుకంటే బిచ్చగాడు మన దగ్గర అడుక్కొని ధన అవసరాలు తీర్చుకుంటే...నీవు పైవాడిని అడుక్కొని ఇంతవాడివి అయ్యినావు గదా! ఎవరి ధనమును ఎవరు దానము చేస్తున్నారో ఆలోచించు. ఎవరి ధనమును ఎవరు పొందుతున్నారో ఆలోచించు. ధనము లేనివాడికి ప్రశాంతత ఉన్న ధనదాహముంటుంది.ధనమున్నవాడికి ధనము ఉన్న ప్రశాంతత ఉండదు. సంపాదించేవాడి కన్నా దానిని అనుభవించేవాడు మిన్న యని గ్రహించు.పేదవాడు ప్రశాంతముగా ఏరోజు ధనమును ఆరోజే అనుభవిస్తాడు. కాని మీరు అనుభవించేటపుడు భయముతో, అనుమానముతో, అహంకారముతో, ఆశతో,ప్రశాంతము లేకుండా అనుభవిస్తారు.అదే మీరిద్ధరిలో ఉండే ఇదే తేడాయని గ్రహించు. మర్మము తెలుసుకో!మూలము తెలుస్తుంది. మాయ మాయం అవుతుంది.మీ మనస్సుకిప్రశాంతత కల్గుతుంది. ఈ విభూదియే నా అఖండ ఐశ్వర్యమని గ్రహించు అంటూ వాడి చేతిలో పెడుతూండగా "స్వామి!మహలక్ష్మీ చెంతలో ఆది భిక్షువు సంపాదించుకున్న అఖండ ఐశ్వర్యమైన విభూదిని నాకు ఇస్తున్నారు. తద్వారా నాలో ఉన్న అన్ని రకాల ధనాశలు గూడ సంపూర్తిగా బూడిదయై... విభూదిగా మారినది. మీరు చెప్పినవాటిని తు.చ.తప్పకుండా ఆచరిస్తూ...మా మనసుకున్న ధనభారమును తగ్గించుకుంటూ...విభూది ధారణ చేస్తూ ఆదిభిక్షువు లాగా ప్రశాంతత జీవితమును గడుపుతాను అంటూ పాదనమస్కారము చేసుకొని ప్రశాంతతవదనమును పొందుతూ వెళ్ళిపోయినాడు.  

No comments:

Post a Comment